Shuru
Apke Nagar Ki App…
రాష్ట్రంలో ఎల్లుండి నుంచి వర్షాలు ఏపీ లో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో ఈ నెల 21 నుంచి 3 రోజులపాటు రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 22వ తేదీ నుంచి 2 రోజులపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పడతాయని చెప్పింది. రానున్న 24 గంటల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో పొగ మంచు కురుస్తుందని, ఎండ స్వల్పంగా పెరుగుతుందని పేర్కొంది.
M vinod kumar
రాష్ట్రంలో ఎల్లుండి నుంచి వర్షాలు ఏపీ లో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో ఈ నెల 21 నుంచి 3 రోజులపాటు రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 22వ తేదీ నుంచి 2 రోజులపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పడతాయని చెప్పింది. రానున్న 24 గంటల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో పొగ మంచు కురుస్తుందని, ఎండ స్వల్పంగా పెరుగుతుందని పేర్కొంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శ్రీ సరస్వతి విద్యా మందిరం విద్యార్థులు ప్లాస్టిక్ నిర్మూలనపై చేపట్టిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను వీధుల్లో పడేయడం వల్ల పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కవర్లను బాటిళ్లలో నింపి అందజేయడంతో చెత్త సేకరణ సులభమవుతుందని, పర్యావరణాన్ని కాపాడవచ్చని విద్యార్థులు వివరించారు. ఈ వినూత్న ఆలోచన పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.1
- శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.3
- శ్రీశైలం మల్లన్నను టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మడకశిర నుంచి ఇరుముడితో వెళ్లి శ్రీశైలం మల్లన్నకు మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారిని కుటుంబ సమేతంగా వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు.1
- ఆదోనిలో జరిగే చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు ఈ నెల 19వ తేదీన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ పరిరక్షణ సమితి నాయకులు చీకోటి ప్రవీణ్ హాజరవుతున్నట్లు తెలిపారు.1
- కోసిగి మండలం మంత్రాలయం తాలూకా కర్నూలు జిల్లా.1
- కడప అల్లాహ్ 23 24 251
- పాములపాడు లో కులాంతర వివాహం చేసిన ఎమ్మార్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు కోటా ప్రభాకర్ మాదిగ, నల్లమల్ల అబ్రహం మాల నంద్యాల జిల్లా ఎమ్ ఎస్ పి అధికార ప్రతినిధి మరియు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఇన్చార్జి కోట ప్రభాకర్ మాదిగారు మరియు మాల మహానాడు జాతీయ నాయకులు నల్లమల్ల అబ్రహం మాల గార్ల సమక్షంలో పాములపాడు మండల కేంద్రం చౌడమ్మ గుడి దగ్గర ఎరుకల కులానికి చెందిన దినారి రామకృష్ణ కొడుకు వేణుగోపాల్ నందికొట్కూరు మారుతి నగర్ కు చెందినటువంటి ఓనమాల లక్ష్మీదేవి కుమార్తె శ్రావణి ఇద్దరు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 13వ తారీకు అబ్బాయి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో ఈ విషయం తెలుసుకున్న పెద్దలు కులాలు వేరు కావడంతో ఇరుకుటుంబంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. అమ్మాయి అబ్బాయికి కొన్ని రోజులు కౌన్సెలింగ్కు పంపించారు. అయినా మేము ఒకరికి ఒకరు ఇష్టపడ్డాం మేం కలిసే ఉంటాం అని చెప్పడంతో అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లు కావడంతో రెండు కులాల పెద్దల తో మాట్లాడి వారికి కులాంతర వివాహాన్ని జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు , జడల శ్రీనివాసులు మాదిగారు, మిడుతూరు మండల ఇంచార్జ్ భూపనుపాడు సతీష్ మాదిగ గారు, మిడుతూరు మండలం ఎమ్మెస్పీ అధ్యక్షులు గోపాల వెంకటరమణ గారు, పాములపాడు మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కనకం మరిస్వామి గారు చవిటి వెంకటరమణ మరియు ఎరుకల సంఘం కుల పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.5
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బుధవారం నుంచి బోర్వెల్ రిగ్ యజమానులు నిరవధిక సమ్మె చేపట్టారు. మొత్తం 21 బోర్వెల్ లారీలను నిలిపివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. బోర్వెల్ సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడంపై రిగ్ ఓనర్ల అసోసియేషన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించే వరకు ఉద్య మిస్తామని, మొదటి విడతగా ఐదు రోజుల పాటు సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.1