logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహాలక్ష్మి అమ్మవారు,లక్ష్మీ గణపతి, శ్రీరాముల వారికి ఇత్తడి అభయహస్తాల సమర్పణ... పిఠాపురం : పిఠాపురం పట్టణంలోని చింతావారి వీధిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి సహిత సీతారామాంజనేయ ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పిఠాపురానికి చెందిన సమయమంతుల శివశంకర ప్రసాద్, అనంతలక్ష్మి దంపతులు ఆలయంలోని మహాలక్ష్మి అమ్మవారు, లక్ష్మీ గణపతి, శ్రీరాముల వారికి ప్రత్యేకంగా తయారు చేయించిన ఇత్తడి అభయహస్తాలను బహూకరించారు. దాత దంపతులు సమర్పించిన అభయహస్తాలను ఆలయ అర్చకులు పోతుకూసి కాశీ విశ్వనాథ శాస్త్రి, నిర్వాహకులు ప్రత్యేక పూజల అనంతరం ఆయా దేవతామూర్తులకు అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు పూజల్లో పాల్గొని స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం దాత కుటుంబ సభ్యులను ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. దేవతామూర్తులకు అభయహస్తాలను సమర్పించడం ద్వారా భక్తులపై దైవానుగ్రహం, రక్షణ కలగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ మాజీ వైస్‌చైర్‌పర్సన్ కొత్తపల్లి పద్మా బుజ్జి, కోరుమిల్లి సూర్యనారాయణ, చింతా వెంకటేశ్వరరావు, వంగలపూడి సత్యనారాయణ, కొత్తపల్లి వీర రామ రాఘవ, డేగల సత్తిబాబు పాటు పలువురు భక్తులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.

9 hrs ago
user_Prasanna kumar Rowthu
Prasanna kumar Rowthu
Press advisory Pithapuram, Kakinada•
9 hrs ago
a5aa33ff-797a-4478-bd2a-5e6591d923fb

మహాలక్ష్మి అమ్మవారు,లక్ష్మీ గణపతి, శ్రీరాముల వారికి ఇత్తడి అభయహస్తాల సమర్పణ... పిఠాపురం : పిఠాపురం పట్టణంలోని చింతావారి వీధిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి సహిత సీతారామాంజనేయ ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పిఠాపురానికి చెందిన సమయమంతుల శివశంకర ప్రసాద్, అనంతలక్ష్మి దంపతులు ఆలయంలోని మహాలక్ష్మి అమ్మవారు, లక్ష్మీ గణపతి, శ్రీరాముల వారికి ప్రత్యేకంగా తయారు చేయించిన ఇత్తడి అభయహస్తాలను బహూకరించారు. దాత దంపతులు సమర్పించిన అభయహస్తాలను ఆలయ అర్చకులు పోతుకూసి కాశీ విశ్వనాథ శాస్త్రి, నిర్వాహకులు ప్రత్యేక పూజల అనంతరం ఆయా దేవతామూర్తులకు అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు పూజల్లో పాల్గొని స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం దాత కుటుంబ సభ్యులను ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. దేవతామూర్తులకు అభయహస్తాలను సమర్పించడం ద్వారా భక్తులపై దైవానుగ్రహం, రక్షణ కలగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ మాజీ వైస్‌చైర్‌పర్సన్ కొత్తపల్లి పద్మా బుజ్జి, కోరుమిల్లి సూర్యనారాయణ, చింతా వెంకటేశ్వరరావు, వంగలపూడి సత్యనారాయణ, కొత్తపల్లి వీర రామ రాఘవ, డేగల సత్తిబాబు పాటు పలువురు భక్తులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కొత్త సూరవరంలో ఘనంగా ప్రారంభమైన పరదేశమ్మ తల్లి జాతర మహోత్సవా లు కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో 41 జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర మహోత్సవంలో భాగంగా 11 రోజులు దీక్ష అనంతరం మాల ధారణ ధరించిన భక్తులు ఇరుముడులు కట్టుకొని ఎస్. అన్నవరం గ్రామమంతా గిరి ప్రదక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత, పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గురు స్వామి చోడిశెట్టి కన్నా ప్రకాష్ ఆధ్వర్యంలో మాల విసర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ బుధవారం నాడు రాత్రి అమ్మవారి జాతర కార్యక్రమం ఘనంగా జరుగుతుందని తెలిపారు.
