logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కర్పూరి ఠాగూర్ కు భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం సంతోషకరం. కర్పూరి ఠాగూర్ యువతకు ఆదర్శం. కర్పూరి ఠాగూర్ ఘనంగా 39వ వర్ధంతి. బద్వేలు :పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనములో కర్పూరీ ఠాగూర్ 39వ వర్ధంతి చేతి వృత్తిదారుల సంఘం పట్టణ కన్వీనర్ నాగార్జున అధ్యక్షతన జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బద్వేలు పట్టణ కార్యదర్శి కే శ్రీనివాసులు మాట్లాడుతూ కర్పూరీ ఠాకూర్ బీహార్లోని సమస్తిపూర్ జిల్లా పితౌంజియా (ప్రస్తుతం కర్పూరి) గ్రామంలో గోకుల్ ఠాకూర్, రామ్దులారి దేవి దంపతులకు జన్మించాడు. అతను మహాత్మా గాంధీ, సత్యనారాయణ సిన్హాచే ప్రభావితమయ్యాడు. అతను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో చేరి విద్యార్థి నాయకుడిగా, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు, అతను 26 నెలల జైలు జీవితం గడిపాడు. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, తన గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు. అతను 1952లో తాజ్పూర్ నియోజకవర్గం నుండి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా బీహార్ విధానసభ సభ్యుడు అయ్యాడు. 1960లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సార్వత్రిక సమ్మె సందర్భంగా పి అండ్ టి ఉద్యోగులకు నాయకత్వం వహించినందుకు అరెస్టయ్యాడు. 1970లో, అతను టెల్కో కార్మికుల ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి 28 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాడు. హిందీ భాషపై తనకున్న విశ్వాసంతో బీహార్ విద్యా మంత్రిగా మెట్రిక్యులేషన్ పాఠ్యాంశాలకు ఆంగ్లాన్ని తప్పనిసరి సబ్జెక్ట్గా తొలగించాడు. అతను 1970లో బీహార్లో మొదటి కాంగ్రెసేతర సోషలిస్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి ముందు బీహార్లో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసాడు. అతను బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కూడా అమలు చేశాడు. అతని హయాంలో, బీహార్లోని వెనుకబడిన ప్రాంతాలలో అతని పేరు మీద అనేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి.అతను సంయుక్త సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసాడు. లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, దేవేంద్ర ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి ప్రముఖ బీహారీ నాయకులకు అతను గురువుగా కీర్తిపొందాడు. 1984లో ప్రారంభించబడిన దళిత మజ్దూర్ కిసాన్ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నాడు.కర్పూరీ ఠాకూర్ 1952లో ఎమ్మెల్యేగా ఎన్నికతో ప్రారంభమైన రాజకీయ జీవితం (1977 పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనప్పుడు, 1984 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సమయం మినహా) 1988లో మరణించే వరకు శాసనసభ్యునిగా ఉన్నాడు. ఠాకూర్ 1967 మార్చి 5 నుంచి 1968 జనవరి 28 వరకు బీహార్ విద్యాశాఖ మంత్రిగా,1970 డిసెంబరులో సంయుక్త సోషలిస్టు పార్టీతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు, కాని అతని ప్రభుత్వం ఆరు నెలల తరువాత పడిపోయింది. 1977 జూన్ లో తిరిగి పదవిని చేపట్టినా పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేయలేక, దాదాపు రెండేళ్లలో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇందుకు ప్రధానకారణం అతను అమలు చేసిన రిజర్వేషన్ విధానం వల్ల జరిగిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటారు. కర్పూరీ ఠాకూర్ విధానపరమైన నిర్ణయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, అతని సచ్చీలత (క్లిన్ ఇమేజ్), మచ్చలేని రాజకీయ నాయకుడిగా వ్యక్తిగతంగా గౌరవించబడ్డారు. కర్పూరి ఠాకూర్ 64 సంవత్సరాల వయసులో 1988 ఫిబ్రవరి 17న గుండెపోటుతో మరణించాడు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం పట్టణ గౌరవ ఇద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం ఉపాధ్యక్షురాలు గౌసియా బేగం బద్వేల్ పట్టణ ఉపాధ్యక్షురాలు మోక్షమ్మ బాలమ్మ, మస్తాన్ బి, పోరుమామిళ్ల పట్టణ ఇద్వా నాయకురాలు బీబి, మేరీ, ఓబుళమ్మ, కమిటీ సభ్యులురాలు రోషమ్మ లక్ష్మి కాంతమ్మ, రామాలక్షుమ్మ, సుబ్బలక్షుమ్మ, సుప్రజ రాజగోపాల్ వెంకటేశ్వర్లు శాంతయ్య పాల్గొన్నారు.

