సిఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సిద్దిపేట డిసిసి అధ్యక్షురాలు అంక్షరెడ్డి రాఖీ పౌర్ణమి పండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షురాలు అంక్షరెడ్డి రాఖీ కట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్న అంక్షరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి, మిఠాయి తినిపించి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసిసి అధ్యక్షురాలికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులు అందజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.రాష్ట్ర ఆడపడుచులందరి తరఫున ముఖ్యమంత్రికి అంక్షరెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ, సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజా ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి దూసుకుపోవాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లాలో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు

- రాఖీ పౌర్ణమి సందర్భంగా అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక, ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలి. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. #rakshabandhan #rakhi1
- *కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క* గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది. *కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క* గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.1
- ఆలేరులో బీసీల...........................................1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ గురువారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.7,63,530, కార్ పార్కింగ్ రూ.3,50,000, VIP దర్శనాలతో రూ.2,26,950, బ్రేక్ దర్శనాలతో రూ.1,28,400, ప్రధాన బుకింగ్ రూ.1,24,350 ,వ్రతాలతో రూ.1,43,000, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.20,27,130 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాఖీ కట్టిన బండ కార్తీక చంద్రారెడ్డి. రక్షాబంధన్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి రాఖీ కట్టారు. కిషన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి చేతికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుకు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ లకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు ఆమెకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు.3
- మారుతినగర్ లో దాదాపు పది లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ప్రారంభం మారుతి నగర్ లో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయం తో ఓపెన్ జిమ్ ను మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కాలనీ వాసులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ సామాగ్రిని జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు సూచించారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, అందరు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కాలనీవాసులు జైకృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, శ్రవణ్,, అనిల్, బాలరాజ్, బాబు తదితరులు పాల్గొన్నారు.1
- Pls Scroll మనసున్న నాయకుడిగా, అన్నా అంటే నేనున్నానంటూ ప్రజలకు అండగా నిలిచే ప్రజా సేవకుడిగా పేరున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు గారి ఇంట రాఖీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా హరీశ్ రావు గారిని మహిళా ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు కలిసి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు గారు వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. తనను కలిసి రాఖీలు కట్టి ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలకు రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా హరీశ్ రావు గారు అన్నారు. ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తనపై చూపిన ఆప్యాయత పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని హరీశ్ రావు గారు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.1
- రాఖీ పండుగ రోజు రక్తమోడుతున్నా.. బిడ్డ ఆకలి తీర్చిన తల్లి మమకారం రాఖీ పండుగ రోజున బంధువులకు రాఖీలు కట్టేందుకు బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. హత్నూర మండలం చందాపూర్‌కు చెందిన కుటుంబం చిలిపిచేడ్ చౌరస్తా వద్దకు చేరుకోగానే బైక్‌కు కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడింది. ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలై రక్తస్రావమైనప్పటికీ.. ఒడిలో ఉన్న చిన్నారి ఆకలిని మాత్రం ఆమె పట్టించుకోకుండా ఉండలేకపోయింది. గాయాల బాధను భరిస్తూనే బిడ్డకు పాలు ఇచ్చింది. రక్తమోడుతున్న స్థితిలోనూ బిడ్డ ఆకలి తీర్చిన ఆ తల్లి మమకారం అక్కడున్న వారిని కదిలించింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. రాఖీ పండుగ వేళ చోటుచేసుకున్న ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది.1