logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చర్ల మండలం లో విజయ్ కాలనీలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి దీపావళి చర్ల: విజయ్ కాలనీలో రవి, భవాని దంపతుల ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ నేతలు దుర్గాప్రసాద్, మురళి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ నాయుడు, మాజీ ఎంపీటీసీ పద్మజ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

22 hrs ago
user_Koti Bharathraju
Koti Bharathraju
చేర్ల, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
22 hrs ago

చర్ల మండలం లో విజయ్ కాలనీలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి దీపావళి చర్ల: విజయ్ కాలనీలో రవి, భవాని దంపతుల ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ నేతలు దుర్గాప్రసాద్, మురళి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ నాయుడు, మాజీ ఎంపీటీసీ పద్మజ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • చర్ల మండలం లో విజయ్ కాలనీలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి దీపావళి చర్ల: విజయ్ కాలనీలో రవి, భవాని దంపతుల ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ నేతలు దుర్గాప్రసాద్, మురళి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ నాయుడు, మాజీ ఎంపీటీసీ పద్మజ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
    1
    చర్ల మండలం లో విజయ్ కాలనీలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి దీపావళి
చర్ల: విజయ్ కాలనీలో రవి, భవాని దంపతుల ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ నేతలు దుర్గాప్రసాద్, మురళి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ నాయుడు, మాజీ ఎంపీటీసీ పద్మజ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
    user_Koti Bharathraju
    Koti Bharathraju
    చేర్ల, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    22 hrs ago
  • సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక సాకేతపురి దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు . ఉదయం నుండి స్వామివారికి అభిషేకము, వస్త్రాలంకరణ, అష్టోత్రము , ఆకుపూజ హనుమాన్ చాలీసా వంటి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఎంతో శక్తివంతుడని,కోరిని కోర్కెలు తీర్చే ఇష్టదైవమని ఆయనకు తమలపాకు దండ, సింధూరం సమర్పించిన ఎలాంటి కష్టాలు దరిచేరవుఅని భక్తుల విశ్వాసం. అలాంటి స్వామి సేవలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు . ప్రతి మంగళవారం జరిగే హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది . సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుందని ,ఈ ఆలయ కేంద్రం ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు, ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు ,మహిళాలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
    4
    సాకేతపురి దాసాంజనేయ స్వామి  ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక సాకేతపురి దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో  సోమవారం అమావాస్య సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు . ఉదయం నుండి స్వామివారికి అభిషేకము, వస్త్రాలంకరణ, అష్టోత్రము , ఆకుపూజ హనుమాన్ చాలీసా వంటి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఎంతో   శక్తివంతుడని,కోరిని కోర్కెలు తీర్చే  ఇష్టదైవమని ఆయనకు తమలపాకు దండ, సింధూరం సమర్పించిన ఎలాంటి కష్టాలు దరిచేరవుఅని భక్తుల విశ్వాసం. అలాంటి స్వామి సేవలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు . ప్రతి మంగళవారం  జరిగే హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది . సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుందని ,ఈ ఆలయ కేంద్రం ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు, ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు ,మహిళాలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    18 hrs ago
  • ప్రైవేట్ చిట్టీల పేరుతో రూ.55.33 లక్షల మోసం.. ముగ్గురు అరెస్ట్ ప్రైవేట్ చిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ.55.33 లక్షలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగూడెం పట్టణంలోని న్యూ గొల్లగూడెంకు చెందిన కట్టుల సరోజ (62), కట్టుల చంద్రకళ (37), కట్టుల కుమార్ (40) కలిసి మొత్తం 11 ప్రైవేట్ చిట్టీలు నిర్వహిస్తూ ఖాతాదారుల నుంచి రూ.55,33,745 వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చిట్టీల ద్వారా వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించకుండా ఖాతాదారులను మోసం చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 188/2026 కింద కేసు నమోదు కాగా, నమ్మదగిన సమాచారం మేరకు కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ముగ్గురు నిందితులను త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద చిట్టీల లావాదేవీల వివరాలు నమోదు చేసిన ఐదు బుక్స్‌ను స్వాధీనం చేసుకొని, అరెస్టు చేసిన ముగ్గురిని న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. ప్రజలు అధిక లాభాలు వస్తాయనే ఆశతో అనధికారిక ప్రైవేట్ చిట్టీలలో చేరి తమ కష్టార్జితాన్ని కోల్పోవద్దని డీఎస్పీ సూచించారు. చిట్టీలలో చేరే ముందు నిర్వాహకుల చట్టబద్ధత, అనుమతులను పరిశీలించాలని, సరైన రసీదులు, రికార్డులు లేకుండా నగదు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. చట్టవిరుద్ధంగా చిట్టీలు నిర్వహిస్తూ ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన కొత్తగూడెం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అభినందించారు. ప్రజలను ఆర్థిక మోసాల నుంచి రక్షించేందుకు నిరంతరం నిఘా కొనసాగించాలని అధికారులకు సూచించారు.
