logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సైబర్ నేరాలపై విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి... మహదేవపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. యువత ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని గుర్తు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వెంబడించడం (సైబర్ స్టాకింగ్), నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం, అలాగే వివాహ సంబంధాల పేరుతో జరిగే మోసాలు వంటి నేరాల గురించి విద్యార్థులకు వివరించారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, అనుమానాస్పద మెసేజ్‌లు, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే స్పందించవద్దని సూచించారు. అంతేకాకుండా అజ్ఞాత వ్యక్తులు నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించి వేధిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎస్సై సాయి శశాంక్ మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన పడినప్పుడు వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నెంబర్ కు ఫోన్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

15 hrs ago
user_Syed shafeeq ahmed
Syed shafeeq ahmed
Mahadevpur, Jayashankar Bhupalapally•
15 hrs ago
ca10cfa3-8d5f-454c-80d8-e5298afa4911

సైబర్ నేరాలపై విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి... మహదేవపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. యువత ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని గుర్తు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వెంబడించడం (సైబర్ స్టాకింగ్), నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం, అలాగే వివాహ సంబంధాల పేరుతో జరిగే మోసాలు వంటి నేరాల గురించి విద్యార్థులకు వివరించారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, అనుమానాస్పద మెసేజ్‌లు, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే స్పందించవద్దని సూచించారు. అంతేకాకుండా అజ్ఞాత వ్యక్తులు నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించి వేధిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎస్సై సాయి శశాంక్ మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన పడినప్పుడు వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నెంబర్ కు ఫోన్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    1
    వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. 
స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. 
ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
    1
    కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.. టాయిలెట్స్ కి,అదనపు గదికి అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థినులు పాటలు ,కథలు చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.
    3
    రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని  విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం  విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు.  వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు..
టాయిలెట్స్ కి,అదనపు గదికి  అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు  బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు.
విద్యార్థినులు పాటలు ,కథలు  చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • *टिपर लॉरी में आग लग गई.. देखते ही देखते जलकर खाक हो गई* तेलंगाना: नलगोंडा जिले के चंदूर मंडल के तुम्मलपल्ली गांव में आग लग गई। सड़क बढ़ाने के काम के लिए गांव की ओर जा रही टिपर लॉरी में अचानक आग लग गई। अधिकारियों ने बताया कि आग बिजली के शॉर्ट सर्किट की वजह से लगी। टिपर देखते ही देखते पूरी तरह जलकर खाक हो गया। हादसे में ड्राइवर गंभीर रूप से घायल हो गया। उसे अस्पताल ले जाया गया, जहां डॉक्टरों ने बताया कि उसकी हालत गंभीर है। पुलिस घटना की जांच कर रही है।
    1
    *टिपर लॉरी में आग लग गई.. देखते ही देखते जलकर खाक हो गई*
तेलंगाना: नलगोंडा जिले के चंदूर मंडल के तुम्मलपल्ली गांव में आग लग गई। सड़क बढ़ाने के काम के लिए गांव की ओर जा रही टिपर लॉरी में अचानक आग लग गई। अधिकारियों ने बताया कि आग बिजली के शॉर्ट सर्किट की वजह से लगी। टिपर देखते ही देखते पूरी तरह जलकर खाक हो गया। हादसे में ड्राइवर गंभीर रूप से घायल हो गया। उसे अस्पताल ले जाया गया, जहां डॉक्टरों ने बताया कि उसकी हालत गंभीर है। पुलिस घटना की जांच कर रही है।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    15 hrs ago
  • బెజ్జూర్ గ్రామ సామాజిక ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సర్పంచ్ దుర్గం సరోజ–తిరుపతి, వైద్యుడు శ్రావణ్ శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
    1
    బెజ్జూర్ గ్రామ సామాజిక ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సర్పంచ్ దుర్గం సరోజ–తిరుపతి, వైద్యుడు శ్రావణ్ శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • వరంగల్:దుగ్గొండి మండలంలోని తొగర్రాయి ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
    1
    వరంగల్:దుగ్గొండి మండలంలోని తొగర్రాయి ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్థానిక వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ తెలిపారు. సోమవారం రాత్రి వార్డులోని పలు కాలనీలలో ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల నివారణ మందును స్ప్రే చేయించారు. ప్రజలు ఇళ్లు, వార్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు అధ్యక్షుడు సయ్యద్ హాజీ, సయ్యద్ హఫీజ్, మోహన్, బిలాల్, తదితరులు పాల్గొన్నారు.
    1
    లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్థానిక వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ తెలిపారు. సోమవారం రాత్రి వార్డులోని పలు కాలనీలలో ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల నివారణ మందును స్ప్రే చేయించారు. ప్రజలు ఇళ్లు, వార్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు అధ్యక్షుడు సయ్యద్ హాజీ, సయ్యద్ హఫీజ్, మోహన్, బిలాల్, తదితరులు పాల్గొన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • ఖానాపురం గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ తన పనితీరుతో ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తడి చెత్త-పొడి చెత్త వేరు చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో అంగడి ఏర్పాటు చేయడం, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం వంటి చర్యలతో “సర్పంచ్ అంటే ఇలా ఉండాలి” అని ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. తన పనితీరుతో గ్రామంలో “సంథింగ్ స్పెషల్”గా నిలుస్తున్నారు.
    1
    ఖానాపురం గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ తన పనితీరుతో ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తడి చెత్త-పొడి చెత్త వేరు చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో అంగడి ఏర్పాటు చేయడం, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం వంటి చర్యలతో “సర్పంచ్ అంటే ఇలా ఉండాలి” అని ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. తన పనితీరుతో గ్రామంలో “సంథింగ్ స్పెషల్”గా నిలుస్తున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.