logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిఘానేత్రాలతో గ్రామానికి భద్రత దొంగతనాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం నాతవరం (సత్య ఆంధ్ర): పీ.కే.గూడెం గ్రామంలో జరుగుతున్న శ్రీ తలుపులమ్మతల్లి పండుగ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని మూడు రోడ్ల జంక్షన్ వద్ద సీసీ కెమెరాలను శాశ్వతంగా ఏర్పాటు చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు గాడి వెంకటరమణ, నీటి సంఘం అధ్యక్షుడు అచ్యుత వెంకటరమణతో పాటు పలువురు నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దొంగతనాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్సై తెలిపారు. ముఖ్యంగా నిఘా, భద్రతా పర్యవేక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇదే విధంగా ప్రతి గ్రామంలో యువకులు, నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిఘానేత్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఎస్సై కోరారు. గ్రామ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన గ్రామ కమిటీ, నాయకులను ఆయన అభినందించారు.

6 hrs ago
user_SETTI SIVA SATYANARAYANA
SETTI SIVA SATYANARAYANA
Local News Reporter నాతవరం, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago
257b070f-841f-48be-8d14-95db1b2f7e4c

నిఘానేత్రాలతో గ్రామానికి భద్రత దొంగతనాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం నాతవరం (సత్య ఆంధ్ర): పీ.కే.గూడెం గ్రామంలో జరుగుతున్న శ్రీ తలుపులమ్మతల్లి పండుగ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని మూడు రోడ్ల జంక్షన్ వద్ద సీసీ కెమెరాలను శాశ్వతంగా ఏర్పాటు చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు గాడి వెంకటరమణ, నీటి సంఘం అధ్యక్షుడు అచ్యుత వెంకటరమణతో పాటు పలువురు నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో

f7ef81b3-44b6-4f8e-99b4-372fa1a2b9ff

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దొంగతనాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్సై తెలిపారు. ముఖ్యంగా నిఘా, భద్రతా పర్యవేక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇదే విధంగా ప్రతి గ్రామంలో యువకులు, నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిఘానేత్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఎస్సై కోరారు. గ్రామ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన గ్రామ కమిటీ, నాయకులను ఆయన అభినందించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకలు అనకాపల్లి:స్థానిక సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షు లు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో పట్టణం లో గల కన్యకాపరమేశ్వరి దేవాలయం జంక్షన్ లో గల భారతరత్న మదర్ థెరిస్సా విగ్రహం వద్ద మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకల ను ఘనముగా నిర్వహించా రు. ఈ కార్యక్రమం లో సంస్థ అధ్యక్షులు బల్లా నాగభూష ణము మదర్ థెరిస్సా విగ్ర హానికి జ్యోతి వెలిగించి పూలమాల వేసి ఘనముగా నివాళి లర్పించారు.విద్యా ర్థులకు, పాదచారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బల్లా నాగభూషణం మాట్లాడు తూ మదర్ థెరిస్సా గారు భారతదేశమునకు చేసిన సేవలు ఎన్నటికీ మరచి పోలేనివని వారు మన దేశము లో నిరుపేదలకు, కుష్ఠు రోగులకు,క్షయ వ్యాధి గ్రస్తులకు, క్షత గాత్రులకు, తన ఫౌండేషన్ ద్వారా అశేషమైన సేవలను అందించిన మహనీయ వ్యక్తియని, అటువంటి మహనీయ సేవామూర్తి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వారి శత జయంతి ని పురష్కరించు కొని అత్యుత్తమ భారత రత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించిందని, అలాగే వారి సేవలకు గాను రామన్ మెగ సేసే అవార్డు, ప్రపంచం నోబెల్ బహుమతీ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న సేవా మూర్తి యని, ప్రార్ధించే పెదవులక న్నా సాయం చేసే చేతులు మిన్న అన్న ఆశయ స్ఫూర్తి తో తన జీవితమంతా అన్నార్థుల, అభాగ్యుల సేవల కే అంకితం చేశారని అటువంటి గొప్ప మహనీ య వ్యక్తి 116 వ జన్మదినం సందర్భముగా వారికి ఘన నివాళులు అర్పించుకోవడం ఎంతో గర్వముగా సంతోష ముగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శులు రొబ్బి మల్లేశ్వరరావు, బల్లా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు అయ్యగారి వెంకటరమణ మూర్తి, పొట్టి శ్రీరాములు భవన్ చైర్మన్ పిరాట్ల నరసింహ మూర్తి, జె. ఎం. జె. స్కూల్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్దులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా రు.
