logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ముత్తోజిపేట సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రాలీ బోల్తా పడడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో చిన్నారులు, పెద్దలు ఇద్దరూ ఉన్నారని, వీరంతా సూర్యాపేట నుంచి మేడారం వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా, పైలట్లు వాయినాల నాగరాజు, సామల మధు, అలాగే ఈఎంటీలు అనిత, రమేశ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. వారు క్షతగాత్రులను నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.

1 hr ago
user_Chetty:Ramesh
Chetty:Ramesh
నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
1 hr ago

ముత్తోజిపేట సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రాలీ బోల్తా పడడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో చిన్నారులు, పెద్దలు ఇద్దరూ ఉన్నారని, వీరంతా సూర్యాపేట నుంచి మేడారం వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా, పైలట్లు వాయినాల నాగరాజు, సామల మధు, అలాగే ఈఎంటీలు అనిత, రమేశ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. వారు క్షతగాత్రులను నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.

More news from తెలంగాణ and nearby areas
  • ముత్తోజిపేట సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రాలీ బోల్తా పడడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో చిన్నారులు, పెద్దలు ఇద్దరూ ఉన్నారని, వీరంతా సూర్యాపేట నుంచి మేడారం వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా, పైలట్లు వాయినాల నాగరాజు, సామల మధు, అలాగే ఈఎంటీలు అనిత, రమేశ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. వారు క్షతగాత్రులను నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.
    1
    ముత్తోజిపేట సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రాలీ బోల్తా పడడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో చిన్నారులు, పెద్దలు ఇద్దరూ ఉన్నారని, వీరంతా సూర్యాపేట నుంచి మేడారం వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది.

స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా, పైలట్లు వాయినాల నాగరాజు, సామల మధు, అలాగే ఈఎంటీలు అనిత, రమేశ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. వారు క్షతగాత్రులను నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం (TSCPSEU) ఆధ్వర్యంలో జనజాగరణ యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను తక్షణమే రద్దు చేసి, ఓపీఎస్ (పాత పెన్షన్ విధానం)ను పునరుద్ధరించాలని తమ డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. జూలై 28న ములుగు జిల్లాకు చేరుకోనున్న ఈ జనజాగరణ యాత్రను విజయవంతం చేయడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
    1
    ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం (TSCPSEU) ఆధ్వర్యంలో జనజాగరణ యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను తక్షణమే రద్దు చేసి, ఓపీఎస్ (పాత పెన్షన్ విధానం)ను పునరుద్ధరించాలని తమ డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. జూలై 28న ములుగు జిల్లాకు చేరుకోనున్న ఈ జనజాగరణ యాత్రను విజయవంతం చేయడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
    user_Swathi
    Swathi
    గ్రాఫిక్ డిజైనర్ ములుగు, ములుగు, తెలంగాణ•
    15 hrs ago
  • రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నేడు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, హనుమకొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, వరంగల్ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి క్షేత్రస్థాయిలో పర్యటించి పటిష్ట ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమాలు సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీపీ శ్వేత సూచించారు. ఆమె భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రోటోకాల్ నిబంధనల అమలుపై అధికారులతో చర్చించారు. అలాగే, గవర్నర్ పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు పర్యటన మార్గాలు, కార్యక్రమాల ప్రదేశాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాలను నిశితంగా పరిశీలించారు.
    1
    రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నేడు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, హనుమకొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, వరంగల్ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి క్షేత్రస్థాయిలో పర్యటించి పటిష్ట ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమాలు సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీపీ శ్వేత సూచించారు. ఆమె భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రోటోకాల్ నిబంధనల అమలుపై అధికారులతో చర్చించారు. అలాగే, గవర్నర్ పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు పర్యటన మార్గాలు, కార్యక్రమాల ప్రదేశాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాలను నిశితంగా పరిశీలించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    20 min ago
  • నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో చిరుతపులి సంచారం స్థానికులలో తీవ్ర కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో, రైతు ధర్మాయి శ్రావణ్‌కు చెందిన కోళ్ల ఫారం వద్ద చిరుత సంచరించింది. ఈ దృశ్యాలు ఫారంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం, చిరుత కోళ్ల ఫారంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది, అయితే అక్కడ ఉన్న కుక్కలు గట్టిగా మొరగడంతో అది వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చిరుత గ్రామ శివార్లలో సంచరిస్తోందన్న సమాచారం వ్యాపించడంతో రైతులు, ఇతర గ్రామ ప్రజలు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లడం మరియు పశువుల సంరక్షణ చేపట్టడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు అటవీ శాఖ అధికారులను తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. చిరుత జాడను వెంటనే గుర్తించి బోన్లు ఏర్పాటు చేయాలని, గ్రామ పరిసర ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు నిరంతర గస్తీ నిర్వహించాలని, ప్రజల భద్రత కోసం అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
    1
    నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో చిరుతపులి సంచారం స్థానికులలో తీవ్ర కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో, రైతు ధర్మాయి శ్రావణ్‌కు చెందిన కోళ్ల ఫారం వద్ద చిరుత సంచరించింది. ఈ దృశ్యాలు ఫారంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి.

