యూరియా యాప్ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి సూర్యాపేట: అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం ఎల్లతీస్తున్నారని, ఆరోపణలు కాకుండా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జివివి గార్డెన్ లో జరిగిన సిపిఐ (ఎం )సూర్యాపేట జిల్లా విస్తృత సాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంలో రెండు ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా 32వేల ఓట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. ఇంకా 42 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. 4, ఎకరాలు భూ సేకరణ, కాలువల నిర్మాణం, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. బీసీలకు42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల విషయంలో వివక్షత లేకుండా అర్హులైన వారందరికీ అక్రిడిషన్స్ కార్డులు ఇవ్వాలన్నారు. ఏ ఒక్క జర్నలిస్టుకు నష్టం కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులైన పేదలందరికీ ఇవ్వాలన్నారు. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ కూడా అమలు కాలేదు అన్నారు. పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబి జీరాంజి పేరు పెట్టడం మహాత్ముని అవమానించడమేనని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టానికి 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా బిల్లులో మార్పు తీసుకురాటం మూలంగా60 శాతం కేంద్ర ప్రభుత్వం,40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పడం అర్థం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపైన భారం కలిగించే ఈ చర్యలను వెంటనే వెనుక తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి హామీ ద్వారా ఉపాధి పొందుతున్నారని, వారి నోటిలో మట్టి కొట్టి విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడడం సమంజసం కాదన్నారు. యూరియా బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పడం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యాప్ డౌన్లోడ్ కాక పోవడంతో రైతులు యూరియాను బుక్ చేసుకోలేక పోతున్నారని అన్నారు. అనేకమంది గిరిజనులు, నిరక్షరాశులయిన రైతులు యాప్ ద్వారా యూరియా పొందటం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం తక్షణమే పాత పద్ధతిలో యూరియాను అందించాలని కోరారు. ఇప్పటికే గ్రామాలలో యూరియా కొరత ఉందని, ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి కావాల్సిన యూరియాను అందుబాటులో ఉంచాలన్నారు. *ప్రశ్నించే గొంతు నొక్కుతున్న కేంద్ర ప్రభుత్వం....* *సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి* కేంద్రంలో మూడవసారి అధికారంలోకొచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతూ అప్రజా స్వామీక పరిపాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేస్తున్న మతోన్మాద చర్యలను ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు, ఎన్కౌంటర్ల ద్వారా అణిచివేస్తుందన్నారు. ఇటీవల సామాజిక కార్యకర్త అనాధాశ్రమం నిర్వాహకులు మాజీ మావోయిస్టు గాదే ఇన్నయ్యను ఎన్ ఐ ఏ అధికారులు అక్రమం పద్ధతిలో అరెస్టు చేశారని ఈ అరెస్టును తీవ్రంగాఖండిస్తున్నామన్నారు. సామాజిక సమస్యలపై స్పందించే వ్యక్తులను అరెస్టు చేయడం, బావ వక్రీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. ప్రజాస్వామిక వాదులందరూ ఈ అరెస్టును ఖండించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు మద్యం, డబ్బు విచ్చలవిడిగా కుమ్మరించి గెలిచాయన్నారు. ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన ప్రజలు సిపిఐ (ఎం) కు అత్యధికంగా ఓట్లేసి గెలిపించారని వారికి సిపిఐ (ఎం )పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభానికి ముందు ప్రారంభ సూచికంగా సిపిఐ (ఎం )పతాకాన్ని సిపిఐ (ఎం) సీనియర్ నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఘనంగా సన్మానించారు. సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో సిపిఐ (ఎం )రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, పారేపల్లి శేఖర్ రావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, వివిధ మండలాల కార్యదర్శిలు, ప్రజా సంఘాల జిల్లా నాయకులుతదితరులు పాల్గొన్నారు.

- సిద్దిపేట జిల్లాలో వ్యవసాయదారులు జాగ్రత్త గా ఉండాలి1
- Post by మేకల మాల్యాద్రి1
- Post by Ravi Poreddy1
- ముక్కోటి ఏకాదశి రామాలయం సిద్ధం జన్నారంలోని రాంనగర్ లో ఉన్న రామాలయం ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోంది. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని రాంనగర్ రామాలయాన్ని సోమవారం రాత్రి దేవాలయ కమిటీ చైర్మన్ మిక్కిలినేని రాజశేఖర్ ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సభ్యులు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. దేవాలయంలో తోరణాలు, బంతిపూల దండలు కడుతున్నారు. ధ్వజస్తంభాన్ని బల్బులతో అలంకరించారు. మంగళవారం దేవాలయంలో భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించనున్నారు.1
- 16 గ్రామాలను ఆదోని మండలంలోని ఉంచాలని పెద్ద హరివాణం మండలం వద్దు ఆదోని ముద్దు రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న చిన్న హరివాణం గోపాల్ రెడ్డి ఆయన ఆమరణ నిరాహార దీక్ష 48 గంటల దాటి ఆరోగ్యం క్షీణించడంతో 16 గ్రామాల ప్రజలు దీక్షా శిబిరం దగ్గర ఆందోళనలు రేపు 16 గ్రాములు సంపూర్ణ బందుకు పిలుపునిచ్చిన 16 గ్రామాల ప్రజలు1
- శివకోట మందిరం ఐదో వార్షికోత్సవం1
- యాంకర్ : చైనా మాంజ పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని దానం అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరైన చైనా మాంజను విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఏ షాపులో అయిన చైనా మాంజ అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే , విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని... వారికి తన నుండి 5 వేల నగదు బహుమతిగా ఇస్తానని దానం నాగేందర్ ప్రకటించారు.1
- ప్లాస్టిక్ లేని సమాజాన్ని నిర్మిద్దాం1
- ఐదవ వార్షికోత్సవం1