Shuru
Apke Nagar Ki App…
నాచారం డివిజన్లోని హెచ్ఎంటి చెరువులో గుర్రపు డెక్కన్ తొలగిస్తున్న దృశ్యాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ నాయకులు( మేడ్చల్ జిల్లా, నాచారం). నాచారం హెచ్ఎంటి చెరువులో గుర్రపు డెక్క ఎక్కువగా పెరగడం తో నాచారంలో దోమల బెడద ఎక్కువైంది నాచారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉప్పల్ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి కి నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. పరమేశ్వర్ రెడ్డి స్పందించి జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి చెరువులోని గుర్రపుడ్డెక్క తొలగించే మిషన్ తో పనులు ప్రారంభించారు. సమస్య త్వరగా పరిష్కారం కోసం పాటుపడిన పరమేశ్వర్ రెడ్డికి నాచారం డివిజన్ కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమ భావనగౌడ్,శ్రీకాంత్ గౌడ్,అశ్వధామ రెడ్డి,మహేష్ యాదవ్, ఫాసీనుద్దీన్,గద్ద క్రాంతి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Nitturi Ravi
నాచారం డివిజన్లోని హెచ్ఎంటి చెరువులో గుర్రపు డెక్కన్ తొలగిస్తున్న దృశ్యాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ నాయకులు( మేడ్చల్ జిల్లా, నాచారం). నాచారం హెచ్ఎంటి చెరువులో గుర్రపు డెక్క ఎక్కువగా పెరగడం తో నాచారంలో దోమల బెడద ఎక్కువైంది నాచారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉప్పల్ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి కి నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. పరమేశ్వర్ రెడ్డి స్పందించి జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి చెరువులోని గుర్రపుడ్డెక్క తొలగించే మిషన్ తో పనులు ప్రారంభించారు. సమస్య త్వరగా పరిష్కారం కోసం పాటుపడిన పరమేశ్వర్ రెడ్డికి నాచారం డివిజన్ కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమ భావనగౌడ్,శ్రీకాంత్ గౌడ్,అశ్వధామ రెడ్డి,మహేష్ యాదవ్, ఫాసీనుద్దీన్,గద్ద క్రాంతి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 9 ప్రజా తెలంగాణ న్యూస్ / రంజాన్ ఉపవాసాల సందర్బంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ. తదితర నాయకులు పాల్గొన్నారు.1
- బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న హెచ్.పి.వి టీకా ను 14 ఏళ్ల వయస్సు గల బాలికలందరూ సద్వినియోగం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు లాలాపేటలోని పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆమె లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్తిక రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్ప సంకల్పం తీసుకుందన్నారు. మార్కెట్ లో దాదాపు 4 వేలు విలువ చేసే వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. గతంలో కరోనా విపత్కర పరిస్థితిలో దేశ ప్రజలందరికీ భారత దేశంలో తయారైన వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజారోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వరూప గౌడ్, కనికట్ల హరి, అనిత, సత్యవతి, ఉపేందర్ యాదవ్ ,వీరన్న, వేణు యాదవ్ సికింద్రాబాద్ నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ జయశ్రీ, లాలాపేట ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ లావణ్య, డాక్టర్ వందన, ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.1
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.1
- సంగారెడ్డిలో ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ ఎంపికలు1
- నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్.. 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్.. చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు.. పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం.. వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.1
- 'హోటళ్ల బంద్'.. భోజన ప్రియులకు భారీ షాక్! బెంగళూరు: నగరంలోని హోటళ్లు మరియు రెస్టారెంట్ల యజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి (మార్చి 10, 2026) నుంచి నగరవ్యాప్తంగా హోటళ్లను మూసివేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. పశ్చిమాసియా (Middle East) లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమవ్వడంతో వంట వండటం సాధ్యం కాక, హోటళ్లను నిరవధికంగా బంద్ చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా బ్యాచిలర్స్, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు మరియు ఆస్పత్రుల్లో ఉండే రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని హోటల్ యజమానులు కోరుతున్నారు. గ్యాస్ నిల్వలు పెరిగే వరకు ఈ బంద్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.3
- గజ్వేల్ మండలంలోని మాసన్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి గారు మరియు బి ఆర్ఎస్ శ్రేణులు ముస్లిం మైనార్టీ సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు4
- ఆన్లైన్ యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రక్రియ రైతులకు శాపంగా మారింది. నిరక్షరాస్య రైతులు ఎరువులు పొందలేక గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నా, సాంకేతిక కారణాలతో యూరియా అందడం లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి అందరికీ యూరియా అందేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతున్నారు.1