తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నకిరేకల్ పాత్ర చరిత్రలో చిరస్మరణీయం.... పోరాట యోధుల త్యాగాలను భావితరాలకు అందించాలి : గడగోజు రవీంద్రాచారి... నకిరేకల్, సెప్టెంబర్ 16: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో నకిరేకల్ నియోజకవర్గం చెరగని ముద్ర వేసిందని జర్నలిస్టు, రచయిత గడగోజు రవీంద్రాచారి పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై ఆయన రచించిన వ్యాసంలో నకిరేకల్ ప్రాంతంలోని అనేక గ్రామాలు నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి కేంద్రాలుగా నిలిచాయని వివరించారు. 1946లో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నకిరేకల్ పరిధిలోని చిత్తలూరు, కొసనగోడు, నోముల, కడపర్తి, అయిటిపాముల, కొప్పోలు, తుంగతుర్తి, గుండ్రాంపల్లి, వల్లాల తదితర గ్రామాలకు చెందిన అనేక మంది పోరాట యోధులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. చిత్తలూరులో సమిష్టి వ్యవసాయాన్ని నిర్వహించడం, వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయడం, రజాకార్లకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలు సాగించడం వంటి సంఘటనలు చరిత్రలో నిలిచిపోయాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాసరెడ్డి (ఎన్‌ఎస్‌ఆర్) వంటి నాయకులు ఉద్యమానికి నాయకత్వం వహించారని, అనేక మంది పోరాట యోధులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. వల్లాల అమరవీరులు, గుండ్రాంపల్లి మారణకాండ, పసునూరి వెంకట్‌రెడ్డి, ముస్కు వెంకట్‌రెడ్డి వంటి అమరవీరుల త్యాగాలు తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలిచాయని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వాస్తవాలతో భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అమరవీరుల త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శంగా నిలవాలని గడగోజు రవీంద్రాచారి పిలుపునిచ్చారు. నకిరేకల్ నేలపై సాగిన రైతాంగ సాయుధ పోరాటం భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం జరిగిన ప్రజా ప్రతిఘటనకు చిరస్మరణీయ చిహ్నంగా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నకిరేకల్ పాత్ర చరిత్రలో చిరస్మరణీయం.... పోరాట యోధుల త్యాగాలను భావితరాలకు అందించాలి : గడగోజు రవీంద్రాచారి... నకిరేకల్, సెప్టెంబర్ 16: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో నకిరేకల్ నియోజకవర్గం చెరగని ముద్ర వేసిందని జర్నలిస్టు, రచయిత గడగోజు రవీంద్రాచారి పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై ఆయన రచించిన వ్యాసంలో నకిరేకల్ ప్రాంతంలోని అనేక గ్రామాలు నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి కేంద్రాలుగా నిలిచాయని వివరించారు. 1946లో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నకిరేకల్ పరిధిలోని చిత్తలూరు, కొసనగోడు, నోముల, కడపర్తి, అయిటిపాముల, కొప్పోలు, తుంగతుర్తి, గుండ్రాంపల్లి, వల్లాల తదితర గ్రామాలకు చెందిన అనేక మంది పోరాట యోధులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. చిత్తలూరులో సమిష్టి వ్యవసాయాన్ని నిర్వహించడం, వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయడం, రజాకార్లకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలు సాగించడం వంటి సంఘటనలు చరిత్రలో నిలిచిపోయాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాసరెడ్డి (ఎన్‌ఎస్‌ఆర్) వంటి నాయకులు ఉద్యమానికి నాయకత్వం వహించారని, అనేక మంది పోరాట యోధులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. వల్లాల అమరవీరులు, గుండ్రాంపల్లి మారణకాండ, పసునూరి వెంకట్‌రెడ్డి, ముస్కు వెంకట్‌రెడ్డి వంటి అమరవీరుల త్యాగాలు తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలిచాయని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వాస్తవాలతో భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అమరవీరుల త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శంగా నిలవాలని గడగోజు రవీంద్రాచారి పిలుపునిచ్చారు. నకిరేకల్ నేలపై సాగిన రైతాంగ సాయుధ పోరాటం భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం జరిగిన ప్రజా ప్రతిఘటనకు చిరస్మరణీయ చిహ్నంగా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.
