logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చేయూత పింఛన్లు.. దరఖాస్తుకు ఇవాళ ఒక్కరోజే ఛాన్స్....... తెలంగాణలో కొత్త చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈ గడువు SEP 15తో ముగియాల్సి ఉంది. అయితే వరుస సెలవులు రావడంతో దరఖాస్తు చేసేందుకు లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. దీంతో పలువురి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఒకరోజు గడువు పొడిగించింది. ఈ మేరకు సెప్టెంబర్ 16 సాయంత్రం 5:00 గంటల వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలిగింది. అర్హులైన వారు సమీపంలోని ప్రజాపాలన కేంద్రాలు లేదా మీ-సేవ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

1 hr ago
user_Bellamplly Ashok kumar
Bellamplly Ashok kumar
Local News Reporter Kotapally, Mancherial•
1 hr ago
77842607-8680-4abe-baa6-f29924b95b08

చేయూత పింఛన్లు.. దరఖాస్తుకు ఇవాళ ఒక్కరోజే ఛాన్స్....... తెలంగాణలో కొత్త చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈ గడువు SEP 15తో ముగియాల్సి ఉంది. అయితే వరుస సెలవులు రావడంతో దరఖాస్తు చేసేందుకు లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. దీంతో పలువురి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఒకరోజు గడువు పొడిగించింది. ఈ మేరకు సెప్టెంబర్ 16 సాయంత్రం 5:00 గంటల వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలిగింది. అర్హులైన వారు సమీపంలోని ప్రజాపాలన కేంద్రాలు లేదా మీ-సేవ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

More news from తెలంగాణ and nearby areas
  • సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై కరపత్రం విడుదల 50 ఏళ్ల అరుణోదయలో 50 ఏళ్ల విమలక్క ప్రస్థానం సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై ఆహ్వానం కరపత్రం విడుదల ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కోశాధికారి జి రాములు ఆధ్వర్యంలో ఈరోజు రాంనగర్ లో కరెక్ట్ కరపత్రాల విడుదల కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ... సెప్టెంబర్ 26న ప్రారంభ సభ విమలక్క ప్రస్థానం 50 గంటల పాటు ఏకధాటిగా పాట ఆట మాటలతో సాగే ఈ సభను విజయవంతం కొరకు కరపత్రాలు విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సభలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర చత్తీస్ గడ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ నుండి కళాకారులు తెలుగు రాష్ట్రంలోని డజన్ల కొద్ది కళారూపాలు వందలాది కళాకారుల దీనిలో భాగస్వామవుతున్నారు హైదరాబాద్ సుందరయ్య పార్క్ నుండి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు ఊరేగింపుగా వెళ్లి జెండా ఆవిష్కరణ నిర్వహించి ప్రారంభ సభలో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ లక్ష్మి ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు ఆచార్య కట్ట భగవంతు రెడ్డి ప్రొఫెసర్ వినయ్ బాబు పోతల రమేష్ ముఖ్య అతిధి హాజరై ఈ ప్రారంభ సభను పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర కార్యదర్శి పల్లె లింగన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు యాకుబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జనగాం చిన్నయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బతుకుల రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు పద్మ, ఏఐఎస్టియు పెద్దపెల్లి జిల్లా నాయకులు ఎం రామస్వామి, రామగుండం డివిజన్ అధ్యక్షుడు ఆర్ యాకయ్య, ఎండి మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.
    1
    సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై కరపత్రం విడుదల

50 ఏళ్ల అరుణోదయలో 50 ఏళ్ల విమలక్క ప్రస్థానం సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై ఆహ్వానం కరపత్రం విడుదల ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కోశాధికారి జి రాములు ఆధ్వర్యంలో ఈరోజు రాంనగర్ లో కరెక్ట్ కరపత్రాల విడుదల కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ... సెప్టెంబర్ 26న ప్రారంభ సభ విమలక్క ప్రస్థానం 50 గంటల పాటు ఏకధాటిగా పాట ఆట మాటలతో సాగే ఈ సభను విజయవంతం కొరకు కరపత్రాలు విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సభలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర చత్తీస్ గడ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ నుండి కళాకారులు తెలుగు రాష్ట్రంలోని డజన్ల కొద్ది కళారూపాలు వందలాది కళాకారుల దీనిలో భాగస్వామవుతున్నారు హైదరాబాద్ సుందరయ్య పార్క్ నుండి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు ఊరేగింపుగా వెళ్లి జెండా ఆవిష్కరణ నిర్వహించి  ప్రారంభ సభలో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ లక్ష్మి ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు ఆచార్య కట్ట భగవంతు రెడ్డి ప్రొఫెసర్ వినయ్ బాబు పోతల రమేష్ ముఖ్య అతిధి హాజరై ఈ ప్రారంభ సభను పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర కార్యదర్శి పల్లె లింగన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు యాకుబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జనగాం చిన్నయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బతుకుల రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు పద్మ, ఏఐఎస్టియు పెద్దపెల్లి జిల్లా నాయకులు ఎం రామస్వామి, రామగుండం డివిజన్ అధ్యక్షుడు ఆర్ యాకయ్య, ఎండి మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    13 hrs ago