    1
    ప్రైవేట్ చిట్టీల పేరుతో రూ.55.33 లక్షల మోసం.. ముగ్గురు అరెస్ట్
ప్రైవేట్ చిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ.55.33 లక్షలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 
కొత్తగూడెం పట్టణంలోని న్యూ గొల్లగూడెంకు చెందిన కట్టుల సరోజ (62), కట్టుల చంద్రకళ (37), కట్టుల కుమార్ (40) కలిసి మొత్తం 11 ప్రైవేట్ చిట్టీలు నిర్వహిస్తూ ఖాతాదారుల నుంచి రూ.55,33,745 వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చిట్టీల ద్వారా వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించకుండా ఖాతాదారులను మోసం చేసినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 188/2026 కింద కేసు నమోదు కాగా, నమ్మదగిన సమాచారం మేరకు కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ముగ్గురు నిందితులను త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద చిట్టీల లావాదేవీల వివరాలు నమోదు చేసిన ఐదు బుక్స్‌ను స్వాధీనం చేసుకొని, అరెస్టు చేసిన ముగ్గురిని న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు.
ప్రజలు అధిక లాభాలు వస్తాయనే ఆశతో అనధికారిక ప్రైవేట్ చిట్టీలలో చేరి తమ కష్టార్జితాన్ని కోల్పోవద్దని డీఎస్పీ  సూచించారు. చిట్టీలలో చేరే ముందు నిర్వాహకుల చట్టబద్ధత, అనుమతులను పరిశీలించాలని, సరైన రసీదులు, రికార్డులు లేకుండా నగదు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. చట్టవిరుద్ధంగా చిట్టీలు నిర్వహిస్తూ ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన కొత్తగూడెం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అభినందించారు. ప్రజలను ఆర్థిక మోసాల నుంచి రక్షించేందుకు నిరంతరం నిఘా కొనసాగించాలని అధికారులకు సూచించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    18 hrs ago
  • అర్ధంతరంగా రోడ్డు పనులు.. ప్రయాణికులకు అవస్థలు........ ములుగు: ఖాసిందేవిపేట నుంచి అంకన్నగూడెం వెళ్లే రహదారిలోని పచ్చర్లకుంట వద్ద సుమారు 500 మీటర్ల మేర కంకర పోసి వదిలేశారు. రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు కంకర రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
    1
    అర్ధంతరంగా రోడ్డు పనులు.. ప్రయాణికులకు అవస్థలు........
