logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 21వ వార్డు సభ్యురాలు దూసరి కృష్ణవేణి గైర్హాజరు కావడంపై బుధవారం స్థానిక హనుమాన్ ఆలయంలో శివ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల రోజున డబ్బులు తీసుకుని హాజరు కాలేదన్న ప్రతిపక్ష ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఎప్పుడూ డబ్బులకు అమ్ముడుపోనని స్పష్టం చేస్తూ, ఆరోపణలు ఆధారాలతో చేయాలని పేర్కొన్నారు. లేనిపోని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. తన విజయంలో భాగమైన 21వ వార్డు సభ్యులు, వ్యాపారవేత్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే పాల్వయి హరీష్ బాబు నాయకత్వంలో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్నికల హామీలను అమలు చేస్తానని తెలిపారు.

2 hrs ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
2 hrs ago

కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 21వ వార్డు సభ్యురాలు దూసరి కృష్ణవేణి గైర్హాజరు కావడంపై బుధవారం స్థానిక హనుమాన్ ఆలయంలో శివ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల రోజున డబ్బులు తీసుకుని హాజరు కాలేదన్న ప్రతిపక్ష ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఎప్పుడూ డబ్బులకు అమ్ముడుపోనని స్పష్టం చేస్తూ, ఆరోపణలు ఆధారాలతో చేయాలని పేర్కొన్నారు. లేనిపోని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. తన విజయంలో భాగమైన 21వ వార్డు సభ్యులు, వ్యాపారవేత్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే పాల్వయి హరీష్ బాబు నాయకత్వంలో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్నికల హామీలను అమలు చేస్తానని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Bharath Newz
    1
    Post by Bharath Newz
    user_Bharath Newz
    Bharath Newz
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో బంజారా ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జన్మదిన సందర్బంగా అధికారిక ఉత్సవాలు నిర్వహించిన్న సందర్బంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ. బంజారా సమాజాన్ని ఎక్కతటి పైకి తీసుకొచ్చిన సేవాలాల్ మహారాజ్ అడుగు జాడల్లో అందరూ నడవాలని సమాజం కొరకు ప్రతి ఒక్కరు సమయాన్ని కేటాహించాలని బంజారాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్థావిస్తానని అన్నారు. ఈ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ రాజహర్షి షా,ఐటీడీఎ పివో యువరాజ్ మార్మట్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ ఎస్పీ మౌనిక గార్లతో కలిసి భోగ్ సమర్పించారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో బంజారా ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జన్మదిన సందర్బంగా అధికారిక ఉత్సవాలు నిర్వహించిన్న సందర్బంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ. బంజారా సమాజాన్ని ఎక్కతటి పైకి తీసుకొచ్చిన సేవాలాల్ మహారాజ్ అడుగు జాడల్లో అందరూ నడవాలని సమాజం కొరకు ప్రతి ఒక్కరు సమయాన్ని కేటాహించాలని బంజారాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్థావిస్తానని అన్నారు. ఈ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ రాజహర్షి షా,ఐటీడీఎ పివో యువరాజ్ మార్మట్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ ఎస్పీ మౌనిక గార్లతో కలిసి భోగ్ సమర్పించారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter Adilabad Urban, Telangana•
    2 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్‌లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్‌లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
  • నిర్మల్ లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదేవ్ కేక్ కట్టు చేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు ఫలాలు పంపిణీ చేశారు.
    1
    నిర్మల్ లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదేవ్  కేక్ కట్టు చేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు ఫలాలు పంపిణీ చేశారు.
    user_HB 6 NEWS
    HB 6 NEWS
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    1 day ago
  • కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానం పై అలకబూనారు. ఢిల్లీకి రావాలని పిలిచిన వెళ్లకుండా సొంత పనుల్లో జీవన్ రెడ్డి నిమగ్నమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అవమానపరిచేలా పార్టీ పెద్దలు వ్యవహరించారని జీవన్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సంజయ్ ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం తమకు తప్పవు వేధింపులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ లో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. భవిష్యత్తు ఎటు వైపు దారితీస్తాయో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైలెంట్ గా కాంగ్రెస్ పెద్దల తీరును జీవన్ రెడ్డి నిరసిస్తున్నారు. జీవన్ రెడ్డి అలకబూనడంపై పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.
