logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి – బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మెదక్, శనివారం: భారతీయ జనతా యువ మోర్చా (BJYM) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే పిలుపు మేరకు, మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆరోపించారు. విద్యార్థులను అవమానించేలా మాట్లాడటం సరికాదని, వెంటనే విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నిరసనలో భాగంగా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పోలీసు అధికారులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్, బీజేపీ టౌన్ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైఎం నాయకులు ప్రేమ్, గణేష్, నర్సింగ్, రవి, రమేష్, గిరి, ప్రవీణ్, మధు, బబ్లూ, సన్నీ, మహేందర్, శ్యామ్ గౌడ్, చందు, సాయి, రాజేష్, దశరథ్, అనిల్, రాహుల్, విక్రమ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

5 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•
5 hrs ago

సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి – బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మెదక్, శనివారం: భారతీయ జనతా యువ మోర్చా (BJYM) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే పిలుపు మేరకు, మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆరోపించారు. విద్యార్థులను అవమానించేలా మాట్లాడటం సరికాదని, వెంటనే విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నిరసనలో భాగంగా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పోలీసు అధికారులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్, బీజేపీ టౌన్ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైఎం నాయకులు ప్రేమ్, గణేష్, నర్సింగ్, రవి, రమేష్, గిరి, ప్రవీణ్, మధు, బబ్లూ, సన్నీ, మహేందర్, శ్యామ్ గౌడ్, చందు, సాయి, రాజేష్, దశరథ్, అనిల్, రాహుల్, విక్రమ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రుద్రారం గీతం యూనివర్సిటీలో పాల్గొన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 17వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు హాజరై స్నాతకోపన్యాసం చేశారు. మొత్తం 1990 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా, 17 బంగారు పతకాలు అందజేశారు. చేనేత కళాకారుడు కు గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ప్రదానం చేశారు. రాజమౌళి రాకతో విద్యార్థులు ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు.
    1
    రుద్రారం గీతం యూనివర్సిటీలో పాల్గొన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 
హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 17వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు  హాజరై స్నాతకోపన్యాసం చేశారు. మొత్తం 1990 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా, 17 బంగారు పతకాలు అందజేశారు. చేనేత కళాకారుడు కు గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ప్రదానం చేశారు. రాజమౌళి రాకతో విద్యార్థులు ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • భారీ వర్షంతో తడిసిముద్దైన బాన్సువాడ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన బాన్సువాడ పట్టణంలో శనివారం కురిసిన భారీ వర్షంతో జనజీవనం కొంతసేపు అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. కొంతకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. వ్యవసాయ పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.
    2
    భారీ వర్షంతో తడిసిముద్దైన బాన్సువాడ
లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

