కోరుట్ల పట్టణ అఖిలపక్షాల నాయకుల మరియు ప్రజా సంఘాల విజయం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్ల సంతకాల పై ఆధారపడింది జగిత్యాల జిల్లా కోరుట్ల, పట్టణంలోని చారిత్రక గడి బురుజులు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన గ్రామ కంఠం, ఆబాదీ భూములపై భూ మాఫియా కన్నుపడి నకిలీ దస్తావేజులు, అనుమానాస్పద వీఎల్టీల ఆధారంగా ఈ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చే కుట్ర జరుగుతుంది కావున జగిత్యాల జిల్లా కోరుట్ల గడి స్థలాల రక్షణకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు అక్కడ వేసిన విఎల్టీల రద్దుకు బిజేపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంతకాలతో సిద్దం..*ఇక మిగిలింది కాంగ్రెస్ కౌన్సిలర్లు వారు కూడా పెడితే కోరుట్ల ప్రజల విజయం. కలుగుతుంది పురాతన గడి బురుజులు, కోనేరు వాటి స్థలాలు రక్షించాలని అక్కడ ప్రతి సంవత్సరం జరిగే విజయదశమి, బతుకమ్మ, గణేష్, మొహరం ఉత్సవాలు యదావిధిగా కొనసాగించాలని మరియు ఆ స్థలాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ మార్కెట్, ఆహ్లాదకరమైన పార్కు, మైసమ్మ, హనుమాన్ దేవాలయాల తో పాటు నిరంతరం ఎగిరే జాతీయ జెండా ఆవిష్కరించాలని గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న ఉద్యమాలకు ఇన్ని రోజులు అక్కడ నిషేధం కొనసాగింది కానీ ఈమధ్య మున్సిపల్ కమిషనర్ తప్పిదం వల్ల నకిలీ దస్తావేజులతో అక్రమ విఎల్టీలు వేసి ప్రజల ఆకాంక్షలను చెల్లాచెదురు చేసిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని ఆ విఎల్ టి లను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా చేసిన నిరసన దీక్షల అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులకు బిజేపి, బిఆర్ ఎస్ కౌన్సిలర్ లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమంలో మొదటి రోజు బీజేపీ కౌన్సిలర్లు తమ సంతకాలు చేసి పూర్తి మద్దతు ప్రకటించగా, నేడు బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా సంతకాల కార్యక్రమంలో పాల్గొని గడి బురుజు భూముల రక్షణకు తమ మద్దతు తెలిపారు. వీఎల్టీల రద్దు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని గడి బురుజు భూములు ఎవరి స్వంతం కాదు ఇది ప్రజల ఆస్తి… ప్రజల హక్కు అని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గడి బురుజు భూములు ప్రజల ఆస్తి అని, అవినీతి దస్తావేజులతో వాటిని ఆక్రమించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాపాడటానికి ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తామని వారు తెలిపారు.ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం. డాక్టర్ పేట భాస్కర్, ఎండి ముజాహిద్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, చింత భూమేశ్వర్, సుతారి రాములు, భూపెల్లి నగేశ్, షాహేద్ మహ్మద్ షేక్, కుంచెం శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.

