నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌నా రాజధాని అమరావతి- ఎమ్మెల్యేవేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌నా రాజధాని అమరావతి - అమరావతి రైతులకు, ప్రజలకు నా సెల్యూట్ - నా రాజధాని అమరావతి అని గర్వపడేలా చేశారు - దేవుడు సీఎం వెంటే ఉన్నారు అనే దానికి ఇదే నిదర్శనం - ప్రతి ఒక్కరూ సాయంత్రం రెండు దీపాలు వెలిగించండి - ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు - అమరావతికి మద్దతుగా భారీ ర్యాలీ.. తరలివచ్చిన ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించడం ప్రతి ఒక్కరికీ గర్వ కారణమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అనేలా ప్రతి ఒక్కరూ ఉప్పొంగిపోయే విషయమన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మినగల్లులో బుచ్చిరెడ్డిపాలెం మండలం, మినగల్లు పంచాయతీ నందు, నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం, సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు, స్థానిక నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం అభివృద్ధి, శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ ఆంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతిని సాకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, సీఎం చంద్రబాబుకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 2014-19 మధ్య రాజధాని పనులు చేపడితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పడేసిందన్నారు. నాడు ప్రధాని మోడీని రాష్ట్రానికి తెచ్చి శంకుస్థాపన చేశారన్నారు. నేడు అదే రాజధానికి చట్టబద్ధత కల్పించి రాష్ట్ర ప్రజలను గర్వపడేలా చేశారన్నారు. దేశం మొత్తం అమరావతికి మద్దతుగా ఉంటే ఒక్క వైసీసీ మాత్రం వ్యతిరేకించి తమ బుద్ధి చూపిందని ఎద్దెవా చేశారు. ఇలాంటి నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని కూటమి ప్రభుత్వం నిరూపించిందని చెప్పారు. ఈ సందర్భంగా రైతుల కష్టాలను, వారి త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రోజు సాయంత్రం రెండు దీపాలు వెలిగించి తమ సంఘీభావం తెలపాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 21 నెలల కాలంలో చేతల ప్రభుత్వం అని అభివృద్ధి చేసి నిరూపించుకున్నామన్నారు. ఎన్నికల చేసిన హామీలన్నీ అమలు చేస్తూ సంక్షేమ పథకాలను గడపకే చేర్చామన్నారు. కొత్త మినగల్లులో 15 లక్షల 60 వేలతో 3 సిసి రోడ్లు, పాత మినగల్లులో 10 లక్షలతో నిర్మించిన స్మశానవాటికకు వెళ్లే సిసి రోడ్డు ప్రారంభోత్సవాలు, 40 లక్షలతో వాటర్ పైప్‌లైన్ శంకుస్థాపన మొత్తం 65 లక్షల 60 వేలతో చేసుకుంటున్న అభివృద్ధి పనులే కూటమి ప్రభుత్వ పనితీరుకు అద్ధం పడుతున్నాయని చెప్పారు. 52 లక్షలతో కాలువల్లో పూడిక తీత చేపట్టామన్నారు. మినగల్లు గ్రామంలో నిరుపయోగంగా ఉన్న పాత పంచాయతీ కార్యాలయాన్ని గ్రామస్తుల అభ్యర్థన మేరకు 90 వేల రూపాయలు వెచ్చించి గ్రంథాలయంగా మార్చడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు పరిపాలన దక్షత, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదల రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలన్న యువనేత, ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి లోకేష్ కృషి చూస్తుంటే ఇలాంటి నాయకులు దొరకడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్నికార్యక్రమాలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌నా రాజధాని అమరావతి- ఎమ్మెల్యేవేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌నా రాజధాని అమరావతి - అమరావతి రైతులకు, ప్రజలకు నా సెల్యూట్ - నా రాజధాని అమరావతి అని గర్వపడేలా చేశారు - దేవుడు సీఎం వెంటే ఉన్నారు అనే దానికి ఇదే నిదర్శనం - ప్రతి ఒక్కరూ సాయంత్రం రెండు దీపాలు వెలిగించండి - ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు - అమరావతికి మద్దతుగా భారీ ర్యాలీ.. తరలివచ్చిన ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించడం ప్రతి ఒక్కరికీ గర్వ కారణమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అనేలా ప్రతి ఒక్కరూ ఉప్పొంగిపోయే విషయమన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మినగల్లులో బుచ్చిరెడ్డిపాలెం మండలం, మినగల్లు పంచాయతీ