స్థానికుల కథనం ప్రకారం, చిరుత కోళ్ల ఫారంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది, అయితే అక్కడ ఉన్న కుక్కలు గట్టిగా మొరగడంతో అది వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చిరుత గ్రామ శివార్లలో సంచరిస్తోందన్న సమాచారం వ్యాపించడంతో రైతులు, ఇతర గ్రామ ప్రజలు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లడం మరియు పశువుల సంరక్షణ చేపట్టడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్థులు అటవీ శాఖ అధికారులను తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. చిరుత జాడను వెంటనే గుర్తించి బోన్లు ఏర్పాటు చేయాలని, గ్రామ పరిసర ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు నిరంతర గస్తీ నిర్వహించాలని, ప్రజల భద్రత కోసం అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • ప్రముఖ సినీ నటుడు, సామాజిక సేవకుడు సోనూ సూద్ హనుమకొండకు చెందిన నిరంజన్ కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. నిరంజన్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన ఆయన, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో మనోధైర్యంతో ఉండాలని సూచించిన సోనూ సూద్, అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. దీనిపై నిరంజన్ కుటుంబ సభ్యులు సోనూ సూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    ప్రముఖ సినీ నటుడు, సామాజిక సేవకుడు సోనూ సూద్ హనుమకొండకు చెందిన నిరంజన్ కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. నిరంజన్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన ఆయన, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో మనోధైర్యంతో ఉండాలని సూచించిన సోనూ సూద్, అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. దీనిపై నిరంజన్ కుటుంబ సభ్యులు సోనూ సూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    23 hrs ago
  • ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో డాక్టర్ వైయస్సార్ 77వ జయంతి వేడుకలు కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు గుజ్జర్లపూడి రాంబాబు, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏపూరి మహేందర్, తోటకూరి శివయ్య వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వారు కేకు కట్ చేసి, స్వీట్లు పంచుకుని ఆనందోత్సాహాలతో ఈ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల గుండెచప్పుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, అవి దేశంలోనే చారిత్రాత్మకంగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిన సమయంలో రికార్డు స్థాయిలో 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పేద ప్రజల కనీస అవసరాలైన కూడు, గుడ్డ, తిండి, ఆరోగ్య సంక్షేమం, విద్య, వైద్యం వంటి వాటిని గుర్తించి ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇప్పించి రూపాయికి కిలో బియ్యాన్ని అందించడం జరిగిందని తెలిపారు. మేనిఫెస్టోలో రైతులకు, విద్యార్థులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉచిత విద్యుత్తుతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను అమలు చేయడం ద్వారా లక్షల మందిని డాక్టర్లను, ఇంజనీర్లను చేసిన ఘనత వైయస్సార్‌కే దక్కిందని వారు అన్నారు. అన్నదాతగా, జీవన దాతగా జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు కట్టి సాగునీరు ప్రతి ఒక్కరికీ అందేటట్లుగా చేసి అన్నదాతగా పేరుగాంచారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    1
    ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో డాక్టర్ వైయస్సార్ 77వ జయంతి వేడుకలు కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు గుజ్జర్లపూడి రాంబాబు, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏపూరి మహేందర్, తోటకూరి శివయ్య వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వారు కేకు కట్ చేసి, స్వీట్లు పంచుకుని ఆనందోత్సాహాలతో ఈ సంబరాలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల గుండెచప్పుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, అవి దేశంలోనే చారిత్రాత్మకంగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిన సమయంలో రికార్డు స్థాయిలో 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పేద ప్రజల కనీస అవసరాలైన కూడు, గుడ్డ, తిండి, ఆరోగ్య సంక్షేమం, విద్య, వైద్యం వంటి వాటిని గుర్తించి ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇప్పించి రూపాయికి కిలో బియ్యాన్ని అందించడం జరిగిందని తెలిపారు.

