తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా గ్రామపంచాయతీ ముందు జెండా ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ *తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా షాబాద్ లంబడి తండా గ్రామపంచాయతీ గౌరవ సర్పంచ్ గారిచే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది* *నైజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన తెలంగాణ* *షాబాద్ లంబాడి తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు* మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ పరిధిలోని షాబాద్ లంబాడి తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లునవత్, ప్రభు నాయక్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన ఉద్యమ చరిత్రను వివరించారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వెట్టి చాకిరీ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటాలు, స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయిన చారిత్రక పరిణామాలను గుర్తు చేసుకున్నారు. 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం వెంటనే భారతదేశంలో విలీనం కాలేదు. నిజాం పాలన కొనసాగుతుండగా తెలంగాణ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు ఉధృతమయ్యాయి. చివరకు 1948 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం చేపట్టిన ‘పోలీస్ యాక్షన్’ అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయింది. దీంతో తెలంగాణ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొందిన చారిత్రక ఘట్టాన్ని సెప్టెంబర్ 17న గుర్తుచేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాణావత్ దరియా నాయక్ , వార్డు సభ్యులు లునవత్ ప్రేమ , విస్లావత్ బిమ్లా, మాలోత్ శోభ , రామావత్ నెహ్రు , మూడవత్ గీత , ఇస్లావత్ రమిని , బాణావత్ థౌర్య, మాజీ ఉపసర్పంచ్ సురేష్,గ్రామ కార్యదర్శి రాఘవేంద్ర, మరియ అంగన్వాడి టీచర్, కే. సుజాత, యం,లలిత, వెంకటలక్ష్మి, కుమారి, మరియు గ్రామ పెద్దలు, తుకారం, అంబృ నాయక్, మోహన్ నాయక్, రాజు నాయక్, రమేష్ నాయక్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బాలాజీ మందిరంలో ఆశీర్వాద దీపాలు వెలిగించిన బిజెపి నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలో బాలాజీ ఆలయంలో నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు జీవించి దేశ ప్రధానిగా ఉండి వికసిత్ భారత లక్ష్యం చేరుకొని విశ్వ గురువుగా మారాలని ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని ఆశీర్వాద దీపం కార్యక్రమం పేరుమీద దీపాలు వెలిగించి దేవుని కోరుకోనిప్రత్యేకపూజలోపాల్గోన్నబిజేపి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోల్ల మల్లిక ధార్మిక సెల్ కన్వీనర్ రాజేశ్వరి, బిజేపి ధార్మిక సెల్ జయంతి కన్వీనర్ కృష్ణ, 21 వార్డ్ కౌన్సిలర్ పబ్బా రాజమణి లక్ష్మణ్ 28 వార్డ్ కౌన్సిలర్ అఖిలభారత్, సౌజన్య ప్రభాకర్ అంకం శ్రీను మైనార్టీ మోర్చా అధ్యక్షుడు గ్యాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు1
- చిన్నారుల నృత్యాలతో అలరిస్తున్న టీచర్స్ కాలనీ గణేష్ మండలి ఎల్లారెడ్డి: పట్టణంలోని కొత్తబాది టీచర్స్ కాలనీలో గణేష్ మండలి ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేదమంత్రాలతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తున్నారు. చిన్నారులు నిర్వహిస్తున్న నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, కాలనీ వాసులను అలరిస్తున్నాయి.1
- మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వకర్మలు తమ వృత్తి, ఉపాధికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న మంత్రి.. ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.1
- సదాశివపేట: సదాశివపేట సామాజిక ఆసుపత్రిలో మూడు 108 అంబులెన్స్ ల ఏర్పాటు..! సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం జరిగిన ఫుడ్ పాయిజన్ లో దాదాపు 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారిని సదాశివపేట, సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.వారిని సంగారెడ్డి జిల్లా డిఎం & హెచ్ఓ లలితాదేవి పర్యవేక్షించి విద్యార్థులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి ఆదేశించారు.అదేవిధంగా డిఎం & హెచ్ఓ ఆదేశాల మేరకు సదాశివపేట సామాజిక ఆసుపత్రి నందు ముందస్తు చర్యగా మూడు 108 అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సంపత్ తెలిపారు.1
- ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపం ఘనంగా… నిత్య అన్నదానాలతో భక్తిమయం ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపం ఘనంగా… నిత్య అన్నదానాలతో భక్తిమయం బాన్సువాడ, గురువారం: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో ఏర్పాటు చేసిన బాల గణేష్ మండపం వద్ద వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ యజ్ఞాలు, హోమాలు, వినాయకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. మండపం పరిసరాలు భక్తుల రాకపోకలతో కిటకిటలాడుతూ, గణేశుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు. గురువారం నాడు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నాగులగామ వందన గోపీనాథ్ గుప్త, రాహుల్ ఆటోమొబైల్, మోటమర్రి సంధ్యరాణి, నాగరాజు గుప్త, త్రిమూర్తి ఎంటర్ ప్రైజెస్ వారి చేతుల మీదుగా నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాల గణేష్ మండలి సభ్యులు మాట్లాడుతూ, ప్రతిరోజూ భక్తి భావంతో నిత్య అన్నదానాలు నిర్వహిస్తూ వినాయకుని కృపాకటాక్షాలు అందరికీ కలగాలని ఆకాంక్షించారు. గణేశుని ఆటపాటలు, భజనలతో కాలనీ అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయిందని తెలిపారు.4
- తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ శంఖారావం... తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఆవిర్భావం... బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా... ఉదయించింది 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'!* తెలంగాణ గడ్డ ఎప్పుడూ పోరాటాలకి పెట్టింది పేరు. అన్యాయం జరిగిన ప్రతిసారీ ఈ నేల తిరగబడింది... దోపిడీపై ధిక్కార స్వరం వినిపించింది. ఆ పోరాటాల స్ఫూర్తితో, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా, ఈ గడ్డపై పురుడుపోసుకున్న సరికొత్త ఆశల కిరణమే 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ.. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు... తరతరాలుగా అధికారానికి, హక్కులకు దూరంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆక్రందనల నుండి పుట్టిన ప్రజా చైతన్య ఉప్పెన.! ప్రశ్నించే గొంతుక... తీన్మార్ మల్లన్న పోరాటంవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై, పాలకుల అహంకారంపై ఒంటరి పోరాటం మొదలుపెట్టిన ధీరుడు తీన్మార్ మల్లన్న... బెదిరింపులకు లొంగలేదు, అక్రమ కేసులకు భయపడలేదు. జైలు గోడలు ఆయన ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. ప్రజా సమస్యలే అజెండాగా, ప్రజల గొంతుకై గర్జించిన మల్లన్న,.. నేడు తెలంగాణలో శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సైన్యాన్ని నడిపిస్తున్నారు.ఆయన నడిపిన ప్రతి ఉద్యమం, చేసిన ప్రతి పోరాటం... వ్యవస్థను ప్రశ్నించే ధైర్యాన్ని సామాన్యుడికి నేర్పింది.. మా ఓట్లతో మీరు గద్దెనెక్కడం కాదు... మా ఓట్లతో మేమే పాలకులమవుతాం" అనే నిఖార్సైన సత్యాన్ని చాటిచెప్పింది.! సామాన్యుడి ఆయుధం ఓటు అయితే, ఆ ఓటుకు అసలైన విలువను ఇచ్చేందుకు సిద్ధమైంది రాజ్యాధికార పార్టీ. సమాజంలో పేరుకుపోయిన అసమానతలను, దోపిడీ వ్యవస్థలను కత్తిరించడమే ధ్యేయంగా 'కత్తెర' గుర్తుతో ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతోంది..!1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- ప్రెస్ నోట్ తేదీ 17-09-2026 మెదక్ జిల్లా దివ్యాంగులు ఆత్మ గౌరవంతో జీవించాలి --మెదక్ ఎంపీ రఘునందన్ రావు దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలి మెదక్ ఎంపీ రఘునందన్ రావు దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. గురువారం కలెక్టర్లోని సమావేశ మందిరంలో దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా వికలాంగుల కు ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. మోదీ గారు గత 25 సంవత్సరాల పేద ప్రజలకు ప్రజా సేవ చేస్తున్నారని గుర్తు చేశారు.6 నెలలుగా 461 మంది దివ్యాంగులను గుర్తించి 850 దివ్యంగా సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.దివ్యాంగులు మొన్న జరిగిన గ్లాస్ కో క్రీడల్లో ప్రపంచంలో 4 వ స్థానం సాధించి 39 పథకాలు ఇండియాకు తీసుకొచ్చారని , ఇన్ని పథకాలు ఏ క్రీడలకు కూడా ఇండియాకు రాలేదని, దివ్యాంగులు ఎవరికి తక్కువకాని , ఆత్మవిశ్వాసంతో జీవించాలని అన్నారు.దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదంగా, స్వయం ఆధారితంగా జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా అడ్డంకులు లేని, సమగ్ర, సౌకర్యవంతమైన సమాజ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. సహాయ పరికరాల పంపిణీ ద్వారా దివ్యాంగుల చలనశీలత, వినికిడి సామర్థ్యం, దైనందిన కార్యకలాపాల్లో స్వయం ఆధారితత మెరుగుపడటంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ వో అంబాదాస్ రాజేశ్వర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.1