    1
    సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకలు
అనకాపల్లి:స్థానిక సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షు 
లు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో పట్టణం లో గల కన్యకాపరమేశ్వరి దేవాలయం జంక్షన్ లో గల 
భారతరత్న మదర్ థెరిస్సా 
విగ్రహం వద్ద మదర్ థెరిస్సా 
116 వ జయంతి వేడుకల
ను ఘనముగా నిర్వహించా 
రు. ఈ కార్యక్రమం లో సంస్థ 
అధ్యక్షులు బల్లా నాగభూష
ణము మదర్ థెరిస్సా విగ్ర
హానికి జ్యోతి వెలిగించి పూలమాల వేసి ఘనముగా 
నివాళి లర్పించారు.విద్యా
ర్థులకు, పాదచారులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా బల్లా నాగభూషణం మాట్లాడు
తూ మదర్ థెరిస్సా గారు 
భారతదేశమునకు చేసిన సేవలు ఎన్నటికీ మరచి పోలేనివని వారు మన దేశము లో నిరుపేదలకు, కుష్ఠు రోగులకు,క్షయ వ్యాధి 
గ్రస్తులకు, క్షత గాత్రులకు, తన ఫౌండేషన్ ద్వారా అశేషమైన సేవలను అందించిన మహనీయ వ్యక్తియని, అటువంటి మహనీయ సేవామూర్తి 
చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వారి శత జయంతి ని పురష్కరించు కొని అత్యుత్తమ భారత
రత్న పురస్కారాన్ని ఇచ్చి 
గౌరవించిందని, అలాగే వారి సేవలకు గాను రామన్ మెగ
సేసే అవార్డు, ప్రపంచం నోబెల్ బహుమతీ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న సేవా మూర్తి
యని, ప్రార్ధించే పెదవులక
న్నా సాయం చేసే చేతులు మిన్న అన్న ఆశయ స్ఫూర్తి
తో తన జీవితమంతా అన్నార్థుల, అభాగ్యుల సేవల కే అంకితం చేశారని 
అటువంటి గొప్ప మహనీ
య వ్యక్తి 116 వ జన్మదినం 
సందర్భముగా వారికి ఘన 
నివాళులు అర్పించుకోవడం 
ఎంతో గర్వముగా సంతోష ముగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిద్దార్థ అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శులు 
రొబ్బి మల్లేశ్వరరావు, బల్లా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు అయ్యగారి వెంకటరమణ మూర్తి, పొట్టి 
శ్రీరాములు భవన్ చైర్మన్ 
పిరాట్ల నరసింహ మూర్తి, 
జె. ఎం. జె. స్కూల్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్దులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా
రు.
    user_Nagireddy Sivaji
    Nagireddy Sivaji
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    51 min ago
  • రోలుగుంటలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన ర్యాలీ.... రోలుగుంట, ఆగస్టు 26: ఫ్లోరైడ్‌ ప్రభావిత రోలుగుంటలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ దళిత, గిరిజన, పేద మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. వరాహ నదిలో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. కాలనీలకు తక్షణం ట్యాంకర్ల ద్వారా నీరందించాలని, సీఎస్‌ఆర్‌, డీఎఫ్‌ఎం నిధులతో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. సీపీఎం నాయకులు కె.గోవిందరావు, వి.నూకరత్నం, వి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
    4
    రోలుగుంటలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన ర్యాలీ....
