logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గంగాధర మండల కేంద్రంలో భవిత కేంద్రమును ప్రారంభించిన సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ప్రత్యేక అవసరాల గల పిల్లల కోసం ఏర్పాటు చేసిన “భవిత కేంద్రం”ను గ్రామ సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు సమాజంలో ఇతర పిల్లలకు ఏమాత్రం తీసిపోకుండా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా దివ్యాంగ పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీతో పాటు ప్రత్యేక విద్యా బోధకుల ద్వారా విద్యాబుద్ధులు అందించనున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఉన్న లోపాలను చూసి నిరాశ చెందకుండా, వారిని భవిత కేంద్రాల్లో చేర్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ దమ్మని రాము, ఎంఈఓ ప్రభాకర్ రావు, ఐఈఆర్‌పి సిబ్బంది, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

1 hr ago
user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
1 hr ago
583aa749-8d61-49ed-a704-bea646e64cab

గంగాధర మండల కేంద్రంలో భవిత కేంద్రమును ప్రారంభించిన సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ప్రత్యేక అవసరాల గల పిల్లల కోసం ఏర్పాటు చేసిన “భవిత కేంద్రం”ను గ్రామ సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు సమాజంలో ఇతర పిల్లలకు ఏమాత్రం తీసిపోకుండా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా దివ్యాంగ పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీతో పాటు ప్రత్యేక విద్యా బోధకుల ద్వారా విద్యాబుద్ధులు అందించనున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఉన్న లోపాలను చూసి నిరాశ చెందకుండా, వారిని భవిత కేంద్రాల్లో చేర్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ దమ్మని రాము, ఎంఈఓ ప్రభాకర్ రావు, ఐఈఆర్‌పి సిబ్బంది, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • కరీంనగర్‌లో తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరం ముగిసింది. మే 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కళాకారులకు ఉపాధి అవకాశాలు, గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.
    2
    కరీంనగర్‌లో తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరం ముగిసింది. మే 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కళాకారులకు ఉపాధి అవకాశాలు, గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    16 hrs ago
  • కొండగట్టులో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు...భారీగా తరలివస్తున్న భక్తులు....హనుమాన్ దీక్ష స్వాములతో కాషాయవర్ణ శోభితంగా మారిన కొండగట్టు కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.‌ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బాగంగా రెండవ రోజు కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివస్తున్న భక్తులతో కొండగట్టు భక్తజన సంద్రంగా మారింది. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయవర్ణ శోభితంగా మారింది. రామనామ స్మరణలు, జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దుచేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మాల ధారణతో కొండగట్టుకు చేరుకునే భక్తులు, మాల విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురి కాకుండా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రేపు జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఆ దిశగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ పలు ప్రాంతాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం హనుమాన్ దీక్ష స్వాములు కొండగట్టు ను సందర్శించి అంజన్నను దర్శించుకుంటున్నారు. ఇరుముడితో పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకొని మాల విరమణ చేస్తున్నారు.‌ భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొండగట్టు క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.
    4
    కొండగట్టులో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు...భారీగా తరలివస్తున్న భక్తులు....హనుమాన్ దీక్ష స్వాములతో కాషాయవర్ణ శోభితంగా మారిన కొండగట్టు
కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.‌ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బాగంగా రెండవ రోజు కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివస్తున్న భక్తులతో కొండగట్టు భక్తజన సంద్రంగా మారింది. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయవర్ణ శోభితంగా మారింది. రామనామ స్మరణలు, జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దుచేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మాల ధారణతో కొండగట్టుకు చేరుకునే భక్తులు, మాల విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురి కాకుండా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రేపు జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఆ దిశగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ పలు ప్రాంతాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం హనుమాన్ దీక్ష స్వాములు కొండగట్టు ను సందర్శించి అంజన్నను దర్శించుకుంటున్నారు. ఇరుముడితో పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకొని మాల విరమణ చేస్తున్నారు.‌ 
భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో  కొండగట్టు క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    49 min ago
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ సభలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
    1
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ సభలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    23 hrs ago
  • చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
    1
    చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
  • మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని నిన్న రాత్రి డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన
    1
    మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన 

ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్
మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన 
ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్
మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని నిన్న రాత్రి  డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు 
తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    1
    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
    2
    కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • తెలంగాణలోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభ 'జై శ్రీరాం' నినాదాలతో హోరెత్తింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగం కాంగ్రెస్, బీఆర్ఎస్ గుండెల్లో రాళ్లు పడేలా చేసిందని అనడంతో కార్యకర్తలు ఉత్సాహంగా స్పందించారు. తాను ధర్మం కోసం పనిచేసే మోదీ సైనికుడిని అని చెప్పి వారిని మరింత ఆకట్టుకున్నారు.
    1
    తెలంగాణలోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభ 'జై శ్రీరాం' నినాదాలతో హోరెత్తింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగం కాంగ్రెస్, బీఆర్ఎస్ గుండెల్లో రాళ్లు పడేలా చేసిందని అనడంతో కార్యకర్తలు ఉత్సాహంగా స్పందించారు. తాను ధర్మం కోసం పనిచేసే మోదీ సైనికుడిని అని చెప్పి వారిని మరింత ఆకట్టుకున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.