అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా శ్రావణ మాసం పూజలు గజ్వేల్ నియోజకవర్గం: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా గురువారం నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్యగారి శేఖర్ లతా దంపతులు,2 వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్ దంపతులు,వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బొగ్గుల సురేష్ గురుస్వామి,మాట్లాడుతూ, గజ్వేల్ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా స్వామివారికి దంపతుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించే కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని శ్రావణమాసం నెల రోజులు ప్రతి రోజు దంపతులచే స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని,ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అయిత సత్యనారాయణ,కోశాధికారి నారాయణరెడ్డి,కార్యదర్శి గోపి, నాయకులు గందె యాదగిరి, మర్యాల శ్రీనివాస్,లక్ష్మారెడ్డి,గంగిశెట్టి వెంకటేశం,కైలాస ప్రశాంత్, దేవానంద్, డెంటల్ శ్రీనివాస్,అంజయ్య, విక్రాంత్, దీపక్,గందె సంతోష్, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు
అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా శ్రావణ మాసం పూజలు గజ్వేల్ నియోజకవర్గం: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా గురువారం నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్యగారి శేఖర్ లతా దంపతులు,2 వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్ దంపతులు,వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బొగ్గుల సురేష్ గురుస్వామి,మాట్లాడుతూ, గజ్వేల్ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా స్వామివారికి దంపతుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించే కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని శ్రావణమాసం నెల రోజులు ప్రతి రోజు దంపతులచే స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని,ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అయిత సత్యనారాయణ,కోశాధికారి నారాయణరెడ్డి,కార్యదర్శి గోపి, నాయకులు గందె యాదగిరి, మర్యాల శ్రీనివాస్,లక్ష్మారెడ్డి,గంగిశెట్టి వెంకటేశం,కైలాస ప్రశాంత్, దేవానంద్, డెంటల్ శ్రీనివాస్,అంజయ్య, విక్రాంత్, దీపక్,గందె సంతోష్, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు
- అక్క కోసం 10అడుగుల రాఖీ చిత్రించి అంకితం ఇచ్చిన తమ్ముడు రామకోటి రామరాజు అక్క ప్రేమకు ప్రతిరూపంగా బిస్కెట్లతో భారీ రాఖీ అక్క పైన ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా, అక్క మధుర జ్ఞాపకాలను రాఖీ రూపంలో నిలిపి, తన ప్రేమకు ప్రతీకగా వివిధ రకాల బిస్కెట్లతో 10 అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని రూపొందించారు. మూడు రోజులపాటు శ్రమించి ప్రేమతో రూపొందించిన రాఖీ చిత్రాన్ని గురువారం ఆవిష్కరించి తన అక్కకు అంకితం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. అమ్మ తర్వాత అమ్మలా ఆప్యాయతను పంచిన నా అక్క ప్రతి సంవత్సరం నా చేతికి రాఖీ కట్టేదని ఆమె కట్టిన రాఖీ నాకు కేవలం దారం కాదు, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేదన్నారు. అక్క కట్టిన రాఖీతో బలం పొందిన ఈ చేతితోనే నేడు లక్షలాది మంది భక్తులచే శ్రీరామ నామాన్ని లిఖింపజేస్తున్నాను. అదే చేతితో ఎన్నో దేవతా చిత్రాలను రూపొందించి ప్రజల అభిమానంతో పాటు అనేక అవార్డులను అందుకున్నానన్నారు. నా కళకు, నా సేవకు అక్క ప్రేమే ఒక స్ఫూర్తి అని తెలిపారు. గతంలోనూ అక్క జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు పలు రాఖీ చిత్రాలను రూపొందించినట్లు చెప్పారు. అక్క తమ్ముడి మధ్య చెరగని ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ రాఖీ చిత్రాన్ని తిలకించిన ప్రజలు, ప్రముఖులు రామకోటి రామరాజును అభినందించారు.3
- హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జ తెలంగాణ ఉద్యోగ జేఏసీ హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జన తెలంగాణ ఉద్యోగ జేఏసీ (TGEJAC) పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మహాధర్నాలో మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని అన్ని సంఘాల నాయకులు, వైద్యులు, వైద్య ఆరోగ్య ఉద్యోగులు భారీగా పాల్గొని తమ ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా TGO Doctors Forum & TMPHDA అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్దన్ మాట్లాడుతూ: 🔴 2వ PRCను వెంటనే అమలు చేయాలి 🔴 6 పెండింగ్ DAలను విడుదల చేయాలి 🔴 OPSను పునరుద్ధరించాలి 🔴 పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి 🔴 EHSలోని లోటుపాట్లను పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో, *TGEJAC చైర్మన్ మారం జగదీష్ అన్నగారు, జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాస్ అన్నగారి నాయకత్వంలో సెప్టెంబర్ 10న “చలో హైదరాబాద్”* కార్యక్రమాన్ని నిర్వహించి, లక్షలాది ఉద్యోగులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. 🤝 మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్ ఐక్య గళం ఈ మహాధర్నాలో వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. డా. కిరణ్ మాదాల డా. వెంకట్ యాదవ్ శ్రీనివాస్ కొప్పునమోని శ్రీనివాస్ మెంగా సుజాత రాథోడ్ దేవిక రొక్కం బత్తిని సుదర్శన్ గౌడ్ డా. రవికుమార్ ✊🏻 ఐక్యంగా నిలబడదాం… హక్కులు సాధించుకుందాం ,జై TGEJAC✊🏻1
