Shuru
Apke Nagar Ki App…
గంభీరావుపేట అంగన్వాడిలో పోషణ పక్షోత్సవాలు.............. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేట అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ పక్షోత్సవాల సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ జుమ్మడి మల్లేశ్వరి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సర్పంచ్ జుమ్మిడి కిష్టయ్య ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి పౌష్టికాహారం కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Krishna
గంభీరావుపేట అంగన్వాడిలో పోషణ పక్షోత్సవాలు.............. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేట అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ పక్షోత్సవాల సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ జుమ్మడి మల్లేశ్వరి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సర్పంచ్ జుమ్మిడి కిష్టయ్య ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి పౌష్టికాహారం కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- సిర్పూర్ (టి) మండల కేంద్రంలో నోయిడా కార్మికులపై లాఠీచార్జ్, అరెస్టులకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో హమాలీ కార్మికుల అడ్డా వద్ద నిరసన జరిగింది. జిల్లా జాయింట్ సెక్రటరీ వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ, కార్మికులు కనీస వేతనాలు, 8 గంటల పని దినం, కాంట్రాక్ట్ విధానం రద్దు వంటి డిమాండ్ల కోసం శాంతియుతంగా పోరాడుతుండగా అణచివేత చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. కార్మికుల సమస్యలను పక్కన పెట్టి నిర్బంధాలు, అరెస్టులు చేయడం తగదని, వెంటనే ఈ చర్యలు నిలిపి డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.1
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ప్రక్రియ నేతకాని సామాజిక వర్గంలో పెను మంటలు రేపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధాన శక్తిగా ఉన్న నేతకానీలను జనాభా లెక్కల్లో విస్మరించడంపై ఆ సామాజిక వర్గ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వివక్షను నిరసిస్తూ నేతకాని విద్యార్థి సంఘం (TNMVS OUJAC) రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత ప్రభుత్వానికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. "మా ఉనికిని తుడిచేస్తారా?" - ఆగ్రహం వ్యక్తం చేసిన సాయిని ప్రసాద్ కులగణన నివేదికల్లో నేతకాని కులానికి కనీస గుర్తింపు ఇవ్వకపోవడంపై ఓయూ వేదికగా జరిగిన సమావేశంలో సాయిని ప్రసాద్ నేత మాట్లాడారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు కుట్ర పూరిత వివక్ష: "తెలంగాణ గడ్డపై 12 లక్షల జనాభా కలిగిన మా సమాజాన్ని లెక్కల్లో చూపకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, నేతకానీల గొంతు నొక్కే ప్రయత్నం." 40 నియోజకవర్గాల్లో పంజా: రాష్ట్రవ్యాప్తంగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతకాని ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారని, తమను తక్కువ అంచనా వేస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. తొత్తుల పాలన: ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే కొమ్ముకాస్తూ, అత్యంత వెనుకబడిన నేతకానీలను విస్మరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కార్యాచరణ సిద్ధం ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు నేతకాని బిడ్డలంతా ఏకతాటిపైకి వచ్చి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.1
- రోడ్డు నియమాలను అందరూ పాటించాలని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ సూచించారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అలైవ్ అరైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ అప్పాల జలపతి, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ ఉన్నారు.1
- జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం తాటిపల్లిలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల కు చెందిన సీనియర్ కంటి వైద్యులు డా. ముదస్సర్ తన సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంవిఐ లు అభిలాష్, ప్రమీల, షేక్ రియాజ్, రామారావు, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కంటి పరీక్షల అనంతరం, డా. ముదస్సర్ ప్రస్తుత ఎండాకాలంలో వాహన డ్రైవర్లతో పాటుగా చిన్నపిల్లలు, వృద్దులు కంటి జాగ్రతల కోసం టీబీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.1
- *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, ఏప్రిల్ 17 :- *ప్రమాదంలో గాయపడిన వారి ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి చేర్చిన ఒక లక్ష యాభై వేల వరకు నగదు రహిత చికిత్స.* *సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ శిక్షణలో స్వయంగా పాల్గొన్న జిల్లా ఎస్పి* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* “అరైవ్ అలైవ్” వారోత్సవాలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈరోజు స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి అధ్యక్షతన రిమ్స్ ఆసుపత్రి నిష్ణాతులైన అనస్తేషియా వైద్యులచే డయల్ 100, బ్లూ కోర్ట్, స్పెషల్ పార్టీ, ఏ ఆర్ సిబ్బందికి సిపిఆర్ (CPR) మరియు ఫస్ట్ ఎయిడ్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాద సందర్భంలో ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ కీలక భూమిక పోషిస్తుందని, గోల్డెన్ అవర్‌లోపు బాధితుడికి తక్షణ వైద్య సహాయం అందిస్తే ప్రాణాలను రక్షించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. సిపిఆర్ చేయడానికి ముందు బాధితుడు స్పృహలో ఉన్నాడో లేదో నిర్ధారించుకోవాలని, గుండె స్పందన ఆగిపోయిన సందర్భంలో మాత్రమే సిపిఆర్ నిర్వహించాలని సూచించారు. రోడ్డుపై జరిగిన ప్రమాదాలను గమనించిన వెంటనే స్పందించి బాధితులను సమీప ఆసుపత్రికి తరలించడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “రహ-వీర్” పథకం ద్వారా నగదు బహుమతి లభిస్తుందని, అలాగే ప్రమాద బాధితులకు సమీప ఆసుపత్రిలో ₹1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందుబాటులో ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి చేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ శిక్షణలో పాల్గొనడం జరిగింది. అధికారులు, సిబ్బందికి ప్రతి ఒక్కరికి శిక్షణను అందించి ప్రాణాపాయ సమయంలో రక్షించేలా సంసిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు, ఆర్ ఐ లు, రిజర్వ్ సిబ్బంది రిమ్స్ వైద్యులు అనస్థీషియా డా శ్యామ్ సుందర్, డా గంగాధర్, డా వివేక్, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.4
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నాయకులు పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు రాజీనామా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం వైఖరికి నిరసనగా రాజీనామా ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గెలుపుకై శాయశక్తులా కృషి చేశాం కొడిమ్యాల మండలానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ ఎమ్మెల్యే నెరవేర్చలేదు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అనుచరులు స్కాంకు పాల్పడుతున్నారు అన్ని తెలిసినా ఎమ్మెల్యే సత్యం ఆయన అనుచరులకే వంత పాడుతున్నారు పూడూర్ ఖాదీ బోర్డు ల్యాండ్ ఏమైందో ఎమ్మెల్యే సత్యం చెప్పాలి అంటూ నిలదీసిన కాంగ్రెస్ నాయకులు1
- ఆదిలాబాద్ జిల్లా : ప్రజా పాలన ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఎస్టీయూ భవన్లో జరిగిన ప్రత్యేక మున్సిపల్ స్థాయి సమావేశంలో ప్రసంగించిన మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్1
- ప్రభుత్వ పాఠశాలలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి పాఠశాల హెచ్ఎం గిరిధర్ అన్నారు. శుక్రవారం గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులువిద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్ ఉన్నారు.1