7 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
7 hrs ago
933e3e40-7b0a-43cf-a4a3-367273862864

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు:నేషనల్ హైవే రహదారుల్లో ఫ్రీ లెఫ్ట్ లో వాహనాలు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లను సిఐ రామకృష్ణ పరిశీలించారు . అనంతరం పట్టణం లోని నాలుగు రోడ్ సర్కిల్లో ట్రాఫిక్ ను అర్బన్ సీఐ రామకృష్ణ పరిశీలించి పట్టణంలో వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్న పోలీస్ సిబ్బంది సిఐ రామకృష్ణ పాలు రకాల సూచనలను తెలియజేశారు.
    1
    బద్వేలు:నేషనల్ హైవే రహదారుల్లో ఫ్రీ లెఫ్ట్ లో వాహనాలు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లను సిఐ  రామకృష్ణ  పరిశీలించారు . అనంతరం పట్టణం లోని 
నాలుగు రోడ్ సర్కిల్లో ట్రాఫిక్ ను  అర్బన్ సీఐ రామకృష్ణ  పరిశీలించి పట్టణంలో వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్న పోలీస్ సిబ్బంది సిఐ రామకృష్ణ  పాలు రకాల సూచనలను తెలియజేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన. మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.
    1
    మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన.
మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.
    user_Rayachoti
    Rayachoti
    జర్నలిస్ట్ Rayachoti, Annamayya•
    7 hrs ago
  • Post by మీ శ్రేయోభిలాషి
    1
    Post by మీ శ్రేయోభిలాషి
    user_మీ శ్రేయోభిలాషి
    మీ శ్రేయోభిలాషి
    Local Politician నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • మదనపల్లి లో చిన్నారిని దారుణంగా హత్య చేసిన నిందితున్ని ఎన్కౌంటర్ చేయాలి.
    1
    మదనపల్లి లో చిన్నారిని దారుణంగా హత్య చేసిన నిందితున్ని ఎన్కౌంటర్ చేయాలి.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    15 hrs ago
  • గన్నవరం విమానాశ్రయం రన్‌వేపై దిగిన ఆ ప్రత్యేక విమానం కేవలం ఒక వ్యక్తిని మాత్రమే మోసుకొని రాలేదు; నవ్యాంధ్ర భవిష్యత్తుకు అవసరమైన ఒక గొప్ప 'దాతృత్వ ఆలోచన'ను, 'అత్యాధునిక సాంకేతికత'ను వెంటబెట్టుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచం గర్వించే మానవతావాది బిల్ గేట్స్ అమరావతి గడ్డపై అడుగుపెట్టడం ఒక చారిత్రాత్మక ఘట్టం. అమరావతి గడ్డపై అపర కుబేరుడు: ఇది కేవలం పర్యటన కాదు.. ఒక ఆశల వారధి! నేటి సమాజంలో సాయం చేసే చేతిని కూడా అనుమానించే పరిస్థితి. కానీ, తాను సంపాదించిన సంపదలో సింహభాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం వెచ్చించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులకు 'దాతృత్వం' అంటే ఏమిటో నేర్పిన మహోన్నత వ్యక్తి బిల్ గేట్స్. ఆయన గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకడం వెనుక ఒక స్పష్టమైన సంకేతం ఉంది. అది—సాంకేతికతతో సామాన్యుడి జీవితాన్ని మార్చాలనే తపన. సంపద పంపిణీ కాదు.. సమస్యల పరిష్కారం బిల్ గేట్స్ పర్యటనను కేవలం ఒక పారిశ్రామికవేత్త పర్యటనగా చూడలేం. ఒక మనిషి తన మేధస్సుతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగి, మళ్ళీ అదే మేధస్సును పేదరికం, రోగాలు, వ్యవసాయ సంక్షోభాల పరిష్కారానికి ఎలా వాడుతున్నారనేది ఇక్కడ ముఖ్యం. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీలో సాగుతున్న 'సంజీవని' వంటి ప్రాజెక్టులు వేలమంది ప్రాణాలను, జీవనోపాధిని కాపాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే RTGS కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించనుండటం విశేషం. డేటా ఆధారిత పాలనలో ఏపీ దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. ప్రభుత్వ ఫలాలు నేరుగా లబ్ధిదారుడికి అందుతున్నాయా? సాంకేతికత ద్వారా అవినీతిని ఎలా అరికట్టవచ్చు? విపత్తుల సమయంలో సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు? ఈ అంశాలపై గేట్స్ వంటి విజనరీకి చంద్రబాబు నాయుడు ప్రజంటేషన్ ఇవ్వడం రాష్ట్ర ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుంది. బిల్ గేట్స్ వంటి దిగ్గజాలను ఆంధ్రప్రదేశ్ వైపు చూడలా చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి సామాన్యమైనది కాదు. గత మూడు దశాబ్దాలుగా ఆయనకు గేట్స్ తో ఉన్న సాన్నిహిత్యం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మించుకున్న ఒక బలమైన బంధం. ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులకు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ లా కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ నిర్మాణ సమయం నుండి నేటి అమరావతి వరకు, టెక్నాలజీని సామాన్యుడి ముంగిటకు తేవాలనే ఆయన ప్రయత్నమే గేట్స్ ఫౌండేషన్ ను ఇక్కడికి రప్పించింది. లోకేశ్ తో కూడిన మంత్రుల బృందం గేట్స్ కు స్వాగతం పలకడం ద్వారా ప్రభుత్వం అంతా ఒకే లక్ష్యం—'అభివృద్ధి'—కోసం పనిచేస్తోందని నిరూపించారు. ఈ పర్యటన ద్వారా రాబోయే మార్పులు అపారం: ఉండవల్లిలో డ్రోన్లు, AI (కృత్రిమ మేధ) సాయంతో చేసే వ్యవసాయాన్ని గేట్స్ పరిశీలించడం ద్వారా, భవిష్యత్తులో మన రైతులు ప్రపంచ స్థాయి సాగు పద్ధతులను అందుకోనున్నారు. వైద్యం & విద్య: గేట్స్ ఫౌండేషన్ సహకారంతో స్కూళ్లలో డిజిటల్ విద్య, ఆసుపత్రుల్లో అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. గేట్స్ రాకతో ఇతర అంతర్జాతీయ సంస్థల దృష్టి కూడా అమరావతిపై పడుతుంది. ఇది 'స్వర్ణాంధ్ర విజన్ 2047' దిశగా పడే బలమైన అడుగు. బిల్ గేట్స్ పర్యటన ఒక గంటలో.. రోజులో ముగిసే కార్యక్రమం కాదు, అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దొరికిన ఒక గొప్ప భరోసా. సంపద ఉన్న ప్రతివాడూ సాయం చేయడు, సాయం చేసే మనసున్న ప్రతివాడి దగ్గరా సంపద ఉండదు. ఈ రెండూ పుష్కలంగా ఉన్న గేట్స్, మార్పును ఆకాంక్షించే చంద్రబాబు కలిస్తే—అది సామాన్యుడి పాలిట వరం.
    2
    గన్నవరం విమానాశ్రయం రన్‌వేపై దిగిన ఆ ప్రత్యేక విమానం కేవలం ఒక వ్యక్తిని మాత్రమే మోసుకొని రాలేదు; నవ్యాంధ్ర భవిష్యత్తుకు అవసరమైన ఒక గొప్ప 'దాతృత్వ ఆలోచన'ను, 'అత్యాధునిక సాంకేతికత'ను వెంటబెట్టుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచం గర్వించే మానవతావాది బిల్ గేట్స్ అమరావతి గడ్డపై అడుగుపెట్టడం ఒక చారిత్రాత్మక ఘట్టం.
అమరావతి గడ్డపై అపర కుబేరుడు: ఇది కేవలం పర్యటన కాదు.. ఒక ఆశల వారధి!
నేటి సమాజంలో సాయం చేసే చేతిని కూడా అనుమానించే పరిస్థితి. కానీ, తాను సంపాదించిన సంపదలో సింహభాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం వెచ్చించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులకు 'దాతృత్వం' అంటే ఏమిటో నేర్పిన మహోన్నత వ్యక్తి బిల్ గేట్స్. ఆయన గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకడం వెనుక ఒక స్పష్టమైన సంకేతం ఉంది. అది—సాంకేతికతతో సామాన్యుడి జీవితాన్ని మార్చాలనే తపన.
సంపద పంపిణీ కాదు.. సమస్యల పరిష్కారం
బిల్ గేట్స్ పర్యటనను కేవలం ఒక పారిశ్రామికవేత్త పర్యటనగా చూడలేం. ఒక మనిషి తన మేధస్సుతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగి, మళ్ళీ అదే మేధస్సును పేదరికం, రోగాలు, వ్యవసాయ సంక్షోభాల పరిష్కారానికి ఎలా వాడుతున్నారనేది ఇక్కడ ముఖ్యం. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీలో సాగుతున్న 'సంజీవని' వంటి ప్రాజెక్టులు వేలమంది ప్రాణాలను, జీవనోపాధిని కాపాడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే RTGS కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించనుండటం విశేషం. డేటా ఆధారిత పాలనలో ఏపీ దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది.