    1
    కొత్త సూరవరంలో ఘనంగా ప్రారంభమైన పరదేశమ్మ తల్లి జాతర మహోత్సవా లు 
కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో 41 జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర మహోత్సవంలో భాగంగా 11 రోజులు దీక్ష అనంతరం మాల ధారణ ధరించిన భక్తులు ఇరుముడులు కట్టుకొని ఎస్. అన్నవరం గ్రామమంతా గిరి ప్రదక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత, పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గురు స్వామి చోడిశెట్టి కన్నా ప్రకాష్ ఆధ్వర్యంలో మాల విసర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ బుధవారం నాడు రాత్రి అమ్మవారి జాతర కార్యక్రమం ఘనంగా జరుగుతుందని  తెలిపారు.
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    1
    బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ 
పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకలు అనకాపల్లి:స్థానిక సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షు లు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో పట్టణం లో గల కన్యకాపరమేశ్వరి దేవాలయం జంక్షన్ లో గల భారతరత్న మదర్ థెరిస్సా విగ్రహం వద్ద మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకల ను ఘనముగా నిర్వహించా రు. ఈ కార్యక్రమం లో సంస్థ అధ్యక్షులు బల్లా నాగభూష ణము మదర్ థెరిస్సా విగ్ర హానికి జ్యోతి వెలిగించి పూలమాల వేసి ఘనముగా నివాళి లర్పించారు.విద్యా ర్థులకు, పాదచారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బల్లా నాగభూషణం మాట్లాడు తూ మదర్ థెరిస్సా గారు భారతదేశమునకు చేసిన సేవలు ఎన్నటికీ మరచి పోలేనివని వారు మన దేశము లో నిరుపేదలకు, కుష్ఠు రోగులకు,క్షయ వ్యాధి గ్రస్తులకు, క్షత గాత్రులకు, తన ఫౌండేషన్ ద్వారా అశేషమైన సేవలను అందించిన మహనీయ వ్యక్తియని, అటువంటి మహనీయ సేవామూర్తి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వారి శత జయంతి ని పురష్కరించు కొని అత్యుత్తమ భారత రత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించిందని, అలాగే వారి సేవలకు గాను రామన్ మెగ సేసే అవార్డు, ప్రపంచం నోబెల్ బహుమతీ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న సేవా మూర్తి యని, ప్రార్ధించే పెదవులక న్నా సాయం చేసే చేతులు మిన్న అన్న ఆశయ స్ఫూర్తి తో తన జీవితమంతా అన్నార్థుల, అభాగ్యుల సేవల కే అంకితం చేశారని అటువంటి గొప్ప మహనీ య వ్యక్తి 116 వ జన్మదినం సందర్భముగా వారికి ఘన నివాళులు అర్పించుకోవడం ఎంతో గర్వముగా సంతోష ముగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శులు రొబ్బి మల్లేశ్వరరావు, బల్లా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు అయ్యగారి వెంకటరమణ మూర్తి, పొట్టి శ్రీరాములు భవన్ చైర్మన్ పిరాట్ల నరసింహ మూర్తి, జె. ఎం. జె. స్కూల్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్దులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా రు.
