logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గుర్తు తెలియని వ్యక్తుల దుశ్చర్య… మంటల్లో దగ్ధమైన అడవి ప్రాంతం మంగళపర్తి అడవిలో భారీ అగ్ని ప్రమాదం… వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ సమీపంలోని అడవిలో గుర్తు తెలియని దుండగులు నిప్పంటించిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. మంటలు వేగంగా వ్యాపించి అడవిలోని చెట్లు, పొదలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకరావాలి అధికారులు కోరుతున్నారు.

on 14 March
user_ASHOK VENGANI
ASHOK VENGANI
Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
on 14 March

గుర్తు తెలియని వ్యక్తుల దుశ్చర్య… మంటల్లో దగ్ధమైన అడవి ప్రాంతం మంగళపర్తి అడవిలో భారీ అగ్ని ప్రమాదం… వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ సమీపంలోని అడవిలో గుర్తు తెలియని దుండగులు నిప్పంటించిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. మంటలు వేగంగా వ్యాపించి అడవిలోని చెట్లు, పొదలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకరావాలి అధికారులు కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం (14-04-2026) ఉదయం 9:30 గంటలకు పులిహోర పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమానికి ఈ వారం దాతలుగా శ్రీమతి & శ్రీ మురికి శ్వేత విజయ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ రామదూత పూజ జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది.ఈ సందర్భంగా భక్తులకు పులిహోరను పంపిణీ చేసి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, మల్యాల భైరయ్య, నేతి శ్రీనివాస్, దూబకుంట లచ్చల్, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, నోముల సంతోష్, పోగుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం భక్తి, సేవా భావం కలగలిపిన మంచి ఉదాహరణగా నిలిచింది.
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం (14-04-2026) ఉదయం 9:30 గంటలకు పులిహోర పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమానికి ఈ వారం దాతలుగా శ్రీమతి & శ్రీ మురికి శ్వేత విజయ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ రామదూత పూజ జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది.ఈ సందర్భంగా భక్తులకు పులిహోరను పంపిణీ చేసి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, మల్యాల భైరయ్య, నేతి శ్రీనివాస్, దూబకుంట లచ్చల్, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, నోముల సంతోష్, పోగుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం భక్తి, సేవా భావం కలగలిపిన మంచి ఉదాహరణగా నిలిచింది.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
  • కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డీ లిమిటేషన్‌ను అడ్డుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కందిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌ను ఎలా అడ్డుకుంటారో సీఎం చెప్పాలని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మోదీని విమర్శించి ఎక్కడున్నారో అందరికీ తెలుసని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్‌లో అదే పరిస్థితి పడుతుందని పేర్కొన్నారు.
    1
    కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డీ లిమిటేషన్‌ను అడ్డుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కందిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌ను ఎలా అడ్డుకుంటారో సీఎం చెప్పాలని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మోదీని విమర్శించి ఎక్కడున్నారో అందరికీ తెలుసని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్‌లో అదే పరిస్థితి పడుతుందని పేర్కొన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు: TGIIC చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి
    1
    చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు: TGIIC చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం. మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మ దేవేందర్ రెడ్డి..మెదక్‌ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం అపారమని కొనియాడారు. దేశ స్వపరిపాలనకు ఆదర్శంగా నిలిచేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దూరదృష్టి గల నాయకుడని తెలిపారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతో పాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.అంబేద్కర్ ఆశయాలతో నవ సమాజ నిర్మాణానికి కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి.కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు,న్యాయవాది జీవన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్,సంధ్య నవీన్, ఉదయ్ కుమార్,గౌస్,సోహెల్, జుబేర్ అహ్మద్, మహిళా నాయకురాలు అంకం.చంద్రకళ రాధ,నాయకులు, కిష్ట గౌడ్, అంజ గౌడ్, కిష్టయ్య, విశ్వం,లింగా రెడ్డి, ప్రభు రెడ్డి,కిషన్, మాయ. మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, ఏనుగుల రాజు, సునీల్,రవి లక్ష్మీనారాయణ,దశరథం,ఇందాడ్,సంతోష్ ,వెంకట్,ఆంజనేయులు,ప్రభాకర్ ,లక్ష్మణ్,కిషన్,మోహన్,ఇస్మాయిల్, రవి తదితరులు పాల్గొన్నారు.
    1
    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.
మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మ దేవేందర్ రెడ్డి..మెదక్‌ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు..
