Shuru
Apke Nagar Ki App…
మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికలు విజయవంతం మెట్‌పల్లి మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఆర్డీవో శ్రీ ఎన్. శ్రీనివాస్‌కు మున్సిపల్ కమిషనర్ శ్రీ టి. మోహన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 50 రోజుల పాటు కష్టపడి పనిచేసిన అన్ని విభాగాల సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Mahammad Vaseem
మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికలు విజయవంతం మెట్‌పల్లి మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఆర్డీవో శ్రీ ఎన్. శ్రీనివాస్‌కు మున్సిపల్ కమిషనర్ శ్రీ టి. మోహన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 50 రోజుల పాటు కష్టపడి పనిచేసిన అన్ని విభాగాల సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
More news from తెలంగాణ and nearby areas
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- నిర్మల్ లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదేవ్ కేక్ కట్టు చేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు ఫలాలు పంపిణీ చేశారు.1
- కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.2
- Post by Ravi Poreddy1
- మెదక్ జిల్లా*17 ఫిబ్రవరి 2026 మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిఫిబ్రవరి 17 , 2026:ప్రత్యేక సమగ్ర సవరణ దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు- కలెక్టర్లు, ఈ.ఆర్.ఓ., ఏ.ఈ.ఆర్.ఓ లతో ప్రత్యేక సమగ్ర సవరణకు ముందుగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఇందుకు గాను గ్రామ పాలన అధికారులు, ఇతర అధికారులను బూత్ స్థాయి అధికారులకు మ్యాపింగ్ లో సహాయకులుగా నియమించి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి పార్టీ నుంచి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని, బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకులు, ఏ ఈ ఆర్ ఓ లు వారికి మ్యాపింగ్ చేయడంలో సహాయ సహకారాలు అందించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జరిగేలా పకడ్బందీగా ప్రక్రియ చేయాలని తెలిపారు.బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని తెలిపారు. నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి - కలెక్టర్ రాహుల్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బూత్ స్థాయి అధికారులతో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి , తాసిల్దార్ శ్రీనివాస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీదుబ్బరాజేశ్వర స్వామివారి రథోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా హర హర మహాదేవ అంటూ వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీదుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గత మూడు రోజుల నుండి అంగరంగ వైభవంగా పూజలందుకుంటున్నడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం పదకోండు గంటలకు శ్రీదుబ్బరాజేశ్వరస్వామి వారి రథోత్సవాన్ని పలు పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామి అమ్మవార్లను ఆసీనులు చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఈ రథోత్సవాన్ని పురవీధుల గుండా స్వామివారి రథాన్ని పెద్ద ఎత్తున భక్తులు తడుతో లాగుతూ హర హర మహాదేవ ఓం నమశ్శివాయ అంటూ స్వామివారి శోభాయాత్ర కొనసాగింది. ఈ శోభాయాత్రకు చుట్టుపక్కల గ్రామాలు వివిధ జిల్లాల నుండి కుటుంబ సమేతంగా వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను చేశారు.1