logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇంటర్మీడియెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ జితేష్ వి. పాటిల్. జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు సంబంధిత విభాగాధిపతులను నియమించినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా అనుభవం కలిగిన ఇన్విజిలేటర్లను నియమించాలని ఆదేశించారు.పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల భద్రత విషయంలో పూర్తి అప్రమత్తత పాటించాలని సూచించారు. ప్రశ్నాపత్రాల నిల్వ, పంపిణీ, రవాణా ప్రక్రియలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, సంబంధిత పోలీస్ స్టేషన్లలో స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేసి భద్రత మధ్య రవాణా నిర్వహించాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి అమలు చేసి, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల ప్రాంతంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు.పరీక్షలు ముగిసిన అనంతరం జవాబు పత్రాలను అత్యంత జాగ్రత్తగా, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సంబంధిత మూల్యాంకన కేంద్రాలకు పంపించేందుకు పోస్టల్ శాఖ అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జవాబు పత్రాల సీలింగ్, భద్రతా తనిఖీలు, రవాణా ప్రక్రియలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, నిర్ణీత కాలవ్యవధిలో గమ్యస్థానాలకు చేరేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష నిర్వహించు రోజుల్లో ఉదయం 6.00 గంటల నుంచి 8.00 గంటల వరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు ఇచ్చారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య శాఖ అధికారులు ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన మందులు, ప్రథమ చికిత్స సదుపాయాలు కల్పించి, ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్, పంచాయతీ శాఖ అధికారులు పరీక్షా కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను సమకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష రాయనున్న విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం ఒక గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.ఇంటర్మీడియెట్ పరీక్షలను ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

4 hrs ago
user_VANAMA SRINIVAS RAO
VANAMA SRINIVAS RAO
జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
4 hrs ago
fe868362-0f4a-4c76-bbc0-a6573ccf2726

More news from తెలంగాణ and nearby areas
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం గాంధీనగర్‌కు 44 వ డివిజన్ కు చెందిన దొమ్మాటి పద్మ అనే నీరు పేద మహిళ భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా వితంతు పింఛన్ రావడం లేదు సదరు మహిళకు పింఛన్ కోసం గతం లో కూడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాల్వంచ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వితంతు పింఛన్ మంజూరు చెయ్యాలని కోరటం జరిగినది కానీ పింఛన్ మంజూరు కాకపోవడం బాధాకరమని పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు దొమ్మాటి పద్మ గారి భర్త దొమ్మాటి మొగిలయ్య గారు 29-12-2020 తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ వెంటనే ఆమె పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదని అన్నారు.ప్రస్తుతం ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని,ఆమెకు ఒక్క కుమార్తె ఉందని ఆమె కూలి పనులు చేస్తూ తల్లిని పోషిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి, అర్హత ఉన్న వితంతు మహిళ దొమ్మాటి పద్మ కు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
    3
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం గాంధీనగర్‌కు 44 వ డివిజన్ కు చెందిన దొమ్మాటి పద్మ అనే నీరు పేద మహిళ భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా వితంతు పింఛన్ రావడం లేదు సదరు మహిళకు పింఛన్ కోసం గతం లో కూడ బీజేపీ  పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాల్వంచ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వితంతు పింఛన్ మంజూరు చెయ్యాలని కోరటం జరిగినది కానీ పింఛన్ మంజూరు  కాకపోవడం బాధాకరమని పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు దొమ్మాటి పద్మ గారి భర్త దొమ్మాటి మొగిలయ్య గారు 29-12-2020 తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ వెంటనే ఆమె పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదని అన్నారు.ప్రస్తుతం ఆమె తీవ్రమైన అనారోగ్య  సమస్యలతో బాధపడుతుందని,ఆమెకు ఒక్క కుమార్తె ఉందని ఆమె  కూలి పనులు చేస్తూ తల్లిని పోషిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి, అర్హత ఉన్న వితంతు మహిళ దొమ్మాటి పద్మ కు  తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
  • ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.