నందు, నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం, సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు, స్థానిక నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం అభివృద్ధి, శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ ఆంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతిని సాకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, సీఎం చంద్రబాబుకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 2014-19 మధ్య రాజధాని పనులు చేపడితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పడేసిందన్నారు. నాడు ప్రధాని మోడీని రాష్ట్రానికి తెచ్చి శంకుస్థాపన చేశారన్నారు. నేడు అదే రాజధానికి చట్టబద్ధత కల్పించి రాష్ట్ర ప్రజలను గర్వపడేలా చేశారన్నారు. దేశం మొత్తం అమరావతికి మద్దతుగా ఉంటే ఒక్క వైసీసీ మాత్రం వ్యతిరేకించి తమ
బుద్ధి చూపిందని ఎద్దెవా చేశారు. ఇలాంటి నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని కూటమి ప్రభుత్వం నిరూపించిందని చెప్పారు. ఈ సందర్భంగా రైతుల కష్టాలను, వారి త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రోజు సాయంత్రం రెండు దీపాలు వెలిగించి తమ సంఘీభావం తెలపాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 21 నెలల కాలంలో చేతల ప్రభుత్వం అని అభివృద్ధి చేసి నిరూపించుకున్నామన్నారు. ఎన్నికల చేసిన హామీలన్నీ అమలు చేస్తూ సంక్షేమ పథకాలను గడపకే చేర్చామన్నారు. కొత్త మినగల్లులో 15 లక్షల 60 వేలతో 3 సిసి రోడ్లు, పాత మినగల్లులో 10 లక్షలతో నిర్మించిన స్మశానవాటికకు వెళ్లే సిసి రోడ్డు ప్రారంభోత్సవాలు, 40 లక్షలతో వాటర్ పైప్‌లైన్ శంకుస్థాపన మొత్తం 65 లక్షల
60 వేలతో చేసుకుంటున్న అభివృద్ధి పనులే కూటమి ప్రభుత్వ పనితీరుకు అద్ధం పడుతున్నాయని చెప్పారు. 52 లక్షలతో కాలువల్లో పూడిక తీత చేపట్టామన్నారు. మినగల్లు గ్రామంలో నిరుపయోగంగా ఉన్న పాత పంచాయతీ కార్యాలయాన్ని గ్రామస్తుల అభ్యర్థన మేరకు 90 వేల రూపాయలు వెచ్చించి గ్రంథాలయంగా మార్చడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు పరిపాలన దక్షత, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదల రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలన్న యువనేత, ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి లోకేష్ కృషి చూస్తుంటే ఇలాంటి నాయకులు దొరకడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్నికార్యక్రమాలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
- నెల్లూరు నగరంలోని నేటి ఉదయం మహానగరాలకు దీటుగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో మెడికవర్ హాస్పిటల్ సమీపంలో అంగరంగ వైభవంగా స్టార్ బిర్యాని రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం జరిగింది. మహానగరాలలో స్టార్ బిర్యాని ప్రత్యేక గుర్తింపు కలగని రుచికి నాణ్యతకు మంచి పేరు పొందినదని కావున నెల్లూరు ఒకసారి విచ్చేసి తమ స్టార్ బిర్యాని టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు వంశీకృష్ణ రెడ్డి మీడియాతో తెలిపారు. ఇటువంటి బిర్యానీ రెస్టారెంట్స్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డిని అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.1
- శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోఘనంగా గరుడ సేవ మండల కేంద్రమైన విడవలూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సీతా లక్ష్మ హనుమాన్ సమేత శ్రీ కోదండరామ స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు సీతారాములకు గరుడ సేవ ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సాయంత్రం ప్రత్యేక పూలంగి సేవ కార్యక్రమాన్ని ప్రత్యేక పూలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూలంగి సేవ అలంకరణ వచ్చిన భక్తులను ఆకర్షించింది. ఈ అలంకరణలో స్వామి అమ్మవార్లను చూసిన భక్తులు ముగ్దులే మైమరిచినారు. ఈ పూలంగి సేవ కు ఉభయకర్తలుగా కీర్తిశేషులు మడపర్తి వెంకటేశ్వర్లు కోడలు కుమారుడు మంజుల వేణుగోపాల్ వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు.4
