Shuru
Apke Nagar Ki App…
56 ఏళ్ల రాహుల్ గాంధీ ఫిట్నెస్ సీక్రెట్............. ఇదే 56 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటం వెనుక సీక్రెట్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. “ఎంత బిజీగా ఉన్నా రోజూ కనీసం గంటపాటు మార్షల్ ఆర్ట్స్, ఈత, రన్నింగ్, యోగా, ఏరోబిక్ వంటివి చేస్తా. అనారోగ్యకరమైన అలవాట్లను వ్యాయామంతో సరిదిద్దలేం. క్రమశిక్షణతో కూడిన శ్రమ, ఆరోగ్యకర ఆహారంతో ఫిట్నెస్ సాధించవచ్చు. స్నాక్స్ ఎక్కువగా తినడం మానుకోవాలి. లిక్కర్ అలవాటు ఉంటే పరిమితంగా తీసుకోవాలి' అని సూచించారు.
Reporter Gaddam Kiran
56 ఏళ్ల రాహుల్ గాంధీ ఫిట్నెస్ సీక్రెట్............. ఇదే 56 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటం వెనుక సీక్రెట్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. “ఎంత బిజీగా ఉన్నా రోజూ కనీసం గంటపాటు మార్షల్ ఆర్ట్స్, ఈత, రన్నింగ్, యోగా, ఏరోబిక్ వంటివి చేస్తా. అనారోగ్యకరమైన అలవాట్లను వ్యాయామంతో సరిదిద్దలేం. క్రమశిక్షణతో కూడిన శ్రమ, ఆరోగ్యకర ఆహారంతో ఫిట్నెస్ సాధించవచ్చు. స్నాక్స్ ఎక్కువగా తినడం మానుకోవాలి. లిక్కర్ అలవాటు ఉంటే పరిమితంగా తీసుకోవాలి' అని సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- 56 ఏళ్ల రాహుల్ గాంధీ ఫిట్నెస్ సీక్రెట్............. ఇదే 56 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటం వెనుక సీక్రెట్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. “ఎంత బిజీగా ఉన్నా రోజూ కనీసం గంటపాటు మార్షల్ ఆర్ట్స్, ఈత, రన్నింగ్, యోగా, ఏరోబిక్ వంటివి చేస్తా. అనారోగ్యకరమైన అలవాట్లను వ్యాయామంతో సరిదిద్దలేం. క్రమశిక్షణతో కూడిన శ్రమ, ఆరోగ్యకర ఆహారంతో ఫిట్నెస్ సాధించవచ్చు. స్నాక్స్ ఎక్కువగా తినడం మానుకోవాలి. లిక్కర్ అలవాటు ఉంటే పరిమితంగా తీసుకోవాలి' అని సూచించారు.1
- పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రిలు పొంగులేటి, పొన్నం హన్మకొండ జిల్లా:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, మనేపల్లి తదితర గ్రామాల్లో 394 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు 8 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందే వరకు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్లతో పాటు కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో 394 కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందడం సంతోషకరమన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశామని, అనర్హులు తేలితే కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.1
- దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనీ జిల్లా ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో.. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ నిరసనలో భాగంగా సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ ప్రభుత్వ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1
- పెద్ది విగ్రహ ప్రతిష్ఠను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఉద్రిక్తత ల మధ్య బీఆర్ఎస్ నాయకులు నర్సంపేటలో ప్రతిష్ఠించారు. సోమవారం నిర్వహించిన ఈ విగ్రహ ప్రతిష్ఠ స్థలానికి చేరుకున్న డీసీపీ, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ప్రైవేట్ భూమిలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే మీకేంటని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు వెనక్కి తగ్గడంతో విగ్రహ ఏర్పాటును ఘనంగా నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ ఈ రోజు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో జైలు భరో కార్యక్రమంలో రసవత్తరంగా సాగింది. కార్మికులు,కర్షికులు ప్రజలు పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి పాల్గొన్నారు.మహబూబాబాద్ పట్టణంలో పోలీసులకు పార్టీ శ్రేణులకు మధ్య భారీగా తోపులాట జరగటంతో కార్యకర్తలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదలతో హోరేత్తించారు. అక్రమ అరెస్టులను వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలు. పార్టీ నాయకులను నిర్భంధింది అరెస్టులు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు తహసీల్దార్ కార్యాలయం ఏరియాలో సిపిఎం పార్టీ శ్రేణులకు పోలీసుల మధ్య భారీ ఉదృక్తత్త జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేట్ అనుకూల విధానాలను శరా వేగంగా అమలు చేయడానికి పూనుకోవడం బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది. అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నేడు జైల్ భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ’ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకించేందుకు శ్రామిక ప్రజలు పోరాడాల్సిన అవసరముందన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఎందరో పోరాటయోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని, సంపదను, సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. అనేక దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29కార్మిక చట్టాలను ఒక్క కలం పోటుతో రద్దుచేసి వాటన్నింటినీ నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకరావడం అంటే కార్మికుల మౌలిక హక్కులను పూర్తిగా హరించివేయడమే విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్న 32 దేశాల వ్యవసాయ దిగుమతులను అనుమతులను రద్దు చేయాలి. స్వదేశి ఉత్పత్తులను ప్రొత్సహించాలి. మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, రోజు వేతనం 600కు, పని దినాలు ఏడాదికి 200 రోజులకు పెంచాలని,పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలి. లేబర్ కోడ్లు రద్దుచేసి కనీస వేతనం 31,000 /-ఇవ్వాలని , భవన నిర్మాణం, హమాలి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్,సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌలి,కుమ్మరి కుంట్ల నాగన్న,పట్ల మధు,గుండు సులోచన,కంపల్లి శ్రీనివాస్,కరుణ,నీలం కృష్ణ వేణి,కందునురి కవిత, బానోత్ వెంకన్న నాయక్,యమగాని వెంకన్న,బత్తుల వెంకన్న,గారే కోటేశ్వరావు,వెంకట్ నారాయణ,దేవత్ హేమనాయక్ ,బానోత్ ప్రకాష్ నాయక్,రావుల రాజు తదితరులు పాల్గున్నారు.1
- దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి.. హనుమకొండలో భారీ ర్యాలీ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. దళిత క్రైస్తవుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.1
- ప్రియ స్నేహితుడా మన జీవితంలో శాశ్వతమైన రక్షణ ఆధారం సమాధానం ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు ఇవ్వగలడు ఎందుకంటే మనిషి శాశ్వత కాలం జీవించలేరు గనుక చూపించలేడు యేసు అన్నాడు నేను మొదటి వాడిని కడపటి వాడిని మృతుడనైతిని గాని పాపక్షమాపణ నిమిత్తం ప్రజల కోసం యుగయుగములు జీవించుచున్నాను అన్నాడు1