బాన్సువాడ పట్టణంలో శనివారం కురిసిన భారీ వర్షంతో జనజీవనం కొంతసేపు అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది.
కొంతకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. వ్యవసాయ పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.
    user_SUDHAM VITTAL
    SUDHAM VITTAL
    Banswada, Kamareddy•
    4 hrs ago
  • జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.
    1
    జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు
బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు
జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని  ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    27 min ago
  • అంబీర్ చెరువులో ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేయాలి: ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ డివిజన్ ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు అంబీర్ చెరువులో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాంతంలో చట్టవిరుద్ధంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మిస్తున్నారని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంబీర్ చెరువు కబ్జాల కారణంగా 150 ఎకరాలకు కుదించబడిందని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్‌ను అడ్డుకుంటామని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాలనీవాసుల పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, సుందరీకరణ పేరుతో చెరువులను ఆక్రమించి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆదిత్యనగర్ కాలనీ ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి, ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
    3
    అంబీర్ చెరువులో ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేయాలి: ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ డివిజన్ ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు అంబీర్ చెరువులో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాంతంలో చట్టవిరుద్ధంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మిస్తున్నారని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు.
ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంబీర్ చెరువు కబ్జాల కారణంగా 150 ఎకరాలకు కుదించబడిందని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్‌ను అడ్డుకుంటామని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాలనీవాసుల పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, సుందరీకరణ పేరుతో చెరువులను ఆక్రమించి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆదిత్యనగర్ కాలనీ ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి, ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    25 min ago
  • నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన బిల్లుల చెల్లింపులలో దాదాపు కోటి 70 లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్ కి బీజేపీ కౌన్సిలర్ ల పిర్యాదు కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం అనంతరం జరిగిన బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని, ఈ విషయంలో అధికారులతో పాటు పాలకవర్గంలోని కొంత మంది చేతి వాటం చూయించారని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కలిసి పిర్యాదు చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ లు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో నూతన పాలక వర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కామారెడ్డి మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 5,92,91,364 ఖర్చు కాగా అందులో 75 బిల్లులు 1,13,14566 రూపాయల చెల్లింపు విషయంలో, అంతే కాకుండా SDRF సంబంధించిన 71,28,937 రూపాయలు ఖర్చు కా అందులో 5 బిల్లులకు గాను 59,86,353 రూపాయలు చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్టుగా అనుమానం అందని వీటి విషయంలో సరియైన విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై, వాటి వెనక ఉన్న ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరడం జరిగిందని, ఈ విషయంలో సరియైన స్పందన రాకపోతే విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి పిర్యాదు చేస్తామని అన్నారు.
    1
    నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన బిల్లుల చెల్లింపులలో దాదాపు కోటి 70 లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్ కి బీజేపీ కౌన్సిలర్ ల పిర్యాదు
కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం అనంతరం జరిగిన బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని, ఈ విషయంలో అధికారులతో పాటు పాలకవర్గంలోని కొంత మంది చేతి వాటం చూయించారని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కలిసి పిర్యాదు చేయటం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ లు మాట్లాడుతూ  కామారెడ్డి పట్టణంలో నూతన పాలక వర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కామారెడ్డి మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 5,92,91,364 ఖర్చు కాగా అందులో 75 బిల్లులు 1,13,14566 రూపాయల చెల్లింపు విషయంలో, అంతే కాకుండా SDRF సంబంధించిన 71,28,937 రూపాయలు ఖర్చు కా అందులో 5 బిల్లులకు గాను 59,86,353 రూపాయలు చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్టుగా అనుమానం అందని వీటి విషయంలో సరియైన విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై, వాటి వెనక ఉన్న ప్రజా ప్రతినిధులపై  చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ ని కోరడం జరిగిందని, ఈ విషయంలో సరియైన స్పందన రాకపోతే  విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి పిర్యాదు చేస్తామని అన్నారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి – బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మెదక్, శనివారం: భారతీయ జనతా యువ మోర్చా (BJYM) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే పిలుపు మేరకు, మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆరోపించారు. విద్యార్థులను అవమానించేలా మాట్లాడటం సరికాదని, వెంటనే విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నిరసనలో భాగంగా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పోలీసు అధికారులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్, బీజేపీ టౌన్ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైఎం నాయకులు ప్రేమ్, గణేష్, నర్సింగ్, రవి, రమేష్, గిరి, ప్రవీణ్, మధు, బబ్లూ, సన్నీ, మహేందర్, శ్యామ్ గౌడ్, చందు, సాయి, రాజేష్, దశరథ్, అనిల్, రాహుల్, విక్రమ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ 
రేవంత్ రెడ్డి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి – బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్
మెదక్, శనివారం:
భారతీయ జనతా యువ మోర్చా (BJYM) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే పిలుపు మేరకు, మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆరోపించారు. విద్యార్థులను అవమానించేలా మాట్లాడటం సరికాదని, వెంటనే విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అలాగే విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
నిరసనలో భాగంగా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పోలీసు అధికారులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్, బీజేపీ టౌన్ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైఎం నాయకులు ప్రేమ్, గణేష్, నర్సింగ్, రవి, రమేష్, గిరి, ప్రవీణ్, మధు, బబ్లూ, సన్నీ, మహేందర్, శ్యామ్ గౌడ్, చందు, సాయి, రాజేష్, దశరథ్, అనిల్, రాహుల్, విక్రమ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.