జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో క్రీస్తు శేషులు శ్రీ జువ్వాడి రత్నాకరరావు జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన కోరుట్ల ప్రీమియర్ క్రికెట్ లీగ్ జాతరలో *తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జిల్లా ఎస్పీ అశోక్ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు డీసీసీ అధ్యక్షులు నందయ్య, జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్మన్ అడువల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..* క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమన్వయం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. కోరుట్ల ప్రీమియర్ క్రికెట్ లీగ్ వంటి పోటీలు గ్రామీణ స్థాయి క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.క్రీస్తు శేషులు శ్రీ జువ్వాడి రత్నాకరరావు గారి జ్ఞాపకార్థంగా ఈ లీగ్‌ను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుకు సాగాలని, క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో క్రీస్తు శేషులు శ్రీ జువ్వాడి రత్నాకరరావు జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన కోరుట్ల ప్రీమియర్ క్రికెట్ లీగ్ జాతరలో *తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జిల్లా ఎస్పీ అశోక్ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు డీసీసీ అధ్యక్షులు నందయ్య, జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్మన్ అడువల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..* క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమన్వయం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. కోరుట్ల ప్రీమియర్ క్రికెట్ లీగ్ వంటి పోటీలు గ్రామీణ స్థాయి క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.క్రీస్తు శేషులు శ్రీ జువ్వాడి రత్నాకరరావు గారి జ్ఞాపకార్థంగా ఈ లీగ్‌ను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుకు సాగాలని, క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
- మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పుల్లకండం మేఘన రాణి, కడియాల భావన చిన్ననాటి నుంచి సన్నిహిత స్నేహితులు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు కలిసే చదువుకున్న వీరు, ఎంఎస్ చదువుల కోసం మూడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారు. ఇటీవల చదువులు పూర్తిచేసుకున్న అనంతరం కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఇద్దరూ మృతి చెందారు. 14 రోజుల తర్వాత వారి పార్ధివ దేహాలు స్వగ్రామాలకు చేరగా, ముల్కనూర్‌లో ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.1
- 👉గజ్వేల్ జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్ మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ అమ్మ బాగున్నారా అని ఆత్మీయంగా పలకరించిన కేసీఆర్ టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను సమ్మక్క సారలమ్మ జాతరను ఆహ్వానించిన మంత్రులు సీతక్క కొండా సురేఖ తెలంగాణ శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతను గజ్వేల్ ఎర్రవెల్లిలోని తననివాసానికి వచ్చిన మహిళా మంత్రులను బీఆర్ఎ ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయంగా స్వాగతించారు. తెలంగాణ మంత్రులు సీతక్క, కొండా సురేఖలు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతర ప్రసాదాన్ని అందించి, రాష్ట్ర ప్రభుత్వ తరపున జాతరకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో మంత్రులను సత్కరించారు. తేనీటి విందు అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నప్పుడు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు.1
- వరంగల్ వ్యవసాయ కళాశాలలో ఇద్దరు సస్పెండ్... వరంగల్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో వరంగల్ వ్యవసాయ కాలేజీ సిబ్బంది పాత్ర ఉన్నట్లు తేలడంతో జూనియర్ అసిస్టెంట్ సిద్దార్థ, టెక్నికల్ అసిస్టెంట్ ప్రశ్నపత్రాల ఇంచార్జ్ రమేష్ ను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, 5గురు ఇన్-సర్వీస్ విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేశారు. ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు వ్యవసాయ కళాశాల అధికారులు తెలిపారు.1
- *రాబోయే రోజుల్లో డబ్బు తీసుకొని ఓటు వేయకపోతే ఓడిన అభ్యర్థులు ఇలాగే చేస్తారేమో. ఆలోచనాత్మక వీడియో*1
- సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్1
- చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర పార్బాయిల్డ్ రైస్ మిల్, వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్ ఇవి రెండు విసర్జిస్తున్న వాయు, ఘన, ద్రవ కాలుష్యాలను చిట్యాల మున్సిపల్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నియంత్రించకపోవడం వల్ల చంద్రపురి కాలనీ, సాయి ద్వారకాపురి కాలనీ, ఆదర్శనగర్, ఆటోనగర్, ముత్యాలమ్మ గూడెం, సంజీవనగర్ తదితర పట్టణవాసుల జీవనానికి ఈ రైస్ మిల్లులు రెండు విసర్జించే కాలుష్యం తీవ్ర ఆటంకంగా మారిందని చంద్రపురి కాలనీ చుట్టూరా రైల్వే లైన్ ప్రక్కన చెత్త డెంపు యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల రైస్ మిల్ విసర్జిత కాలుష్యపు నీరు చెత్తలో పేరుకుపోవడంతో ప్రజలు శ్వాస పీల్చలేక, దోమలతో జీవించలేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని, వీటిని నివారించడంలో మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వీటిని కంట్రోల్ చేయకపోతే రెండు రైస్ మిల్లులకు తాళాలు వేసి నిలిపివేస్తామని" ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మిల్లు యాజమాన్యాలను హెచ్చరిక చేశారు.* *మూడు జిల్లాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వెంకన్న గారితో ఫోన్లో మాట్లాడి, వారు సందర్శించి మిల్లుల నుండి వస్తున్న కాలుష్యాన్ని నివారిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ధర్నాను విరమించారు.* ఈ ధర్నాలో కాలనీకి చెందిన మహిళలు, బాలబాలికలు వీరితోపాటు చేపూరి శ్రీనివాస్ నేత, మారగొని యాదగిరి గౌడ్, రుద్రారపు నరసింహ, రుద్రారపు కిష్టయ్య, ఆదిరెడ్డి, నరసింహ, రావిడి సత్తిరెడ్డి, బిల్లపాటి అలివేలు, మారగోని జ్యోతి, రుద్రారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.1
- పుట్టినరోజు సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేనలో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలోని వారి ఇంటి ఆవరణలో మొక్క నాటిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సతీమణి సుంకే దీవెన ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు1
- ములుగు జిల్లా మల్లంపల్లి జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. సమ్మక్క–సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.1
- నర్సంపేట మండలంలోని బిట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న యాన్యువల్ డే వేడుకల్లో భాగంగా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సౌమిత్, జోయల్, వరుణ్, వర్షిత్ జోన, విద్యార్థులు డ్యాన్సుల్లో పాల్గొని ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. విద్యార్థుల నృత్యాలు హాజరైన తల్లిదండ్రులు, అతిథులను ఆకట్టుకోగా, వారి కేరింతలు, చప్పట్లతో కాలేజీ ప్రాంగణం మొత్తం ఆనందోత్సాహాలతో నిండిపోయింది. తమ పిల్లల ప్రతిభను చూసిన తల్లిదండ్రులు గర్వంతో ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఉత్సాహం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో యాన్యువల్ డే వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి.3