logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గండీడ్‌లో ఘనంగా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం 18 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలు, జ్ఞాపికలతో సత్కారం గండీడ్: మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 18 మంది ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలియజేస్తూ వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి రుద్రారం జనార్ధన్ మాట్లాడుతూ.. దేశంలో ఉపాధ్యాయుల సేవలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. భారత మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1888న తమిళనాడులోని తిరుత్తనిలో జన్మించారని తెలిపారు. ఉపాధ్యాయుడిగా విశేష సేవలందించిన ఆయన భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని తన వ్యక్తిగత వేడుకగా కాకుండా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని కోరడంతో 1962 నుంచి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. సమాజంలో ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన స్థానం ఉందని జనార్ధన్ పేర్కొన్నారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా నైతిక విలువలు, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయుల బోధన, మార్గదర్శకత్వం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.అవార్డు అందుకున్న ఉత్తమ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తమ సేవలను గుర్తించి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో విద్యార్థుల అభ్యున్నతికి మరింత అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంలు రవిబాబు, విజయలక్ష్మి, టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు రామ్‌గోపాల్ నాయక్, సీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కేఎం చంద్రకాంత్, పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్షుడు జనార్ధన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షుడు గంట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, పీఆర్టీయూ తెలంగాణ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, టీజీయూఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ నాయక్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ నాయక్, సీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి దోమ లక్ష్మయ్యతో పాటు అవార్డు గ్రహీతలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

14 hrs ago
user_J.rr
J.rr
మహమ్మదాబాద్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
14 hrs ago
737fcf5b-c1fa-4613-a685-eb4e40032b41

గండీడ్‌లో ఘనంగా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం 18 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలు, జ్ఞాపికలతో సత్కారం గండీడ్: మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 18 మంది ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలియజేస్తూ వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి రుద్రారం జనార్ధన్ మాట్లాడుతూ.. దేశంలో ఉపాధ్యాయుల సేవలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. భారత మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1888న తమిళనాడులోని తిరుత్తనిలో జన్మించారని తెలిపారు. ఉపాధ్యాయుడిగా విశేష సేవలందించిన ఆయన భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని తన వ్యక్తిగత వేడుకగా కాకుండా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని కోరడంతో 1962 నుంచి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. సమాజంలో ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన స్థానం ఉందని జనార్ధన్ పేర్కొన్నారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా నైతిక విలువలు, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయుల బోధన, మార్గదర్శకత్వం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.అవార్డు అందుకున్న ఉత్తమ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తమ సేవలను గుర్తించి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో విద్యార్థుల అభ్యున్నతికి మరింత అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంలు రవిబాబు, విజయలక్ష్మి, టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు రామ్‌గోపాల్ నాయక్, సీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కేఎం చంద్రకాంత్, పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్షుడు జనార్ధన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షుడు గంట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, పీఆర్టీయూ తెలంగాణ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, టీజీయూఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ నాయక్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ నాయక్, సీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి దోమ లక్ష్మయ్యతో పాటు అవార్డు గ్రహీతలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు మార్పు అంటే ఇదేనా రేవంతూ.. తూ.. ఒక్క కల్వకుర్తి నియోజకవర్గం లొనే 308 ఎకరాలు అంటే .. రాష్ట్రo.. పక్క రాష్ట్రo లో ఎంత ఉందొ మొత్తం లెక్కలు వొస్తాయి.. ఎలా సంపాదించావు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసిందన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం అన్నారు.
    1
    సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డ  మాజీ మంత్రి హరీష్ రావు
మార్పు అంటే ఇదేనా రేవంతూ.. తూ.. ఒక్క కల్వకుర్తి నియోజకవర్గం లొనే 308 ఎకరాలు  అంటే .. రాష్ట్రo.. పక్క రాష్ట్రo లో  ఎంత  ఉందొ మొత్తం  లెక్కలు  వొస్తాయి.. ఎలా  సంపాదించావు అంటూ  మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసిందన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం అన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    13 hrs ago
  • ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలలో న్యాయం చేయాలి. కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలలో తగు న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంబంధిత శాఖ అధికారులతో ఎస్సీ ఎస్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కేసుల పరిశీలన పై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీల కేసులను వేగవంతంగా పరిష్కరించి న్యాయం చేయాలని భక్కి వెంకటయ్య సూచించారు.
