logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరు మండలం, శేగిరెడ్డిపాడు, వెలగలేరు గ్రామాల పరిధిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై మాజీ మంత్రివర్యులు, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మరియు పార్టీ నాయకులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిషాకు ఫిర్యాదు చేశారు. అక్కడ జరుగుతున్న దోపిడీని 'కేజీఎఫ్ సినిమా' తరహాలో జరుగుతోందని పేర్కొంటూ, జోగి రమేష్ ఆధారాలతో సహా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

1 hr ago
user_దాసి ప్రతాప్
దాసి ప్రతాప్
ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరు మండలం, శేగిరెడ్డిపాడు, వెలగలేరు గ్రామాల పరిధిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై మాజీ మంత్రివర్యులు, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మరియు పార్టీ నాయకులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిషాకు ఫిర్యాదు చేశారు. అక్కడ జరుగుతున్న దోపిడీని 'కేజీఎఫ్ సినిమా' తరహాలో జరుగుతోందని పేర్కొంటూ, జోగి రమేష్ ఆధారాలతో సహా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం నూతన గూడెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బండి మునేశ్వర రావు ఇంట్లోని బావిలో పూడిక తీయడానికి వెళ్లిన ఇద్దరు కూలీలు ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటనలో గణేష్ నగర్‌కు చెందిన రాజుతో పాటు పైడిపాక పునరావాస కాలనీకి చెందిన బండి వీర వెంకటరావు అలియాస్ చిట్టిబాబు ప్రాణాలు కోల్పోయారు. తొలుత చిట్టిబాబు బావిలోకి దిగి ఊపిరాడటం లేదని కేకలు వేయగా, అతడిని రక్షించేందుకు వీర వెంకటరావు కూడా బావిలోకి దిగాడు. ఇద్దరూ లోపల చిక్కుకుని కేకలు వేయడంతో స్థానికులు తాడు సాయంతో వారిని పైకి లాగేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సమాచారం అందిన వెంటనే పోలవరం సీఐ కృష్ణకుమార్, ఎస్సై అప్పారావు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
    1
    ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం నూతన గూడెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బండి మునేశ్వర రావు ఇంట్లోని బావిలో పూడిక తీయడానికి వెళ్లిన ఇద్దరు కూలీలు ఊపిరాడక మృతి చెందారు.

ఈ ఘటనలో గణేష్ నగర్‌కు చెందిన రాజుతో పాటు పైడిపాక పునరావాస కాలనీకి చెందిన బండి వీర వెంకటరావు అలియాస్ చిట్టిబాబు ప్రాణాలు కోల్పోయారు. తొలుత చిట్టిబాబు బావిలోకి దిగి ఊపిరాడటం లేదని కేకలు వేయగా, అతడిని రక్షించేందుకు వీర వెంకటరావు కూడా బావిలోకి దిగాడు. ఇద్దరూ లోపల చిక్కుకుని కేకలు వేయడంతో స్థానికులు తాడు సాయంతో వారిని పైకి లాగేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది.