రోలుగుంట, ఆగస్టు 26: ఫ్లోరైడ్‌ ప్రభావిత రోలుగుంటలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ దళిత, గిరిజన, పేద మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. వరాహ నదిలో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. కాలనీలకు తక్షణం ట్యాంకర్ల ద్వారా నీరందించాలని, సీఎస్‌ఆర్‌, డీఎఫ్‌ఎం నిధులతో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. సీపీఎం నాయకులు కె.గోవిందరావు, వి.నూకరత్నం, వి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
    user_NANI
    NANI
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • విజయనగరం: బీసీల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీ నాయకులు, బీసీ వర్గాలపై జరిగిన దాడులు, అణచివేతలను గుర్తుచేస్తూ.. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. బీసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతతో పాటు బీసీ నాయకులకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
    1
    విజయనగరం: బీసీల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు..
విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు   పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీ నాయకులు, బీసీ వర్గాలపై జరిగిన దాడులు, అణచివేతలను గుర్తుచేస్తూ.. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు.
బీసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతతో పాటు బీసీ నాయకులకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • విజయనగరం పట్టణంలో మీలాద్-ఉన్-నబి పండగ బారి ర్యాలీ నిర్వహణ విజయనగరం పట్టణం పరిధిలో ముస్లిం సోదరులు మీలాద్-ఉన్-నబి పండగ సందర్భంగా బుధవారం ఉదయం బారి ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మత స్థాపకుడు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పండగ జరుపుకుంటున్నామని ముస్లిం ఐక్య సంఘం తెలిపారు. విజయనగరం కోట జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు అధిక సంఖ్యలో ముస్లిం మత సంఘాలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
    1
    విజయనగరం పట్టణంలో మీలాద్-ఉన్-నబి పండగ బారి ర్యాలీ నిర్వహణ 
విజయనగరం పట్టణం పరిధిలో ముస్లిం సోదరులు మీలాద్-ఉన్-నబి పండగ సందర్భంగా బుధవారం ఉదయం బారి ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మత స్థాపకుడు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పండగ జరుపుకుంటున్నామని ముస్లిం ఐక్య సంఘం తెలిపారు. విజయనగరం కోట జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు అధిక సంఖ్యలో ముస్లిం మత సంఘాలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    1
    బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ 
పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే బేబీనాయన.. పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్.. - ⁠వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం. బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.
    1
    బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే  బేబీనాయన..
పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్..
- ⁠వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం.
బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. 
గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.
    user_వెంకీ నాయుడు
    వెంకీ నాయుడు
    Photographer బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • శ్రీకాకుళం నగరంలో ప్లే గ్రౌండ్ గా మారిన హెలి ప్యాడ్..! శ్రీకాకుళం నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలలకు క్రీడా మైదానాల కొరత ఉంది. ఈ కారణంగా విద్యార్థులు ఖాళీ స్థలాలు పార్కుల్ని క్రీడా మైదానాలుగా వాడుకుంటున్నారు.అవీ చాలక ఇప్పుడు నగరంలోని డచ్ బంగ్లా సమీపంలో ఉన్న హెలిప్యాడ్ ని సైతం క్రీడామైదానంగా తయారు చేసారు. భద్రతాపరమైన ప్రోటోకాల్ హెలి ప్యాడ్ సమీపంలో అమలులో ఉంటుంది. అయినా సంబంధిత అధికారులు గాని, క్రీడాకారులు గాని ఎవరూ పట్టించుకోవటం లేదు. నగరంలో మరిన్ని ఆట స్థలాలను ఏర్పాటు చేసి, అభివృద్ధి చేయాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    శ్రీకాకుళం నగరంలో  ప్లే గ్రౌండ్ గా మారిన హెలి ప్యాడ్..!