    1
    ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలలో న్యాయం చేయాలి. కమిషన్ చైర్మన్ వెంకటయ్య
ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలలో తగు న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంబంధిత శాఖ అధికారులతో ఎస్సీ ఎస్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కేసుల పరిశీలన పై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీల కేసులను వేగవంతంగా పరిష్కరించి న్యాయం చేయాలని భక్కి వెంకటయ్య సూచించారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    14 hrs ago
  • అమృతం కోసం దేవతలు రాక్షసుల క్షీరసాగర మథనంలో ఘననాధుడు శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం (పద్మశాలి) ఆధ్వర్యంలో గద్వాల వినాయక మండపాలను 53 ఏళ్లుగా వినూత్న అలంకరణల్లో పురాణ ఘాతల్లో ఘననాతుని దర్శనం. పురాణ ఘట్టాలతో ఆకట్టుకుంటున్న ఘననాధుడు. జోగులాంబ గద్వాల పట్టణం వేదనగర్ లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం(పద్మశాలి) ఆధ్వర్యంలో 53 ఏళ్లుగా వినాయక చవితి నవరాత్రి బ్రహ్మోస్థవాలు వినూత్న రీతిలో వినాయక మండపాలను అలంకరిస్తున్నారు. 1971లో గద్వాల మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గద్వాలపట్టణంలో తొలిసారిగా వినాయక చవితి వేడుకలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1973 నుంచి శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న రీతులలో పురాణ ఘట్టాలను వివిధ ఆకృతులలో అలంకరణలు చేస్తూ భక్తులకు పురాణాల్లోని ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు మండపాల్లో మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస, ఘాతలను పలురకాలుగా కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తూ చిన్నారులకు , యువతకు , ప్రజలకు పురాణాల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా అలంకరణలు చేస్తున్నారు. ఈ సన్నివేశాలను చూసే వారికి అప్పటి పురాణ కథలు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఈ సంవత్సరం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ ఆధ్వర్యంలో అమృత భాండం కోసం దేవతలు–దానవులు క్షీరసాగర మథనం ఘట్టాన్ని వినూత్నంగా రూపొందించారు. ఈ అలంకరణను గద్వాల పట్టణ ప్రజలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను స్వకులశాలి సమాజం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వకులసాలి యువజన సంఘం ఉపాధ్యక్షుడు దేవుజి రాఘవేందర్, కార్యదర్శి సాక్రె శ్రీనివాస్, దోత్రే సురేంద్రబాబు, కార్యవర్గ సభ్యులు గణప నరేందర్, కాంబ్లే ప్రవీణ్, గచ్చి వీరన్న, దోత్రే ప్రమోద్, సఫారీ అజయ్, సఫారీ సురేష్, జిందే కార్తీక్ తదితరులు కుల బాంధవులు మాజీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
    2
    అమృతం కోసం దేవతలు రాక్షసుల క్షీరసాగర మథనంలో ఘననాధుడు 

శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం 
(పద్మశాలి) ఆధ్వర్యంలో గద్వాల వినాయక మండపాలను 53 ఏళ్లుగా వినూత్న అలంకరణల్లో పురాణ ఘాతల్లో ఘననాతుని దర్శనం. పురాణ ఘట్టాలతో ఆకట్టుకుంటున్న ఘననాధుడు.
