ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు అన్ని ప్రజా సంఘాలతో కలిసి ధర్మవరంలోని బ్రహ్మంగారి గుడిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ, జిల్లా చేనేత కన్వీనర్ జేవీ రమణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముందుగా నేతన్న విగ్రహానికి పూలమాల వేసి, ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. చేనేత సంఘాల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ, పూర్ణచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు అమీర్ భాషా, వైకాపా చేనేత నాయకులు గడ్డం రంగా, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తుంపర్తి పరమేష్, సీపీఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు రమణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న తదితరులు ప్రసంగించారు. ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద రూ. 25 వేల పథకాన్ని అమలు చేస్తామని, కేంద్ర ప్రభుత్వం చేనేతపై విధిస్తున్న జీఎస్‌టీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారని, కానీ వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు పింఛన్ పథకం అమలు చేస్తామని చెప్పినా, అది ఎందుకు చేపట్టలేదని వారు ప్రశ్నించారు. కేవలం ఉచిత విద్యుత్ మాత్రమే ఇచ్చి సర్దుబాటు చేస్తున్నారని, చేనేత పరిశ్రమపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని వక్తలు విమర్శించారు. ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22వ తేదీన శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో చేనేత నాయకులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాను జయప్రదం చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు విజయభాస్కర్, సీపీఎం నాయకులు ఎస్ హెచ్ బాషా, చేతి వృత్తిదారుల సంఘం నాయకులు చెన్నంపల్లి శ్రీనివాసులు, చేనేత సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఖాదర్ బాషా, హరి, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు శిలా నారాయణస్వామి, నాగరాజు, జేవీవీ జిల్లా కార్యదర్శి లోకేష్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా, ఎస్ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున, లాయర్స్ అసోసియేషన్ నాయకులు ప్రసాద్, చేనేత నాయకులు పాలగిరి శ్రీధర్, సంకారపు రాజా, కొండ, మల్లికార్జున, మహిళా సమైక్య నాయకులు లలితమ్మ, లింగమ్మ, ఇతర చేనేత కార్మికులు పాల్గొన్నారు.

- అనంతపురం జిల్లాలోని శింగనమల మండలం ఆకులేడు గ్రామ శివారులో రాత్రి దొంగలు ఒక ఏటీఎంను పగులగొట్టి, అందులోని నగదును దోచుకున్నారు. ఆ తర్వాత వారు ఆ ఏటీఎంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. కాగా, ఇదే శింగనమల మండలంలో దుండగులు మరో ఏటీఎంను పూర్తిగా ఎత్తుకెళ్లారు.1
- చిత్తూరు రైల్వేస్టేషన్‌లో ఒక ప్రయాణికుడిపై చెప్పుతో దాడి చేసిన ఘటనలో గుంతకల్లు రైల్వే డివిజన్‌లో కమర్షియల్ విభాగం RS-2/CTO హోదాలో పనిచేస్తున్న కె. జ్యోతిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, సమాచారం అందిన వెంటనే ఆమెపై చర్యలకు ఉపక్రమించారు. దక్షిణ తీర రైల్వే ప్రధాన కమర్షియల్ కంట్రోలర్ జూన్ 14న ఈ సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు విధులు, వేతనం నుంచి ఆమె సస్పెన్షన్ కొనసాగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.1
- బద్వేలు పట్టణంలోని రాఘవేంద్ర గ్రాండ్ కళ్యాణ మండపంలో జూన్ 16, మంగళవారం కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలకు నియోజకవర్గం నలుమూలల నుండి నాయకులు, మహిళలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వక్తలు తమ ప్రసంగాలలో గత రెండేళ్లలో ప్రజలకు ప్రభుత్వం కల్పించిన నమ్మకం, చేపట్టిన అభివృద్ధి పనులు, అందించిన సంక్షేమ ఫలాలను విస్తృతంగా వివరించారు. ఈ విజయోత్సవ సంబరాలకు మంచూరు సూర్యనారాయణ రెడ్డితో పాటు బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరి ప్రసాద్, బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ, టీడీపీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతిబింబించేలా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయగా, సూర్యనారాయణ రెడ్డి, బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ వాటిని పరిశీలించారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల విజయగాథలను ప్రదర్శించిన ఈ స్టాళ్లను తిలకించారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆర్డీవో చంద్రమోహన్ ప్రజాప్రతినిధులకు వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాలుగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ప్రతీకగా ఈ విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరి