వైసీపీ పాలనలో నామినేషన్లు అడ్డుకున్నది గుర్తులేదా రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకున్నది గుర్తులేదా అని రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ ప్రశ్నించారు. మండలకేంద్రమైన సిద్ధవటం ఆకుల వీధిలోని తన నివాసంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు జాగ్రత్త వహించాలని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మీరేం చేశారో గుర్తులేదా అంటూ ఆయన మండిపడ్డారు. టీడీపీ, జనసేన ఎంపీటీసీల అభ్యర్థుల నివాసాలపై దౌర్జన్యాలు సృష్టించి గందరగోళం సృష్టించి తప్పుడు కేసులు పెట్టించారని నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకున్న చరిత్ర వైసీపీ పార్టీకే దక్కుతుందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసి పోటీ చేయవచ్చనన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దౌర్జన్యాలు, దోపిడీలు ప్రజలకు అందరికీ తెలుసని వైసీపీ తరుపున అభ్యర్థులు నిర్భయంగా పోటీ చేయవచ్చని ఆయన తెలిపారు.
వైసీపీ పాలనలో నామినేషన్లు అడ్డుకున్నది గుర్తులేదా రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకున్నది గుర్తులేదా అని రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ ప్రశ్నించారు. మండలకేంద్రమైన సిద్ధవటం ఆకుల వీధిలోని తన నివాసంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు జాగ్రత్త వహించాలని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మీరేం చేశారో గుర్తులేదా అంటూ ఆయన మండిపడ్డారు. టీడీపీ, జనసేన ఎంపీటీసీల అభ్యర్థుల నివాసాలపై దౌర్జన్యాలు సృష్టించి గందరగోళం సృష్టించి తప్పుడు కేసులు పెట్టించారని నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకున్న చరిత్ర వైసీపీ పార్టీకే దక్కుతుందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసి పోటీ చేయవచ్చనన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దౌర్జన్యాలు, దోపిడీలు ప్రజలకు అందరికీ తెలుసని వైసీపీ తరుపున అభ్యర్థులు నిర్భయంగా పోటీ చేయవచ్చని ఆయన తెలిపారు.
- బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- బద్వేలు పట్టణంలో ప్రయాణ బస్సుల ఇష్టారాజ్యం...వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. బద్వేలు, ఆగస్టు 25: బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణ సంస్థల బస్సులను రోడ్లకు అడ్డంగా నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో బస్సులు ఆపడంతో తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాల భయం నెలకొందన్నారు. రోడ్లకు అడ్డంగా బస్సులు నిలిపే వారిపై చర్యలు తీసుకొని, వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.1
- కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట....... కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.1
- పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.1
- పట్టణ అభివృద్ధికై స్లమ్ ఏరియాల్లో సర్వే - సెప్టెంబర్ 28 చలో ఆర్డీఓ - సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్. బద్వేలు,ఆగస్టు 25: బద్వేలు స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో మంగళవారం సీపీఎం పట్టణ కమిటీ సమావేశం పి.చాంద్ భాషా అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. బద్వేలు జనాభా లక్షా 50 వేలు దాటిందని, వలసలు, ప్లైవుడ్ పరిశ్రమతో స్లమ్ ఏరియాల్లో పేదలు పెరుగుతున్నా మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 28 వరకు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై సర్వే చేసి, సెప్టెంబర్ 28న "చలో ఆర్డీఓ ఆఫీస్" కార్యక్రమం చేపడతామన్నారు. వామపక్షాల పోరాటంతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, ప్రజల సామాజిక, ఆర్థిక హక్కులను హరిస్తున్నాయని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కె.శ్రీను, సుబ్బరాయుడు, రాయప్ప తదితరులు పాల్గొన్నారు.1