    1
    కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానం పై అలకబూనారు. ఢిల్లీకి రావాలని పిలిచిన వెళ్లకుండా సొంత పనుల్లో జీవన్ రెడ్డి నిమగ్నమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అవమానపరిచేలా పార్టీ పెద్దలు వ్యవహరించారని జీవన్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సంజయ్ ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం తమకు తప్పవు వేధింపులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ లో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. భవిష్యత్తు ఎటు వైపు దారితీస్తాయో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైలెంట్ గా కాంగ్రెస్ పెద్దల తీరును జీవన్ రెడ్డి నిరసిస్తున్నారు. జీవన్ రెడ్డి అలకబూనడంపై పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • నగరంలో సాధన సంస్థ నెల రోజులపాటు నిర్వహించనున్న బాల్యవివాహల నిరోధక ప్రచార రథాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల శరీర ఆకృతి పెరిగే వయసులో, మేధస్సు కూడా పెరుగుతుందన్నారు. పెరిగే క్రమంలో విరిగే పనులు చేయరాదని, ఎదగనిద్దామని ఆమె పేర్కొన్నారు. బాలల భవిష్యత్ భద్రతకు బాల్య వివాహలు గొడ్డలి పెట్టులాంటివని తెలిపారు. బాల్యవివాహలు చేసిన వారు, ప్రోత్సహించిన వారు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులేనని అన్నారు. బాల్యవివాహలను చట్టం ద్వారా నిషేదించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ అన్నారు. బాలల చదువుకే ప్రాధాన్యతనివ్వాలని, చదువు వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. ఎదిగి ఎదగని వయసులో బాల్య వివాహలు చేయడం అంటే చిగురించే మొక్కలను చిదిమివేయడమేనని ఆమె అన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ సాధన సంస్థ ఒక మంచి ప్రచారశైలికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పద్మ, చైతన్య, సాధన, సిబ్బంది మధుసూదన్, వినీష్, నిరీక్ష, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ పర్యవేక్షకురాలు శైలజ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    1
    నగరంలో సాధన సంస్థ నెల రోజులపాటు నిర్వహించనున్న బాల్యవివాహల నిరోధక ప్రచార రథాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ  జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల శరీర ఆకృతి పెరిగే వయసులో, మేధస్సు కూడా పెరుగుతుందన్నారు. పెరిగే క్రమంలో విరిగే పనులు చేయరాదని, ఎదగనిద్దామని ఆమె పేర్కొన్నారు. బాలల భవిష్యత్ భద్రతకు బాల్య వివాహలు గొడ్డలి పెట్టులాంటివని తెలిపారు. బాల్యవివాహలు చేసిన వారు, ప్రోత్సహించిన వారు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులేనని అన్నారు. బాల్యవివాహలను చట్టం ద్వారా నిషేదించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ అన్నారు. బాలల చదువుకే ప్రాధాన్యతనివ్వాలని, చదువు వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. ఎదిగి ఎదగని వయసులో బాల్య వివాహలు చేయడం అంటే చిగురించే మొక్కలను చిదిమివేయడమేనని ఆమె అన్నారు.
చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ సాధన సంస్థ ఒక మంచి ప్రచారశైలికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పద్మ, చైతన్య, సాధన, సిబ్బంది మధుసూదన్, వినీష్, నిరీక్ష,  జిల్లా న్యాయసేవ అధికార సంస్థ పర్యవేక్షకురాలు శైలజ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    user_Sri
    Sri
    Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Bharath Newz
    1
    Post by Bharath Newz
    user_Bharath Newz
    Bharath Newz
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా పిప్పలదరి గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి పంట పొలంలో రైతుల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతుల కండ్లలో ఆనందం ధైర్యం చూస్తే తెలంగాణ లో మళ్ళీ రైతు రాజ్యం రాబోతుందని తెలుస్తుంది అని అన్నారు.