సమాచారం అందిన వెంటనే పోలవరం సీఐ కృష్ణకుమార్, ఎస్సై అప్పారావు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    40 min ago
  • మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరు మండలం, శేగిరెడ్డిపాడు, వెలగలేరు గ్రామాల పరిధిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై మాజీ మంత్రివర్యులు, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మరియు పార్టీ నాయకులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిషాకు ఫిర్యాదు చేశారు. అక్కడ జరుగుతున్న దోపిడీని 'కేజీఎఫ్ సినిమా' తరహాలో జరుగుతోందని పేర్కొంటూ, జోగి రమేష్ ఆధారాలతో సహా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
    1
    మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరు మండలం, శేగిరెడ్డిపాడు, వెలగలేరు గ్రామాల పరిధిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై మాజీ మంత్రివర్యులు, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మరియు పార్టీ నాయకులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిషాకు ఫిర్యాదు చేశారు. అక్కడ జరుగుతున్న దోపిడీని 'కేజీఎఫ్ సినిమా' తరహాలో జరుగుతోందని పేర్కొంటూ, జోగి రమేష్ ఆధారాలతో సహా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
    user_దాసి ప్రతాప్
    దాసి ప్రతాప్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గుంటూరు నగరంలోని బ్రాడీపేట 2/7లో ఉన్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఆదివారం, 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆవాజ్ కమిటీ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో 'ఎస్ఐఆర్ (SIR) అవగాహన సదస్సు' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ చిస్తి అధ్యక్షత వహించగా, ఇప్పటివరకు భారతదేశంలో ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునేవారని, అయితే ఈసారి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వాలే ప్రజలను ఎన్నుకునే ప్రక్రియ జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ, దేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక పథకం ప్రకారం, కుట్రపూరితంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఓటు ఉన్న భారతదేశం, ఓటు లేని భారతదేశం అంటూ దేశాన్ని రెండు రకాలుగా విభజించే ప్రయత్నం జరుగుతోందని, ముఖ్యంగా మైనారిటీలు, దళితులు, ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని సెక్యులర్ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఓటర్లందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన గట్టిగా సూచించారు. మరొక అతిథి, బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ చైర్మన్ ఎం కే ఎస్ మొహియుద్దీన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓటు నమోదు చేసుకునే ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో మేల్కో ఆంధ్రప్రదేశ్ నాయకులు రమేష్ పట్నాయక్, ముస్లిం సమైక్యవేదిక నాయకులు హాజీ అబ్దుల్ కలాం, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నీలాంబరం, ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఏ సుభాన్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి సలీం, కిద్మత్ బ్యాంక్ నిర్వాహకులు బషీర్, గుంటూరు జిల్లా కార్యదర్శి ఎస్ కే భాష తదితరులు పాల్గొన్నారు.
    1
    గుంటూరు నగరంలోని బ్రాడీపేట 2/7లో ఉన్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఆదివారం, 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆవాజ్ కమిటీ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో 'ఎస్ఐఆర్ (SIR) అవగాహన సదస్సు' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ చిస్తి అధ్యక్షత వహించగా, ఇప్పటివరకు భారతదేశంలో ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునేవారని, అయితే ఈసారి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వాలే ప్రజలను ఎన్నుకునే ప్రక్రియ జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ, దేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక పథకం ప్రకారం, కుట్రపూరితంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఓటు ఉన్న భారతదేశం, ఓటు లేని భారతదేశం అంటూ దేశాన్ని రెండు రకాలుగా విభజించే ప్రయత్నం జరుగుతోందని, ముఖ్యంగా మైనారిటీలు, దళితులు, ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని సెక్యులర్ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఓటర్లందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన గట్టిగా సూచించారు.

మరొక అతిథి, బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ చైర్మన్ ఎం కే ఎస్ మొహియుద్దీన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓటు నమోదు చేసుకునే ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో మేల్కో ఆంధ్రప్రదేశ్ నాయకులు రమేష్ పట్నాయక్, ముస్లిం సమైక్యవేదిక నాయకులు హాజీ అబ్దుల్ కలాం, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నీలాంబరం, ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఏ సుభాన్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి సలీం, కిద్మత్ బ్యాంక్ నిర్వాహకులు బషీర్, గుంటూరు జిల్లా కార్యదర్శి ఎస్ కే భాష తదితరులు పాల్గొన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    8 hrs ago
  • ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య జగ్గయ్యపేట మండలంలోని గరుడాచలంలో, అలాగే రెడ్డి నాయక్ తండాలో జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. గరుడాచలంలోని శ్రీ వీర నరసింహ స్వామి వారి పుణ్యక్షేత్రానికి DMF నిధుల ద్వారా రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఘాట్ రోడ్డు పనులు ఇందులో భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా, రెడ్డి నాయక్ తండాలో రూ.90 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రహదారి ప్రతిపాదిత మార్గాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఈ అభివృద్ధి పనుల పరిశీలనలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యతో పాటు పంచాయతీ రాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ మరియు స్థానిక నాయకులు ఉన్నారు. వీరందరితో కలిసి ఆయన జరుగుతున్న పనులను సమీక్షించారు.
    1
    ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య జగ్గయ్యపేట మండలంలోని గరుడాచలంలో, అలాగే రెడ్డి నాయక్ తండాలో జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. గరుడాచలంలోని శ్రీ వీర నరసింహ స్వామి వారి పుణ్యక్షేత్రానికి DMF నిధుల ద్వారా రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఘాట్ రోడ్డు పనులు ఇందులో భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా, రెడ్డి నాయక్ తండాలో రూ.90 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రహదారి ప్రతిపాదిత మార్గాన్ని కూడా ఆయన పరిశీలించారు.