    1
    సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకలు
అనకాపల్లి:స్థానిక సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షు 
లు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో పట్టణం లో గల కన్యకాపరమేశ్వరి దేవాలయం జంక్షన్ లో గల 
భారతరత్న మదర్ థెరిస్సా 
విగ్రహం వద్ద మదర్ థెరిస్సా 
116 వ జయంతి వేడుకల
ను ఘనముగా నిర్వహించా 
రు. ఈ కార్యక్రమం లో సంస్థ 
అధ్యక్షులు బల్లా నాగభూష
ణము మదర్ థెరిస్సా విగ్ర
హానికి జ్యోతి వెలిగించి పూలమాల వేసి ఘనముగా 
నివాళి లర్పించారు.విద్యా
ర్థులకు, పాదచారులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా బల్లా నాగభూషణం మాట్లాడు
తూ మదర్ థెరిస్సా గారు 
భారతదేశమునకు చేసిన సేవలు ఎన్నటికీ మరచి పోలేనివని వారు మన దేశము లో నిరుపేదలకు, కుష్ఠు రోగులకు,క్షయ వ్యాధి 
గ్రస్తులకు, క్షత గాత్రులకు, తన ఫౌండేషన్ ద్వారా అశేషమైన సేవలను అందించిన మహనీయ వ్యక్తియని, అటువంటి మహనీయ సేవామూర్తి 
చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వారి శత జయంతి ని పురష్కరించు కొని అత్యుత్తమ భారత
రత్న పురస్కారాన్ని ఇచ్చి 
గౌరవించిందని, అలాగే వారి సేవలకు గాను రామన్ మెగ
సేసే అవార్డు, ప్రపంచం నోబెల్ బహుమతీ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న సేవా మూర్తి
యని, ప్రార్ధించే పెదవులక
న్నా సాయం చేసే చేతులు మిన్న అన్న ఆశయ స్ఫూర్తి
తో తన జీవితమంతా అన్నార్థుల, అభాగ్యుల సేవల కే అంకితం చేశారని 
అటువంటి గొప్ప మహనీ
య వ్యక్తి 116 వ జన్మదినం 
సందర్భముగా వారికి ఘన 
నివాళులు అర్పించుకోవడం 
ఎంతో గర్వముగా సంతోష ముగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిద్దార్థ అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శులు 
రొబ్బి మల్లేశ్వరరావు, బల్లా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు అయ్యగారి వెంకటరమణ మూర్తి, పొట్టి 
శ్రీరాములు భవన్ చైర్మన్ 
పిరాట్ల నరసింహ మూర్తి, 
జె. ఎం. జె. స్కూల్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్దులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా
రు.
    user_Nagireddy Sivaji
    Nagireddy Sivaji
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • రోలుగుంటలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన ర్యాలీ.... రోలుగుంట, ఆగస్టు 26: ఫ్లోరైడ్‌ ప్రభావిత రోలుగుంటలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ దళిత, గిరిజన, పేద మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. వరాహ నదిలో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. కాలనీలకు తక్షణం ట్యాంకర్ల ద్వారా నీరందించాలని, సీఎస్‌ఆర్‌, డీఎఫ్‌ఎం నిధులతో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. సీపీఎం నాయకులు కె.గోవిందరావు, వి.నూకరత్నం, వి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
    4
    రోలుగుంటలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన ర్యాలీ....
రోలుగుంట, ఆగస్టు 26: ఫ్లోరైడ్‌ ప్రభావిత రోలుగుంటలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ దళిత, గిరిజన, పేద మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. వరాహ నదిలో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. కాలనీలకు తక్షణం ట్యాంకర్ల ద్వారా నీరందించాలని, సీఎస్‌ఆర్‌, డీఎఫ్‌ఎం నిధులతో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. సీపీఎం నాయకులు కె.గోవిందరావు, వి.నూకరత్నం, వి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
    user_NANI
    NANI
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II
    1
    *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II 
*అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II
    user_Krishna Kasturi
    Krishna Kasturi
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • అనుమతి లేకుండా బైక్ ర్యాలీ.. యువతకు సీఐ సూచనలు........ మచిలీపట్నం: మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని ఇనుగుదురుపేట సీఐ ముందుగానే స్పష్టం చేశారు. అయితే సీఐ సూచించిన సమయం కంటే ముందే కొంతమంది ముస్లిం యువత బైక్‌లతో బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. మత పెద్దలు చెప్పిన విధంగా యువత నడుచుకోవాలని సీఐ సూచించి, పరిస్థితిని సర్దుబాటు చేసి యువతను అక్కడి నుంచి పంపించారు.
    1
    అనుమతి లేకుండా బైక్ ర్యాలీ.. యువతకు సీఐ సూచనలు........
