logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిర్మాణ పనుల్లో విషాదం.. ఐదో అంతస్తు నుంచి పడి కార్మికుడి మృతి.. నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లాపూర్‌ నెహ్రూనగర్‌కు చెందిన అర్పుల బప్పన్న (50) గత 20 ఏళ్లుగా లేబర్ కాంట్రాక్టర్‌ వద్ద కూలీగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం పని నిమిత్తం హెచ్‌ఎంటీ నగర్‌కు వెళ్లాడు. సుమారు 8.30 గంటలకు బప్పన్నతో కలిసి పనిచేస్తున్న రాము అతని ఫోన్‌ నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తూ.. సెంట్రింగ్‌ పని చేస్తుండగా బప్పన్న కిందపడిపోయి స్పందించడం లేదని తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే బప్పన్న మృతి చెందినట్లు గుర్తించారు. సహచర కార్మికుల వివరాల ప్రకారం.. ఐదో అంతస్తు నుంచి సెంట్రింగ్‌ బాక్సులను కిందకు దించుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్ర గాయాలై మృతి చెందినట్లు తెలిసింది. మృతుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తన తమ్ముడి మృతిపై ఎలాంటి అనుమానం లేదని పేర్కొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు.

11 hrs ago
user_Kumar Journalist
Kumar Journalist
సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
11 hrs ago
ddafbe13-0c94-4470-b364-124e6f97a174

నిర్మాణ పనుల్లో విషాదం.. ఐదో అంతస్తు నుంచి పడి కార్మికుడి మృతి.. నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లాపూర్‌ నెహ్రూనగర్‌కు చెందిన అర్పుల బప్పన్న (50) గత 20 ఏళ్లుగా లేబర్ కాంట్రాక్టర్‌ వద్ద కూలీగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం పని నిమిత్తం హెచ్‌ఎంటీ నగర్‌కు వెళ్లాడు. సుమారు 8.30 గంటలకు బప్పన్నతో కలిసి పనిచేస్తున్న రాము అతని ఫోన్‌ నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తూ.. సెంట్రింగ్‌ పని చేస్తుండగా బప్పన్న కిందపడిపోయి స్పందించడం లేదని తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే బప్పన్న మృతి చెందినట్లు గుర్తించారు. సహచర కార్మికుల వివరాల ప్రకారం.. ఐదో అంతస్తు నుంచి సెంట్రింగ్‌ బాక్సులను కిందకు దించుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్ర గాయాలై మృతి చెందినట్లు తెలిసింది. మృతుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తన తమ్ముడి మృతిపై ఎలాంటి అనుమానం లేదని పేర్కొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.
    1
    బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు  విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా  విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.
NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    10 hrs ago
  • ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers
    1
    ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242
Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers
    user_ANS Mattresses Manufacturers i
    ANS Mattresses Manufacturers i
    Electrician హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
    1
    భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు 
ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు
ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి
ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా?
ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా
అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది
* మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    16 hrs ago
  • కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 #genz #genzaddawithteenmarmallanna #trp #bccm
    1
    కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻

కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻
#genz #genzaddawithteenmarmallanna #trp #bccm
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    12 hrs ago
  • ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని  బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    21 min ago
  • ఉదయం నుంచే ఎరువుల కోసం వేచి చూస్తున్నామని మహిళా రైతు యశోద ఆవేదన మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచే ఎరువుల కోసం వేచి చూస్తున్నామని మహిళా రైతు యశోద ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు కొనుగోలు చేసేందుకు అప్పులు చేయాల్సి వస్తున్న సమయంలో ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఖరీదైన ఫోన్ ఎలా కొనుగోలు చేయాలని ప్రశ్నించారు. చదువు లేకపోవడంతో ఆన్‌లైన్ విధానంలో బుకింగ్ చేసుకోవడం తమకు కష్టంగా మారిందన్నారు. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ ప్రక్రియతో ఇబ్బంది పెట్టకుండా నేరుగా యూరియా అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
    1
    ఉదయం నుంచే ఎరువుల కోసం వేచి చూస్తున్నామని మహిళా రైతు యశోద ఆవేదన
మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచే ఎరువుల కోసం వేచి చూస్తున్నామని మహిళా రైతు యశోద ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు కొనుగోలు చేసేందుకు అప్పులు చేయాల్సి వస్తున్న సమయంలో ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఖరీదైన ఫోన్ ఎలా కొనుగోలు చేయాలని ప్రశ్నించారు. చదువు లేకపోవడంతో ఆన్‌లైన్ విధానంలో బుకింగ్ చేసుకోవడం తమకు కష్టంగా మారిందన్నారు. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ ప్రక్రియతో ఇబ్బంది పెట్టకుండా నేరుగా యూరియా అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    13 hrs ago
  • నేరేడ్మెట్–కాప్రా–కుషాయిగూడలో సాయంత్రం భారీ వర్షం వాహనదారులకు ఇబ్బందులు నేరేడ్మెట్, కాప్రా, కుషాయిగూడ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వర్షం ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలు కాలనీల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా రోడ్లు నీటితో నిండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం కారణంగా కొంతమేర ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినప్పటికీ, చల్లబడిన వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందారు.
    1
    నేరేడ్మెట్–కాప్రా–కుషాయిగూడలో సాయంత్రం భారీ వర్షం వాహనదారులకు ఇబ్బందులు

నేరేడ్మెట్, కాప్రా, కుషాయిగూడ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వర్షం ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలు కాలనీల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా రోడ్లు నీటితో నిండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం కారణంగా కొంతమేర ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినప్పటికీ, చల్లబడిన వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    17 hrs ago
  • హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
    1
    హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.