ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినికి డిలైట్ లో ఉద్యోగం పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవల విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థిని యాదగిరి మౌనిక సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రతిష్ఠాత్మక ఉద్యోగాన్ని సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. కళాశాలలో సీఎస్‌సీ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) గ్రూపులో విద్యను అభ్యసించిన మౌనిక బెంగళూరుకు చెందిన డిలైట్ సంస్థలో సైబర్ సెక్యూరిటీ విభాగంలో సాస్ అనలిస్ట్‌గా అత్యధిక ప్యాకేజీతో ఎంపికైనట్లు కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ టి. ప్రేమ్ బోస్కో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ అందించడం వల్లే ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతిక రంగంలో మౌనిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాన్ని సాధించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగానికి ఎంపికైన యాదగిరి మౌనికను ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఘనంగా అభినందించింది. కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బుర్రా అనురాధ, డైరెక్టర్ బుర్రా అఖిలేష్ మౌనికను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఆమెకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కళాశాల యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, సాంకేతిక నైపుణ్యాలతో ముందుకు సాగితే ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు సాధించవచ్చని పేర్కొన్నారు. మౌనిక సాధించిన విజయంతో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఇతర విద్యార్థులు కూడా సాంకేతిక రంగంలో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వై.వై.ఎన్. రాజశేఖర్, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొని యాదగిరి మౌనికకు అభినందనలు తెలిపారు.

- కొత్త సూరవరంలో ఘనంగా ప్రారంభమైన పరదేశమ్మ తల్లి జాతర మహోత్సవా లు కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో 41 జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర మహోత్సవంలో భాగంగా 11 రోజులు దీక్ష అనంతరం మాల ధారణ ధరించిన భక్తులు ఇరుముడులు కట్టుకొని ఎస్. అన్నవరం గ్రామమంతా గిరి ప్రదక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత, పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గురు స్వామి చోడిశెట్టి కన్నా ప్రకాష్ ఆధ్వర్యంలో మాల విసర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ బుధవారం నాడు రాత్రి అమ్మవారి జాతర కార్యక్రమం ఘనంగా జరుగుతుందని తెలిపారు.1
- బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు1
- సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకలు అనకాపల్లి:స్థానిక సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షు లు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో పట్టణం లో గల కన్యకాపరమేశ్వరి దేవాలయం జంక్షన్ లో గల భారతరత్న మదర్ థెరిస్సా విగ్రహం వద్ద మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకల ను ఘనముగా నిర్వహించా రు. ఈ కార్యక్రమం లో సంస్థ అధ్యక్షులు బల్లా నాగభూష ణము మదర్ థెరిస్సా విగ్ర హానికి జ్యోతి వెలిగించి పూలమాల వేసి ఘనముగా నివాళి లర్పించారు.విద్యా ర్థులకు, పాదచారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బల్లా నాగభూషణం మాట్లాడు తూ మదర్ థెరిస్సా గారు భారతదేశమునకు చేసిన సేవలు ఎన్నటికీ మరచి పోలేనివని వారు మన దేశము లో నిరుపేదలకు, కుష్ఠు రోగులకు,క్షయ వ్యాధి గ్రస్తులకు, క్షత గాత్రులకు, తన ఫౌండేషన్ ద్వారా అశేషమైన సేవలను అందించిన మహనీయ వ్యక్తియని, అటువంటి మహనీయ సేవామూర్తి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వారి శత జయంతి ని పురష్కరించు కొని అత్యుత్తమ భారత రత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించిందని, అలాగే వారి సేవలకు గాను రామన్ మెగ సేసే అవార్డు, ప్రపంచం నోబెల్ బహుమతీ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న సేవా మూర్తి యని, ప్రార్ధించే పెదవులక న్నా సాయం చేసే చేతులు మిన్న అన్న ఆశయ స్ఫూర్తి తో తన జీవితమంతా అన్నార్థుల, అభాగ్యుల సేవల కే అంకితం చేశారని అటువంటి గొప్ప మహనీ య వ్యక్తి 116 వ జన్మదినం సందర్భముగా వారికి ఘన నివాళులు అర్పించుకోవడం ఎంతో గర్వముగా సంతోష ముగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శులు రొబ్బి మల్లేశ్వరరావు, బల్లా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు అయ్యగారి వెంకటరమణ మూర్తి, పొట్టి శ్రీరాములు భవన్ చైర్మన్ పిరాట్ల నరసింహ మూర్తి, జె. ఎం. జె. స్కూల్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్దులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా రు.1
- రోలుగుంటలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన ర్యాలీ.... రోలుగుంట, ఆగస్టు 26: ఫ్లోరైడ్ ప్రభావిత రోలుగుంటలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ దళిత, గిరిజన, పేద మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. వరాహ నదిలో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. కాలనీలకు తక్షణం ట్యాంకర్ల ద్వారా నీరందించాలని, సీఎస్‌ఆర్, డీఎఫ్‌ఎం నిధులతో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. సీపీఎం నాయకులు కె.గోవిందరావు, వి.నూకరత్నం, వి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.4
- *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II1
- అనుమతి లేకుండా బైక్ ర్యాలీ.. యువతకు సీఐ సూచనలు........ మచిలీపట్నం: మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని ఇనుగుదురుపేట సీఐ ముందుగానే స్పష్టం చేశారు. అయితే సీఐ సూచించిన సమయం కంటే ముందే కొంతమంది ముస్లిం యువత బైక్‌లతో బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. మత పెద్దలు చెప్పిన విధంగా యువత నడుచుకోవాలని సీఐ సూచించి, పరిస్థితిని సర్దుబాటు చేసి యువతను అక్కడి నుంచి పంపించారు.1
- గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.4
- ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ సేవలు ప్రారంభం-తుమ్మపాలలో కొత్త వెలుగులు అనకాపల్లి:సామాజిక సేవే పరమావధిగా, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూతనందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల గ్రామంలో నూతనంగా ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ ముఖ్య నేత ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం వి ఆర్) చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేసి ఈ సేవా సంస్థ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు ( ఎం వి ఆర్) మాట్లాడుతూ... సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు, అకస్మాత్తుగా ఆపదల్లో చిక్కుకున్న బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరికైనా ఏ చిన్న కష్టం వచ్చినా, విద్య, వైద్యం, లేదా మరేదైనా ఆపద ఎదురైనా సరే నిరభ్యంతరంగా ట్రస్ట్ వద్దకు వచ్చి సంప్రదించవచ్చు. మా పరిధి మేరకు ప్రతి ఒక్కరికీ కొండంత అండగా ఉంటామని ఆయన ప్రజలకు ఘనంగా భరోసా నిచ్చారు.సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఆరంభమైన ఈ ట్రస్ట్ కార్యకలాపాలు సీఈవో బలరామ్, సి పీఆర్‌ఓ బోస్, ట్రస్ట్ మెంబర్ విష్ణువర్ధన్ ల సమర్థవంతమైన సారథ్యంలో నిరంతరం కొనసాగనున్నాయన్నారు. ఈ సేవా కార్యక్రమానికి అనకాపల్లి ఇన్‌చార్జ్ గైపూరి రాజుతో పాటు ఎం వి ఆర్ యువసేన సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతు తెలిపారు. మానవత్వమే ప్రాతిపదికగా సేవారంగంలోకి అడుగుపెట్టిన ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ నిర్వాహకులను తుమ్మపాల గ్రామస్తులు, ప్రజాప్రతి నిధులు హృదయపూర్వకంగా అభినందించారు. సంప్రదించవలసిన నెంబర్లు 08924. 2378964