జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో పలు ప్రజా సంక్షేమ అంశాలపై సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ, సంక్షేమ పథకాల అమలు, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశం శనివారం జిల్లా కలెక్టర్ జిల్లా ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన ఐడీఓసీలోని కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల జిల్లా అధికారులు, కామారెడ్డి జిల్లా దివ్యాంగుల సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, మైనారిటీ, బీసీ, గిరిజన సంక్షేమ విద్యాసంస్థలకు ఆవిరితో ఉడికించిన బియ్యం (స్టీమ్ రైస్) సరఫరా, విద్యాసంస్థలకు గ్యాస్ సిలిండర్ల సరఫరా, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం దివ్యాంగులకు కొత్త చౌక ధరల దుకాణాల ఏర్పాటు, ఈ-కేవైసీ నమోదులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ, దీపం పథకం ప్రయోజనాల బదిలీ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను మానవీయ దృక్పథంతో పరిశీలించి, వారికి అవసరమైన సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ-కేవైసీ నమోదులో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి నిత్యావసర సరుకులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టళ్లు, ప్రభుత్వ విద్యాసంస్థలకు నాణ్యమైన ఆవిరితో ఉడికించిన బియ్యం, గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం దివ్యాంగులకు చౌక ధరల దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిబంధనల మేరకు వేగవంతం చేయాలని తెలిపారు. జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు సమావేశంలో ప్రస్తావించిన ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిగణించి, సంబంధిత శాఖలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమానికి. సంబంధించిన ప్రతి అంశంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ NY గిరి. ట్రైనింగ్ కలెక్టర్ రవితేజ. DM శ్రీకాంత్. రవీందర్. జిల్లా అధికారులు పాల్గొన్నారు

- కామారెడ్డి జిల్లా కేంద్రంలో లిటిల్ స్కాలర్స్ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు, అదనపు చార్జీలు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ప్రతి విద్యార్థి నుంచి రూ.4 వేల వరకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని, దీనిపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అలాగే పాఠశాల యాజమాన్యం పుస్తకాలను పాఠశాలలోనే విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిరసన సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.1
- నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ నీ తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబూ తో కలిసి పరిశీలించరు మంత్రి వివేక్ వెంకట స్వామి మంత్రి కామెంట్స్ ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ లో ఉండేది కోదిరోజులుగా బిఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతు బ్యారేజ్ లు లేకుండా పంపు లు నడిపియండి అంటూ ప్రచారం చేశారు బ్యారేజ్ లు లేకుండా పంపులు నడిపితే బ్యారేజ్ లు ఎందుకు కట్టినట్టు మరి గతంలో 60 టీఎంసీలు ఎల్లంపల్లి కి పంపు చేశారు తిరిగి వరద రావడం తో దాన్ని గోదావరి లోకి వదిలేసారు దానికి 30వేల కోట్ల కరంట్ బిల్లులు వచ్చాయి.. అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచిస్తుంది కేంద్రం డ్యామ్ సేఫ్టీ కమిటీ అందులో మళ్ళీ నీళ్లు నింపారాదు అని మరోసారి చెప్పింది కాబట్టి దానికి అనుగుణంగా నే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఉత్తమ్ కుమార్ కామెంట్స్ శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ 112టీఎంసీలు కానీ పూడిక తీత వాళ్ళ 80కి పడిపోయింది మళ్ళీ 112టీఎంసీలకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాబోయే రోజుల్లో వరద ఎంత వస్తుంది ఎంత సాగు నీరు ఇవ్వగలం అనేది స్పష్టమైన ప్రకటన రెండు మూడు రోజుల్లో ఇస్తాం మెడిగడ్డ సుందిల్ల అన్నారం పంపు హౌస్ లు అవసరం లేకుండా నే కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి లో 20 టీఎంసీల నీరు వచ్చింది దీనిపై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది రైతులు గమనించాలి నిన్న కూడా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ బ్యారేజ్ ల్లో నీరు నింపదు అని తెలిపారు ఆ బ్యారేజ్ లకి ప్రభుత్వం వ్యతిరేకం కాదు దాన్ని పూర్తిగా పరిశీలించి మర్మతులు చేస్తాం దీనిలో రాజకీయ దురుద్దెశం లేదు కానీ ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ స్వర్గీయ శ్రీపాద రావ్ గారి పేరుపై అప్పట్లో కట్టిన శ్రీరాంసాగర్, శ్రీశైలం, నిజం సాగర్ నాగార్జునా సాగర్ 60 ఏళ్ళు అయినా ఎలా ఉన్నాయి బిఆర్ఎస్ కట్టిన అన్నారం మెడిగడ్డ, సుందిల్లా ఎలా ఉంది ప్రజలు గమనించాలి జాతీయ అంతర్జాతీయ నిపుణులు సూచనల మేరకు ముందుకు వెళ్తాము4
- భారీ వర్షంతో తడిసిముద్దైన బాన్సువాడ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన బాన్సువాడ పట్టణంలో శనివారం కురిసిన భారీ వర్షంతో జనజీవనం కొంతసేపు అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. కొంతకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. వ్యవసాయ పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.2
- గ్రామాభివృద్ధిపై చిన్న శంకరంపేటలో గ్రామసభ, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చిన్న శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో శనివారం నిర్వహించిన గ్రామసభలో గ్రామాభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సభ్యుల అభిప్రాయాలను సేకరించారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా దోమల నివారణ చర్యలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అలాగే గ్రామంలోని అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరుస్తామని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు.1
- బోధన్ ఉర్సు మహోత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హజ్రత్ షా జలాల్ బుఖారీ (రహ్.) 675వ ఉర్సు మహోత్సవాల్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. పాల్గొన్నారు. దర్గా వద్ద చాదర్ సమర్పించి, గులాబీ పూలతో నివాళులర్పించిన కమిషనర్... రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా నిర్వాహకులు పోలీస్ కమిషనర్‌కు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, దర్గా కార్యదర్శి ముక్తాదారు, మత పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి – బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మెదక్, శనివారం: భారతీయ జనతా యువ మోర్చా (BJYM) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే పిలుపు మేరకు, మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆరోపించారు. విద్యార్థులను అవమానించేలా మాట్లాడటం సరికాదని, వెంటనే విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నిరసనలో భాగంగా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పోలీసు అధికారులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్, బీజేపీ టౌన్ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైఎం నాయకులు ప్రేమ్, గణేష్, నర్సింగ్, రవి, రమేష్, గిరి, ప్రవీణ్, మధు, బబ్లూ, సన్నీ, మహేందర్, శ్యామ్ గౌడ్, చందు, సాయి, రాజేష్, దశరథ్, అనిల్, రాహుల్, విక్రమ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.1