ప్రసాద్, బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు నగిరి భైరవ ప్రసాద్, బి. కోడూరు మండలం టీడీపీ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి, బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ, బీజేపీ జిల్లా కార్యదర్శి కేవీ రమణ, ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వేణుగోపాల్, సీమాంక్ హాస్పిటల్ డైరెక్టర్ జహంగీర్ భాష, బద్వేలు నియోజకవర్గ నాయకులు చెరుకూరి రవికుమార్, పామూరి బాలిరెడ్డి, కర్నాటి వెంకట రెడ్డి, బాదిరెడ్డి వీరారెడ్డి, ఇమామ్ హుస్సేన్, కొంకుల రాంబాబు, మాచుపల్లి లక్ష్మి దేవి, చెరుకూరి చెండ్రాయుడు, ఓ. రమణారెడ్డి, జనసేన నాయకులు ఈశ్వర్ రెడ్డి, సింగం శెట్టి వెంకట సుబ్బయ్య, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విజయోత్సవ సభ బద్వేలులో విజయవంతంగా జరిగింది.2
- తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, ‘చేనేత కళా రత్న’ అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ మంగళవారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. తన తండ్రి, ప్రముఖ చేనేత శిల్పి అవార్డు గ్రహీత స్వర్గీయ నల్ల పరంధాములు గారి స్ఫూర్తితో, వారి అడుగుజాడల్లో నడుస్తూ తాను ప్రత్యేకంగా నేసిన అత్యంత విలక్షణమైన పట్టుచీరను శ్రీ కనకదుర్గఅమ్మవారికి అలంకరణ చేయవలసినదిగా ఆలయ ఈవో వికె శీనా నాయక్ కు ఆయన అందజేశారు. ‘అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర’గా చేనేత రంగానికే మచ్చుతునకగా నిలిచిన ఈ కళాఖండాన్ని విజయ్ కుమార్ వారం రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి మగ్గంపై అద్భుతంగా మలిచారు. ఈ పట్టుచీర పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 48 ఇంచులు ఉంటుంది. ఇంత పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ, దీని బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం. సాంప్రదాయ, ఆకర్షణీయమైన ‘ఇక్కత్ డిజైన్’ వచ్చేలా అత్యంత నైపుణ్యంతో రూపొందించిన ఈ చీరను మడతపెడితే సులభంగా ఒక చిన్న అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది. ఈ సందర్భంగా చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ, గతంలో తాను తయారు చేసిన ప్రతి సరికొత్త చేనేత సృష్టికి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు లభించాయని తెలిపారు. ఎల్లప్పుడూ దుర్గమ్మ తల్లి దీవెనలు తమపై ఉండాలని కోరుకుంటూ ఈ సరికొత్త పట్టుచీరను సమర్పించి, అమ్మవారి కృపకు పాత్రులం కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో ‘ఆపరేషన్ సింధు’ పేరిట అద్భుతమైన శాలువను తయారు చేసి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అందించి, వారి చేతుల మీదుగా ఘనమైన ప్రశంసలు పొందిన స్ఫూర్తితోనే, చేనేత కళా నైపుణ్యాన్ని చాటుతూ ఈ చీరను రూపొందించినట్లు వివరించారు. అమ్మవారికి సమర్పించిన ఈ అద్భుతమైన చేనేత కళాఖండాన్ని ఆలయ ఈవో శీనానాయక్ పరిశీలించి, అసాధారణ ప్రతిభ చూపిన చేనేత కళాకారుణ్ణి ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్న రీతిగా మన సంప్రదాయ కళలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని శీనానాయక్ ఈ సందర్భంగా కోరారు.1
- నంద్యాల జిల్లాలోని మహానంది ఈశ్వర్ నగర్ ఎస్సీ కాలనీలో గత కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ కాలనీలో రాత్రి వేళల్లో చిమ్మ చీకటి అలుముకోవడంతో, పిల్లలు, పెద్దలు ఎవరూ బయటకు రావాలంటేనే భయపడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అడవి జంతువులు జనావాసంలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలను అధికారులు గుర్తుంచుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలు త్వరగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- ప్రజలకు మెరుగైన తాగునీటి సేవలను అందించడమే ప్రధాన లక్ష్యంగా కమిషనర్ ఎన్. గంగిరెడ్డి గాంధీనగర్‌లో నీటి సరఫరా వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించారు.1
- అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం గ్రామంలో గొర్రెలు తమ వాహనాలకు అడ్డు వచ్చాయనే కారణంతో కొందరు పోరంబోకులు తండ్రి కొడుకులైన కాపరులను తీవ్రంగా చితకబాదారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆ కాపరులను కొందరు స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.3
- మార్కాపురం జిల్లాలోని అర్ధవీడు మండలం, మాగుటూరు గ్రామంలో ఇంటి ముందు శుభ్రం చేసే విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ వివాదంలో, ఒక కుటుంబానికి చెందిన సభ్యులు రజిత అనే మహిళపై కత్తితో దాడి చేశారు, దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రజితను ఆమె కుటుంబ సభ్యులు వెంటనే కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.1