logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ఫిర్యాదుదారుల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి.* *పోలీస్ ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహణ.* *పత్రికా ప్రకటన* అదిలాబాద్ జిల్లా, మే 11 :- *జిల్లా నలుమూలల నుండి విచ్చేసి 29 ఫిర్యాదులను అందజేసిన బాధితులు.* *సమస్య విన్న వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా పరిష్కారానికి ఆదేశాలు.* *ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాల సమాచారమైన 8712659973 నెంబర్ కి వాట్సాప్ లో తెలియజేయవచ్చు* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* ప్రతి సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయం లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు విచ్చేసి నేరుగా జిల్లా ఎస్పీకి తమ సమస్యలను తెలియజేశారు, విన్న వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా జిల్లా ఎస్పీ బాధితుల సమస్యలను పరిష్కరించడానికి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. బాధితుల సమస్యల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. సమస్యలను పరిష్కరించినప్పుడు పోలీసు వ్యవస్థ పై ఉన్న నమ్మకం మరింత పెంపొందించబడుతుందని, ప్రజలలో పోలీసుల పట్ల ఉన్న గౌరవం పెరుగుతుందని తెలిపారు. బాధితులకు అన్యాయం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు పోలీసు ముఖ్య కార్యాలయంలో 29 ఫిర్యాదులను నమోదు కాగా అందులో భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, కేసుల సమస్యలు, భూ సమస్యలు ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపేందుకు జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని, ప్రశాంతమైన వాతావరణంలో జిల్లా కొనసాగడానికి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని, వాటిని తుడిచి పెట్టే దిశలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని తెలిపారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల సమాచారం అయినా 8712659973 నెంబర్ కు వాట్సప్ ద్వారా సమాచారం అందించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసి కొండరాజు, సిబ్బంది వామన్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Rural, Telangana•
1 hr ago
4d13a3a8-6669-44b6-86ba-da90750f5759

*ఫిర్యాదుదారుల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి.* *పోలీస్ ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహణ.* *పత్రికా ప్రకటన* అదిలాబాద్ జిల్లా, మే 11 :- *జిల్లా నలుమూలల నుండి విచ్చేసి 29 ఫిర్యాదులను అందజేసిన బాధితులు.* *సమస్య విన్న వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా పరిష్కారానికి ఆదేశాలు.* *ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాల సమాచారమైన 8712659973 నెంబర్ కి వాట్సాప్ లో తెలియజేయవచ్చు* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* ప్రతి సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయం లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు విచ్చేసి నేరుగా జిల్లా ఎస్పీకి తమ సమస్యలను తెలియజేశారు, విన్న వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా జిల్లా ఎస్పీ బాధితుల సమస్యలను పరిష్కరించడానికి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. బాధితుల సమస్యల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. సమస్యలను పరిష్కరించినప్పుడు పోలీసు వ్యవస్థ పై ఉన్న నమ్మకం మరింత పెంపొందించబడుతుందని, ప్రజలలో పోలీసుల పట్ల ఉన్న గౌరవం పెరుగుతుందని తెలిపారు. బాధితులకు అన్యాయం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు పోలీసు ముఖ్య కార్యాలయంలో 29 ఫిర్యాదులను నమోదు కాగా అందులో భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, కేసుల సమస్యలు, భూ సమస్యలు ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపేందుకు జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని, ప్రశాంతమైన వాతావరణంలో జిల్లా కొనసాగడానికి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని, వాటిని తుడిచి పెట్టే దిశలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని తెలిపారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల సమాచారం అయినా 8712659973 నెంబర్ కు వాట్సప్ ద్వారా సమాచారం అందించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసి కొండరాజు, సిబ్బంది వామన్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • ఆదిలాబాద్ జిల్లాలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా జనగణన-2027 ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా 'సెన్సస్ వాక్'తో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి దశ కీలకమైన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ప్రజలు భయం లేకుండా వివరాలు అందించి, జాతీయ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సేకరించిన సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం గోప్యంగా ఉంటుందని, ప్రభుత్వ అభివృద్ధి పథకాల కోసమే ఉపయోగపడుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
    3