ప్రభుత్వ ఫలాలు నేరుగా లబ్ధిదారుడికి అందుతున్నాయా?
సాంకేతికత ద్వారా అవినీతిని ఎలా అరికట్టవచ్చు?
విపత్తుల సమయంలో సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?
ఈ అంశాలపై గేట్స్ వంటి విజనరీకి చంద్రబాబు నాయుడు ప్రజంటేషన్ ఇవ్వడం రాష్ట్ర ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుంది.
బిల్ గేట్స్ వంటి దిగ్గజాలను ఆంధ్రప్రదేశ్ వైపు చూడలా చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి సామాన్యమైనది కాదు. గత మూడు దశాబ్దాలుగా ఆయనకు గేట్స్ తో ఉన్న సాన్నిహిత్యం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మించుకున్న ఒక బలమైన బంధం.
ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులకు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ లా కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ నిర్మాణ సమయం నుండి నేటి అమరావతి వరకు, టెక్నాలజీని సామాన్యుడి ముంగిటకు తేవాలనే ఆయన ప్రయత్నమే గేట్స్ ఫౌండేషన్ ను ఇక్కడికి రప్పించింది.
లోకేశ్ తో కూడిన మంత్రుల బృందం గేట్స్ కు స్వాగతం పలకడం ద్వారా ప్రభుత్వం అంతా ఒకే లక్ష్యం—'అభివృద్ధి'—కోసం పనిచేస్తోందని నిరూపించారు.
ఈ పర్యటన ద్వారా రాబోయే మార్పులు అపారం:
ఉండవల్లిలో డ్రోన్లు, AI (కృత్రిమ మేధ) సాయంతో చేసే వ్యవసాయాన్ని గేట్స్ పరిశీలించడం ద్వారా, భవిష్యత్తులో మన రైతులు ప్రపంచ స్థాయి సాగు పద్ధతులను అందుకోనున్నారు.
వైద్యం & విద్య: గేట్స్ ఫౌండేషన్ సహకారంతో స్కూళ్లలో డిజిటల్ విద్య, ఆసుపత్రుల్లో అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి.
గేట్స్ రాకతో ఇతర అంతర్జాతీయ సంస్థల దృష్టి కూడా అమరావతిపై పడుతుంది. ఇది 'స్వర్ణాంధ్ర విజన్ 2047' దిశగా పడే బలమైన అడుగు.
బిల్ గేట్స్ పర్యటన ఒక గంటలో.. రోజులో ముగిసే కార్యక్రమం కాదు, అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దొరికిన ఒక గొప్ప భరోసా. సంపద ఉన్న ప్రతివాడూ సాయం చేయడు, సాయం చేసే మనసున్న ప్రతివాడి దగ్గరా సంపద ఉండదు. ఈ రెండూ పుష్కలంగా ఉన్న గేట్స్, మార్పును ఆకాంక్షించే చంద్రబాబు కలిస్తే—అది సామాన్యుడి పాలిట వరం.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG
    1
    మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG
    user_SN MEDIA
    SN MEDIA
    మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు, ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..
    1
    మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు,  ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..
    user_SREENIVAS
    SREENIVAS
    Teacher మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • బద్వేలు:పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ నల్లబ్యాడ్జీలు దరించి నిరసన తెలియజేస్తున్న VRA, VROలు నిరసన కార్యక్రమం చేశారు. తమపై పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ వీఆర్, వీఆర్ఎలు బద్వేలు తహశీల్దారు కార్యాలయం వద్ద సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమకు భూముల రీసర్వేతో పాటు హౌస్ సర్వే చేయాలని ప్రభుత్వం తమపై అధిక ఒత్తిడి తెస్తోంది....దీంతో తమకు ఒత్తిడి అధికమైందని, కావున తమకు ఒకేసారి రెండు, మూడు పనులు కేటాయించడం సరికాదని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని జిల్లా వీఆర్ఎ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
    1
    బద్వేలు:పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ నల్లబ్యాడ్జీలు దరించి నిరసన 
తెలియజేస్తున్న VRA, VROలు నిరసన కార్యక్రమం చేశారు. తమపై పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ వీఆర్, వీఆర్ఎలు బద్వేలు తహశీల్దారు కార్యాలయం వద్ద సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమకు భూముల రీసర్వేతో పాటు హౌస్ సర్వే చేయాలని ప్రభుత్వం తమపై అధిక ఒత్తిడి తెస్తోంది....దీంతో తమకు ఒత్తిడి అధికమైందని, కావున తమకు ఒకేసారి రెండు, మూడు పనులు కేటాయించడం సరికాదని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని జిల్లా వీఆర్ఎ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.