గణేష్ మండపాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నల్లగొండ పట్టణంలోని కమ్యూనల్‌గా సున్నితమైన, మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మండపాల నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. మండపాల వద్ద 24 గంటల పాటు వాలంటీర్లను అందుబాటులో ఉంచాలని, నిర్వాహకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చూడాలని, మండపం పరిసరాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు స్పష్టంగా కనిపించే విధంగా కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి గణేష్ మండపాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు జియో ట్యాగింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, విద్యుత్ వైర్లు, స్విచ్ బోర్డులు, జనరేటర్లు తదితరాలను సురక్షితంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద అవసరమైన అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మైనర్ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు గైర్హాజరై గణేష్ మండపాల వద్ద ఉండకుండా మండపాల నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలకు గైర్హాజరై గణేష్ మండపాల వద్ద కనిపించే విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, మండపాల నిర్వాహకుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి, విద్య ప్రాముఖ్యతను వివరించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తమ పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా, చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ కోరారు. మండపాల వద్ద ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్‌ను నిబంధనల ప్రకారం మాత్రమే వినియోగించాలని, నిర్ణీత సమయం అనంతరం శబ్ద కాలుష్యాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఎస్పీ తెలిపారు. ఇతర మతాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి పాటలు, నినాదాలు, కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. మండపాలకు వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనాల పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా, ఏదైనా సమస్య లేదా అవాంఛనీయ పరిస్థితి తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, వాటిని ఫార్వర్డ్ చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసుల నిరంతర నిఘా, పెట్రోలింగ్, బందోబస్తు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సోదరభావంతో, అన్ని వర్గాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూ నిర్వహించేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజలు పోలీస్ శాఖకు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి, ఎస్బీ సీఐ నాగరాజు, నల్లగొండ 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- హైదరాబాద్ లో గోల్డెన్ గణపతి..ఈ ఏడాది ఇక్కడే స్పెషల్ తరలి వస్తున్న భక్తులు హైదరాబాద్ మహానగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బేగం బజార్ లో ఏర్పాట్లు చేసిన బంగారు గణపతి నీ చూసేందుకు ఎగబడుతున్నారు.1
- "భూమి, భుక్తి ,వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బావి తరాలకు అందించాలి: నల్లు సుధాకర్ రెడ్డి" *నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు* భూమి,బుక్తి,వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషుల తిరుగుబాటే కమ్యూనిస్టులనాయకత్వం లో సాగిన సాయుధ పోరాటమని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు మహబూబాబాద్ జిల్లా ; మరిపెడ మండల కేంద్రం గాంధీ సెంటర్ లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాల సందర్భంగా అమరవీరుల చిత్ర పటానికి పూలమాలవేసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దొరలు, భూస్వాములు, జాగిర్దారుల, రజాకార్ల దాస్టికాలకు వ్యతిరేకంగా, భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు నాయకులైన రావి నారాయణరెడ్డి,బద్దం ఎల్లారెడ్డి,ముగ్దుo మొయినుద్దీన్ పిలుపుతో ఎర్రజెండా నాయకత్వంలో కొనసాగి 10 లక్షల ఎకరాల భూమిని పంచి, మూడువేల గ్రామాలను విముక్తి చేసి,వేలాది కామ్రేడ్స్ త్యాగాల ఫలితంగా నాటి నిజాం తోక ముడిచే సందర్భంలో, సైన్యాలు రావడంతో హైదరాబాదు రాష్ట్రం భారత్ లో విలీనమైందనేది చారిత్రాత్మక సత్యమని,దీనిని మసిపూసి మారేడు కాయలు చేసే విధంగా, సాయుధ పోరాటంతో సంబంధంలేని బిజెపి లాంటి కుహన శక్తులు ముస్లిం రాజు పై హిందువుల పోరాటంగా చిత్రికరించే ప్రయత్నాలు చేయడాన్ని ప్రగతిశీల శక్తులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు .. *నాటి సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి, సాయుధ పోరాట స్మారక చిహ్నాన్ని ట్యాంకు బండపై ఏర్పాటు చేసి, సెప్టెంబర్ 17 విలీన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు* ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారగని బాలకృష్ణ,జిల్లా కౌన్సిల్తు సభ్యులు అబ్దుల్ రషీద్,తురక రమేష్,అంజి, వీరేందేర్, వెంకన్న, నర్సయ్య,కన్నె వెంకన్న, కలగుర నాగరాజు, యుగేందర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు...1