    ఆదిలాబాద్ జిల్లాలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా జనగణన-2027 ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా 'సెన్సస్ వాక్'తో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి దశ కీలకమైన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ప్రజలు భయం లేకుండా వివరాలు అందించి, జాతీయ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సేకరించిన సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం గోప్యంగా ఉంటుందని, ప్రభుత్వ అభివృద్ధి పథకాల కోసమే ఉపయోగపడుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    9 hrs ago
  • కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
    2
    కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • ముధోల్ మండలం విటోలి గ్రామంలో సోమవారం విషాదం ఇద్దరు బాలురు మృతి నిర్మల్ జిల్లా ముధోల్ మండలం విటోలి గ్రామంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిఖిల్(15), స్వరాజ్ (14) అనే ఇద్దరు బాలురు స్నేహితులతో కలిసి సరదాగా గ్రామం శివారులోని రంగారికుంట చెరువులో ఈతకు వెళ్లారు. ఈత కొడుతున్ న క్రమంలో నిఖిల్, స్వరాజ్ నీట మునిగి మృతిచెందారు. విషయం తెలుసుకున్ న ఎస్ఐ పెర్సీస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
    1
    ముధోల్ మండలం విటోలి గ్రామంలో సోమవారం విషాదం ఇద్దరు బాలురు మృతి 
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం విటోలి గ్రామంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిఖిల్(15), స్వరాజ్ (14) అనే ఇద్దరు బాలురు స్నేహితులతో కలిసి సరదాగా గ్రామం శివారులోని రంగారికుంట చెరువులో ఈతకు వెళ్లారు. ఈత కొడుతున్ న క్రమంలో నిఖిల్, స్వరాజ్ నీట మునిగి మృతిచెందారు. విషయం తెలుసుకున్ న ఎస్ఐ పెర్సీస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
    user_LALASHRAFI VIJAY
    LALASHRAFI VIJAY
    భైంసా, నిర్మల్, తెలంగాణ•
    31 min ago
  • ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన కలిసే ప్రతిపాదన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. "నువ్వు నన్ను కలవకుంటే, నువ్వు వెళ్లాలనుకున్న చోటుకు నేను నిన్ను తీసుకెళ్తాను" అని మోడీ చెప్పినట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తీవ్ర కుదుపు సృష్టించాయి. ఈ సమావేశం జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
    1
    ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన కలిసే ప్రతిపాదన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. "నువ్వు నన్ను కలవకుంటే, నువ్వు వెళ్లాలనుకున్న చోటుకు నేను నిన్ను తీసుకెళ్తాను" అని మోడీ చెప్పినట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తీవ్ర కుదుపు సృష్టించాయి. ఈ సమావేశం జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    20 hrs ago
  • కొమురం భీం ఆసిఫాబాద్ నుండి ప్రత్యేక రైలులో వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం వారు పరేడ్ గ్రౌండ్‌కు ర్యాలీగా చేరుకున్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
    1
    కొమురం భీం ఆసిఫాబాద్ నుండి ప్రత్యేక రైలులో వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం వారు పరేడ్ గ్రౌండ్‌కు ర్యాలీగా చేరుకున్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • రోడ్డెక్కిన రైతన్న ఉధృతంగా మారిన ధర్నా ​ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నిజామాబాద్ జిల్లాలో భగ్గుమన్న రైతులు ​నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు ప్రభుత్వ తీరుపై అన్నదాతల ఆగ్రహం. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు పెట్టుకుని ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నేడు రోడ్డెక్కారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి 63పై రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.మండూటి ఎండను కూడా లెక్కచేయకుండా రైతులు చేపట్టిన ఈ నిరసనలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు: ​గత కేసీఆర్ ప్రభుత్వంలో క్వింటాల్‌కు 41.5 కిలోల చొప్పున తూకం వేసేవారని, కానీ ఇప్పుడు రైస్ మిల్లర్లు 45 కిలోలు కావాలని రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం తరలించడానికి గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోందని, లారీల సంఖ్య తక్కువగా ఉండటంతో రవాణా పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. ​ఎర్రటి ఎండలో అన్నదాతలు ఆకలితో రోడ్ల మీద కూర్చోవాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన దుయ్యబట్టారు. ​​ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి. ​గన్నీ బ్యాగులు, లారీల సంఖ్యను తక్షణమే పెంచాలి. ​గతంలో మాదిరిగానే 41.5 కిలోల తూకాన్నే అమలు చేయాలి, మిల్లర్ల అక్రమాలను అరికట్టాలి. ​తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
    1
    రోడ్డెక్కిన రైతన్న  ఉధృతంగా మారిన ధర్నా
​ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం 
 నిజామాబాద్ జిల్లాలో భగ్గుమన్న రైతులు

​నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు ప్రభుత్వ తీరుపై అన్నదాతల ఆగ్రహం.
నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు పెట్టుకుని ఎదురుచూస్తున్నా.
ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నేడు రోడ్డెక్కారు. 
బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి 63పై రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.మండూటి ఎండను కూడా లెక్కచేయకుండా రైతులు చేపట్టిన ఈ నిరసనలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. 
బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ...
ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు:
​గత కేసీఆర్ ప్రభుత్వంలో క్వింటాల్‌కు 41.5 కిలోల చొప్పున తూకం వేసేవారని, కానీ ఇప్పుడు రైస్ మిల్లర్లు 45 కిలోలు కావాలని రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు.
ధాన్యం తరలించడానికి గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోందని, లారీల సంఖ్య తక్కువగా ఉండటంతో రవాణా పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు.
​ఎర్రటి ఎండలో అన్నదాతలు ఆకలితో రోడ్ల మీద కూర్చోవాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన దుయ్యబట్టారు.
​​ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి.
​గన్నీ బ్యాగులు, లారీల సంఖ్యను తక్షణమే పెంచాలి.
​గతంలో మాదిరిగానే 41.5 కిలోల తూకాన్నే అమలు చేయాలి, మిల్లర్ల అక్రమాలను అరికట్టాలి.
​తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
    user_MOHAMMAD SHAIK HUSSAIN
    MOHAMMAD SHAIK HUSSAIN
    బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు… ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ… గత మూడు రోజులుగా ఘటనపై ఎలాంటి స్పందన లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. “రక్షకుడే భక్షకుడు అయ్యాడు” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.పోక్సో చట్టం ప్రకారం 24 గంటల్లోనే అరెస్ట్ చేయాల్సి ఉండగా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సాధారణ వ్యక్తి అయితే వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు, అధికార పార్టీకి చెందిన వారి విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు..బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని, బాలికకు పూర్తి రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గాని, కేంద్ర మంత్రులు గాని ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాయకులు ఈ ఘటనపై స్పందించి ఆ చిన్నారికి న్యాయం జరిగేలా ముందుకు రావాలని కోరారు..మహిళల భద్రతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు…
    1
    బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ 
బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ 
మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు…
ఈ సందర్భంగా సంజయ్  మాట్లాడుతూ… గత మూడు రోజులుగా ఘటనపై ఎలాంటి స్పందన లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. 
మైనర్ బాలికకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. “రక్షకుడే భక్షకుడు అయ్యాడు” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.పోక్సో చట్టం ప్రకారం 24 గంటల్లోనే అరెస్ట్ చేయాల్సి ఉండగా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సాధారణ వ్యక్తి అయితే వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు, అధికార పార్టీకి చెందిన వారి విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు..బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని, బాలికకు పూర్తి రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గాని, కేంద్ర మంత్రులు గాని ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాయకులు ఈ ఘటనపై స్పందించి ఆ చిన్నారికి న్యాయం జరిగేలా ముందుకు రావాలని కోరారు..మహిళల భద్రతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు…
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • ఆదిలాబాద్‌లో ఓ నేత తమ పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రకటించారు, జెండాను పడనివ్వనని శపథం చేశారు. కష్టాలెదురైనా తలెత్తుకునే పనిచేస్తానని, తలవంచే పని చేయనని ధీమా వ్యక్తం చేస్తూ, ఈ ధర్మయుద్ధంలో తమ వెన్నంటి నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    ఆదిలాబాద్‌లో ఓ నేత తమ పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రకటించారు, జెండాను పడనివ్వనని శపథం చేశారు. కష్టాలెదురైనా తలెత్తుకునే పనిచేస్తానని, తలవంచే పని చేయనని ధీమా వ్యక్తం చేస్తూ, ఈ ధర్మయుద్ధంలో తమ వెన్నంటి నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.