పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు – ఉత్తమ ఫలితాలే ఏపీ ఆదివాసీ జేఏసీ, ఏటీఏ లక్ష్యం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏపీ ఆదివాసీ జేఏసీ మరియు ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ (ఏటీఏ) ఆధ్వర్యంలో పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తెల్లం శేఖర్, కారం రామన్న దొర, ఏటీఏ మండల నాయకులు చిచ్చడి శేషారావు, సోడే కన్నం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెల్లం శేఖర్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న 18 మంది పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు అందజేసి, వారు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు కృషి చేసి దేవీపట్నం మండలానికి రాష్ట్ర స్థాయిలో మంచి ఉత్తీర్ణత తీసుకురావాలని తెలిపారు. ఏటీఏ నాయకులు చిచ్చడి శేషారావు, సోడే కన్నం రాజు మాట్లాడుతూ విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ. వెంకటేశ్వరరావు (శ్రీనివాస్), కె. కృష్ణారెడ్డి, చవలం సత్యనారాయణ దొర, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

- Post by Shyam1
- అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో పట్టాదారు భూమిపై వివాదం చెలరేగింది. గ్రామానికి చెందిన డేగల అప్పారావు పేరుమీద ఉన్న సర్వే నెంబర్ 28-2లో ఎకరం 20 సెంట్ల సొంత పట్టా భూమిని రెవెన్యూ అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామకంఠం భూమిగా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామకంఠానికి సంబంధించి సర్వే నెంబర్ 28-1లో ఇప్పటికే భూమి ఉండగా, అప్పారావు పట్టా భూమిని బలవంతంగా గ్రామకంఠంగా చూపించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివెనుక ప్రభావశీలులైన కొందరు పెద్దల రాజకీయ హస్తం ఉందేమో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సంబంధిత రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మరియు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.1
- డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, లైవ్ యాక్సిడెంట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఘటన క్షణాలు స్పష్టంగా రికార్డ్ కావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.1
- चीन ने हांगकांग-झुहाई-मकाऊ (HZMB) ब्रिज के रूप में दुनिया का सबसे लंबा समुद्री पुल बनाया है, जो 55 किमी लंबा है। अक्टूबर 2018 में खुला यह पुल 3 शहरों को जोड़ता है और इसका एक महत्वपूर्ण 6.7 किमी हिस्सा समुद्र के नीचे एक टनल के रूप में बना है, जिससे यात्रा का समय 4 घंटे से घटकर 30 मिनट हो गया है।1
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మృతి చెందిన జర్నలిస్టు డేగల చినబాబు కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్కు అందజేత ఇటీవల మృతి చెందిన ఏబీఎన్ అన్నవరం రిపోర్టర్ డేగల చినబాబు కుటుంబానికి జర్నలిస్టుల ఫెడరేషన్ అండగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో చినబాబు కుటుంబ సభ్యులకు సోమవారం ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు చినబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చినబాబు మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్టకాలంలో జర్నలిస్టుల ఫెడరేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అధికార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చినబాబు జర్నలిజం రంగంలో ఎంతో అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఆయన ఎప్పుడూ ముందుండేవారని గుర్తుచేశారు. నిజాయితీ, నిబద్ధతతో వార్తలను అందించడంలో ఆయన చూపిన కృషి ఇతర జర్నలిస్టులకు ఆదర్శమని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని, జర్నలిస్టులు లేదా వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చినబాబు కుటుంబానికి సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నిరంతరం పని ఒత్తిడితో జర్నలిజం వృత్తిని చేస్తున్న పలువురు అకస్మాత్తుగా మరణిస్తుండడంతో వారి కుటుంబాలు వీధిని పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ సందర్భంగా చినబాబు కుటుంబ సభ్యులు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సమయంలో జర్నలిస్టుల సంఘం అండగా నిలవడం తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పుర్రె త్రినాథ్, కే.వి.సత్యనారాయణ, శ్రీధర్, ఎస్ కే ఇమ్రాన్, దుర్గా శ్రీనివాస్, స్థానిక జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు రమణ, వెంకట్, ప్రసాద్, హరగోపాల్, ప్రవీణ్, లోవరాజు పడాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.6
- ఎచ్చెర్ల మండలం జరజం గ్రామ పరిధిలోని NH16పై అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టిన కారు ఆటోలోని ప్యాసింజర్లు ఎగిరిపడగా, ఒకరు మృతిచెందినట్లు, మరో 12 మంది గాయాలపాలైనట్లు సమాచారం.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు1
- ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం సూరన్న గొంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యేలకాలం నుండి శిధిలమైన పాఠశాలలోనే పిల్లల చదువులు కొనసాగుతున్న దీన పరిస్థితి అధికారులు వచ్చిన చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లడం తప్ప గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించని అధికారులు గిరిజన అభివృద్ధి సంస్థ ఎంతో దూరం కాదు కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే పిల్లలు వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి అయినా సరే టర్పాన్స్ వేసో ఎలాగో అలాగా పాఠశాల ఉపాధ్యాయులు సొర్వతీసుకొని పాఠశాలను నడిపించడం జరుగుతుంది దీనమైన పాఠశాలను ప్రజాప్రతినిధులు ఆసక్తి సూపి తక్షణమే నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకోవడం జరుగుతుంది.2
- Post by Shyam1