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం అపారమని కొనియాడారు. దేశ స్వపరిపాలనకు ఆదర్శంగా నిలిచేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దూరదృష్టి గల నాయకుడని తెలిపారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతో పాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
భవిష్యత్తులో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.అంబేద్కర్ ఆశయాలతో నవ సమాజ నిర్మాణానికి కృషి కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి.కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు,న్యాయవాది జీవన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు  దీపక్ కుమార్,సంధ్య నవీన్, ఉదయ్ కుమార్,గౌస్,సోహెల్, జుబేర్ అహ్మద్, మహిళా నాయకురాలు అంకం.చంద్రకళ రాధ,నాయకులు, కిష్ట గౌడ్, అంజ గౌడ్, కిష్టయ్య, విశ్వం,లింగా రెడ్డి, ప్రభు రెడ్డి,కిషన్, మాయ. మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, ఏనుగుల రాజు, సునీల్,రవి లక్ష్మీనారాయణ,దశరథం,ఇందాడ్,సంతోష్ ,వెంకట్,ఆంజనేయులు,ప్రభాకర్ ,లక్ష్మణ్,కిషన్,మోహన్,ఇస్మాయిల్, రవి తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    1 day ago
  • ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన పరిపాలన భవనానికి అంబేద్కర్ ఫూలే పేరుపెట్టాలని, అదేవిధంగా వారి పేరు మీద ఫెలోషిప్లను కూడా అందజేయాలని ఓయూ జేఏసీ చైర్మన్, పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిబిఎస్ఏ అధ్యక్షులు నలగంటి శరత్, బహుజన విద్యార్థి సంఘాల అధ్యక్షులు వేల్పుల సంజయ్, టిఎస్ఎఫ్ అధ్యక్షులు జంపాల రాజేష్ పాల్గొని ఈ మేరకు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం నిర్మించబోయే జగ్జీవన్ రామ్, అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ ను విద్యార్థులుగా స్వాగతిస్తున్నామని, ఈ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించడానికి పూనుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. పొలిటికల్ జేఏసీ నరసింహ, డిబిఎస్ఏ నాయకులు జంగిలి దర్శన్, మధు, ఓయూ జెఏసి మరియు ఎన్టీవీఎస్ ప్రెసిడెంట్ చరణ్, ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి దరువు రమేష్, ఓయూ జేఏసీ నాయకులు రాజేందర్, ప్రవీణ్,సంజీవ్, అరుణ్,కరుణాకర్, ఉదయ్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    5
    ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా  నిర్మించిన పరిపాలన భవనానికి అంబేద్కర్ ఫూలే పేరుపెట్టాలని, అదేవిధంగా వారి పేరు మీద ఫెలోషిప్లను కూడా అందజేయాలని ఓయూ జేఏసీ చైర్మన్, పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిబిఎస్ఏ అధ్యక్షులు నలగంటి శరత్, బహుజన విద్యార్థి సంఘాల అధ్యక్షులు వేల్పుల  సంజయ్, టిఎస్ఎఫ్ అధ్యక్షులు జంపాల రాజేష్ పాల్గొని ఈ మేరకు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం నిర్మించబోయే జగ్జీవన్ రామ్, అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ ను విద్యార్థులుగా స్వాగతిస్తున్నామని, ఈ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించడానికి పూనుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. పొలిటికల్ జేఏసీ నరసింహ, డిబిఎస్ఏ నాయకులు జంగిలి దర్శన్, మధు, ఓయూ జెఏసి  మరియు ఎన్టీవీఎస్  ప్రెసిడెంట్ చరణ్, ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి దరువు రమేష్, ఓయూ జేఏసీ నాయకులు రాజేందర్, ప్రవీణ్,సంజీవ్, అరుణ్,కరుణాకర్, ఉదయ్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది :14.04.2026
కామారెడ్డి జిల్లా 
మంగళవారం 
తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. 
అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
  • More details to buy Watsup 8374614046 👆👆👆👆👆👆👆
    5
    More details to buy
Watsup 8374614046
👆👆👆👆👆👆👆
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Bantwaram, Vikarabad•
    16 hrs ago
  • అంబేద్కర్ 135 వ జయంతి ని పురస్కరించుకొని లాలాపేట లోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి , బిజెపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ వర్కర్లను శాలువాలతో సత్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తిస్తుందని, పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతిలో ధరిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ఏతర పార్టీల అధికారంలో అంబేద్కర్ కు భారతరత్న వరించిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అంబేద్కర్ ను గౌరవించే విధంగా ఆయన చదివిన తిరిగిన ప్రదేశాలను పంచ తీర్థలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలను రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అలాంటి మహనీయుని ఆశయాలు కొనసాగే విధంగా రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్లాలని కోరారు.
    2
    అంబేద్కర్ 135 వ జయంతి ని పురస్కరించుకొని లాలాపేట లోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పూలమాలవేసి  నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి , బిజెపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ వర్కర్లను శాలువాలతో సత్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా  ప్రవర్తిస్తుందని, పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతిలో ధరిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ఏతర పార్టీల అధికారంలో  అంబేద్కర్ కు భారతరత్న వరించిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అంబేద్కర్ ను  గౌరవించే విధంగా ఆయన చదివిన తిరిగిన ప్రదేశాలను పంచ తీర్థలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలను రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అలాంటి మహనీయుని ఆశయాలు కొనసాగే విధంగా రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్లాలని కోరారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.