*ప్రకృతి వ్యవసాయం లాభదాయకం* న్యవసాయాధికారి మోహన్ కుమార్ *ప్రకృతి వ్యవసాయం లాభదాయకం* ప్రకృతి వ్యవసాయ పద్ధతులను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రైతులు స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయాన్ని సాధించవచ్చని వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ తెలిపారు బుధవారం కాగ తి రైతు సేవా కేంద్రంలో ఎఫ్ఎంటీ, ఐసిఆర్పీలు, టీ -ఐ సి ఆర్ పి లకు మరియు చౌడేపల్లి మండలంలోని రైతు సేవా కేంద్ర సిబ్బందికి సమగ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పద్ధతులైన ఫ్రీ మ్యాన్షన్ డ్రై సోయింగ్ (పిఎండిఎస్), 365 రోజుల గ్రీన్ కవర్, డ్రౌట్ ప్రూఫింగ్ మోడల్ ( డి ఆర్ పి ఎం) హాఫ్ మూన్ మోడల్ పై సవివరంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పిఎండిఎస్ పద్ధతి ద్వారా పంటలు ముందుగానే స్థిరపడటంతో దిగుబడులు మెరుగుపడతాయని, 365 రోజుల గ్రీన్ కవర్ ద్వారా భూసారం పెరిగి నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు మరియు డ్రౌట్ ఫ్రూపింగ్ మోడల్ వర్షాభావ పరిస్థితుల్లో నేలలో తేమను ఎక్కువ కాలం నిలువ ఉంచి పంటలను ఎండ నుండి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. తక్కువ నీటితో కూడా పంటల సాగు సాధ్యమవుతుందని, భూసారం కాపాడడంతో పాటు పంటలు దిగుబడిని స్థిరంగా ఉంచడంలో ఈ పద్ధతి ఉపయోగకరమై చెప్పారు అలాగే హాఫ్ మూన్ మోడల్ ద్వారా వర్షపు నీటిని సమర్థవంతంగా సేకరించి నేలలోకి చొరబాటును పెంచడం ద్వారా మొక్కల వేర్లకు తగిన తేమ అందించి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పంటల పెరుగుదలను మెరుగుపరచవచ్చని వివరించారు.

- పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ "నారా చంద్రబాబునాయుడు" గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమం లో పుంగనూరు మండలం అధ్యక్షులు మాధవరెడ్డి, సీవీ రెడ్డి ,దేశదీ ప్రకాష్, కృష్ణంరాజు,శ్రీకాంత్,సెమీపతి, ఇబ్రహీం, కవిత , నాసిర్, షామీర్,రాజు, noor, సద్దాం,పోలీస్ గిరి,బులెట్ పవన్ ,ధర్మ, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- *తల–మొండెం వేరు… వినుకొండలో అనుమానాస్పద మృతి* పల్నాడు జిల్లా..న్యూస్. వినుకొండ మండలం విఠంరాజుపల్లి సమీపంలో రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహం తల, మొండెం వేర్వేరుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది రైలు ప్రమాదమా లేక హత్య కోణమా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టి ఆధారాలు సేకరిస్తున్నారు.1
- సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామం పరిధిలోని సచివాలయం, 1 మంగళవారం ఉదయం 11 గంటలు కావస్తున్న సచివాలయం తలుపులు తెరచకపోవడంతో సచివాలయ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేసి నిరసన చేసిన గ్రామస్తులు1
- శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం :-రెవిన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం లో అసెంబ్లీ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో ఉదయం 11:00 గంటలకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వెల్లడించిన ఓటర్ల వివరాలు: • *ధర్మవరం 160 అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,48,012 మంది ఓటర్లు ఉన్నారు* • పురుషులు : 1,22,706 • మహిళలు : 1,25,285 • ఇతరులు : 21 *18 సంవత్సరాలు నిండిన యువతీ–యువకులు తప్పనిసరిగా తమ ఓటు హక్కు నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.* అలాగే ఓటరు జాబితాలో కొత్త నమోదులు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ ,ఎలక్షన్ సీనియర్ సహాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.1
- మడకశిర మండలం గౌడనహళ్లి పంచాయితీ జమ్మానిపల్లి గ్రామంలో ప్రత్యేక అధికారి భాస్కర్ పర్యటించారు.గ్రామంలోని త్రాగునీటి సమస్యలు డ్రైనేజీ సమస్యల పై స్థానిక గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చివరగా ఎంపీపీ పాఠశాలలో రికార్డులను పరిశీలన చేసి ఉపాధ్యాయుల పనితీరు మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమం లో క్లస్టర్ కన్వీనర్ మురళి బాబు గ్రామస్తులు హనుమంత రాయప్ప పాల్గొన్నారు1
- Post by T. Raja simha1
- కుప్పం మండలం మల్లనూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వెనకాల 12 అడుగుల కొండచిలువ హల్చల్ చేసింది. విద్యార్థులు భయముతో పరుగులు పెట్టారు. వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారి జయశంకర్ ఆధ్వర్యంలో కొండచిలువ పట్టుకొని. అడివిలో వదిలిపెట్టారు.1