Shuru
Apke Nagar Ki App…
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభించారు. ఇది ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (PM మిత్ర) పార్క్‌లో భాగంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని వరంగల్ కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవో తదితర అధికారులు వీక్షించారు.
M D Azizuddin
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభించారు. ఇది ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (PM మిత్ర) పార్క్‌లో భాగంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని వరంగల్ కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవో తదితర అధికారులు వీక్షించారు.
More news from తెలంగాణ and nearby areas
- రాష్ట్రంలో గన్, డ్రగ్స్, గంజాయి కల్చర్ పెరిగింది : మాజీమంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో పోలీసులు ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంలో చూపుతున్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదని విమర్శించారు.1
- వరంగల్ నగరంలోని ఏకశిలా పరపతి సంఘం కార్యాలయం ఎదుట ఆదివారం సభ్యులు ఆందోళన చేపట్టారు. సంఘం ఆదాయం, ఖర్చులు, సభ్యుల చందాల వివరాలు పారదర్శకంగా వెల్లడించడం లేదని వారు ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని సభ్యులు హెచ్చరించారు.1
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అద్దంకి నాగమణి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవితలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీతక్క, అద్దంకి దయాకర్ వంటి ప్రజా నాయకులపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని ఆమె ఘాటుగా విమర్శించారు. కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన కవితకు కష్టపడి పైకి వచ్చిన వారి విలువ తెలియదని నాగమణి ఎద్దేవా చేశారు.1
- NCHM JEE-2026 పరీక్షకు సంబంధించిన మొదటి ఆన్సర్ కీ విడుదలైంది. విద్యార్థులు తమ సమాధానాలను వెంటనే సరిచూసుకొని స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు. తదుపరి ప్రక్రియకు ఇది అత్యంత కీలకమైన అడుగు.1
- పెద్దపల్లి జిల్లాలో పది రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు వంశీ మృతదేహం ఎక్లాస్ పూర్ వద్ద లభ్యం...హత్య చేసి శవం దొరకకుండా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బంధువులు ఆందోళన పెద్దపల్లి జిల్లాలో పది రోజుల క్రితం అదృశ్యమైన రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన యువకుడు జూల వంశీ మృతదేహం మంథని మండలం ఎక్లాస్ పూర్ శివారులోని గాడుల గండి వద్ద లభించింది. హత్యచేసి ఎక్లాస్ పూర్ గాడుదుల గండి గుట్ట వద్ద లోయలో మృతదేహాన్ని పడేశాని బందువులు ఆందోళనకు దిగారు. రోడ్డు పై బైఠాయించి ధర్నా చేశారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో మృతుని కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని పదిరోజుల నుండి పోలీసులు మృతదేహాన్ని గుర్తించకపోవడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో పోలీసుల పురోగతి లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30 నుండి వంశీ కనబడకుండా పోవడంతో మూడు రోజులు అనంతరం కుటుంబ సభ్యుల గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంఘటన స్థలానికి గోదావరిఖని ఏసిపి మడత రమేష్ చేరుకుని జూల వంశీ హత్య కేసులో ఓ మహిళతోపాటు ముగ్గురిని గుర్తించామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శవాన్ని దొరకనీయకుండా దాచి పెట్టే ప్రయత్నం చేసిన కేసుతో పాటు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.1
- Post by Mana Velugu1
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆదివారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.16,83,760, VIP దర్శనాలతో రూ.9,29,700, కార్ పార్కింగ్తో రూ.7,27,500, బ్రేక్ దర్శనాలతో రూ.4,21,500, ప్రధాన బుకింగ్తో రూ.3,57,950, వ్రతాలతో రూ.2,79,000, యాదరుషి నిలయం రూ.2,71,150, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.51,80,379 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- హన్మకొండ జిల్లా ఐనవోలు నుండి 11 మంది హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టుకు పాదయాత్ర మొదలుపెట్టారు. నాలుగు రోజుల పాటు సుమారు 150 కిలోమీటర్లు నడిచి, వారు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మాల విరమణ చేయనున్నారు.1