logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర విమోచనం, విలీనం అంటూ రకరకాల పేరుతో పాలక పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరిగిన రోజు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బహుజనులు రాజ్యాధికారం వైపు అడుగులు వేసి రాజ్యాధికారం సాధిస్తేనే రాజ్యాంగఫలాలు అందుతాయని అన్నారు. కేంద్రంలోని ప్రధాని మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తుందన్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో హమారా ప్రసాద్ అనే వ్యక్తి అంబేద్కర్ను కించపరుస్తూ పుస్తకం రాసి విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగ ఫలితంగా రాజ్యాధికారం ఫలాలు అనుభవిస్తున్న దళిత ఎమ్మెల్యే ఎంపీలు అంబేద్కర్ అవమానిస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం శోచనియం అన్నారు.

1 hr ago
user_Bellampalli news
Bellampalli news
Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
1 hr ago
8092c607-6eee-4a49-816d-664e26c3d4d7

రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర విమోచనం, విలీనం అంటూ రకరకాల పేరుతో పాలక పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరిగిన రోజు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బహుజనులు రాజ్యాధికారం వైపు అడుగులు వేసి రాజ్యాధికారం సాధిస్తేనే రాజ్యాంగఫలాలు అందుతాయని అన్నారు. కేంద్రంలోని ప్రధాని మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తుందన్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో హమారా ప్రసాద్ అనే వ్యక్తి అంబేద్కర్ను కించపరుస్తూ పుస్తకం రాసి విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగ ఫలితంగా రాజ్యాధికారం ఫలాలు అనుభవిస్తున్న దళిత ఎమ్మెల్యే ఎంపీలు అంబేద్కర్ అవమానిస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం శోచనియం అన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే జోగాపూర్-మైలారం రోడ్డు పనులు ఆలస్యం ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే నెన్నెల మండలం జోగాపూర్-మైలారం రోడ్డు పనులు నిలిచిపోయాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టి రెండు నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే పనులను అడ్డుకుంటున్నామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు
    1
    ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే జోగాపూర్-మైలారం రోడ్డు పనులు ఆలస్యం 
ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే నెన్నెల మండలం జోగాపూర్-మైలారం రోడ్డు పనులు నిలిచిపోయాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టి రెండు నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే పనులను అడ్డుకుంటున్నామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • 56వ డివిజన్‌లో రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు శ్రీకారం : మేయర్ మహంకాళి స్వామి రామగుండం నగరపాలక ఏరియాలోనీ స్థానిక 56వ డివిజన్‌లో ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. 56వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొమ్ము స్వప్న–వేణు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో UGD పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ శ్రీ మహంకాళి స్వామి గారు, డిప్యూటీ మేయర్ శ్రీ ఎల్లయ్య గారు హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి గారు మాట్లాడుతూ, నగరంలోని వివిధ డివిజన్లలో మౌలిక వసతులను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన డ్రైనేజీ, రహదారులు, తాగునీరు తదితర ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌తో పాటు వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    56వ డివిజన్‌లో రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు శ్రీకారం : మేయర్ మహంకాళి స్వామి
రామగుండం నగరపాలక ఏరియాలోనీ స్థానిక 56వ డివిజన్‌లో ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు గురువారం శ్రీకారం చుట్టారు.
56వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొమ్ము స్వప్న–వేణు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో UGD పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ శ్రీ మహంకాళి స్వామి గారు, డిప్యూటీ మేయర్ శ్రీ ఎల్లయ్య గారు హాజరై పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి గారు మాట్లాడుతూ, నగరంలోని వివిధ డివిజన్లలో మౌలిక వసతులను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన డ్రైనేజీ, రహదారులు, తాగునీరు తదితర ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌తో పాటు వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    4 hrs ago
  • శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.
    1
    శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.
    user_కర్ణాల నాగరాజు
    కర్ణాల నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.
