ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ ప్రింట్ లేక గర్భిణీల ఇబ్బందులు కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, స్కానింగ్ అనంతరం బిడ్డకు సంబంధించిన ఫోటో లేదా వివరాలు ఉండే పేపర్ ప్రింట్ ఇవ్వకపోవడం గర్భిణీలకు ఇబ్బందిగా మారింది.సాధారణంగా స్కానింగ్ చేసిన తర్వాత బిడ్డ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రింట్ ఇవ్వాల్సి ఉండగా, ఇక్కడ ఆ సౌకర్యం లేకపోవడంతో గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కానింగ్ రిపోర్టు ప్రింట్ లేకపోవడంతో గర్భిణీలు తమ వైద్య రికార్డులను పూర్తి స్థాయిలో పొందలేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు.దీంతో కొంతమంది గర్భిణీలు ప్రైవేట్ స్కాన్ సెంటర్లకు వెళ్లి ప్రింట్లు తీసుకోవాల్సి వస్తోందని, దాంతో అదనపు ఖర్చు పడుతోందని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాల్సి ఉండగా ఈ సమస్య నెలకొనడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.స్కానింగ్ యంత్రానికి సంబంధించిన ప్రింటర్ లేదా పేపర్ సౌకర్యాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని గర్భిణీలు, స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ ప్రింట్ లేక గర్భిణీల ఇబ్బందులు కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, స్కానింగ్ అనంతరం బిడ్డకు సంబంధించిన ఫోటో లేదా వివరాలు ఉండే పేపర్ ప్రింట్ ఇవ్వకపోవడం గర్భిణీలకు ఇబ్బందిగా మారింది.సాధారణంగా స్కానింగ్ చేసిన తర్వాత బిడ్డ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రింట్ ఇవ్వాల్సి ఉండగా, ఇక్కడ ఆ సౌకర్యం లేకపోవడంతో గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కానింగ్ రిపోర్టు ప్రింట్ లేకపోవడంతో గర్భిణీలు తమ వైద్య రికార్డులను పూర్తి స్థాయిలో పొందలేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు.దీంతో కొంతమంది గర్భిణీలు ప్రైవేట్ స్కాన్ సెంటర్లకు వెళ్లి ప్రింట్లు తీసుకోవాల్సి వస్తోందని, దాంతో అదనపు ఖర్చు పడుతోందని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాల్సి ఉండగా ఈ సమస్య నెలకొనడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.స్కానింగ్ యంత్రానికి సంబంధించిన ప్రింటర్ లేదా పేపర్ సౌకర్యాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని గర్భిణీలు, స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
- రంజాన్ మాసం సహనం, దానం, సహోదర భావానికి ప్రతీక అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బోయిన్ పల్లి, కడక్ పుర, నేతాజీ నగర్ లో జరిగిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన కజూర్ తినిపించి నేటి ఉపవాస దీక్ష విరమింప చేశారు. భారత దేశంలో సర్వ మతాలు సమానమేనని తెలిపారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి కాంగ్రేస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు.1
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ కీసర మండల రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ ప్రజల సమస్యలు పట్టించుకోలేని అధ్యక్షుడు పన్నీరు మహేష్ ఆరోపించారు. కాలనీ ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం ఇల్లు లేని నిరుపేదలకు రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ లో 52 బిల్డింగులు,6420 కుటుంబాలు ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రోడ్డు సమస్య, రోజు కనీసం ఒక రెండు మూడు బైకులు కిందపడి ప్రజలను కాలు చేతులు వేరే కొట్టుకుంటున్నారు. రెండు సంవత్సరాల నుండి కలెక్టర్ కు మరియు జిహెచ్ఎంసి వారికి మరియు నాగారం మున్సిపాలిటీ అధికారులకు, ఎన్నిసార్లు వినతిపత్రం వచ్చినా కూడా చూసి చూడనట్టుగా వివరిస్తున్న అధికారులు మరియు లీడర్లు , రాంపల్లి డబుల్ బెడ్రూంలో ఇల్లు అలెర్ట్మెంట్ చేశారు. అక్కడ ఉండడానికి ప్రధానమైనటువంటి సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ కావట్లేదు, బస్తీ దావకాన లేదు, అంగన్వాడి కేంద్రం లేదు, ప్రజలు కనీసం అక్కడ ఏదైనా పని చేసుకుని బతకడానికి వసతులు లేవు, ఏవైతే గవర్నమెంట్ చేసినటువంటి సెంటర్ అవి కూడా ఓపెన్ చేయకుండా, తినడానికి తిండి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, నాగారం మున్సిపాలిటీకి టాక్సీ కూడా పే చేయడం జరిగింది. ఒక్కొక్కరు 1980 రూపాయలు టాక్స్ కడుతున్నారు. ఇప్పుడు వరకు మాకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. టాక్స్ కట్టని వారికి నోటీసులు అందిస్తామని చెప్పి పేద ప్రజలను భయాందోళనకు గురిచేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ యొక్క రాంపల్లి డబుల్ బెడ్ సమస్యలను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ప్రభుత్వ స్పందించకపోతే కాలనీ ప్రజలందరం పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తామని హెచ్చరించారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్ / – 5వ రోజు కార్యాచరణలో భాగంగా 4వ వార్డులో కచ్చానాల తవ్వకం, ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత. – నిబంధనలు అతిక్రమించి కాలువల్లో చెత్త వేసే వారికి నోటీసులు జారీకి కమిషనర్ ఆదేశాలు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం *‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల* కార్యాచరణలో భాగంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు కార్యాచరణలో భాగంగా *మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి G. చందన రవీందర్* గారు మరియు *మున్సిపల్ కమిషనర్ శ్రీ R. వెంకట్ గోపాల్* గారు పలు అభివృద్ధి మరియు పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు. _*ప్రధాన అంశాలు:*_ * వార్డు నం. 