Shuru
Apke Nagar Ki App…
Paramesh Ratnagiri
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరు నగరంపాలెంలో మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆదివారం తెలిపారు. గుంతల మయంగా ఉన్న రోడ్డు మొత్తం ప్రోక్లైనర్‌తో పగలగొట్టి పనిని ప్రారంభించారన్నారు. నాణ్యమైన ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వర్షపు నీరు రోడ్డుపై నిలబడకుండా డ్రైనేజీలో కలవాలని ఆర్ అండ్ బి అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు.1
- యాదాద్రి భువనగిరిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం శాస్త్రోక్తంగా ఆలయం అర్చకుల వేదమంత్రాల మధ్య స్వామి వారి నిత్య కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా సుదర్శన హోమం అనంతరం స్వామివార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి కళ్యాణ తంతును నిర్వహించారు. రెండు గంటల పాటు జరిగిన ఈ కళ్యాణాన్ని వేలాది భక్తులు కనులారా వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.1
- ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ వదలపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.1
- *బడంగ్పేట్ సర్కిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం* రంగారెడ్డి జిల్లా:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్‌లో బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం సఫిల్‌గూడ కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో ఓ ముస్లిం యువకుడు మలవిసర్జన చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలపై, హిందువులపై దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని పేర్కొన్న బీజేపీ నాయకులు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.4
- గజ్వేల్‌లో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మహంకాళి ఆలయానికి 10,000 విరాళం అందజేసిన ఉప్పల ప్రవీణ్ .. 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 12 ప్రజా తెలంగాణ న్యూస్/ మైనంపల్లి హనుమంతరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు శనివారం మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి 10 000 రూపాయలు విరాళం అందజేసిన కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అనంతరం మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి, మైనంపల్లి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు ఈ సందర్భంగా టి పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని అన్నారు. మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని, ఆయనకు మరింత బలం, ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రవీణ్ గుప్తా, కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్రనాయకులు ఇక్బాల్,ఆత్మ కమిటీ డైరెక్టర్లు నాయిని భవాని తిరుపతి,సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, కృపానందం, గజ్వేల్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేత నాగరాజు, మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బాలయ్య గారిcరాజు గౌడ్, టిల్లు రెడ్డి, మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమీర్,ప్రభాకర్ గౌడ్, కొండ రవి, మామిడి మహేష్, మీర్జా జమీర,చర్లపల్లి రవి, మైస నాగరాజు, రాజిరెడ్డిపల్లి రాజు, చంద్రం, బీడీకల్ని రాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రశాంతి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు4
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- Post by Paramesh Ratnagiri1
- సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లే వాహనాలతో గత మూడు రోజులుగా చౌటుప్పల్ కొర్లపాడు టౌన్ టోల్ ప్లాజాలు వాహనాల రద్దీతో నిండిపోయాయి. ఆదివారమే ఎక్కువ శాతం ప్రయాణికులు ఆంధ్ర వైపు వెళ్లడంతో సోమవారం కొంత రద్దీ తగ్గిపోయింది. దీంతో వాహనాలు చకచక టోల్ ప్లాజాలను దాటుతున్నాయి.1
- మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో సునామీ సుధాకర్ సందడి చేశారు. సోమవారం కళాశాలలో కళాశాల చైర్మన్ కె.ఎస్.రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున కోడిపందాలు,పతంగుల పోటీలు, ముగ్గుల పోటీలను నిర్వహించారు.1