    1
    బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా పిప్పలదరి గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి పంట పొలంలో రైతుల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతుల కండ్లలో ఆనందం ధైర్యం చూస్తే తెలంగాణ లో మళ్ళీ రైతు రాజ్యం రాబోతుందని తెలుస్తుంది అని అన్నారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter Boath, Adilabad•
    16 hrs ago
  • అధికారుల్లో జవాబుదారి తనం పెంచేందుకు ఆర్టిఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి.శ్రీనివాసరావు, భోరెడ్డి అయోధ్య రెడ్డి, మోసినా పర్వీన్, దేశాల భోపాల్ ఆర్టీఐ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 మే 14న రాష్ట్ర సమాచార కమిషనర్లుగా తాము బాధ్యత తీసుకునే నాటికి 17 వేలా 808 రెండవ అప్పిళ్లు రాష్ట్ర కమిషన్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 8 నెలల్లో ఇప్పటివరకు 15 జిల్లాలలో పర్యటించి అక్కడే వాదనలు విన్నామని తెలిపారు. ఇలా సుమారు 9 వేల అప్పిళ్లను పరిష్కరించామన్నారు. ఇంత త్వరగా అప్పిళ్లను పరిష్కరించడం దేశంలోనే మొదటిసారిగా పేర్కొన్నారు. 13 శాఖల్లో కేసుల సంఖ్య జీరోకి తెచ్చామని తెలిపారు. సగటున నెలకు 643 కేసులు పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. వీలైనంత త్వరగా మిగిలిన జిల్లాల్లో పర్యటించి పెండింగ్ కేసులన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. అర్జీదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల ప్రయోజనం కోసమేనని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి, అప్పిలేట్ అధికారులతో సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. దరఖాస్తులు, ఫిర్యాదులు, పరిష్కారం, పెండింగ్ దరఖాస్తులు, పరిష్కారం కోసం తీసుకునే చర్యలపై పిఐఓలతో కమిషనర్లు చర్చించారు.
    1
    అధికారుల్లో జవాబుదారి తనం పెంచేందుకు ఆర్టిఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు.  కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి.శ్రీనివాసరావు, భోరెడ్డి అయోధ్య రెడ్డి, మోసినా పర్వీన్, దేశాల భోపాల్  ఆర్టీఐ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 మే 14న రాష్ట్ర సమాచార కమిషనర్లుగా తాము బాధ్యత తీసుకునే నాటికి 17 వేలా 808 రెండవ అప్పిళ్లు రాష్ట్ర కమిషన్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 8 నెలల్లో ఇప్పటివరకు 15 జిల్లాలలో పర్యటించి అక్కడే వాదనలు విన్నామని తెలిపారు. ఇలా సుమారు 9 వేల అప్పిళ్లను పరిష్కరించామన్నారు. ఇంత త్వరగా అప్పిళ్లను పరిష్కరించడం   దేశంలోనే మొదటిసారిగా పేర్కొన్నారు. 13 శాఖల్లో కేసుల సంఖ్య జీరోకి తెచ్చామని తెలిపారు. సగటున నెలకు 643 కేసులు పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. వీలైనంత త్వరగా మిగిలిన జిల్లాల్లో పర్యటించి పెండింగ్ కేసులన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. అర్జీదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని తెలిపారు. 
ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల ప్రయోజనం కోసమేనని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి, అప్పిలేట్ అధికారులతో  సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. దరఖాస్తులు, ఫిర్యాదులు, పరిష్కారం, పెండింగ్ దరఖాస్తులు, పరిష్కారం కోసం తీసుకునే చర్యలపై పిఐఓలతో కమిషనర్లు చర్చించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.