రుణమాఫీ అడిగితే అక్రమ కేసులా? కాంగ్రెస్ ప్రభుత్వంపై వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజం రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేసినందుకు రైతులు, బి.ఆర్.ఎస్. నాయకులపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆర్మూర్ కోర్టులో కేసు విచారణకు హాజరైన కమ్మర్‌పల్లి మండల బి.ఆర్.ఎస్. నాయకులు, రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం 52,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా ప్రభుత్వం కేవలం 22,000 మందికి మాత్రమే వర్తింపజేసిందని విమర్శించారు. మిగిలిన 30,000 మంది రైతుల పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని అడిగినందుకు కమ్మర్‌పల్లి బి.ఆర్.ఎస్. నాయకులు, రైతులపై అక్రమ కేసులు పెట్టి గత రెండేళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని వేముల గుర్తుచేశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరిన వారిని ఇబ్బందులకు గురిచేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని, అప్రజాస్వామిక విధానాలను సూచిస్తోందని విమర్శించారు. న్యాయం కోసం పోరాడుతున్న రైతులకు బి.ఆర్.ఎస్. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు బి.ఆర్.ఎస్. నాయకులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఎలాంటి కొర్రీలు లేకుండా అర్హులైన రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలి. రైతులను వేధించే ధోరణిని ప్రభుత్వం మానుకోవాలి. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
రుణమాఫీ అడిగితే అక్రమ కేసులా? కాంగ్రెస్ ప్రభుత్వంపై వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజం రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేసినందుకు రైతులు, బి.ఆర్.ఎస్. నాయకులపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆర్మూర్ కోర్టులో కేసు విచారణకు హాజరైన కమ్మర్‌పల్లి మండల బి.ఆర్.ఎస్. నాయకులు, రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం 52,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా ప్రభుత్వం కేవలం 22,000 మందికి మాత్రమే వర్తింపజేసిందని విమర్శించారు. మిగిలిన 30,000 మంది రైతుల పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని అడిగినందుకు కమ్మర్‌పల్లి బి.ఆర్.ఎస్. నాయకులు, రైతులపై అక్రమ కేసులు పెట్టి గత రెండేళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని వేముల గుర్తుచేశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరిన వారిని ఇబ్బందులకు గురిచేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని, అప్రజాస్వామిక విధానాలను సూచిస్తోందని విమర్శించారు. న్యాయం కోసం పోరాడుతున్న రైతులకు బి.ఆర్.ఎస్. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు బి.ఆర్.ఎస్. నాయకులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఎలాంటి కొర్రీలు లేకుండా అర్హులైన రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలి. రైతులను వేధించే ధోరణిని ప్రభుత్వం మానుకోవాలి. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
- *ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు త్వరితగతిన అట్టి వ్యక్తిని కాపాడడానికి సిపిఆర్ ఎంతో ఉపయోగపడుతుంది పోలీస్ కమిషనర్ వెల్లడి* *జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ* *ప్రతి ఒక్కరూ సిపిఆర్ పద్ధతి అవగాహన కలిగి ఉండవలెను* రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న *99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో* భాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం ప్రజలలో ట్రాఫిక్ నియమాలు పట్ల బాధ్యత భావం పెంపొందించడం లక్ష్యంగా అరైవ్ ఆలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు . ఇందులో భాగముగా నేడు ఐదవ రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు బ్లూ కోర్టు సిబ్బందికి మరియు ఆటో డ్రైవర్లకు సిపిఆర్ పద్ధతి పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్*., గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ప్రాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పోలీస్ కమిషనర్ గారు పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు వంటి ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన వర్గాలు తప్పనిసరిగా CPR (Cardiopulmonary Resuscitation) విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సిపిఆర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అయితే సమాజంలో ఇంకా చాలామందికి ఈ పద్ధతి పై సరైన అవగాహన లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ గారు తెలిపారు. ఈ శిక్షణలో సిపిఆర్ విధానం , ప్రాథమిక ప్రథమ చికిత్స (First Aid), అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి అంశాలను నిపుణుల ద్వారా వివరించనున్నారు. ప్రతి పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమయానికి సరైన సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని, అందుకు సిపిఆర్ వంటి నైపుణ్యాలు ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ గారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) శ్రీ జి.బస్వా రెడ్డి , నిజామాబాద్ ట్రాఫిక్ ఏ.సీ.పి శ్రీ మస్తాన్ అలీ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , ట్రాఫిక్ సి ఐ శ్రీ ప్రసాద్ , ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ వినోద్ , డాక్టర్ శ్రీ విశాల్ (ఐ.ఎమ్.ఏ ప్రెసిడెంట్ ) , డాక్టర్ రామనేశ్వర్ ( న్యూరాలజిస్ట్ , ( ఐ.ఎమ్.ఏ ట్రెజరీ ), డాక్టర్ శ్రీశైలం (పీడియాట్రెస్ట్) , డాక్టర్ విట్టల్ ఆనస్తేషియా స్పెషలిస్ట్, మరియు ఐటీ కోర్స్ సిబ్బంది, బ్లూ కోర్ట్ సిబ్బంది , ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.3
- Post by Boke saikumar Boke saikumar1
- జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం తాటిపల్లిలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల కు చెందిన సీనియర్ కంటి వైద్యులు డా. ముదస్సర్ తన సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంవిఐ లు అభిలాష్, ప్రమీల, షేక్ రియాజ్, రామారావు, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కంటి పరీక్షల అనంతరం, డా. ముదస్సర్ ప్రస్తుత ఎండాకాలంలో వాహన డ్రైవర్లతో పాటుగా చిన్నపిల్లలు, వృద్దులు కంటి జాగ్రతల కోసం టీబీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.1
- పత్రిక ప్రకటన తేది :16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.1
- Post by Vishwamber Rao1
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ప్రక్రియ నేతకాని సామాజిక వర్గంలో పెను మంటలు రేపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధాన శక్తిగా ఉన్న నేతకానీలను జనాభా లెక్కల్లో విస్మరించడంపై ఆ సామాజిక వర్గ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వివక్షను నిరసిస్తూ నేతకాని విద్యార్థి సంఘం (TNMVS OUJAC) రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత ప్రభుత్వానికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. "మా ఉనికిని తుడిచేస్తారా?" - ఆగ్రహం వ్యక్తం చేసిన సాయిని ప్రసాద్ కులగణన నివేదికల్లో నేతకాని కులానికి కనీస గుర్తింపు ఇవ్వకపోవడంపై ఓయూ వేదికగా జరిగిన సమావేశంలో సాయిని ప్రసాద్ నేత మాట్లాడారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు కుట్ర పూరిత వివక్ష: "తెలంగాణ గడ్డపై 12 లక్షల జనాభా కలిగిన మా సమాజాన్ని లెక్కల్లో చూపకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, నేతకానీల గొంతు నొక్కే ప్రయత్నం." 40 నియోజకవర్గాల్లో పంజా: రాష్ట్రవ్యాప్తంగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతకాని ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారని, తమను తక్కువ అంచనా వేస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. తొత్తుల పాలన: ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే కొమ్ముకాస్తూ, అత్యంత వెనుకబడిన నేతకానీలను విస్మరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కార్యాచరణ సిద్ధం ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు నేతకాని బిడ్డలంతా ఏకతాటిపైకి వచ్చి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.1
- రోడ్డు నియమాలను అందరూ పాటించాలని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ సూచించారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అలైవ్ అరైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ అప్పాల జలపతి, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ ఉన్నారు.1
- కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ....ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోrdo nv గిరి, drdo సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, dmho రవీందర్, తహసీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.1