Shuru
Apke Nagar Ki App…
జూన్ 22న బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై బూత్ లెవెల్ ఏజెంట్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక ప్రత్యేక అవగాహన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వర్ని బీర్కూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబా, దుర్గం శ్యామల, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు ఎజాస్, అబ్దుల్ ఖాలేఖ్, నార్ల రవీందర్, మోహన్ నాయక్, యండి. దావూద్, వహబ్, మజ్జులతో పాటు బాన్సువాడ పట్టణ, ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Vishwamber Rao
జూన్ 22న బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై బూత్ లెవెల్ ఏజెంట్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక ప్రత్యేక అవగాహన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వర్ని బీర్కూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబా, దుర్గం శ్యామల, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు ఎజాస్, అబ్దుల్ ఖాలేఖ్, నార్ల రవీందర్, మోహన్ నాయక్, యండి. దావూద్, వహబ్, మజ్జులతో పాటు బాన్సువాడ పట్టణ, ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం, బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విస్తృతంగా చేపట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం రోజున మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ నివాస గృహంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో వారు ఈ సూచనలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, బూత్ కమిటీలు ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల సభ్యత్వ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్, పట్టణ అధ్యక్షులు రవీంద్ర యాదవ్, సంజీవ్, నరసయ్య, కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులైన రవి శంకర్ గౌడ్, మిర్జాపురం హరీశంకర్, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.4
- నిత్యజీవితంలోని ఉరుకుల పురుగుల నుంచి ఒక్కరోజు విరామం తీసుకుని, సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తాండా ప్రజలంతా కలిసి సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, గ్రామంలోని సుమారు 120 కుటుంబాల వారు తమ ఇళ్లకు తాళాలు వేసి, గ్రామ సమీపంలో ఉన్న పంట చేనులో సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ వేడుక సాయంత్రం వరకు కొనసాగింది, వజ్జేపల్లి తాండా ప్రజలందరికీ ఈ సందడి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.1
- రేగోడ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ ప్రవీణ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని ప్రిన్సిపల్ ఈ సందర్భంగా తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ప్రతిరోజూ యోగా చేయాలని ఆమె సూచించారు.1
- రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రత్యేక యాప్ ద్వారా రైతులు తమ ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ యాప్‌లో సమీపంలోని ఎరువుల దుకాణాల్లో ఎంత యూరియా నిల్వ ఉందో తెలుసుకునే సౌకర్యం ఉందని, దీనివల్ల రైతులు తమకు అవసరమైన దుకాణాన్ని ఎంపిక చేసుకుని ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చని దేవ్‌కుమార్ వివరించారు. ఈ కొత్త విధానం వల్ల క్యూలైన్లు, రద్దీ, అనవసర ఇబ్బందులు తగ్గడంతో పాటు ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యూరియా కొరతపై రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని దేవ్‌కుమార్ హామీ ఇచ్చారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకొని రైతులు సులభంగా ఎరువులు పొందాలని ఆయన సూచించారు.1
- జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం ఆదవిపదిర గ్రామస్తులు తమ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. వీర్నపల్లి మండల కేంద్రం నుండి ఆదవిపదిరకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద తాత్కాలికంగా వేసిన డైవర్షన్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. వర్షాలు పడితే ఆ రోడ్డు కొట్టుకుపోయి, మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రానికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన చెందారు. కావున, అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేశారు.4
- మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం, నాగసానిపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో, సోమవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారికి ప్రత్యేక మంగళహారతిని కూడా సమర్పించారు.1
- చేగుంట మండలం సోమ్లా తండాలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్నాయని, అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని సర్పంచ్ ప్రవళిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ ఏఈ వెంకటప్పరెడ్డి, సదరు గ్రామం నార్సింగ్ మండల పరిధిలో ఉందని చెప్పడంతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గ్రామం ఏ మండలంలో ఉందో కూడా తెలియకపోతే ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా ఉండేందుకు విద్యుత్ తీగల సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ఘటన అక్కడున్న వారిలో చర్చనీయాంశంగా మారింది.1