జోగులాంబ గద్వాల పట్టణం వేదనగర్ లోని 
శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం(పద్మశాలి) ఆధ్వర్యంలో 53 ఏళ్లుగా వినాయక చవితి నవరాత్రి బ్రహ్మోస్థవాలు వినూత్న రీతిలో వినాయక మండపాలను అలంకరిస్తున్నారు. 1971లో గద్వాల మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గద్వాలపట్టణంలో తొలిసారిగా వినాయక చవితి వేడుకలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1973 నుంచి శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న రీతులలో పురాణ ఘట్టాలను వివిధ ఆకృతులలో అలంకరణలు చేస్తూ భక్తులకు 
పురాణాల్లోని ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు మండపాల్లో మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస, ఘాతలను పలురకాలుగా కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తూ చిన్నారులకు , యువతకు , ప్రజలకు పురాణాల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా అలంకరణలు చేస్తున్నారు. ఈ సన్నివేశాలను చూసే వారికి అప్పటి పురాణ కథలు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఈ సంవత్సరం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ ఆధ్వర్యంలో అమృత భాండం కోసం దేవతలు–దానవులు క్షీరసాగర మథనం ఘట్టాన్ని వినూత్నంగా రూపొందించారు.  ఈ అలంకరణను గద్వాల పట్టణ ప్రజలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను స్వకులశాలి సమాజం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వకులసాలి యువజన సంఘం ఉపాధ్యక్షుడు దేవుజి రాఘవేందర్, కార్యదర్శి సాక్రె శ్రీనివాస్, దోత్రే సురేంద్రబాబు, కార్యవర్గ సభ్యులు గణప నరేందర్, కాంబ్లే ప్రవీణ్, గచ్చి వీరన్న, దోత్రే ప్రమోద్, సఫారీ అజయ్, సఫారీ సురేష్, జిందే కార్తీక్ తదితరులు కుల బాంధవులు మాజీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    13 hrs ago
  • శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • జేఏసీ బలం ఇదే.. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు........ . జేఏసీ ఐక్యత, పోరాటం వల్లే మన సమస్యలు రాజకీయ పార్టీల దృష్టికి వెళ్తున్నాయని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ఉద్యోగుల సమస్యలపై స్పందించి, వాటిపై మరింత విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సమస్యలకు న్యాయమైన పరిష్కారం లభించే వరకు జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. - జేఏసీ ఐక్యతే మన బలం. - ప్రతి రాజకీయ పార్టీ మన సమస్యలపై మాట్లాడాలి. - ఉద్యోగుల సమస్యలపై విస్తృత చర్చ జరగాలి. - ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలి. - న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. - ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతాం.
    1
    జేఏసీ బలం ఇదే.. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు........
.
జేఏసీ ఐక్యత, పోరాటం వల్లే మన సమస్యలు రాజకీయ పార్టీల దృష్టికి వెళ్తున్నాయని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ఉద్యోగుల సమస్యలపై స్పందించి, వాటిపై మరింత విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సమస్యలకు న్యాయమైన పరిష్కారం లభించే వరకు జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
- జేఏసీ ఐక్యతే మన బలం.
- ప్రతి రాజకీయ పార్టీ మన సమస్యలపై మాట్లాడాలి.
- ఉద్యోగుల సమస్యలపై విస్తృత చర్చ జరగాలి.
- ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలి.
- న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు.
- ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతాం.
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    10 hrs ago
  • గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....
    3
    గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు 
ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... 
కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....
    user_B N RAJU
    B N RAJU
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
    1
    రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో  మీడియాతో మాట్లాడిన హరీష్ రావు 
రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది
రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది
ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    13 hrs ago
  • బాధిత కుటుంబానికి అండగా ఉంటా: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్ ఛార్జీ డాక్టర్ రఘు ని, వారి కుటుంబ సభ్యులను TRS పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. డాక్టర్ రఘు తల్లి పుస్పలత ఇటీవల మృతి చెందగా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని నివాసానికి వెళ్లి పుస్పలత చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీ పునుగోటి పవన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, ఇస్మాయిల్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    బాధిత కుటుంబానికి అండగా ఉంటా: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
తెలంగాణలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్ ఛార్జీ డాక్టర్ రఘు ని, వారి కుటుంబ సభ్యులను TRS పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. డాక్టర్ రఘు తల్లి పుస్పలత ఇటీవల మృతి చెందగా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని నివాసానికి వెళ్లి పుస్పలత చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీ పునుగోటి  పవన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, ఇస్మాయిల్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.