    1
    కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి
    1
    గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల  పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని 
మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన  కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    39 min ago
  • కరీంనగర్‌లో పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం ఉధృతం..! 32వ రోజుకు చేరిన ఆందోళన... G.O.Ms.No.97 రద్దు చేయాలంటూ అధ్యాపకుల నిరసన..! కరీంనగర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీఎంఆర్ మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో... భోజన విరామ సమయంలో అధ్యాపక బృందం నల్ల దుస్తులు, నల్ల మాస్కులు ధరించి నిరసన చేపట్టింది. G.O.Ms.No.97ను వెంటనే రద్దు చేయాలని TPJAC నాయకులు డిమాండ్ చేశారు. అదే సమయంలో... కేంద్ర TPJAC నాయకులు, ఉద్యోగులతో మాట్లాడే సందర్భంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అనుచిత, అన్పార్లమెంటరీ భాష ఉపయోగించారని ఆరోపిస్తూ... తీవ్రంగా ఖండించారు. కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు... రేపటి నుంచి ప్రారంభమయ్యే సెమిస్టర్ మిడ్ ఎగ్జామినేషన్స్ విధులను బహిష్కరిస్తున్నట్లు స్థానిక TPJAC యూనిట్ ప్రిన్సిపాల్‌కు రీప్రజెంటేషన్ అందజేసింది. ఉద్యమం 32వ రోజుకు చేరడంతో... ప్రభుత్వం స్పందిస్తుందా? G.O.Ms.No.97పై తదుపరి నిర్ణయం ఏంటి? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ కోసం తమ ఆందోళన కొనసాగిస్తామని స్థానిక TPJAC, కేంద్ర TPJAC స్పష్టం చేసింది.
    1
    కరీంనగర్‌లో పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం ఉధృతం..!
32వ రోజుకు చేరిన ఆందోళన... G.O.Ms.No.97 రద్దు చేయాలంటూ అధ్యాపకుల నిరసన..!
కరీంనగర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీఎంఆర్ మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో... భోజన విరామ సమయంలో అధ్యాపక బృందం నల్ల దుస్తులు, నల్ల మాస్కులు ధరించి నిరసన చేపట్టింది.
G.O.Ms.No.97ను వెంటనే రద్దు చేయాలని TPJAC నాయకులు డిమాండ్ చేశారు.
అదే సమయంలో... కేంద్ర TPJAC నాయకులు, ఉద్యోగులతో మాట్లాడే సందర్భంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అనుచిత, అన్పార్లమెంటరీ భాష ఉపయోగించారని ఆరోపిస్తూ... తీవ్రంగా ఖండించారు.
కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు... రేపటి నుంచి ప్రారంభమయ్యే సెమిస్టర్ మిడ్ ఎగ్జామినేషన్స్ విధులను బహిష్కరిస్తున్నట్లు స్థానిక TPJAC యూనిట్ ప్రిన్సిపాల్‌కు రీప్రజెంటేషన్ అందజేసింది.
ఉద్యమం 32వ రోజుకు చేరడంతో... ప్రభుత్వం స్పందిస్తుందా? G.O.Ms.No.97పై తదుపరి నిర్ణయం ఏంటి? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ కోసం తమ ఆందోళన కొనసాగిస్తామని స్థానిక TPJAC, కేంద్ర TPJAC స్పష్టం చేసింది.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    35 min ago
  • మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది. కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాంతం: మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నష్టం: డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు పయనమయ్యారు.
    1
    మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది.
కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రాంతం: మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నష్టం: డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు.
ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు పయనమయ్యారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    6 hrs ago
  • అమరవీరుల త్యాగాల పునాదులపైనే తెలంగాణ సిద్ధించింది., బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకావిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా కొరుకంటి చందర్ మాట్లాడుతూ... సెప్టెంబర్ 17న నియోజకవర్గ కేంద్రమైన గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తాలో జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మద్రాస్ రాష్ట్రంలో భాగమైన నాటి రోజుల నుంచి, స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం సాగిన పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిందని గుర్తుచేశారు. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అనే ఆకాంక్షలతో సాగిన మలిదశ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ​గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని, ప్రస్తుతం మాత్రం రైతాంగం ఎరువులు, సాగునీరు, విద్యుత్ సమస్యలతో అల్లాడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ఉద్యమాల గడ్డ అయిన ఈ ప్రాంతం నుంచి మళ్లీ కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో మురళీధర్ రావు, పిటి స్వామి, మేకల సమ్మయ్య యాదవ్, మారుతి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    అమరవీరుల త్యాగాల పునాదులపైనే తెలంగాణ సిద్ధించింది., బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకావిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా కొరుకంటి చందర్ మాట్లాడుతూ... సెప్టెంబర్ 17న నియోజకవర్గ కేంద్రమైన గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తాలో జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మద్రాస్ రాష్ట్రంలో భాగమైన నాటి రోజుల నుంచి, స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం సాగిన పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిందని గుర్తుచేశారు. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అనే ఆకాంక్షలతో సాగిన మలిదశ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ​గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని, ప్రస్తుతం మాత్రం రైతాంగం ఎరువులు, సాగునీరు, విద్యుత్ సమస్యలతో అల్లాడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ఉద్యమాల గడ్డ అయిన ఈ ప్రాంతం నుంచి మళ్లీ కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో మురళీధర్ రావు, పిటి స్వామి, మేకల సమ్మయ్య యాదవ్, మారుతి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.