- జిల్లాలో ప్రశాంతంగా గణేష్ వేడుకలు జరుపుకోవాలి.. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ _గణేష్ ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక సూచనలు.!_ ఇప్పటివరకు జిల్లాలో సుమారు 2,500 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు పూర్తి.. మరో వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశం.. ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి... రాత్రి వేళల్లో మండపం వద్ద ఒక నిర్వాహకుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.. భక్తులను రెచ్చగొట్టే విధంగా పాటలు పెట్టకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి.. ప్రతి గణేష్ మండపానికి ఒక కానిస్టేబుల్‌ను అందుబాటులో.. దొంగతనాల నివారణకు సీసీఎస్ బృందాలు ప్రత్యేకంగా ఫీల్డ్‌లో పర్యటిస్తాయి.. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ కూడా నిరంతరం పర్యవేక్షిస్తాయి... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో నిమజ్జనం తేదీ వివరాలను కూడా నమోదు చేయాలి.. నిమజ్జనం రోజున ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. ల్యాండ్ అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు.. గత వారం రోజులుగా పలువురికి కౌన్సెలింగ్, బైండోవర్ చర్యలు చేపట్టాం.. ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని విజ్ఞప్తి.. *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్*1
- ఇంటి దారి వివాదం ఇరువైపులా ఆవేదనే న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట బాధిత కుటుంబం ధర్నా రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్.. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అధికారులు మహాబుబాబాద్ -దంతాలపల్లి:- ఇంటి దారి విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు తండాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్వం నుంచి తమ కుటుంబం రాకపోకలకు ఉపయోగిస్తున్న బాటను కొందరు పూడ్చివేయడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి అదే దారిలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా బాట విషయంలో తమ దగ్గరి బంధువులతో వివాదం కొనసాగుతోందని, ఈ కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇంటి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని తొలగించారని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ దగ్గరి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ కి వెలితే మీరు ఎవ్వరు రాకూడదని బయటకి పోవాలి అని ఎస్ ఐ ధూచించడాని వాళ్ళు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించాం: ఎస్‌ఐ బాట పూడ్చివేశారంటూ ఫిర్యాదు అందిన వెంటనే తహసీల్దార్, ఎంపీడీవోలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాటకు సంబంధించిన వ్యక్తిని దారి ఇవ్వాలని కోరగా, స్థలం ఇస్తే తన పిల్లలకు గృహాలు పడవని, అందువల్ల స్థలం ఇవ్వలేనని చెప్పినట్లు వివరించారు. అదేవిధంగా తండాలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తిపై కూడా వివాదం ఉందని, బాధితుడు ఆ ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇంటి బాట, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, కుటుంబపరంగా గానీ దూషించలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు.4
- ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- నర్సింహులపేట వైన్ షాప్ ముందు భార్య, భర్తల ఆత్మహత్య యత్నం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రం లోని మధుర వైన్ షాప్ ముందు బొజ్జన్న పేట గ్రామానికి చెందిన భార్య భర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డారు.. బెల్ట్ షాప్ కోసం వైన్ షాప్ నిర్వాహకుల వద్ద నుంచి 40వేల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.. అబ్కారి శాఖ, వైన్ షాప్ వాళ్ళు తమ వద్ద ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమ్మిన వల్లే తమ దగ్గర ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ మధ్యాన్ని తమకు ఇప్పించాలని లేనట్టియితే ఆత్మహత్య చేసుకుంటామని వైన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు..1
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1
- క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ జనగామ: క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.1
- మతోన్మాదవాదులు సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం కుల, మతాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందని కానీ కొంత మంది మతోన్మాదులు చరిత్రను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళ వారం నాడు సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా గుండ్ల గూడెం, పటేల్ గూడెం, శ్రీనివాస పురం గ్రామంలో నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో పాల్గొన్న ఎసి రెడ్డి నరసింహ రెడ్డి, బొమ్మ కంటి లక్ష్మి నర్సయ్య, గ్యార బాలయ్య, ఏంటిక రాములు , గ్యార సిద్దయ్య తదితరుల స్థూ పాలకు. పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గానీ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో గానీ పాల్గొనని వారు నేడు దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బ్రిటిష్ పాలకులకు లొంగిపోయి వారి అనుకూలంగా వ్యవహరించిన శక్తులు నేడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా వక్రీకరించడం ద్వారా ప్రజల మధ్య మత విభజనలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. నిజాం ముస్లిం పాలకుడైనప్పటికీ తెలంగాణలోని అనేక మంది భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు హిందువులే ఉన్నారని, దోపిడీకి మతం లేదని అన్నారు. పేద రైతులు, కూలీలు, మహిళలు, అణగారిన వర్గాలు కుల, మత భేదాలను అధిగమించి సాగించిన ఈ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలను ఓట్ల కోసం వక్రీకరించడం, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం మానుకోవాలని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియజేస్తూ వారి ఆశయాల సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని మల్లేశం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు.M.A ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సూదగాని సత్య రాజయ్య, జూకంటి పౌల్, మిట్ట శంకరయ్య, నల్ల మాస తుల శయ్య, పిక్క గణేష్ మోరీ గాడి రమేశ్, సంగీ రాజు, బొమ్మకంటి లక్ష్మి నారాయణ,గణ గాని మల్లేష్, చౌడ బోయిన యాదగిరి, వడ్డే మాను బాలరాజు, పారుపల్లి సత్తయ్య, గ్యార భాస్కర్ మడిపల్లి ఆంజనేయులు, చెక్కిళ్ళ ఉపేంద్ర, మిట్ట పార్వతమ్మ, దూసరి మల్లమ్మ, ఈదు నూరి కిష్టయ్య, సోమక్క, గ్యార అండాలు ,మిట్ట బిక్షపతి, చెక్కిళ్ళ గౌరమ్మ, ఎల్లమ్మ, అంజమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు1
- భూ వివాదం లో ఎస్ ఐ తలదూర్చారంటు దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఓ కుటుంబం ధర్నా.. మహబూబాబాద్ జిల్లా దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు తూర్పు తండా కు చెందిన రూప్ సింగ్ అనే వ్యక్తి కి చెందిన కుటుంబం ధర్నా దిగింది.. దంతాల పల్లి ఎస్ ఐ రవి కుమార్ మా భూమి విషయం లో కలుగ చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.. మాకు న్యాయం చేయాలనీ లేనట్టాయితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉన్నత అధికారులు స్పందించి న్యాయం చేయాలనీ బాధిత కుటుంబం వేడుకుంటుంది..1