logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతులు తీవ్ర ఆరోపణలు చేశారు. మర్కల్ శివారులో ఉన్న తమ వ్యవసాయ భూములను మర్కల్ గ్రామ పెద్దలు అక్రమంగా కబ్జా చేస్తున్నారని, వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తమ భూమిలో మొరం పోస్తూ దౌర్జన్యానికి దిగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై బాధితులు కామారెడ్డి కలెక్టరేట్‌ లో కలెక్టర్ ఆశీస్ సంగ్వన్ కు ఫిర్యాదు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులు చించనోళ్ల లింగంకు చెందిన సర్వే నెంబర్ 260/ఆ/12, పణం సావిత్రికి చెందిన 260/బి, బక్కన గారి నర్సవ్వకు చెందిన 260/1ఏ, ఉండాడి సాయికి చెందిన 260/11, అలాగే భునగారి కాశావ్వకు చెందిన 260/120 సర్వే నెంబర్లలో దాదాపు ఐదు ఎకరాల భూమి ఉందని తెలిపారు. తమకు ఉన్న ