సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఘనంగా మేడే వేడుకలు హాజరైన డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకింది బానయ్య యూనియన్ జెండా ఎగరవేసారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్మిక పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముందున్నదని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు త్వరితగదన ముగింపు పలికేల చర్యలు చేపట్టి, వారి న్యాయమైన కోరికలను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. గత ప్రభుత్వాలు రోజుల తరబడి కార్మికులు నిరసనలు తెలిపినా చలించలేదని, కానీ ప్రజా ప్రభుత్వం సమస్య జటిలం కాకముందే సానుకూల నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల కోరికలను తీర్చడంలో కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షులు చింతకింది బానయ్య, నాయకులు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, బొప్ప దేవయ్య, రెడ్డిమల్ల భాను, రాజు, సాగర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఘనంగా మేడే వేడుకలు హాజరైన డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకింది బానయ్య యూనియన్ జెండా ఎగరవేసారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్మిక పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముందున్నదని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు త్వరితగదన ముగింపు పలికేల చర్యలు చేపట్టి, వారి న్యాయమైన కోరికలను
తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. గత ప్రభుత్వాలు రోజుల తరబడి కార్మికులు నిరసనలు తెలిపినా చలించలేదని, కానీ ప్రజా ప్రభుత్వం సమస్య జటిలం కాకముందే సానుకూల నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల కోరికలను తీర్చడంలో కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షులు చింతకింది బానయ్య, నాయకులు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, బొప్ప దేవయ్య, రెడ్డిమల్ల భాను, రాజు, సాగర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.
- కరీంనగర్ నగరంలోని శుభాష్ నగర్‌లో ఉన్న కార్మిక సంఘ కార్యాలయంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం (BRTU) ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం సంఘం అధ్యక్షులు బొంకూరి రాములు ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ MLC నరదాసు లక్ష్మణ్ రావు, BRS మాజీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణలో BRS పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం సంఘం అధ్యక్షులు బొంకూరి రాములు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా లేబర్ కార్డులు తీసుకోవాలని సూచించారు. సంఘాలకు సంబంధం లేని వ్యక్తులు లేబర్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి కార్మికులను మోసం చేసే అవకాశమున్నందున అలాంటి వ్యక్తులను నమ్మవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BRS మైనారిటీ నాయకులునాఇమ్,మొబీన్,BRS విద్యార్థి నాయకులు, బొంకూరి మెహన్, భావన నిర్మాణ సంఘం సభ్యులు పులిపాక లక్ష్మణ్, కొమ్ము రమేష్, నీర్ల శ్రీనివాస్, గంగాధర శంకర్, ఆశీర్వాదం, మొదుంపెల్లి శంకరయ్య, గంట లక్ష్మణ్, చిప్ప శ్రీనివాస్, బత్తుల అనిల్ రాజ్ పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ అయిపోయి స్కూల్ సమీపంలో రోడ్డుపై ఆగిపోయిన టాక్టర్ ను పల్సర్ బైక్ ఢీ కొట్టింది. బైకిస్ట్ గోడ మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లి కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తుండగా రోడ్డుపై నిలిచిపోయిన ట్రాక్టర్ ను వెనుక నుంచి బైక్ ఢీ కొట్టడంతో బైకిస్ట్ మహేష్ బైక్ పైనే ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దగ్గేవని స్థానికులు భావిస్తున్నారు.2
- కామారెడ్డి జిల్లా : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వైకుంఠ దామాల పునరుద్ధరణ పనుల నిధుల కై రాష్ట్ర ప్రభుత్వ సలహాధారు షబ్బీర్ అలీ ని కలిసి కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించి నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు ఇప్ప శ్రీనివాస్, షేరు,రామ్మోహన్,కళ్లెం సత్యం,కాళ్ళ గణేష్,అంజద్,భాస్కర్ గౌడ్,వాజీద్,గ్యార సాయిలు,యూనుస్,సిద్ధిఖ్,అన్వర్,చిట్టి బాబు,జావీద్,మోతి లాల్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Venu Gopal1
- జగిత్యాల జిల్లా కోరుట్ల, పట్టణంలోని చారిత్రక గడి బురుజులు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన గ్రామ కంఠం, ఆబాదీ భూములపై భూ మాఫియా కన్నుపడి నకిలీ దస్తావేజులు, అనుమానాస్పద వీఎల్టీల ఆధారంగా ఈ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చే కుట్ర జరుగుతుంది కావున జగిత్యాల జిల్లా కోరుట్ల గడి స్థలాల రక్షణకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు అక్కడ వేసిన విఎల్టీల రద్దుకు బిజేపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంతకాలతో సిద్దం..*ఇక మిగిలింది కాంగ్రెస్ కౌన్సిలర్లు వారు కూడా పెడితే కోరుట్ల ప్రజల విజయం. కలుగుతుంది పురాతన గడి బురుజులు, కోనేరు వాటి స్థలాలు రక్షించాలని అక్కడ ప్రతి సంవత్సరం జరిగే విజయదశమి, బతుకమ్మ, గణేష్, మొహరం ఉత్సవాలు యదావిధిగా కొనసాగించాలని మరియు ఆ స్థలాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ మార్కెట్, ఆహ్లాదకరమైన పార్కు, మైసమ్మ, హనుమాన్ దేవాలయాల తో పాటు నిరంతరం ఎగిరే జాతీయ జెండా ఆవిష్కరించాలని గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న ఉద్యమాలకు ఇన్ని రోజులు అక్కడ నిషేధం కొనసాగింది కానీ ఈమధ్య మున్సిపల్ కమిషనర్ తప్పిదం వల్ల నకిలీ దస్తావేజులతో అక్రమ విఎల్టీలు వేసి ప్రజల ఆకాంక్షలను చెల్లాచెదురు చేసిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని ఆ విఎల్ టి లను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా చేసిన నిరసన దీక్షల అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులకు బిజేపి, బిఆర్ ఎస్ కౌన్సిలర్ లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమంలో మొదటి రోజు బీజేపీ కౌన్సిలర్లు తమ సంతకాలు చేసి పూర్తి మద్దతు ప్రకటించగా, నేడు బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా సంతకాల కార్యక్రమంలో పాల్గొని గడి బురుజు భూముల రక్షణకు తమ మద్దతు తెలిపారు. వీఎల్టీల రద్దు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని గడి బురుజు భూములు ఎవరి స్వంతం కాదు ఇది ప్రజల ఆస్తి… ప్రజల హక్కు అని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గడి బురుజు భూములు ప్రజల ఆస్తి అని, అవినీతి దస్తావేజులతో వాటిని ఆక్రమించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాపాడటానికి ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తామని వారు తెలిపారు.ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం. డాక్టర్ పేట భాస్కర్, ఎండి ముజాహిద్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, చింత భూమేశ్వర్, సుతారి రాములు, భూపెల్లి నగేశ్, షాహేద్ మహ్మద్ షేక్, కుంచెం శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.1
- కమ్మర్ పల్లి: కార్మిక దినోత్సవం అయిన మేడేను కార్మికులు శుక్రవారం మండల కేంద్రంలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద సఫాయి యూనియన్ మండల అధ్యక్షుడు రామాంజనేయులు జెండాను ఆవిష్కరించారు. ఐక్యతతో కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చుకోవచ్చని అన్నారు. తమ హక్కుల సాధనకు కార్మిక సంఘాలు చేపట్టిన పోరాటాలు, సాధించిన విజయాల గురించి సంఘాల నాయకులు మాట్లాడారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిదే వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం సందర్భంగా విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 6.30 గంటలకు అభిషేకం, బలిహరణం నిర్వహించగా, ఉదయం 10.30 గంటలకు శ్రీ భూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నివేదన, తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతి, బలిహరణం, మంగళాశాసనం, తీర్థప్రసాద కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో కన్యాదాతలుగా రాచకొండ రామాచార్యులు, సంధ్య పాల్గొనగా, కళ్యాణోత్సవ దాతలుగా కరీంనగర్‌కు చెందిన కోటోజు శ్రీనివాస్, సుష్మ సేవలు అందించారు.ఆలయ అర్చకులు, వేద పండితులు అంగరంగ వైభవంగా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ టెంట్లు, కూలర్లు, చల్లని నీటి పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణ మండపాన్ని రంగురంగుల పూలతో అలంకరించి, గ్రీన్ మ్యాట్స్, అరటి తోరణాలు, మామిడి ఆకులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆమె కళ్యాణోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.1
- డివైడర్ను ఢీకొట్టిన తార్ వాహనం, వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన2
- ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా, రైతులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు సెంటర్ కు మండల స్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, కొహెడ మండలాల్లో పర్యటించిన మంత్రి పొన్నం అధికారులు, పార్టీ శ్రేణులతో వెర్వేరుగా సమావేశమై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు, వేసవిలో మంచినీటి ఎద్దడి, స్థానిక సమస్యలపై అధికారులకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ధాన్యం కొనుగోలు మొదలయ్యిందని ట్రాన్స్ పోర్ట్ సమస్య లేకుండా మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా జిల్లా కలెక్టర్ లు రైస్ మిల్లర్లతో మాట్లాడుతారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో గ్రామ కార్యదర్శి, జిపివో, వారికి తోడుగా పార్టీ కమిటీ మండల స్థాయిలో తహశీల్దార్ ఎంపిడివో, ఏవో లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా స్థాయిలో డిఎస్వో, డిపివో, జిల్లా వ్యవసాయ అధికారి పర్యవేక్షిస్తు ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని మీ పరిధిలో పరిష్కారం కాకుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తనకేం సంబంధం లేనట్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సీరియస్ గా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు తోపాటు గ్రామాల్లో ఈ వేసవిలో ఎక్కడ మంచినీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికి పనులు ప్రారంభించని వారి ఇళ్ళను రద్దు చేసి కొత్తవారిని ఎంపిక చేయాలని ఆదేశించారు.2