శ్రీకాకుళం నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలలకు క్రీడా మైదానాల కొరత ఉంది. ఈ కారణంగా విద్యార్థులు ఖాళీ స్థలాలు పార్కుల్ని క్రీడా మైదానాలుగా వాడుకుంటున్నారు.అవీ చాలక ఇప్పుడు నగరంలోని డచ్ బంగ్లా  సమీపంలో ఉన్న హెలిప్యాడ్ ని సైతం క్రీడామైదానంగా తయారు చేసారు. భద్రతాపరమైన ప్రోటోకాల్ హెలి ప్యాడ్ సమీపంలో అమలులో ఉంటుంది. అయినా సంబంధిత అధికారులు గాని, క్రీడాకారులు గాని  ఎవరూ పట్టించుకోవటం లేదు. నగరంలో మరిన్ని ఆట స్థలాలను ఏర్పాటు చేసి, అభివృద్ధి చేయాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    14 min ago
  • ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ సేవలు ప్రారంభం-తుమ్మపాలలో కొత్త వెలుగులు అనకాపల్లి:సామాజిక సేవే పరమావధిగా, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూతనందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల గ్రామంలో నూతనంగా ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ ముఖ్య నేత ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం వి ఆర్) చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేసి ఈ సేవా సంస్థ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు ( ఎం వి ఆర్) మాట్లాడుతూ... సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు, అకస్మాత్తుగా ఆపదల్లో చిక్కుకున్న బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరికైనా ఏ చిన్న కష్టం వచ్చినా, విద్య, వైద్యం, లేదా మరేదైనా ఆపద ఎదురైనా సరే నిరభ్యంతరంగా ట్రస్ట్ వద్దకు వచ్చి సంప్రదించవచ్చు. మా పరిధి మేరకు ప్రతి ఒక్కరికీ కొండంత అండగా ఉంటామని ఆయన ప్రజలకు ఘనంగా భరోసా నిచ్చారు.సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఆరంభమైన ఈ ట్రస్ట్ కార్యకలాపాలు సీఈవో బలరామ్, సి పీఆర్‌ఓ బోస్, ట్రస్ట్ మెంబర్ విష్ణువర్ధన్ ల సమర్థవంతమైన సారథ్యంలో నిరంతరం కొనసాగనున్నాయన్నారు. ఈ సేవా కార్యక్రమానికి అనకాపల్లి ఇన్‌చార్జ్ గైపూరి రాజుతో పాటు ఎం వి ఆర్ యువసేన సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతు తెలిపారు. మానవత్వమే ప్రాతిపదికగా సేవారంగంలోకి అడుగుపెట్టిన ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ నిర్వాహకులను తుమ్మపాల గ్రామస్తులు, ప్రజాప్రతి నిధులు హృదయపూర్వకంగా అభినందించారు. సంప్రదించవలసిన నెంబర్లు 08924. 237896
    4
    ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’  సేవలు ప్రారంభం-తుమ్మపాలలో కొత్త వెలుగులు
అనకాపల్లి:సామాజిక సేవే పరమావధిగా, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూతనందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల గ్రామంలో నూతనంగా ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ ముఖ్య నేత ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం వి ఆర్) చేతుల మీదుగా పూజా కార్యక్రమం  చేసి ఈ సేవా సంస్థ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు ( ఎం వి ఆర్) మాట్లాడుతూ... సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు, అకస్మాత్తుగా ఆపదల్లో చిక్కుకున్న బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరికైనా ఏ చిన్న కష్టం వచ్చినా, విద్య, వైద్యం, లేదా మరేదైనా ఆపద ఎదురైనా సరే నిరభ్యంతరంగా ట్రస్ట్ వద్దకు వచ్చి సంప్రదించవచ్చు. మా పరిధి మేరకు ప్రతి ఒక్కరికీ కొండంత అండగా ఉంటామని ఆయన ప్రజలకు ఘనంగా భరోసా నిచ్చారు.సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఆరంభమైన ఈ ట్రస్ట్ కార్యకలాపాలు సీఈవో బలరామ్, సి పీఆర్‌ఓ బోస్, ట్రస్ట్ మెంబర్ విష్ణువర్ధన్ ల సమర్థవంతమైన సారథ్యంలో నిరంతరం కొనసాగనున్నాయన్నారు. ఈ సేవా కార్యక్రమానికి అనకాపల్లి ఇన్‌చార్జ్ గైపూరి రాజుతో పాటు ఎం వి ఆర్ యువసేన సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతు తెలిపారు. మానవత్వమే ప్రాతిపదికగా సేవారంగంలోకి అడుగుపెట్టిన ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ నిర్వాహకులను తుమ్మపాల గ్రామస్తులు, ప్రజాప్రతి నిధులు హృదయపూర్వకంగా అభినందించారు. సంప్రదించవలసిన నెంబర్లు 08924. 237896
    user_Nagireddy Sivaji
    Nagireddy Sivaji
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.