  • చెన్నూరు: చెత్త సేకరణలో వివక్ష.. ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తుడు చెన్నూరు మండలం అంగరాజుపల్లిలో చెత్త సేకరణ విషయంలో వివక్ష చూపుతున్నారని గ్రామానికి చెందిన తిరుపతి ఆరోపించారు. జనరల్ వార్డు కాలనీలో మాత్రమే చెత్త బండి ద్వారా వ్యర్థాలను సేకరిస్తున్నారని, ఇతర వార్డులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. గ్రామంలోని అన్ని వార్డుల్లోనూ క్రమం తప్పకుండా చెత్త సేకరణ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
    1
    చెన్నూరు: చెత్త సేకరణలో వివక్ష.. ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తుడు
చెన్నూరు మండలం అంగరాజుపల్లిలో చెత్త సేకరణ విషయంలో వివక్ష చూపుతున్నారని గ్రామానికి చెందిన తిరుపతి ఆరోపించారు. జనరల్ వార్డు కాలనీలో మాత్రమే చెత్త బండి ద్వారా వ్యర్థాలను సేకరిస్తున్నారని, ఇతర వార్డులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. గ్రామంలోని అన్ని వార్డుల్లోనూ క్రమం తప్పకుండా చెత్త సేకరణ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • *బీసీలకు అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం** *కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నం – బీసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు* *బీసీల హక్కుల కోసం పోరాటం ఆపేది లేదు: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్* ఆసిఫాబాద్: బీసీ కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీ కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2025 మే 1న ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఓబీసీ కుటుంబాలను సమగ్రంగా లెక్కించి, ప్రత్యేక బీసీ కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ కాలమ్ కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీని బహిష్కరించడం బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు. పోలీసులు అడ్డుకున్నా బీసీల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ కులగణనను శాస్త్రీయంగా నిర్వహించే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని రూప్నార్ రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లోబడే లాహు కుమార్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు సాయి కృష్ణ నాయకులు, అసద్, జయరాజ్, వెంకన్న,ముబీన్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    *బీసీలకు అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం**
*కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నం – బీసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు*
*బీసీల హక్కుల కోసం పోరాటం ఆపేది లేదు: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్*
ఆసిఫాబాద్: బీసీ కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీ కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2025 మే 1న ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
ఓబీసీ కుటుంబాలను సమగ్రంగా లెక్కించి, ప్రత్యేక బీసీ కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ కాలమ్ కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీని బహిష్కరించడం బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు.
పోలీసులు అడ్డుకున్నా బీసీల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ కులగణనను శాస్త్రీయంగా నిర్వహించే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని రూప్నార్ రమేష్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లోబడే లాహు కుమార్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు సాయి కృష్ణ నాయకులు, అసద్, జయరాజ్, వెంకన్న,ముబీన్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    16 hrs ago
  • సెప్టెంబర్ 17న ములుగు నియోజకవర్గంలోని అన్ని గూడాలలో , తండాల్లో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించాలి. MLG:సెప్టెంబర్ 17న ములుగు నియోజకవర్గంలోని అన్ని గూడెలు, తండాల్లో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించాలని ములుగు నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా గిరిజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు.
    1
    సెప్టెంబర్ 17న ములుగు నియోజకవర్గంలోని అన్ని గూడాలలో , తండాల్లో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించాలి.
MLG:సెప్టెంబర్ 17న ములుగు నియోజకవర్గంలోని అన్ని గూడెలు, తండాల్లో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించాలని ములుగు నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా గిరిజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    59 min ago
  • టైగర్ లేకున్నా టైగర్ జోన్ అమలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అభయారణ్యంలో టైగర్ లేకుండా టైగర్ జోన్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం మండలానికి చెందిన బద్రి నాయక్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్నారు. జన్నారంలో అమలు చేస్తున్న ఎకో జోన్ తో ఇసుక రాక ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని వాపోయారు. అధికారులు స్పందిస్తూ ఎకో జోన్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.
