logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల భూముల ఆక్రమణ పై వినతి పత్రం సమర్పించడం జరిగింది* *సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి హిందూ దేవాలయాల భూముల ఆక్రమణ పై వినతి పత్రం సమర్పించడం జరిగింది* *విషయం: హిందూ దేవాలయ భూముల రక్షణ, అక్రమణల నివారణ శిధిలావస్థ లో ఉన్న ఆలయాలు పునఃనిర్మాణం మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై వినతిపత్రం* హిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. ఈ ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు దేవుని ఆస్తులు, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు. అయితే ప్రస్తుతం ఈ భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మధ్య ఆకివీడు రామాలయ పునఃనిర్మాణం లో జరిగిన అల్లర్లు, నవమి రోజున జరిగిన దాడులు స్వయంగా స్పీకర్ నే హత్య చేయాలనుకునే ప్రయత్నం పై యావత్ హిందు సమాజం ఆందోళనకు గురవుతుంది. సంవత్సరాలు గా ఆలయాల పునఃనిర్మాణాలు జరగకపోవడం వలన హిందు సమాజం నష్టపోతుంది. రాష్ట్రంలో శిధిలావస్థలో ఉన్న అన్ని ఆలయాలు పునఃనిర్మించాలి. హిందు ఆలయాల మొత్తం భూమి సుమారు 4.7 లక్షల ఎకరాలు, 1.5 లక్షల ఎకరాలు అక్రమణకు గురయ్యాయి, అభివృద్ధి పేరు తో 8000 ఎకరాలు ప్రభుత్వం తీసేసుకుంది. లక్షల కోట్ల విలువ చేసే భూములు హిందు ఆలయాల నుంచి మల్లించబడుతున్నాయి మరియు ఆక్రమించబడుతున్నాయి. దేవాలయాలకు సంబంధించిన లక్షన్నర ఎకరాలకు పైగా భూములు “ప్రైవేట్ వ్యక్తుల సర్వే నంబర్లలో కలిసిపోయాయి” అనే పేరుతో సరైన ధర్యాప్తు చేయకుండా, ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఇది హిందూ సమాజానికి, ఆలయ రక్షణకు తీవ్రమైన ప్రమాదకరం. ఈ చర్యలు ద్వారా ఆలయాలు తీవ్రంగా నష్టపోతాయి. అలాగే, GO No. 139 ద్వారా 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల పేరుతో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే విధానం కూడా పూర్తిగా వ్యతిరేకించదగినది. ఈ నిర్ణయం వల్లే హిందూ సమాజం కోర్టులను ఆశ్రయించి స్టే ఆదేశాలు తెచ్చుకోవలసిన పరిస్థితి వచ్చింది. హిందూ ఆలయ భూములు అభివృద్ధి పేరుతో ఇతరుల చేతుల్లోకి వెళ్లడం అంగీకారయోగ్యం కాదు. హిందూ ఆలయ భూములు ఆలయాలకే చెందాలి ఇదే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అభిప్రాయం. ఇంకా, ఆలయ భూములను ఆక్రమించుకున్న వారికి రెగ్యులరైజేషన్ పేరుతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఆలోచించడం కూడా అత్యంత ప్రమాదకరం. ఇది అక్రమాలను ప్రోత్సహించడమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది. ఆలయ భూముల రక్షణలో కూడా ఆ పారదర్శకత ఉండాలి. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే, గత ప్రభుత్వ ఆలోచనలు కొనసాగిస్తూ కొంతమంది అధికారులలో ఆలయ భూములను రక్షించాలనే దృక్కోణం కాకుండా, వాటిని దారి మళ్లించాలి, దోచిపెట్టాలి అనే ధోరణి కనిపించడం హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తోంది. ఇటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేము. దేవాలయాల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ఆలయాల అభివృద్ధి, పండుగల నిర్వహణకు ప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోవడం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. అలాగే ఆలయ అదాయాల నుంచి కామన్ గుడ్ ఫండ్, అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది... • దేవాలయ భూములపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి, ప్రైవేట్ సర్వే నంబర్లలో కలిసిపోయిన భూములపై నిష్పక్షపాత ధర్యాప్తు చేయాలి. • దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసే నిర్ణయాలను వెంటనే నిలిపివేయాలి. • GO No. 139 ను పూర్తిగా రద్దు చేయాలి. • 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల విధానాన్ని ఉపసంహరించాలి. • ఆలయ భూముల ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. • అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని భూములను తిరిగి ఆలయాలకు అప్పగించాలి. • దేవాలయాల ఆదాయం పూర్తిగా అదే ఆలయాల అభివృద్ధికి వినియోగించే విధంగా చట్టపరమైన హామీ ఇవ్వాలి. • ఆలయాల పండుగల నిర్వహణకు ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించాలి. • CGF నిధులతో శిధిలావస్థ ఆలయాలు పునఃరిద్దరించాలి. • అభివృద్ధి పేరుతో ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న భూమికి తగిన భూమి లేదా నష్టపరిహారం ఆయా ఆలయాలకు ఇవ్వాలి. ఇది కేవలం వినతిపత్రం కాదు హిందూ సమాజం యొక్క గళం. దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఆలయ హక్కుల రక్షణ కోసం ఉద్యమం చేయడం తప్ప మాకు మరే మార్గం ఉండదు. హిందూ ఆలయ భూములు కాపాడాలి అవి ఆలయాలకే చెందాలి అని అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కోరుచున్నది.

10 hrs ago
user_మీడియా ఇన్చార్జి
మీడియా ఇన్చార్జి
Animal Protection Organisation చిలకలూరిపేట హెచ్.ఓ. పురుషోత్తపట్నం, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
10 hrs ago
3d665dba-5ad6-4b96-9212-759d4aa8b088

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • దారుణం.. కుటుంబమంతా ఆత్మహత్య నరసరావుపేటలో ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భోపాల్ ఎయిమ్స్ లో వైద్యుడిగా పనిచేస్తున్న సాతులూరుకు చెందిన గోపి, తన కుటుంబంతో సహా నరసరావుపేటలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి 3 ఏళ్ల చిన్నారి బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లీకూతుళ్లు నిన్న మృతి చెందగా, గోపి నేడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
    1
    దారుణం.. కుటుంబమంతా ఆత్మహత్య
నరసరావుపేటలో ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భోపాల్ ఎయిమ్స్ లో వైద్యుడిగా పనిచేస్తున్న సాతులూరుకు చెందిన గోపి, తన కుటుంబంతో సహా నరసరావుపేటలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి 3 ఏళ్ల చిన్నారి బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లీకూతుళ్లు నిన్న మృతి చెందగా, గోపి నేడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    19 hrs ago
  • . సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యే, సత్తుపల్లి.
    1
    .  సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. 
మట్టా రాగమయి దయానంద్ 
ఎమ్మెల్యే, సత్తుపల్లి.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    3
    నకిరేకల్ నియోజకవర్గo:-
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు.
ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
  • నల్గొండ: నల్గొండ ఆర్టీసీ బస్టాండు నుంచి పెద్ద గడియారం వెళ్లే మార్గంలో సుభాష్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతల మయంగా మారింది. ముఖ్యంగా మూలమలుపు వద్ద గుంతలు పెద్దగా ఉండటంతో, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ ఆర్టీసీ బస్టాండు నుంచి పెద్ద గడియారం వెళ్లే మార్గంలో సుభాష్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతల మయంగా మారింది. ముఖ్యంగా మూలమలుపు వద్ద గుంతలు పెద్దగా ఉండటంతో, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    13 hrs ago
  • సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.
    2
    సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా  మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    8 hrs ago
  • వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు.. అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    1
    వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు..
అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    user_Shaik
    Shaik
    ఉదయగిరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.