4లో ప్రత్యేక డ్రైవ్: TYR గార్డెన్ వెనుక భాగంలో ప్రజ్ఞాపూర్ నుండి వచ్చే వరద కాలువ పూర్తిగా నిండిపోవడం వల్ల నీరు నిలిచి, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన పాలకవర్గం, కచ్చానాల (తాత్కాలిక కాలువ) తవ్వించి నీటి నిల్వను తొలగించేలా చర్యలు తీసుకుంది. * నోటీసుల జారీ: కాలువలను పరిశీలించగా, ప్రజలు నేరుగా చెత్తను కాలువల్లో వేయడం వల్ల నీటి ప్రవాహం ఆగిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. బాధ్యులైన వారికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. * *క్రిమిసంహారకాల పిచికారీ:* మురికి కాలువల్లో దోమల నివారణకు దోమల మందు పిచికారీ మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. * *ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత:* ప్రజా ప్రదేశాల శుభ్రతలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. అక్కడ ఉన్న UGD సమస్యను పరిష్కరించి, ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను, పొదలను తొలగించి ప్రాంగణమంతా క్రిమిసంహారక మందులు చల్లించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 4వ వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, 3వ వార్డు కాముని మురళి గారు, 6వ వార్డు బొగ్గుల స్వప్న గారు, 13వ వార్డు భాగ్యలక్ష్మి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మెప్మా RPలు, SHG మహిళా సంఘాల సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. *కమిషనర్,* గజ్వేల్–ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం.4
- యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. వర్ధన్నపేట అవగాహన సదస్సులో ఏసీపీ పిలుపు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కదలాలి, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన.: ఏసీపీ నర్సయ్య. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు పిల్లల భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, నేటి యువత దేశానికి వెన్నెముక అని, అలవాటుగా మారే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, తహసిల్దార్ విజయసాగర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.1
- *హైదరాబాద్‌లో మున్సిపల్ నిర్లక్ష్యం – చెత్త తగలబెట్టడంతో చెట్లకు, విద్యుత్ వైర్లకు మంటలు* హైదరాబాద్: జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్‌లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చెత్తను సక్రమంగా తరలించకుండా అక్కడికక్కడే తగలబెట్టడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మీర్పేట్ ప్రధాన రహదారిపై, మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది స్థానికుల సమాచారం ప్రకారం, మున్సిపల్ సిబ్బంది తగలబెట్టిన చెత్త మంటలు సమీపంలోని చెట్లకు అంటుకున్నాయి. అక్కడి నుంచి మంటలు పైగా వెళ్లే విద్యుత్ వైర్ల వరకు వ్యాపించడంతో కొంతసేపు ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. బడంగ్పేట్ సర్కిల్ కమిషనర్ సరస్వతి సంఘటనపై ఫోన్లు చేసిన స్పందించలేదని స్థానిక మాజీ కార్పొరేటర్ బిక్షపతి చారి తెలిపారు ఫైర్స్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు చెత్తను బహిరంగంగా తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు3
- Post by Narasimulu Narasimulu1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నిరసన గజ్వేల్: కరెంట్ సరఫరాలో కోత విధించడంతో పoటలు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితి మారక పోతే సహించేదీలేదని ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వే ల్లో లోని సబ్స్టే స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్శాఖ డీఈ భానుప్రకాశకు వినతిపత్రం అందజేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ రైతులకు 24గంటలూ విద్యుత్ సరఫరా అందజేసి అండగా నిలిస్తే.. నేడు పరిస్థితి భిన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో 9గంటలకు మించి సరఫరా కావడం లేదన్నారు. దీంతో పం టలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.4
- రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమ్ నరేందర్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన వేమ్ నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. వేమ్ నరేందర్ రెడ్డి కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.1