    1
    ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    10 min ago
  • బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
    1
    బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
    user_Ram
    Ram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
    1
    తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
    user_RUDRA BHAVANARUSHI
    RUDRA BHAVANARUSHI
    నర్సింహులపేట, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ప్రజాస్వామ్య విరుద్దంగా కాంగ్రెస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు BRSను గెలిపిస్తే కాంగ్రెస్ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కొల్లగొట్టిందని మండిపడ్డారు. తనతో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా ఎన్నిక నిర్వహించారన్నారు. BRS గెలుపు కోసం కార్యకర్తలు కష్ట పడ్డారని, వారికి ఏం జవాబు చెప్పుకోవాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
    1
    ప్రజాస్వామ్య విరుద్దంగా కాంగ్రెస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు BRSను గెలిపిస్తే కాంగ్రెస్ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కొల్లగొట్టిందని మండిపడ్డారు. తనతో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా ఎన్నిక నిర్వహించారన్నారు. BRS గెలుపు కోసం కార్యకర్తలు కష్ట పడ్డారని, వారికి ఏం జవాబు చెప్పుకోవాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    2 hrs ago
  • తొర్రూరులో ఉత్కంఠభరిత పరిస్థితులు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ 144 సెక్షన్ అమలు – భారీగా మోహరించిన పోలీసులు తొర్రూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పట్టణమంతా 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు 9 మంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) కు 7 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో ఇరుపార్టీల బలం 9–9కు సమానమవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇరుపార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు ఈరోజుకు వాయిదా వేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు పూర్తిస్థాయిలో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి, అనవసర గుంపులు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి మొత్తం తొర్రూరు పైనే నిలిచింది. 👉 ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తవుతుందా? 👉 లేక మరింత రాజకీయ ఉత్కంఠకు దారి తీస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
    2
    తొర్రూరులో ఉత్కంఠభరిత పరిస్థితులు
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ 144 సెక్షన్ అమలు – భారీగా మోహరించిన పోలీసులు
తొర్రూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పట్టణమంతా 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు 9 మంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) కు 7 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో ఇరుపార్టీల బలం 9–9కు సమానమవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఇరుపార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు ఈరోజుకు వాయిదా వేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు పూర్తిస్థాయిలో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి, అనవసర గుంపులు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి మొత్తం తొర్రూరు పైనే నిలిచింది.
👉 ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తవుతుందా?
👉 లేక మరింత రాజకీయ ఉత్కంఠకు దారి తీస్తుందా?
అన్నది వేచి చూడాల్సిందే.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    10 hrs ago
  • బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా
*ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,*
జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మందెరికలపాడు, సత్యనారాయణపురం, సారెకల్లు, కారెకట్టు, ప్రభాత్ నగర్, ఉలవనూరు, రేగుల గూడెం తదితర ప్రాంతాలలో పోడు సాగుదారుల సమస్యపై సిపిఐ జిల్లా కార్యదర్శి *కామ్రేడ్ ఎస్కే సాబీర్ పాషా* నాయకత్వంలో పాయకారి యానం బైలు,శాతకొండ రేంజ్ పరిధి వైల్డ్ లైఫ్. ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్ డి ఓ) గారిని కలిసి ఫారెస్ట్ అధికారులు. పోడు సాగుదారులను చీటికిమాటికి ఇబ్బందులకు గురి చేయవద్దని 2023 లో సర్వే చేసిన భూములలో ట్రెంచ్ కొట్టడానికి ప్రయత్నించొద్దని గిరిజన, గిరిజనేతర పేదలు గత 30, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడానికి ప్రయత్నించొద్దని ఎఫ్డిఓ బాబుని కోరారు.తరువాత పోడు సాగుదారులతో మాట్లాడుతూ కొత్తగా పోడు నరకవద్దని పాత భూములు సాగు చేసుకోవాలని కొత్తగా పోడు నరికితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున 2023 కంటే ముందు ఉన్నటువంటి పోడు భూములు సాగు చేసుకోవడం మంచిదని తెలిపారు.
    3
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మందెరికలపాడు, సత్యనారాయణపురం, సారెకల్లు, కారెకట్టు, ప్రభాత్ నగర్, ఉలవనూరు, రేగుల గూడెం తదితర ప్రాంతాలలో పోడు సాగుదారుల సమస్యపై సిపిఐ జిల్లా కార్యదర్శి *కామ్రేడ్ ఎస్కే సాబీర్ పాషా* నాయకత్వంలో పాయకారి యానం బైలు,శాతకొండ రేంజ్ పరిధి వైల్డ్ లైఫ్. ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్ డి ఓ) గారిని కలిసి 
ఫారెస్ట్ అధికారులు. పోడు సాగుదారులను చీటికిమాటికి ఇబ్బందులకు గురి చేయవద్దని
2023 లో సర్వే చేసిన భూములలో ట్రెంచ్ కొట్టడానికి ప్రయత్నించొద్దని 
గిరిజన, గిరిజనేతర పేదలు గత 30, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడానికి ప్రయత్నించొద్దని
ఎఫ్డిఓ బాబుని కోరారు.తరువాత పోడు సాగుదారులతో మాట్లాడుతూ 
కొత్తగా పోడు నరకవద్దని పాత భూములు సాగు చేసుకోవాలని కొత్తగా పోడు నరికితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున 2023 కంటే ముందు ఉన్నటువంటి పోడు భూములు సాగు చేసుకోవడం మంచిదని తెలిపారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.