- గుంతల రోడ్డుపై.. నిరసన బాట! డాంబర్ రోడ్డు కోసం 29న పాదయాత్ర.. సన్నాహక సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ జిల్లా, నిజాంపేట: మూడేళ్లుగా అధ్వానంగా ఉన్న చల్మెడ కమాన్–నందగోకుల్ రహదారికి డాంబర్ వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న పాదయాత్రకు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, బాల్‌రెడ్డి, రంజిత్‌గౌడ్, దయాకర్, శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.2
- మేడ్చల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. బీసీ ఎమ్మెల్యే కోసం ‘సర్జికల్ స్ట్రైక్–59’ మేడ్చల్: నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేడ్చల్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికవుతూ వచ్చారని ‘సర్జికల్ స్ట్రైక్–59’ ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.1
- ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద మహాధర్నా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ దొంత నరేందర్ మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదికను వెల్లడించి ఫిట్‌మెంట్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన ఆరు విడతల కరువు భత్యాన్ని మంజూరు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించే ఆరోగ్య కార్డుల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.1
- అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరి ఓటు పరిరక్షణే SIR-2 లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బోనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో SIR-2 వార్డు సభ నిర్వహించారు. ప్రజలకు మరింత చేరువగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రజలతో కలిసి నేలపై కూర్చొని సభ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై SIR-2 కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి అర్హుడి ఓటు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా కాపాడుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.. ఏవైనా లోపాలు ఉన్నట్లయితే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పేర్కొంటూ, ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భువనగిరి సర్ కోఆర్డినేటర్ ఇ.వి. శ్రీనివాస్ రావు మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ , వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవెస్ చిస్తి PACS చైర్మన్ కొండల్ రెడ్డి ,RDO కృష్ణారెడ్డి గ, MRO జగన్ , పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ , కౌన్సిలర్స్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు BLA లు పాల్గొన్నారు... ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకమైన ఓటరు జాబితా – ప్రజాస్వామ్య పరిరక్షణే మనందరి లక్ష్యం అని నాయకులు పేర్కొన్నారు.4
- *- భారీ బండరాయి ఎలా కొట్టుకుపోయిందో చూడండి!* నేపాల్ వరదల్లో ఓ భారీ బండరాయి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అవుతోంది. టన్నుల కొద్దీ బరువుండే ఆ రాయిని నదీ ప్రవాహం సులభంగా ముందుకు తీసుకెళ్లింది. అంత పెద్ద రాయి పరిస్థితే ఇలా ఉంటే తీరం వెంబడి ఉన్న ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసం అయి ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. కాగా 2013లో కేదార్నాథ్ వరదల్లో ఓ భారీ బండరాయి వచ్చి ఆలయం వెనుక ఆగింది. దాన్ని భక్తులు 'భీమశిల'గా భావించి పూజలు చేస్తున్నారు.. *- భారీ బండరాయి ఎలా కొట్టుకుపోయిందో చూడండి!* నేపాల్ వరదల్లో ఓ భారీ బండరాయి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అవుతోంది. టన్నుల కొద్దీ బరువుండే ఆ రాయిని నదీ ప్రవాహం సులభంగా ముందుకు తీసుకెళ్లింది. అంత పెద్ద రాయి పరిస్థితే ఇలా ఉంటే తీరం వెంబడి ఉన్న ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసం అయి ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. కాగా 2013లో కేదార్నాథ్ వరదల్లో ఓ భారీ బండరాయి వచ్చి ఆలయం వెనుక ఆగింది. దాన్ని భక్తులు 'భీమశిల'గా భావించి పూజలు చేస్తున్నారు..1
- యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు4