ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ గిరిజన నాయకుల సమావేశం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు బాన్స్ వాడ సెప్టెంబర్ 15 ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ గిరిజన నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ సందర్బంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ :-- గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఎన్నికల సమయంలో గిరిజనులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా గిరిజనులను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో గిరిజనులకు చేసిందేమీ లేదని అన్నారు. గిరిజనులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అన్నారు ఏమైంది? రాష్టంలో బంజారాలకు మంత్రి పదవి ఇవ్వలేదు? కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనుల జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించారు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం లో 42 తాండలను చట్టబాధత కల్పించారు. 9 కోట్ల 20 లక్షలతో గిరిజన వసతి గృహం నిర్మించాం. కానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కనీస వసతి కూడా కల్పించలేకపోతున్నాడు. ఎల్లారెడ్డి నియోజకవర్గ తాండలల్లో 42 కోట్లతో బిటీ రోడ్లు నిర్మించిన ఘనత మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారిది. కానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ మా గిరిజనులకు ఓట్ల కోసమే వాడుకున్నారు, ఒక రూపాయి కూడా అభివృద్ధి పనుల కోసం ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వం లో హైదరాబాద్‌లో సేవాలాల్ బంజారా భవన్, కొమురం భీం ఆదివాసీ భవన్ నిర్మాణం చేపట్టామని, గిరిజనుల కోసం సుమారు రూ.100 కోట్ల ఆస్తులు, రూ.25 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. తండాలకు విద్యుత్ సదుపాయం కల్పించడంతో పాటు ఇంటింటికీ తాగునీరు, గురుకులాలు, వసతి గృహాల్లో నాణ్యమైన విద్య, వసతి, భోజన సౌకర్యాలు అందించామని తెలిపారు. కేసీఆర్ గారి పదేళ్ల పాలనలో తండాల్లో గిరిజనుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాలు, వసతి గృహాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లు గడుస్తున్నా గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దారుణమన్నారు. అసైన్‌మెంట్, పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రి నీ చేసుకుంటాం అని, ఎల్లారెడ్డి లో మళ్ళీ జాజాల సురేందర్ గారిని ఎమ్మెల్యే గా గెలిపించి ఎల్లారెడ్డి గడ్డ మీద BRS పార్టీ జెండాను ఎగరేస్తాం అని అన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ గిరిజన మాజీ ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

- నిజాంసాగర్‌లో 11.383 టీఎంసీల నీటి నిల్వ... ప్రధాన కాల్వ నీటి విడుదల నిలిపివేత నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నమోదుల ప్రకారం నీటిమట్టం 1400.02 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 11.383 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ శూన్యంగా నమోదయ్యాయి. స్పిల్‌వే గేట్లు, ప్రధాన కాలువ నుండి విడుదల నిలిపివేయగా, జెన్కొ విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది.1
- 34 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో ఉన్న సీనియర్ మహిళా నేత లొంగుబాటు నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన సీపీఐ మావోయిస్టు పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు నిక్కా శశీల అలియాస్ రాజి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 57 ఏళ్ల నిక్కా శశీల 1992లో పీపుల్స్ వార్‌లో చేరి.. 34 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. డివిజన్ కమిటీ సభ్యురాలిగా పనిచేసిన ఆమె.. అనారోగ్య సమస్యల కారణంగా మావోయిస్టు పార్టీని వీడి సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన శశీలకు ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల చెక్‌తో పాటు 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మిగిలిన మావోయిస్టు కేడర్లు కూడా హింసా మార్గాన్ని వీడి లొంగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.1
- కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష • వివిధ సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ • నిమజ్జన మార్గంలో ట్రాఫిక్, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్ల పరిశీలన - అధికారులకు సూచనలు • నిమజ్జన ప్రదేశాల్లో గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు • గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకు సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా • డీజేలకు స్వస్తి – సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు: జిల్లా ఎస్పీ కామారెడ్డి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, , జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర, బుధవారం పరిశీలించారు. తొలుత ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించారు. కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ – ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ముఖ్య ప్రాంతాల గుండా బాంబే క్లాత్, పాన్ చౌరస్తా, బడా మసీద్, రైల్వే ఫ్లైఓవర్, నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదిగా నిమజ్జన మార్గాన్ని పరిశీలిస్తూ, నిమజ్జన ముగింపు ప్రదేశమైన టేకిర్యాల్ చెరువు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వరకు రూట్‌లోని అన్నీ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా నిమజ్జన రూట్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, రహదారుల పరిస్థితి, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, బారికేడ్లు, అత్యవసర మార్గాలు, విగ్రహాల తరలింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూట్‌లో గుర్తించిన సమస్యలను నిమజ్జన కార్యక్రమానికి ముందే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్, మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి తదితర అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన మార్గంలో భక్తులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ మరియు రహదారి సంబంధిత పనుల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, భక్తులు మరియు ప్రజల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు మరియు వైద్య సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రెస్క్యూ వ్యవస్థను అందుబాటులో ఉంచాలని సూచించారు. నిమజ్జన రూట్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు మరియు డ్రోన్ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధిక శబ్దంతో కూడిన డీజేల కారణంగా చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అమలులో ఉన్న నిబంధనలు, ఆదేశాల మేరకు డీజేల వినియోగంపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయ పద్ధతుల్లో, శాంతియుతంగా మరియు ఆనందోత్సాహాలతో నిర్వహించాలని, నిమజ్జన సమయంలో పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సూచించే భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ కోరారు. నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, కామారెడ్డి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లు పాల్గొన్నారు.1
- తెలంగాణ రాష్ట్రంలో రేపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్నా ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా వుందనీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇందిరామ పిల్ల పేరుతో పాటు పీఎం ఏవై లోగో పెట్టాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు పేదలకు ఇస్తున్న ఇండ్లలో రెండు లక్షల ఇండ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తూకేంద్ర మంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.రైస్ మిల్లర్లుపై విజలెన్స్ దాడులు హైయామైన చర్యనీ అన్నారు. బుధువారం రోజున మెదక్ పట్టణములోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర రైస్ మిల్లర్లు అసోసియేషన్ సభ్యులుతో చర్చలు జరపాలి. రైస్ మిల్లర్లు పై విజలెన్స్ దాడులు చెయ్యడం సబబు కాదని అన్నారు. రైస్ మిల్లు పై దాడులు ఆపకపోతే బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు సివిల్ సప్లై ఎం డి తో చర్చిస్తారు అందర్నీ దొంగలుగా చూడడం సబబు కాదన్నారు. రైస్ మిల్ యజమాన్యాలతో చర్చలు జరిపి రైస్ మిల్లు మిల్లు యధావిధిగా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు గత మూడు సంవత్సరాలుగా మిల్లులకు ఇచ్చిన దాన్యం బియ్యం కొనుగోలు చేయకపోవడంతో రైస్ మిల్లు ధాన్యం పేరుకు పోయిందన్నారు గోదాము లేవన్నారు వచ్చే నెలలో వచ్చే దాన్యం కు ఎక్కడ పెడతారని ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా అసెంబ్లీ సమావేశాలు పక్కదారి పట్టించారన్నారు. 22b నిషేధిత భూములను చర్చ లేదన్నారు ఎలాంటి చర్య లేదన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ .తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారింగానిర్వహించాలన్నారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా హిందువులతో పాటు ముస్లింలు కూడా పోరాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారుఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాదామల్లేష్ గౌడ్ గడ్డం శ్రీనివాస్ రాగి రాములు నాయాని ప్రసాద్ విజయ్ కుమార్ రజింత్ రెడ్డి పంజా విజయ్ కుమార్ సురేష్ శ్రీనివాస్ బేడ్ల సత్యనారాయణ, ప్రభాకర్ బైండ్ల వీణ ,.లక్ష్మి శైలజ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు1
- ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ వెంకటేష్ గౌడ్... నిర్మల్ జిల్లా // బాసర గుడిసె లేని బాసర నా కల.. ఆ కలను నిజం చేసే బాధ్యత నాది... సొంతింటి కలను కాంగ్రెస్ నిజం చేస్తుంది.. విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం : సర్పంచ్ వెంకటేష్ గౌడ్.... బాసర లోని గ్రామ పంచాయతీ భవనం లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించిన సర్పంచ్ వెంకటేష్ గౌడ్, స్థానిక నాయకులు..... ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు...: *సర్పంచ్ వెంకటేష్ గౌడ్* పాల్గొన్న ఈవో ప్రసాద్ గౌడ్.. ఉపసర్పంచ్ సయ్యద్ అలీ, వార్డ్ మెంబర్ లు కృష్ణ, ఫసి, అన్నెల లక్ష్మణ్, ఏజాస్, సాయిలు, ఫారుక్, అశోక్, నాయకులు షానవాజ్...1
- కాచాపూర్ లో కరెంటు కోతలపై బిఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో కరెంటు కోతలపై బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యవసాయానికి 18 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతల వల్ల రైతుల సాగు చేసిన పంటలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని హెచ్చరించారు.1
- విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు మనిషికి అoదేoత ఎత్తు లో వేలాడుతున్న తీగలు విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు మనిషికి అoదేoత ఎత్తు లో వేలాడుతున్న తీగలు పలుమార్లు మోటార్లు కాలిపోతు న్నా పట్టిoచుకోని అధికారులు ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామ శివారు లోని సర్వే నంబర్ 37 లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిoదికి వేలాడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తo చేస్తున్నారు దాదాపు నాలుగు ఎకరాల పొడవునా విద్యత్ తీగలు మనిషి కి ఆoదేoత ఎత్తులో ఉoడటoతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుoదోనని రైతులు భయాoదోళనకు గురవుతున్నారు ఈ సమస్య పై పలుమార్లు లైన్ మెన్ కు విన్నవిoచినప్పటికీ ఇప్పటి వరకు సమస్య పరిష్కరo లేదు1
- జుక్కల్ రైతుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గళం జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని ఉద్యానవన రైతుల సమస్యలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అసెంబ్లీలో ప్రస్తావించారు. నియోజకవర్గంలో బొప్పాయితో పాటు వివిధ రకాల ఉద్యానవన పంటలను రైతులు విస్తారంగా సాగు చేస్తున్న నేపథ్యంలో, రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల పంటలకు మెరుగైన ధరలు లభించేలా అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, గ్రేడింగ్–ప్యాకింగ్ కేంద్రాలు, మార్కెట్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గానికి కీలకమైన లెండి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని అసెంబ్లీ వేదికగా కోరారు.1