logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రేపు ఖానాపూర్ మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఖానాపూర్ MLA , నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ శనివారం ఖానాపూర్ మండలంలో పర్యటించనున్నారు. ఉ. 9 గంటలకు ఖానాపూర్ మండలం కుసుంపూర్ గ్రామంలో ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేస్తారు.ఉ. 10 గం.లకు ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో మొక్కలు నాటడం కార్యక్రమంకుగాను హాజరవుతారు.ఉ. 11 గం.లకు ఖానాపూర్ మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో మండల సమావేశానికి హాజరవుతారు. అనంతరం పలువురిని పరామర్శిస్తారు.

7 hrs ago
user_Bojanapu Surendar
Bojanapu Surendar
Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
7 hrs ago
a0b6421f-bb85-4bb5-8993-b4565644d22b

రేపు ఖానాపూర్ మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఖానాపూర్ MLA , నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ శనివారం ఖానాపూర్ మండలంలో పర్యటించనున్నారు. ఉ. 9 గంటలకు ఖానాపూర్ మండలం కుసుంపూర్ గ్రామంలో ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేస్తారు.ఉ. 10 గం.లకు ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో మొక్కలు నాటడం కార్యక్రమంకుగాను హాజరవుతారు.ఉ. 11 గం.లకు ఖానాపూర్ మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో మండల సమావేశానికి హాజరవుతారు. అనంతరం పలువురిని పరామర్శిస్తారు.

More news from తెలంగాణ and nearby areas
  • అత్యవసరమైనా... నిత్యావసరమైనా వాగు దాటాల్సిందే! అనార్పల్లి–లక్మాపూర్ వాగులపై వంతెనల కోసం స్థానికుల ఆవేదన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని అనార్పల్లి, లక్మాపూర్ గ్రామాల ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే వాగు దాటడమే పెద్ద సవాలుగా మారుతోంది. శుక్రవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గ్రామస్తులు ఒకరికి ఒకరు సహకరిస్తూ ప్రాణాలను పణంగా పెట్టి వాగును దాటారు. నిత్యావసర సరుకులు తీసుకురావాలన్నా, అత్యవసర వైద్య సేవలు పొందాలన్నా ఇదే మార్గం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకరంగా వాగు దాటాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. భారీ వర్షాల సమయంలో వాగులు ఉప్పొంగితే గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని, విద్యార్థులు, రైతులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గం లేక నిస్సహాయంగా వాగు దాటుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, ఇకనైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి అనార్పల్లి, లక్మాపూర్ వాగులపై శాశ్వత వంతెనలు నిర్మించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    అత్యవసరమైనా... నిత్యావసరమైనా వాగు దాటాల్సిందే!
అనార్పల్లి–లక్మాపూర్ వాగులపై వంతెనల కోసం స్థానికుల ఆవేదన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని అనార్పల్లి, లక్మాపూర్ గ్రామాల ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే వాగు దాటడమే పెద్ద సవాలుగా మారుతోంది. శుక్రవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గ్రామస్తులు ఒకరికి ఒకరు సహకరిస్తూ ప్రాణాలను పణంగా పెట్టి వాగును దాటారు. నిత్యావసర సరుకులు తీసుకురావాలన్నా, అత్యవసర వైద్య సేవలు పొందాలన్నా ఇదే మార్గం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకరంగా వాగు దాటాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
భారీ వర్షాల సమయంలో వాగులు ఉప్పొంగితే గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని, విద్యార్థులు, రైతులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గం లేక నిస్సహాయంగా వాగు దాటుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, ఇకనైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి అనార్పల్లి, లక్మాపూర్ వాగులపై శాశ్వత వంతెనలు నిర్మించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."
    1
    సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం."
"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... 
సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది."
**"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • బంబారాలో కుల దూషణల ఆరోపణలు.. దళితుల నిరసన........... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో కుల దూషణలు జరిగాయంటూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు పొన్నాల నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, చిన్నారులతో కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి డప్పులతో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
    2
    బంబారాలో కుల దూషణల ఆరోపణలు.. 

దళితుల నిరసన...........
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో కుల దూషణలు జరిగాయంటూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు పొన్నాల నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, చిన్నారులతో కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి డప్పులతో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • korutla pattanam lo thrishakthimatha devalayam lo varahi navarathrulu varahi navarathri lo bhakti shradhala tho kalakaladuthunna korutla thrishakthi devalayam
    4
    korutla pattanam lo thrishakthimatha  devalayam lo varahi navarathrulu
varahi navarathri lo bhakti shradhala tho kalakaladuthunna korutla thrishakthi devalayam
    user_Pallikondashivakumar
    Pallikondashivakumar
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
    1
    స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు 
రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • రోడ్డుపై మురికి నీటి ప్రవాహం ఇబ్బందులు పడుతున్న వాహనదారులు జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణం అంతా జలమయం అయింది. స్థానిక రామాలయం నుండి సాయిబాబా దేవాలయం వరకు ఉన్న ప్రధాన రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. జన్నారంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.
    1
    రోడ్డుపై మురికి నీటి ప్రవాహం ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణం అంతా జలమయం అయింది. స్థానిక రామాలయం నుండి సాయిబాబా దేవాలయం వరకు ఉన్న ప్రధాన రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. జన్నారంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.