మేనిఫెస్టోలో రైతులకు, విద్యార్థులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉచిత విద్యుత్తుతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను అమలు చేయడం ద్వారా లక్షల మందిని డాక్టర్లను, ఇంజనీర్లను చేసిన ఘనత వైయస్సార్‌కే దక్కిందని వారు అన్నారు. అన్నదాతగా, జీవన దాతగా జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు కట్టి సాగునీరు ప్రతి ఒక్కరికీ అందేటట్లుగా చేసి అన్నదాతగా పేరుగాంచారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_Shiva shankar Yld
    Shiva shankar Yld
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    16 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మీడియా సమావేశం నిర్వహించి, కాళేశ్వరం ఆలయ వ్యవహారాలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శైలజ రామయ్యర్‌లపై పలు తీవ్ర ఆరోపణలు చేశారు. దుద్దిళ్ల కుటుంబం కాళేశ్వరం ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తోందని పుట్ట మధు విమర్శించారు, ఆలయ పురోహితులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. పుష్కరాల సమయంలో ఆలయ నిధులతో కొనుగోలు చేసిన చీరలను ఇతర కార్యక్రమాల్లో పంపిణీ చేయడం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని ఆయన ఆరోపించారు. ఆలయంలో హారతి, పూజా కార్యక్రమాల విషయంలో స్థానిక పురోహితులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, పుష్కరాల సమయంలో బయటి ప్రాంతాల నుంచి పురోహితులను తీసుకువచ్చారని ఆయన ఆక్షేపించారు. ఆలయానికి సంబంధించిన వివరాలు అడిగితే సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా ఇవ్వలేమని చెబుతున్నారని పుట్ట మధు వెల్లడించారు. మంత్రి శ్రీధర్ బాబుకు ఈ ప్రాంతంతో అనుబంధం లేదని, ఆయన కేవలం పర్యాటకుడిలా వ్యవహరిస్తున్నారని పుట్ట మధు విమర్శించారు. కాళేశ్వరం ఆలయ పవిత్రతను కాపాడాలని, పురోహితులకు న్యాయం చేయాలని దుద్దిళ్ల కుటుంబాన్ని ఆయన డిమాండ్ చేశారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మీడియా సమావేశం నిర్వహించి, కాళేశ్వరం ఆలయ వ్యవహారాలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శైలజ రామయ్యర్‌లపై పలు తీవ్ర ఆరోపణలు చేశారు.

దుద్దిళ్ల కుటుంబం కాళేశ్వరం ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తోందని పుట్ట మధు విమర్శించారు, ఆలయ పురోహితులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. పుష్కరాల సమయంలో ఆలయ నిధులతో కొనుగోలు చేసిన చీరలను ఇతర కార్యక్రమాల్లో పంపిణీ చేయడం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని ఆయన ఆరోపించారు. ఆలయంలో హారతి, పూజా కార్యక్రమాల విషయంలో స్థానిక పురోహితులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, పుష్కరాల సమయంలో బయటి ప్రాంతాల నుంచి పురోహితులను తీసుకువచ్చారని ఆయన ఆక్షేపించారు. ఆలయానికి సంబంధించిన వివరాలు అడిగితే సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా ఇవ్వలేమని చెబుతున్నారని పుట్ట మధు వెల్లడించారు.

మంత్రి శ్రీధర్ బాబుకు ఈ ప్రాంతంతో అనుబంధం లేదని, ఆయన కేవలం పర్యాటకుడిలా వ్యవహరిస్తున్నారని పుట్ట మధు విమర్శించారు. కాళేశ్వరం ఆలయ పవిత్రతను కాపాడాలని, పురోహితులకు న్యాయం చేయాలని దుద్దిళ్ల కుటుంబాన్ని ఆయన డిమాండ్ చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    26 min ago
  • మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండల కేంద్రానికి చెందిన నాగార్జున ప్రైవేట్ స్కూల్ బస్సు నల్లెల్ల స్టేజి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. స్థానికుల కథనం ప్రకారం, బస్సు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, వారిని వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు లింగ్యతండా గ్రామానికి చెందిన వారని ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి గాయపడిన విద్యార్థుల సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
    1
    మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండల కేంద్రానికి చెందిన నాగార్జున ప్రైవేట్ స్కూల్ బస్సు నల్లెల్ల స్టేజి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. స్థానికుల కథనం ప్రకారం, బస్సు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, వారిని వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు లింగ్యతండా గ్రామానికి చెందిన వారని ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి గాయపడిన విద్యార్థుల సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.