ఈ అభివృద్ధి పనుల పరిశీలనలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యతో పాటు పంచాయతీ రాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ మరియు స్థానిక నాయకులు ఉన్నారు. వీరందరితో కలిసి ఆయన జరుగుతున్న పనులను సమీక్షించారు.
    user_Kakaraparthi ramesh
    Kakaraparthi ramesh
    జగ్గయ్యపేట, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • చింతకాని మండలంలోని మత్కేపల్లి – జగన్నాధపురం ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 30న నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభకు అధికారికంగా 'రైతు ఆశీర్వాద సభ'గా నామకరణం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ సభ వేదికగా రైతు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, ఈ సభ ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
    1
    చింతకాని మండలంలోని మత్కేపల్లి – జగన్నాధపురం ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 30న నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభకు అధికారికంగా 'రైతు ఆశీర్వాద సభ'గా నామకరణం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ సభ వేదికగా రైతు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, ఈ సభ ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • రేపల్లె 8వ వార్డుకు చెందిన రెల్లి కులస్తులు, రేపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు, అధిక వడ్డీల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న సయ్యద్ భాషా, అతని భార్య మీరాభి, వారి కుమారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రకారం, రేపల్లె మున్సిపాలిటీలో పర్మినెంట్ మరియు కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న 14 మంది కార్మికులు సయ్యద్ భాషా వద్ద అప్పులు తీసుకున్నారు. భాషా ఈ అప్పులకు ₹10 నుండి ₹20 వరకు అధిక వడ్డీలను వసూలు చేస్తున్నాడని, అంతేకాకుండా ఈ వడ్డీలు తీసుకున్నప్పటికీ, వారి వద్ద తీసుకున్న ఖాళీ నోట్లను ఉపయోగించి లక్షలాది రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ తమను వేధిస్తున్న భాషా కుటుంబం నుండి రక్షించాలని కోరిన ఫిర్యాదుదారులు, అధిక వడ్డీలు వసూలు చేసే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌ను అభ్యర్థించారు.
    1
    రేపల్లె 8వ వార్డుకు చెందిన రెల్లి కులస్తులు, రేపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు, అధిక వడ్డీల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న సయ్యద్ భాషా, అతని భార్య మీరాభి, వారి కుమారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ప్రకారం, రేపల్లె మున్సిపాలిటీలో పర్మినెంట్ మరియు కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న 14 మంది కార్మికులు సయ్యద్ భాషా వద్ద అప్పులు తీసుకున్నారు. భాషా ఈ అప్పులకు ₹10 నుండి ₹20 వరకు అధిక వడ్డీలను వసూలు చేస్తున్నాడని, అంతేకాకుండా ఈ వడ్డీలు తీసుకున్నప్పటికీ, వారి వద్ద తీసుకున్న ఖాళీ నోట్లను ఉపయోగించి లక్షలాది రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.