- Post by Bondhu Suresh1
- బద్వేలు:రాజధాని అమరావతి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో రాజధానిపై కమ్ముకున్న అనిశ్చితి, చీకట్లు పూర్తిగా తొలగిపోయాయని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు నిర్వహించారు. అమరావతికి వెలుగులు వచ్చినట్లుగా సంకేతంగా దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు., “ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఇక శాశ్వత రాజధానిగా నిలవనుంది” అని అన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు తమ సొంత భూములను త్యాగంగా సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ కాలంలో రాజధాని అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆ పరిస్థితులను అర్థం చేసుకుని తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇకపై ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా అమరావతిని ఎవరూ కదిలించలేరని, ఇది రాష్ట్ర ప్రజల సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తరఫున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,చెరుకూరి రవికుమార్, పరిటాల వెంకట సుబ్బయ్య,బీరం జయ రామి రెడ్డి, పాలకొండు రాజశేఖర్ రెడ్డి,గాజులపల్లె శంకర్ రెడ్డి కొంకుల రాంబాబు, కల్వపల్లె వీర రెడ్డి, జహంగీర్ భాష,బోవిళ్ళ నరసింహ రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి, పఠాన్ మౌలాలి, రసూల్, ఉపత్తి సుబ్బారెడ్డి,గోపి రెడ్డి, సుబ్బా రాయుడు,రాము,గురు ప్రసాద్ రెడ్డి,కోటపాటి పెంచలయ్య,చిన్నప్ప రెడ్డి, గంగాధర్ రెడ్డి, వెంకటేష్ తదితరు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- వామ్మో తిరుపతిలో ఏంది ఎండలు దంచి కొడుతుంది.చల్లగా కూలింగ్ తాగుదాం.. బావా ఒక వానరం థమ్సప్ తాగుతున్న దృశ్యం...1
- ఈ రోజు Good Friday సందర్భంగా యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమ, క్షమ, నమ్మకం నేర్చుకుందాం 🙏1
- వైరల్: కారు ఢీకొనడంతో మహిళ గాలిలోకి విసిరివేయబడింది *రోడ్డు దాటేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన తెలియజేస్తుంది. కర్ణాటకలోని బంట్వాల్‌లో భారతి(48) అనే యువతి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. మధ్యలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనం వేగాన్ని అంచనా వేయకుండా ముందుకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఆమెను బలంగా ఢీకొట్టడంతో గాలిలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన భారతిని ఆస్పత్రికి తరలించారు. గత నెల 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.*1
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొట్టే పాలెం గ్రామం నెల్లూరు జిల్లా రూరల్ మండలం నందు శ్రీ కోదండ రామయ్య స్వామి వారి గరుడ సేవ ఘనంగా నిర్వహించారు. శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానము నందు బ్రహ్మోత్సవాలలో భాగంగా నేటి సాయంత్రం అంగరంగ వైభవంగా ఉదయం మోహిని ఉత్సవాము మరియు సాయంత్రం 8 గంటలకు గరుడ సేవ అంగరంగ వైభవంగా కన్నుల పండుగ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయ కర్తలగా వ్యవహరించిన వారు కీర్తిశేషులు అల్లా రెడ్డి పిచ్చమ్మ గారి జ్ఞాపకార్థం భర్త అల్లా రెడ్డి రంగారెడ్డి గారి కుమారులు అల్లారెడ్డి రవీందర్ రెడ్డి మరియు శ్రీమతి కవిత అల్లారెడ్డి సురేందర్రెడ్డి శ్రీమతి మాధవి లత అల్లా రెడ్డి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అర్చకుల వేదమంత్రాలతో వైభవంగా నగర ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ కూడా అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు భక్తులు స్థానికులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. దేవస్థానానికి వచ్చిన భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని నిర్వాహకులు మీడియాతో తెలిపారు.1