మచిలీపట్నం: మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని ఇనుగుదురుపేట సీఐ ముందుగానే స్పష్టం చేశారు. అయితే సీఐ సూచించిన సమయం కంటే ముందే కొంతమంది ముస్లిం యువత బైక్‌లతో బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. మత పెద్దలు చెప్పిన విధంగా యువత నడుచుకోవాలని సీఐ సూచించి, పరిస్థితిని సర్దుబాటు చేసి యువతను అక్కడి నుంచి పంపించారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    4
    గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి
ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ సేవలు ప్రారంభం-తుమ్మపాలలో కొత్త వెలుగులు అనకాపల్లి:సామాజిక సేవే పరమావధిగా, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూతనందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల గ్రామంలో నూతనంగా ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ ముఖ్య నేత ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం వి ఆర్) చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేసి ఈ సేవా సంస్థ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు ( ఎం వి ఆర్) మాట్లాడుతూ... సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు, అకస్మాత్తుగా ఆపదల్లో చిక్కుకున్న బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరికైనా ఏ చిన్న కష్టం వచ్చినా, విద్య, వైద్యం, లేదా మరేదైనా ఆపద ఎదురైనా సరే నిరభ్యంతరంగా ట్రస్ట్ వద్దకు వచ్చి సంప్రదించవచ్చు. మా పరిధి మేరకు ప్రతి ఒక్కరికీ కొండంత అండగా ఉంటామని ఆయన ప్రజలకు ఘనంగా భరోసా నిచ్చారు.సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఆరంభమైన ఈ ట్రస్ట్ కార్యకలాపాలు సీఈవో బలరామ్, సి పీఆర్‌ఓ బోస్, ట్రస్ట్ మెంబర్ విష్ణువర్ధన్ ల సమర్థవంతమైన సారథ్యంలో నిరంతరం కొనసాగనున్నాయన్నారు. ఈ సేవా కార్యక్రమానికి అనకాపల్లి ఇన్‌చార్జ్ గైపూరి రాజుతో పాటు ఎం వి ఆర్ యువసేన సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతు తెలిపారు. మానవత్వమే ప్రాతిపదికగా సేవారంగంలోకి అడుగుపెట్టిన ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ నిర్వాహకులను తుమ్మపాల గ్రామస్తులు, ప్రజాప్రతి నిధులు హృదయపూర్వకంగా అభినందించారు. సంప్రదించవలసిన నెంబర్లు 08924. 237896
    4
    ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’  సేవలు ప్రారంభం-తుమ్మపాలలో కొత్త వెలుగులు
అనకాపల్లి:సామాజిక సేవే పరమావధిగా, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూతనందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల గ్రామంలో నూతనంగా ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ ముఖ్య నేత ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం వి ఆర్) చేతుల మీదుగా పూజా కార్యక్రమం  చేసి ఈ సేవా సంస్థ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు ( ఎం వి ఆర్) మాట్లాడుతూ... సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు, అకస్మాత్తుగా ఆపదల్లో చిక్కుకున్న బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరికైనా ఏ చిన్న కష్టం వచ్చినా, విద్య, వైద్యం, లేదా మరేదైనా ఆపద ఎదురైనా సరే నిరభ్యంతరంగా ట్రస్ట్ వద్దకు వచ్చి సంప్రదించవచ్చు. మా పరిధి మేరకు ప్రతి ఒక్కరికీ కొండంత అండగా ఉంటామని ఆయన ప్రజలకు ఘనంగా భరోసా నిచ్చారు.సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఆరంభమైన ఈ ట్రస్ట్ కార్యకలాపాలు సీఈవో బలరామ్, సి పీఆర్‌ఓ బోస్, ట్రస్ట్ మెంబర్ విష్ణువర్ధన్ ల సమర్థవంతమైన సారథ్యంలో నిరంతరం కొనసాగనున్నాయన్నారు. ఈ సేవా కార్యక్రమానికి అనకాపల్లి ఇన్‌చార్జ్ గైపూరి రాజుతో పాటు ఎం వి ఆర్ యువసేన సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతు తెలిపారు. మానవత్వమే ప్రాతిపదికగా సేవారంగంలోకి అడుగుపెట్టిన ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ నిర్వాహకులను తుమ్మపాల గ్రామస్తులు, ప్రజాప్రతి నిధులు హృదయపూర్వకంగా అభినందించారు. సంప్రదించవలసిన నెంబర్లు 08924. 237896
    user_Nagireddy Sivaji
    Nagireddy Sivaji
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.