ములుగు: ఖాసిందేవిపేట నుంచి అంకన్నగూడెం వెళ్లే రహదారిలోని పచ్చర్లకుంట వద్ద సుమారు 500 మీటర్ల మేర కంకర పోసి వదిలేశారు. రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు కంకర రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    3 hrs ago
  • *సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ప్రకటించిన సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్..* తేదీ: 09-11-2026 స్థలం: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, *సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ప్రకటించిన సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్..* తేదీ: 09-11-2026 స్థలం: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సత్తుపల్లి సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రకటన.. 18 మందితో కమిటీ ఏర్పాటు *సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రకటించారు. చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని సోమవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారు క్యాంపు కార్యాలయంలో ప్రకటించారు. ఈ కమిటీ 04-11-2026 నుంచి రెండేళ్ల పాటు కొనసాగనుంది.* ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు మాట్లాడుతూ.. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసి, కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపుగా పదవులు కేటాయించామని తెలిపారు. కమిటీలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. *సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం వివరాలు* చైర్మన్: 1. చల్లగుళ్ల నరసింహారావు – చైర్మన్ వైస్ చైర్మన్: 2. వంట్ల కృష్ణార్జునరావు – వైస్ చైర్మన్ డైరెక్టర్లు / సభ్యులు: 3. మండపాటి రాజేందర్ ప్రసాద్ రెడ్డి 4. పొన్నగంటి జోగారావు 5. దాసరి వెంకటేశ్వర రెడ్డి 6. మోండ్రు సుందరరావు 7. కొప్పుల శ్రీను 8. కోర్సా సత్యవతి 9. ముచ్చనపల్లి నరసింహారావు 10. ఒగ్గు కరుణాకర్ రెడ్డి 11. మహమ్మద్ ఇబ్రహీం 12. చిల్లపల్లి లక్ష్మీ శ్రావణి 13. గుండు ప్రసాద్ 14. నడిపల్లి శ్రీనివాసరావు 15. సత్తుపల్లి PACS చైర్మన్ 16. ఖమ్మం జిల్లా మార్కెటింగ్ అధికారి 17. సత్తుపల్లి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు 18. సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ *ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు ఇటీవల మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు హెలికాప్టర్ ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలకు స్పందించారు.* మంత్రి గారి కోసం వస్తున్న హెలికాప్టర్‌లో తాను ప్రయాణించానని, అధికారికంగా ఎలాంటి హెలికాప్టర్‌ను వినియోగించలేదని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ కేసుల్లో మూలాలు ఉన్న వ్యక్తుల కార్లలో తాను తిరగలేదని పేర్కొంటూ, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకుండా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఘాటుగా హెచ్చరించారు. 15 సంవత్సరాల పాటు సత్తుపల్లి ప్రజలు సండ్ర వెంకట వీరయ్య గారికి అధికారం ఇచ్చినా, ప్రజలకు ఆయన చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆయన సత్తుపల్లికి ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసే పరిస్థితి ఉండేదని అన్నారు. 15 ఏళ్ల పాటు ప్రజలు అవకాశం ఇచ్చినా సత్తుపల్లిని సొంత ఊరిలా భావించలేదని, అందుకే ఇక్కడ సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేదని ఎద్దేవా చేశారు. ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉంటే చెప్పాలని, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 100 గజాల స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా చూస్తామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ప్రకృతి విపత్తు సమయంలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారి గురించి మాట్లాడకుండా హెలికాప్టర్‌లో దిగాడు, కారులో వచ్చాడు అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రెస్‌మీట్ పెట్టడానికి సమయం ఉన్నప్పటికీ, విపత్తు సమయంలో ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు తన అనుచరులను, పార్టీ కార్యకర్తలను పిలుపునివ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇకనైనా చౌకబారు వ్యాఖ్యలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నారావు గారు, సత్తుపల్లి మరియు వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు గారు, నూతన వైస్ చైర్మన్, నూతన డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
    4
    *సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ప్రకటించిన సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్..*

తేదీ: 09-11-2026
స్థలం: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం,
*సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ప్రకటించిన సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్..*
తేదీ: 09-11-2026
స్థలం: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సత్తుపల్లి
సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రకటన.. 18 మందితో కమిటీ ఏర్పాటు
*సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రకటించారు. చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని సోమవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారు క్యాంపు కార్యాలయంలో ప్రకటించారు. ఈ కమిటీ 04-11-2026 నుంచి రెండేళ్ల పాటు కొనసాగనుంది.*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు మాట్లాడుతూ.. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసి, కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపుగా పదవులు కేటాయించామని తెలిపారు. కమిటీలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
*సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం వివరాలు*
చైర్మన్:
1. చల్లగుళ్ల నరసింహారావు – చైర్మన్
వైస్ చైర్మన్:
2. వంట్ల కృష్ణార్జునరావు – వైస్ చైర్మన్
డైరెక్టర్లు / సభ్యులు:
3. మండపాటి రాజేందర్ ప్రసాద్ రెడ్డి
4. పొన్నగంటి జోగారావు
5. దాసరి వెంకటేశ్వర రెడ్డి
6. మోండ్రు సుందరరావు
7. కొప్పుల శ్రీను
8. కోర్సా సత్యవతి
9. ముచ్చనపల్లి నరసింహారావు
10. ఒగ్గు కరుణాకర్ రెడ్డి
11. మహమ్మద్ ఇబ్రహీం
12. చిల్లపల్లి లక్ష్మీ శ్రావణి
13. గుండు ప్రసాద్
14. నడిపల్లి శ్రీనివాసరావు
15. సత్తుపల్లి PACS చైర్మన్
16. ఖమ్మం జిల్లా మార్కెటింగ్ అధికారి
17. సత్తుపల్లి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు
18. సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్
*ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు ఇటీవల మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు హెలికాప్టర్ ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలకు స్పందించారు.*
మంత్రి గారి కోసం వస్తున్న హెలికాప్టర్‌లో తాను ప్రయాణించానని, అధికారికంగా ఎలాంటి హెలికాప్టర్‌ను వినియోగించలేదని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ కేసుల్లో మూలాలు ఉన్న వ్యక్తుల కార్లలో తాను తిరగలేదని పేర్కొంటూ, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకుండా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఘాటుగా హెచ్చరించారు.
15 సంవత్సరాల పాటు సత్తుపల్లి ప్రజలు సండ్ర వెంకట వీరయ్య గారికి అధికారం ఇచ్చినా, ప్రజలకు ఆయన చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆయన సత్తుపల్లికి ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసే పరిస్థితి ఉండేదని అన్నారు. 15 ఏళ్ల పాటు ప్రజలు అవకాశం ఇచ్చినా సత్తుపల్లిని సొంత ఊరిలా భావించలేదని, అందుకే ఇక్కడ సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేదని ఎద్దేవా చేశారు.
ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉంటే చెప్పాలని, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 100 గజాల స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా చూస్తామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన ప్రకృతి విపత్తు సమయంలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారి గురించి మాట్లాడకుండా హెలికాప్టర్‌లో దిగాడు, కారులో వచ్చాడు అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రెస్‌మీట్ పెట్టడానికి సమయం ఉన్నప్పటికీ, విపత్తు సమయంలో ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు తన అనుచరులను, పార్టీ కార్యకర్తలను పిలుపునివ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇకనైనా చౌకబారు వ్యాఖ్యలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నారావు గారు, సత్తుపల్లి మరియు వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు గారు, నూతన వైస్ చైర్మన్, నూతన డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Insurance Agent పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
  • ప్రజావాణిలో ప్రజల వినతులపై పరిష్కార చర్యలు చేపట్టాలి :: జిల్లా అదనపు కలెక్టర్లు ములుగు జిల్లాలో ప్రజావాణిలో అందిన ప్రజల వినతులను పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, ఎం. సంపత్ రావు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సోమవారం ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అర్జీదారులు తెలిపిన సమస్యలను విని, వారి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్జీలను సంబంధిత శాఖలవారీగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ అవసరమైన వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, తీసుకున్న చర్యల వివరాలను అర్జీదారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజావాణిలో మొత్తం 19 అర్జీలు అందాయి. వీటిలో భూ సమస్యలకు సంబంధించి 10, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2, పింఛన్లకు సంబంధించి 2, ఉద్యోగానికి సంబంధించి ఒకటి, ఇతర సమస్యలపై 4 అర్జీలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    4
