స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ STUTS 80వ వసంతాల వైభవోత్సవం జిల్లా STU భవన్‌లో ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం అని అన్నారు. ఉపాధ్యాయుల కృషి తెలంగాణ రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఈరోజు నేను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్న స్థాయికి రావడంలో నా గురువుల బోధనలు, వారు చెప్పిన మాటలు, నేర్పిన విలువలు ఎంతో ప్రభావం చూపాయి” అని ఆమె గుర్తు చేసుకున్నారు.ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు. విద్యార్థుల భవిష్యత్తుకు శిల్పులు. STUTS వంటి ఉపాధ్యాయుల సంఘాలు ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం మరియు విద్యా రంగ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా STUTS యూనియన్‌కు నా వంతు సహకారం అందించేందుకు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముందుండి కృషి చేస్తానని బండారి అనూష సతీష్ గారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు , సంఘం యొక్క రాష్ట్ర నాయకులు , జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ STUTS 80వ వసంతాల వైభవోత్సవం జిల్లా STU భవన్‌లో ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం అని అన్నారు. ఉపాధ్యాయుల కృషి తెలంగాణ రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఈరోజు నేను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్న స్థాయికి రావడంలో నా గురువుల బోధనలు, వారు చెప్పిన మాటలు, నేర్పిన విలువలు ఎంతో ప్రభావం చూపాయి” అని ఆమె గుర్తు చేసుకున్నారు.ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు. విద్యార్థుల భవిష్యత్తుకు శిల్పులు. STUTS వంటి ఉపాధ్యాయుల సంఘాలు ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం మరియు విద్యా రంగ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా STUTS యూనియన్‌కు నా వంతు సహకారం అందించేందుకు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముందుండి కృషి చేస్తానని బండారి అనూష సతీష్ గారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు , సంఘం యొక్క రాష్ట్ర నాయకులు , జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- ఆగస్టు 26, 2026_ఆదిలాబాదు: *అదిలాబాద్‌లో వైభవంగా ఓనం వేడుకలు: జిల్లా కలెక్టర్ రాజర్షిషా* పత్రిక ప్రకటన కేరళ తరహాలోనే బెల్లూరి అయ్యప్ప ఆలయం వద్ద ఓనం మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాదు గ్రామీణ మండలం బెల్లూరి అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన ఓనం వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేరళలో ఏ విధంగా ఓనం పండుగ జరుగుతుందో, అదే రీతిలో అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమం, అభిషేకం, దీక్షా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారని తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ చరిత్ర కొనసాగుతోందని, దేశవ్యాప్తంగా ఓనం పండుగను జరుపుకున్నట్లే మన జిల్లాలో సైతం జరుపుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది తాను ఓనం పండుగలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. భగవంతుని దర్శనం చేసుకుని, ఆశీస్సులు తీసుకుని జిల్లా అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, చదువులోనూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, భగవంతుడు అందరికీ శక్తినివ్వాలని కోరారు. అదేవిధంగా ఆలయానికి సంబంధించి గత సంవత్సరంలో ఉన్న పెండింగ్ పేమెంట్స్, బిల్స్ అన్నీ క్లియర్ చేసుకుని, మరిన్ని వసతులు సమకూర్చుకుంటూ ఈసారి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఓనం పండుగను మరింత ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి రమేష్, గురుస్వాములు గొర్ల కృష్ణ, చంద్ర గణేష్, తిప్పరి సత్యం, గాలి లక్ష్మి, భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.1
- ఆంక్షలతో మేకలను గొర్రెలను అమ్ముకుంటున్నామని ఆవేదన....... కవ్వాల్ అభయారణ్యంలో అమలు చేస్తున్న ఆంక్షలతో తమ వద్ద ఉన్న మేకలను, గొర్రెలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా గ్రామ పెద్ద చిన్నన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం జన్నారంలో ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకల మందతో ఒకప్పుడు తాము అడవికి వెళ్లే వాళ్ళమని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన వాపోయారు. అటవీ ఆంక్షలు తమ ఉపాధిని పూర్తిగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు.1
- సిరికొండ:చినుకు పడితే చిత్తడే.. కోడూరు హై లెవెల్ బ్రిడ్జి సిరికొండ మండలంలోని కోడూరు హై లెవెల్ బ్రిడ్జి వద్ద వర్షం పడితే రహదారి మొత్తం బురదమయంగా మారి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- *-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి *రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది* *-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి – పసుపు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా - 'సునహరి మిట్టి అభియాన్', మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించిన గవర్నర్ నిజామాబాద్, ఆగస్టు 25,2026: రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ''సునహరి మిట్టి అభియాన్', మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు గవర్నర్ మెమంటో లు అందించి అభినందించారు. అనంతరం గవర్నర్ పసుపు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నిజామాబాద్‌కు పసుపు సాగులో ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్ అన్నారు. సారవంతమైన నేలలు, రైతుల కష్టంతో ఈ ప్రాంతం దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పత్తి కేంద్రంగా ఎదిగిందన్నారు. ఇక్కడ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం ఈ ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఇది సాకారం అయ్యిందన్నారు. సాగును లాభదాయకంగా మార్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. పసుపు కేవలం వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాదని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, నిత్యజీవితంతో ముడిపడిన విలువైన సంపద అని గవర్నర్ పేర్కొన్నారు. భారతదేశ వ్యవసాయ వారసత్వానికి పసుపు ప్రతీకగా నిలుస్తోందన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారుగా కొనసాగించడంతో పాటు.. పసుపు ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడమే జాతీయ పసుపు బోర్డు లక్ష్యమని గవర్నర్ అన్నారు. పసుపు పండించే రైతుకు కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పసుపుకు ప్రత్యేక గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు నాణ్యత పెంపు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటకోత అనంతర నిర్వహణపై శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. బాయిలర్లు, పాలిషర్లు, చిన్నతరహా ప్రాసెసింగ్ యూనిట్లు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా దోహదపడతాయని తెలిపారు. సహజ వ్యవసాయం, ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే దూరదృష్టితో ‘సునహరీ మిట్టీ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రసాయన ఎరువులు, ఇతర ఇన్‌పుట్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా నేల సారాన్ని కాపాడటంతో పాటు.. పర్యావరణ పరిరక్షణ, సాగు వ్యయాన్ని తగ్గించేందుకు సహజ వ్యవసాయం తోడ్పడుతుందని అన్నారు. అవశేష రహిత, నాణ్యమైన పసుపుకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని.. నాణ్యతకు ప్రాధాన్యమిస్తే రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు విదేశీ మార్కెట్లకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలు రైతులను నేరుగా దేశంలోని ప్రముఖ ఎగుమతిదారులతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గవర్నర్ అన్నారు. మార్కెట్ అవసరాలు, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు సమష్టిగా పనిచేస్తే భారత పసుపును ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లలో మరింత బలోపేతం చేయవచ్చని గవర్నర్ అన్నారు. రైతులు కేవలం పంట ఉత్పత్తిదారులు మాత్రమే కాదని.. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని గవర్నర్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది అన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, నాణ్యమైన పంటను పండిస్తూ, సమష్టి మార్కెటింగ్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. “అన్నదాత సుఖీభవ” స్ఫూర్తితో రైతు సంపన్నుడిగా, నేల ఆరోగ్యంగా, ప్రపంచ మార్కెట్‌లో భారత్ అగ్రగామిగా నిలిచే వ్యవసాయ వ్యవస్థను నిర్మించాలి అని గవర్నర్ ఆకాంక్షించారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఈ ప్రాంత పసుపు రైతుల నాలుగు దశాబ్దాల కలను నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో కేంద్రం నెరవేర్చిందన్నారు. బోర్డు ఏర్పాటు తో పసుపు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. పసుపు క్వింటాలు ఇచ్చే రేటు గతం కంటే పెరిగిందన్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం దాన కిషోర్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి, నగర మేయర్ ఉమారాణి,నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పి. రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి భవానీ శ్రీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య లు పాల్గొన్నా3
- శ్రావణమాసం రెండవ బుధవారం భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ వేములవాడ భీమన్న క్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శ్రావణమాసం రెండవ బుధవారం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. అభిషేక ప్రియుడైన స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. గండాలు తొలగాలని కోరుకుంటూ గండదీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.1
- *జాతీయ బీసీ సంక్షేమ సంఘం* *రాష్ట్ర ఉపాధ్యక్షలు అమరవేణి నర్సాగౌడ్ కు ఆత్మీయ సన్మానం* *జాతీయ బీసీ సంక్షేమ సంఘం* *రాష్ట్ర ఉపాధ్యక్షలు అమరవేణి నర్సాగౌడ్ కు ఆత్మీయ సన్మానం* . ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోఇటీవల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులు ఐన అమరవేణి నర్సాగౌడ్ గారికి పూల మాలలు శాలువాలతో ఆత్మీయ సన్మానం చేశారు నిర్వహించారు. అమరవేణి నర్సాగౌడ్ హనుముల భాస్కర్ మాట్లాడుతూ :- ఈ దేశంలో 85% పైనున్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం రాకుండా కేవలం పిడికెడు మంది ఉన్న అగ్రకులాలు రాజ్యాంగపరమైన పదవులను అనుభవిస్తూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కకుండా చేస్తున్న వారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం లభించే వరకు ఐక్యంగా పోరాడుతామని తెలియజేశారు బీసీల జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా, హక్కులు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. . ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్ , సోన్ మండల అధ్యక్షులు మ్యాక ప్రేమ్ కుమార్ నాయకులు రమేష్, సత్యనారాయణ, రాజేష్, లక్ష్మీనారాయణ, కిషోర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- అయ్యప్ప ఆలయంలో ఓనం పూజలు.. పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : ఓనం పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లూరిలోని శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డిని సన్మానించారు. ఆలయంలో నిర్వహించిన పడిపూజలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ దంపతులతో కలిసి శ్రీకాంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..1
- *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ - కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. బుధవారం ఉదయం బాలప్రసాద్ - శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో మూడు ముళ్ళు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడుముళ్లు వేశారు. ఉంగరపు వేలుకు ప్రదానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. ఈ వేడుకలో బాలప్రసాద్ తల్లిదండ్రులు స్వరూప - బాలకృష్ణ, సోదరుడు నాగరాజు, తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు.1
- *కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు* *కోడెల మృతిపై విచారణకు ఆదేశం* *నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం* *రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు* వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు... ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు. గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.. వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.4