logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే వృద్ధాప్యం ఎవరికీ శాపంగా మారకూడదు వృద్ధుల రక్షణకు ట్రిబ్యునల్ బెంచ్ అండగా ఉంటుంది | కాజీపేట, సెప్టెంబర్ 15: వృద్ధుల పోషణ, రక్షణ చట్టంపై అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కాజీపేటలోని సహృదయ వృద్ధాశ్రమంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి నేరెళ్ల వెంకట హైమ పూజిత, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్, అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పూజిత, డాక్టర్ అనితా రెడ్డి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం వృద్ధుల పోషణ, రక్షణ చట్టం, ట్రిబ్యునల్ బెంచ్ విధులు, వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షత వహించారు. తల్లిదండ్రులను ఆదరించడం పిల్లల బాధ్యత ఈ సందర్భంగా న్యాయమూర్తి నేరెళ్ల వెంకట హైమ పూజిత, డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యత పిల్లలదేనని స్పష్టం చేశారు. వృద్ధాప్యం ఎవరికీ శాపంగా మారకూడదని, వయోవృద్ధులకు ట్రిబ్యునల్ బెంచ్ అండగా నిలుస్తుందని తెలిపారు. వృద్ధులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా, వేధింపులకు గురైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను లేదా సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్‌ను సంప్రదించాలని సూచించారు. వృద్ధులను వేధించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి తల్లిదండ్రులు తమ జీవితకాలంలో తమ ఆస్తులన్నింటినీ పిల్లలకు పూర్తిగా పంచకూడదని, భవిష్యత్ అవసరాల కోసం కొంత ఆస్తిని తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. తదనంతరం ఆస్తి బదలాయింపు జరిగేలా వీలునామా రాసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రుల బాధ్యతను స్వీకరించేందుకు నిరాకరించే పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తులు, అధికారాలపై హక్కు కోరే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. వృద్ధులను గౌరవించడం, ప్రేమించడం మన సంస్కారానికి నిదర్శనమని అన్నారు. తల్లిదండ్రులను ప్రేమించకుండా, వారిని ఇబ్బందులకు గురిచేసే వారు ఎంతటి కోటీశ్వరులైనా దరిద్రులతో సమానమని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదేననే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి పూజిత, డాక్టర్ అనితా రెడ్డి, రవి, సహృదయ వృద్ధాశ్రమం నిర్వాహకులు యాకూబి, శ్రీకాంత్, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

13 hrs ago
user_Mr.Perfect
Mr.Perfect
Local News Reporter ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
13 hrs ago
a612a9d8-ef77-48a6-b3ce-2fbd6eb85e48

తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే వృద్ధాప్యం ఎవరికీ శాపంగా మారకూడదు వృద్ధుల రక్షణకు ట్రిబ్యునల్ బెంచ్ అండగా ఉంటుంది | కాజీపేట, సెప్టెంబర్ 15: వృద్ధుల పోషణ, రక్షణ చట్టంపై అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కాజీపేటలోని సహృదయ వృద్ధాశ్రమంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి నేరెళ్ల వెంకట హైమ పూజిత, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్, అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పూజిత, డాక్టర్ అనితా రెడ్డి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం వృద్ధుల పోషణ, రక్షణ చట్టం, ట్రిబ్యునల్ బెంచ్ విధులు, వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షత వహించారు. తల్లిదండ్రులను ఆదరించడం పిల్లల బాధ్యత ఈ సందర్భంగా న్యాయమూర్తి నేరెళ్ల వెంకట హైమ పూజిత, డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యత పిల్లలదేనని స్పష్టం చేశారు. వృద్ధాప్యం ఎవరికీ శాపంగా మారకూడదని, వయోవృద్ధులకు ట్రిబ్యునల్ బెంచ్ అండగా

ec39a7b7-39f4-4d1b-9d47-64cc09e3bec0

నిలుస్తుందని తెలిపారు. వృద్ధులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా, వేధింపులకు గురైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను లేదా సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్‌ను సంప్రదించాలని సూచించారు. వృద్ధులను వేధించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి తల్లిదండ్రులు తమ జీవితకాలంలో తమ ఆస్తులన్నింటినీ పిల్లలకు పూర్తిగా పంచకూడదని, భవిష్యత్ అవసరాల కోసం కొంత ఆస్తిని తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. తదనంతరం ఆస్తి బదలాయింపు జరిగేలా వీలునామా రాసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రుల బాధ్యతను స్వీకరించేందుకు నిరాకరించే పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తులు, అధికారాలపై హక్కు కోరే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. వృద్ధులను గౌరవించడం, ప్రేమించడం మన సంస్కారానికి నిదర్శనమని అన్నారు. తల్లిదండ్రులను ప్రేమించకుండా, వారిని ఇబ్బందులకు గురిచేసే వారు ఎంతటి కోటీశ్వరులైనా దరిద్రులతో సమానమని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదేననే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి పూజిత, డాక్టర్ అనితా రెడ్డి, రవి, సహృదయ వృద్ధాశ్రమం నిర్వాహకులు యాకూబి, శ్రీకాంత్, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

More news from Jangoan and nearby areas
  • రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see
    1
    రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Ghanpur (Station), Jangoan•
    15 hrs ago
  • ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    1
    ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన
ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు.
ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    15 hrs ago
  • రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........ రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్‌ను సంప్రదించవచ్చు అని అన్నారు.
    1
    రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........
రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్  అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్‌ను సంప్రదించవచ్చు అని అన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై దేశ వ్యాప్తంగా నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు...కేంద్ర పథకాల లబ్దిదారులంతా భాగస్వాములుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘‘ఆశీర్వాద దీపం’’ పేరిట దేశవ్యాప్తంగా అందరం దీపాన్ని వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరలించాలని ప్రార్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటామని తెలిపారు.‌ కేంద్రం నుండి లబ్ది పొందిన వాళ్లంతా ‘‘ఆశీర్వాద దీపం’’ పాల్గొనాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యంశాలుగా పొందుపరుస్తామని తెలిపారు.
    1
    నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై దేశ వ్యాప్తంగా నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు...కేంద్ర పథకాల లబ్దిదారులంతా భాగస్వాములుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన
గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ  సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘‘ఆశీర్వాద దీపం’’ పేరిట దేశవ్యాప్తంగా అందరం దీపాన్ని వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరలించాలని ప్రార్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటామని తెలిపారు.‌ కేంద్రం నుండి లబ్ది పొందిన వాళ్లంతా ‘‘ఆశీర్వాద దీపం’’ పాల్గొనాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యంశాలుగా పొందుపరుస్తామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    13 hrs ago
  • ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్‌ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్‌ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    1
    ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్‌ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్‌ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    15 hrs ago
  • క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ జనగామ: క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ​ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.
    1
    క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్
జనగామ:
క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు.
​ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు.
​ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.
    user_Parushuram goud
    Parushuram goud
    Singer జనగాం, జనగాం, తెలంగాణ•
    16 hrs ago
  • కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్..... మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ *ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు. సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు. సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు. ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..
    1
    కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్.....
మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ
*ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు
లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్  అన్నారు.
నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్  ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు.
మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్  అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న  మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి  ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు.
వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు.
సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు.
చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు.
సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు.
ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు.
CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు.
సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు.
ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..
    user_ఓలాద్రి వెంకన్న
    ఓలాద్రి వెంకన్న
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    49 min ago
  • ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    1
    ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ 
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.