అధిక వడ్డీలు వసూలు చేస్తూ తమను వేధిస్తున్న భాషా కుటుంబం నుండి రక్షించాలని కోరిన ఫిర్యాదుదారులు, అధిక వడ్డీలు వసూలు చేసే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌ను అభ్యర్థించారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    6 hrs ago
  • ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో, తాసిల్దార్ మరియు ఎమ్మార్వో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో SIR ప్రోగ్రాంపై ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వార్డు నెంబర్లు, సర్పంచులు, మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. BLO (బూత్ లెవల్ ఆఫీసర్లు) మరియు BLA (బూత్ లెవల్ ఏజెంట్లు)లకు SIR కార్యక్రమంపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం.
    4
    ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో, తాసిల్దార్ మరియు ఎమ్మార్వో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో SIR ప్రోగ్రాంపై ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వార్డు నెంబర్లు, సర్పంచులు, మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. BLO (బూత్ లెవల్ ఆఫీసర్లు) మరియు BLA (బూత్ లెవల్ ఏజెంట్లు)లకు SIR కార్యక్రమంపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • ఆదివారం జగ్గయ్యపేట పట్టణంలోని మఠం బజారులో ఓ ఇంటి వరండాలో కేటరింగ్ కోసం వంటలు సిద్ధం చేస్తుండగా పెను గ్యాస్ ప్రమాదం తృటిలో తప్పింది. ఒక్కసారిగా గ్యాస్ లీకై పొగలు కమ్ముకుని, మంటలు వేగంగా వ్యాపించాయి. భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే అప్రమత్తమై గ్యాస్ బండపై నీళ్లు పోసి, దానిని వంట సామాగ్రి నుంచి వేరు చేయడంతో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఇంట్లోని వాషింగ్ మిషన్ పూర్తిగా దగ్దమైంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫైర్ స్టేషన్ అధికారి కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ, వంట కోసం టెంట్ హౌస్ నుంచి తీసుకువచ్చిన నాణ్యత లేని లోకల్ మేడ్ రెగ్యులేటర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. చాలామంది వంట వేగంగా అవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువ గ్యాస్ వస్తుందని భావించి ఇలాంటి లోకల్ మేడ్ రెగ్యులేటర్లను వాడుతున్నారని ఆయన తెలిపారు. వెంటనే ఆ టెంట్ హౌస్‌లో ఉన్న రెగ్యులేటర్లను సీజ్ చేశారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు మూడు, నాలుగు చోట్ల చోటుచేసుకున్నాయని శ్రీనివాసరావు వివరించారు. కేటరింగ్ నిర్వాహకులు, ప్రజలు టెంట్ హౌస్‌ల నుంచి పొయ్యిలు అద్దెకు తీసుకున్నప్పుడు రెగ్యులేటర్లను సరిగా పరిశీలించకుండా వాడకూడదని ఆయన సూచించారు. గ్యాస్ కంపెనీలు అధికారికంగా సరఫరా చేసే నాణ్యమైన ఐఎస్‌ఐ ముద్ర కలిగిన రెగ్యులేటర్లను మాత్రమే ఉపయోగించాలని, నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు.
    2
    ఆదివారం జగ్గయ్యపేట పట్టణంలోని మఠం బజారులో ఓ ఇంటి వరండాలో కేటరింగ్ కోసం వంటలు సిద్ధం చేస్తుండగా పెను గ్యాస్ ప్రమాదం తృటిలో తప్పింది. ఒక్కసారిగా గ్యాస్ లీకై పొగలు కమ్ముకుని, మంటలు వేగంగా వ్యాపించాయి. భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే అప్రమత్తమై గ్యాస్ బండపై నీళ్లు పోసి, దానిని వంట సామాగ్రి నుంచి వేరు చేయడంతో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఇంట్లోని వాషింగ్ మిషన్ పూర్తిగా దగ్దమైంది.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫైర్ స్టేషన్ అధికారి కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ, వంట కోసం టెంట్ హౌస్ నుంచి తీసుకువచ్చిన నాణ్యత లేని లోకల్ మేడ్ రెగ్యులేటర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. చాలామంది వంట వేగంగా అవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువ గ్యాస్ వస్తుందని భావించి ఇలాంటి లోకల్ మేడ్ రెగ్యులేటర్లను వాడుతున్నారని ఆయన తెలిపారు. వెంటనే ఆ టెంట్ హౌస్‌లో ఉన్న రెగ్యులేటర్లను సీజ్ చేశారు.

ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు మూడు, నాలుగు చోట్ల చోటుచేసుకున్నాయని శ్రీనివాసరావు వివరించారు. కేటరింగ్ నిర్వాహకులు, ప్రజలు టెంట్ హౌస్‌ల నుంచి పొయ్యిలు అద్దెకు తీసుకున్నప్పుడు రెగ్యులేటర్లను సరిగా పరిశీలించకుండా వాడకూడదని ఆయన సూచించారు. గ్యాస్ కంపెనీలు అధికారికంగా సరఫరా చేసే నాణ్యమైన ఐఎస్‌ఐ ముద్ర కలిగిన రెగ్యులేటర్లను మాత్రమే ఉపయోగించాలని, నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు.
    user_Kakaraparthi ramesh
    Kakaraparthi ramesh
    జగ్గయ్యపేట, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.