    1
    టైగర్ లేకున్నా టైగర్ జోన్ అమలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు
అభయారణ్యంలో టైగర్ లేకుండా టైగర్ జోన్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం మండలానికి చెందిన బద్రి నాయక్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్నారు. జన్నారంలో అమలు చేస్తున్న ఎకో జోన్ తో ఇసుక రాక ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని వాపోయారు. అధికారులు స్పందిస్తూ ఎకో జోన్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పాడిపశులకు అడ్డాగా మారిన పల్లె ప్రకృతి వనం -------------------------------- యాంకర్: ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం పరిస్థితి దయనీయాంగామారింది. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బండారుపల్లి గ్రామంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలకు ఉపయోగపడాల్సిన పల్లె ప్రకృతి వనం పశువులకు అడ్డాగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈ పల్లె ప్రకృతి వనం నిర్వహణను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తూన్నారు. ఈ పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం పాడిపశువులకు మరియు మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు తెలిపారు
    2
    ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పాడిపశులకు అడ్డాగా మారిన పల్లె ప్రకృతి వనం 
--------------------------------
యాంకర్:
ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం పరిస్థితి దయనీయాంగామారింది. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బండారుపల్లి గ్రామంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలకు ఉపయోగపడాల్సిన పల్లె ప్రకృతి వనం పశువులకు అడ్డాగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈ పల్లె ప్రకృతి వనం నిర్వహణను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తూన్నారు. ఈ పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం పాడిపశువులకు మరియు మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు తెలిపారు
    user_Sai tej
    Sai tej
    Local News Reporter ములుగు, ములుగు, తెలంగాణ•
    19 hrs ago
  • కరీంనగర్‌లో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు మాట్లాడారు..... ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు “సేవా సంకల్ప్ అభియాన్” నిర్వహిస్తామని తెలిపారు. ఆశీర్వాద దీపం, రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు పోటీలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇక ఈనెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు పార్టీలు కుమ్మక్కై ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. అవినీతి అనే నాణేనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ బొమ్మా బొరుసుల్లా మారాయని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తామని.. తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, స్థానిక కార్పొరేటర్లలు
    3
    కరీంనగర్‌లో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు మాట్లాడారు.....
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు “సేవా సంకల్ప్ అభియాన్” నిర్వహిస్తామని తెలిపారు. ఆశీర్వాద దీపం, రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు పోటీలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఇక ఈనెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు పార్టీలు కుమ్మక్కై ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. అవినీతి అనే నాణేనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ బొమ్మా బొరుసుల్లా మారాయని మండిపడ్డారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తామని.. తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, స్థానిక కార్పొరేటర్లలు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    13 hrs ago
  • ఇంజనీర్లు పాత్ర కీలకం. ఇంజినీర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి రామగుండం పునర్నిర్మాణంలో ఇంజనీర్లు పోషిస్తున్న పాత్ర కీలకమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఇంజనీర్స్ డే పురస్కరించుకొని మంగళ వారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజినీర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది శక్తి కి మించి శ్రమిస్తూ అభివృద్దిలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారని ఆయన కొనియాడారు. ప్రస్తుత ఇంజినీర్లు చిత్త శుద్దితో సేవలందిస్తూ నాణ్యత లో ఏ మాత్రం రాజీ పడకుండా మన్నికగా సుదీర్ఘ కాలం నిలిచి ఉండేలా రోడ్లు , కాలువల నిర్మాణం చేపడుతున్నారని అభినందించారు. రామగుండం నగరాన్ని అధ్భుతoగా తీర్చి దిద్దాలనే స్థానిక ఎం ఎల్ ఎ లక్ష్యానికి అనుగుణంగా ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఇంజనీర్లు పని చేసి పాలవర్గానికి మంచి పేరు తీసుకు రావాలని ఆశిస్తున్నామని అన్నారు. అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతి స్వరూప్ , ఎ ఇ లు మీర్ , తేజస్విని , సౌమ్య , మనోజ్ , అన్వేష్ , నవీన్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు నవీన్ , అశోక్ , కళ్యాణ్ , శ్రావణ్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ సత్కారం అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి కజంపురం రాజేందర్ తో పాటు , నగర పాలక సంస్థ కార్పొరేటర్లు గట్ల రమేష్ , వడ్లూరి రవి , కొలని కవిత , బాలసాని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
    1
    ఇంజనీర్లు పాత్ర కీలకం. ఇంజినీర్లను లయన్స్ క్లబ్  ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి
రామగుండం పునర్నిర్మాణంలో  ఇంజనీర్లు పోషిస్తున్న పాత్ర కీలకమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఇంజనీర్స్ డే పురస్కరించుకొని మంగళ వారం  రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజినీర్లను లయన్స్ క్లబ్  ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది  శక్తి కి మించి శ్రమిస్తూ అభివృద్దిలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారని ఆయన కొనియాడారు. ప్రస్తుత ఇంజినీర్లు చిత్త శుద్దితో సేవలందిస్తూ నాణ్యత లో ఏ  మాత్రం రాజీ పడకుండా మన్నికగా సుదీర్ఘ కాలం నిలిచి ఉండేలా రోడ్లు , కాలువల నిర్మాణం చేపడుతున్నారని  అభినందించారు. రామగుండం నగరాన్ని అధ్భుతoగా తీర్చి దిద్దాలనే స్థానిక ఎం ఎల్ ఎ  లక్ష్యానికి అనుగుణంగా ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఇంజనీర్లు పని చేసి పాలవర్గానికి మంచి పేరు తీసుకు రావాలని ఆశిస్తున్నామని అన్నారు. అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతి స్వరూప్ , ఎ ఇ లు మీర్ , తేజస్విని , సౌమ్య , మనోజ్ , అన్వేష్ , నవీన్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు నవీన్ , అశోక్ , కళ్యాణ్ , శ్రావణ్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ సత్కారం అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి కజంపురం రాజేందర్ తో పాటు , నగర పాలక సంస్థ కార్పొరేటర్లు గట్ల రమేష్ , వడ్లూరి రవి , కొలని కవిత , బాలసాని తిరుపతి  తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.