ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఎంతో ఉపయోగకరం: అంతునూరి శివకుమార్ గజ్వేల్, బుధవారం:ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని శ్రీ వాసవి మాత చలివేంద్రం నిర్వాహకులు, ఆర్యవైశ్య నాయకులు అంతునూరి శివకుమార్ తెలిపారు.స్థానిక ఇందిరాబాదు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన శ్రీ వాసవి మాత చలివేంద్రం వద్ద బుధవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గజ్వేల్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తమ అవసరాల కోసం ప్రతిరోజూ పట్టణానికి వస్తుంటారని అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద గత ఏడు సంవత్సరాలుగా చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.దానిలో భాగంగా బుధవారం ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తన మిత్రుడు ఏలిశాల కాశీనాథ్ సహకరించారని, ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ స్థానిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయం అందిస్తున్నారని శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట బిక్షపతి, సిద్ధి బిక్షపతి, ఉప్పల కృష్ణమూర్తి, దుబకుంట రుక్మయ్య, దుబకుంట లచ్చలు, సూపర్ మార్కెట్ లక్ష్మణ్, గౌరిశెట్టి శ్రీనివాస్, గంగా రమేష్, సముద్రాల అమర్నాథ్, మరియాల లింగం, మరియాల శ్రీనివాస్, జగ్గయ్య గారి రాజు, మరుమాముల ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఎంతో ఉపయోగకరం: అంతునూరి శివకుమార్ గజ్వేల్, బుధవారం:ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని శ్రీ వాసవి మాత చలివేంద్రం నిర్వాహకులు, ఆర్యవైశ్య నాయకులు అంతునూరి శివకుమార్ తెలిపారు.స్థానిక ఇందిరాబాదు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన శ్రీ వాసవి మాత చలివేంద్రం
వద్ద బుధవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గజ్వేల్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తమ అవసరాల కోసం ప్రతిరోజూ పట్టణానికి వస్తుంటారని అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద
గత ఏడు సంవత్సరాలుగా చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.దానిలో భాగంగా బుధవారం ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తన మిత్రుడు ఏలిశాల కాశీనాథ్ సహకరించారని, ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ స్థానిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయం అందిస్తున్నారని శివకుమార్
తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట బిక్షపతి, సిద్ధి బిక్షపతి, ఉప్పల కృష్ణమూర్తి, దుబకుంట రుక్మయ్య, దుబకుంట లచ్చలు, సూపర్ మార్కెట్ లక్ష్మణ్, గౌరిశెట్టి శ్రీనివాస్, గంగా రమేష్, సముద్రాల అమర్నాథ్, మరియాల లింగం, మరియాల శ్రీనివాస్, జగ్గయ్య గారి రాజు, మరుమాముల ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
- Papa Mujhe Bhi Bachao 😢 | Helmet Sirf Aapke Liye? | Hyderabad Traffic Police Awareness Program #HyderabadTrafficPolice #RoadSafety #ArriveAlive #DefensiveDriving #HelmetSafety #SaveLives #TrafficAwareness #HyderabadNews #SchoolAwareness #SafetyFirst #RoadAccident #PoliceAwareness #TelanganaPolice #ViralNews #EmotionalStory #BreakingNews #IndiaNews #HelmetAwareness #SafeDriving #PublicAwareness1
- డీలిమిటేషన్ సెగ.. అగ్గిరాజేసిన సీఎం స్టాలిన్! బిల్లు ప్రతులను తగలబెట్టి నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేడు పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు స్టాలిన్ స్వయంగా ఆ బిల్లు ప్రతులను తగలబెట్టారు.1
- Post by నీరటి మహేందర్1
- Post by Solanke Ravi4
- సదాశివపేట మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి1
- బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- పత్రిక ప్రకటన తేది :16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.1
- ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని టీజీఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. కంది లోని రైతు వేదికలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.1