    ప్రజావాణిలో ప్రజల వినతులపై పరిష్కార చర్యలు చేపట్టాలి :: జిల్లా అదనపు కలెక్టర్లు
ములుగు జిల్లాలో ప్రజావాణిలో అందిన ప్రజల వినతులను పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, ఎం. సంపత్ రావు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సోమవారం ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అర్జీదారులు తెలిపిన సమస్యలను విని, వారి దరఖాస్తులను పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్జీలను సంబంధిత శాఖలవారీగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ అవసరమైన వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, తీసుకున్న చర్యల వివరాలను అర్జీదారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజావాణిలో మొత్తం 19 అర్జీలు అందాయి. వీటిలో భూ సమస్యలకు సంబంధించి 10, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2, పింఛన్లకు సంబంధించి 2, ఉద్యోగానికి సంబంధించి ఒకటి, ఇతర సమస్యలపై 4 అర్జీలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో  జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    user_GADAM DEVENDAR
    GADAM DEVENDAR
    ములుగు, ములుగు, తెలంగాణ•
    22 hrs ago
  • శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన లింగపాలెం మండల జడ్పీటీసీ, ఎంపీటీసీల బృందం! ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో లింగపాలెం మండల జడ్పీటీసీగా ఎన్నికైన శ్రీమతి ముసునూరి వెంకట సరోజిని గారు, మండలంలోని ఎంపీటీసీ సభ్యులు సంయుక్తంగా చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నిస్వార్థంగా ప్రజాసేవ అందించాలని సూచించారు. అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన లింగపాలెం మండల జడ్పీటీసీ, ఎంపీటీసీల బృందం!
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో లింగపాలెం మండల జడ్పీటీసీగా ఎన్నికైన శ్రీమతి ముసునూరి వెంకట సరోజిని గారు, మండలంలోని ఎంపీటీసీ సభ్యులు సంయుక్తంగా చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నిస్వార్థంగా ప్రజాసేవ అందించాలని సూచించారు.
అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Natta suresh
    Natta suresh
    Local News Reporter చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • గుడుంబా స్థావరాలపై దాడులు దాడులు... నాటు సారా ముడుసరిలను ధ్వంసం చేసిన పోలీసులు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏజెన్సీలోని గుడుంబా స్థావరాలపై ఉక్కు పాదం మోపుతున్న పోలీసులు. వెంకటాపురం మండలంలో గుడుంబా తయారు చేయడం గాని, ప్రజలకు అమ్మడం జరుగుతే అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటాపురం సర్కిల్ CI ముత్యం రమేష్ హెచ్చరించారు. రామచంద్రాపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని మూడు ప్రదేశాలలో గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. సోమవారం రోజు జరిగిన దాడుల్లో గుడుంబా తయారీ కోసం 48 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 9600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి,30 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు గుడుంబా తయారీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..గ్రామాల్లో ఎవరైనా గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటాపురం సిఐ ముత్యం రమేష్ తెలిపారు.
    1
    గుడుంబా స్థావరాలపై దాడులు దాడులు... నాటు సారా ముడుసరిలను ధ్వంసం చేసిన పోలీసులు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏజెన్సీలోని గుడుంబా స్థావరాలపై ఉక్కు పాదం మోపుతున్న  పోలీసులు.  వెంకటాపురం మండలంలో గుడుంబా తయారు చేయడం గాని, ప్రజలకు అమ్మడం జరుగుతే అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటాపురం సర్కిల్  CI ముత్యం రమేష్ హెచ్చరించారు. రామచంద్రాపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని  మూడు ప్రదేశాలలో గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు.
సోమవారం రోజు జరిగిన దాడుల్లో గుడుంబా తయారీ కోసం 48 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన  9600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి,30 లీటర్ల గుడుంబా  స్వాధీనం చేసుకున్నారు గుడుంబా తయారీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..గ్రామాల్లో ఎవరైనా గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటాపురం సిఐ ముత్యం రమేష్ తెలిపారు.
    user_GADAM DEVENDAR
    GADAM DEVENDAR
    ములుగు, ములుగు, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.