- దారి ఉన్నా.. తన స్థలంపైనే కన్నా? దారి కోసం.. దండయాత్రా? ఇంటి జాగా లాక్కునేందుకు రెండేళ్లుగా వేధింపులంటున్న శంకర్ ఇంటివెనుక సీసీ కెమెరాలు.. కుటుంబ కదలికలపై నిఘా? సీసీ కెమెరాలతో నిఘా.. అధికారుల జోక్యంతోనూ ఆగని వివాదం! అధికారుల జోక్యం.. గ్రామస్తుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచన దంతాలపల్లి మండలంలోని తూర్పుతండా గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి జాగా, దారి విషయంలో రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది. తన పాలివారైన గుగులోతు మున్య, సర్జన్, వారి కుటుంబీకులు తన స్థలాన్ని దారి కోసం లాక్కునేందుకు ఒత్తిడి చేస్తూ గొడవలకు దిగుతున్నారని గుగులోతు శంకర్ ఆరోపించారు. తమ కుటుంబంపై కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మున్య ఇంటికి రాకపోకల కోసం సురేష్ ఇంటి వెనుక ఉన్న సుమారు రెండు అడుగుల ఖాళీ బాటను ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, తన స్థలాన్ని ఆనుకుని కార్లు, పెద్ద వాహనాలు వెళ్లేందుకు మార్గం కల్పించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని శంకర్ పేర్కొన్నారు.వివాదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, జీపీఓ, ఎస్‌ఐ తదితరులు స్పందించి ఇరువర్గాలతో మాట్లాడినట్లు శంకర్ తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని అధికారులు సూచించినట్లు చెప్పారు.మున్య కుటుంబీకులు రూప్‌సింగ్, ధూప్‌సింగ్‌లు ఇంటి వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ కుటుంబ సభ్యుల కదలికలను రికార్డు చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. తమకు స్వేచ్ఛగా బయట ఉండే పరిస్థితి లేకుండా పోయిందని, ఇంట్లో స్థలం సరిపోక ఆరుబయట నిద్రించే సందర్భాల్లో కూడా కెమెరాల నిఘా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, దారి వివాదంలో శంకర్ దగ్గర ఎస్‌ఐ లంచం తీసుకుని వారి కుటుంబాలకు మద్దతు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బాధితులు ఖండించారు. ఆ ప్రచారం అసత్యమని, ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్న ప్రచారంపై కూడా వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరారు. ఇంటి జాగా, దారి వివాదంతో పాటు సీసీ కెమెరాల అంశం, సోషల్ మీడియా ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని, తమకు న్యాయం చేయాలని గుగులోతు శంకర్ కుటుంబం కోరారు.4
- వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి తగ్గిన నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ తో రూ.65 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ.80,100, VIP దర్శనాలతో రూ.1,12,350, కార్ పార్కింగ్ రూ.1,75,000, ప్రసాద విక్రయాలతో రూ.4,21,770, వ్రతాలతో రూ.55 వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,00,486 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- సువర్ణ శివలింగ దర్శనంతో రమణేశ్వరంలో భక్తిశోభ రమణేశ్వరం సువర్ణ శివలింగం వద్ద పెరిగిన భక్తుల రద్దీ1
- తెలంగాణ రైతాoగా పోరాట యోధుల్ని స్మరించుకుందాం :సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సీపీఐ పార్టీ 78 వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరాకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో పోరాట యోధులు తన విప్లవ పందాను కొనసాగిస్తూ ప్రజల హక్కుల కోసం తపించారాని పేర్కొన్నారు.. అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను కొనియాడారు.. ఈ కార్యక్రమం లోజిల్లా కౌన్సిల్ సభ్యులు రషీద్ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు..2
- కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్..... మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ *ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు. సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు. సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు. ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..1