- ఖానాపూర్ పట్టణంలో మేడే ఉత్సవాలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే పురస్కరించుకొని మున్సిపాలిటీ కార్యాలయం ముందు మేడే జెండాను శుక్రవారం కార్మిక సంఘం నాయకులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జావిద్, సురేష్,రమేష్ గౌడ్, జంగం రాజేశ్వర్, రాకేష్ శేఖర్, నగేష్, ఆమెర్, శెంకరమ్మ, లావణ్య, మున్సిపాలిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మేడే 140 కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.3
- కరీంనగర్ నగరంలోని శుభాష్ నగర్‌లో ఉన్న కార్మిక సంఘ కార్యాలయంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం (BRTU) ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం సంఘం అధ్యక్షులు బొంకూరి రాములు ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ MLC నరదాసు లక్ష్మణ్ రావు, BRS మాజీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణలో BRS పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం సంఘం అధ్యక్షులు బొంకూరి రాములు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా లేబర్ కార్డులు తీసుకోవాలని సూచించారు. సంఘాలకు సంబంధం లేని వ్యక్తులు లేబర్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి కార్మికులను మోసం చేసే అవకాశమున్నందున అలాంటి వ్యక్తులను నమ్మవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BRS మైనారిటీ నాయకులునాఇమ్,మొబీన్,BRS విద్యార్థి నాయకులు, బొంకూరి మెహన్, భావన నిర్మాణ సంఘం సభ్యులు పులిపాక లక్ష్మణ్, కొమ్ము రమేష్, నీర్ల శ్రీనివాస్, గంగాధర శంకర్, ఆశీర్వాదం, మొదుంపెల్లి శంకరయ్య, గంట లక్ష్మణ్, చిప్ప శ్రీనివాస్, బత్తుల అనిల్ రాజ్ పాల్గొన్నారు.1
- Post by Vodnala thirupthi1
- కామారెడ్డి జిల్లా : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వైకుంఠ దామాల పునరుద్ధరణ పనుల నిధుల కై రాష్ట్ర ప్రభుత్వ సలహాధారు షబ్బీర్ అలీ ని కలిసి కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించి నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు ఇప్ప శ్రీనివాస్, షేరు,రామ్మోహన్,కళ్లెం సత్యం,కాళ్ళ గణేష్,అంజద్,భాస్కర్ గౌడ్,వాజీద్,గ్యార సాయిలు,యూనుస్,సిద్ధిఖ్,అన్వర్,చిట్టి బాబు,జావీద్,మోతి లాల్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్నసిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో PACS ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సమయంలో గాలిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అన్నాడి సంపత్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు సుదగోని వెంకటేశం, నాయకులు -మండల నాయకత్వం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి మీద తిరగబడ్డారు. .పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో లేని కొత్తగావచ్చిన వారిని ఆదరిస్తూ వారికే ప్రాముఖ్యతనిస్తూ పార్టీ గెలుపు కోసం సొంత పెట్రోల్, ఖర్చులతో గ్రామాలు తిరిగి పార్టీ అధికారంలోకి తెస్తే అప్పుడు లేనివారికి అధికారం అప్పజేప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేమెందుకు నచ్చడం లేదు, ఎందుకు కక్కోస్తున్నామో చెప్పాలని MLA చెప్పాలని అన్నారు...గ్రామాలకు వస్తే కనీసం సమాచారం ఇవ్వకుండా భజనపరులకు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలిపల్లి గ్రామనాయకులు ఎదురుతిరగడంతో సమాధానం చెప్పలేక మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి అక్కడినుండి వెళ్లిపోయారు. .1
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని కవ్వాల్ చౌరస్తాలో హమాలీ కార్మికులు మేడే జెండాను ఎగరవేశారు అలాగే సిపిఎం, సిఐటియు, అనుబంధ సంఘాల నాయకులు స్థానిక మార్కెట్ కమిటీ, బస్టాండ్ ల వద్ద మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కులను కాపాడుకుందామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిదే వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం సందర్భంగా విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 6.30 గంటలకు అభిషేకం, బలిహరణం నిర్వహించగా, ఉదయం 10.30 గంటలకు శ్రీ భూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నివేదన, తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతి, బలిహరణం, మంగళాశాసనం, తీర్థప్రసాద కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో కన్యాదాతలుగా రాచకొండ రామాచార్యులు, సంధ్య పాల్గొనగా, కళ్యాణోత్సవ దాతలుగా కరీంనగర్‌కు చెందిన కోటోజు శ్రీనివాస్, సుష్మ సేవలు అందించారు.ఆలయ అర్చకులు, వేద పండితులు అంగరంగ వైభవంగా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ టెంట్లు, కూలర్లు, చల్లని నీటి పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణ మండపాన్ని రంగురంగుల పూలతో అలంకరించి, గ్రీన్ మ్యాట్స్, అరటి తోరణాలు, మామిడి ఆకులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆమె కళ్యాణోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.1
- డివైడర్ను ఢీకొట్టిన తార్ వాహనం, వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన2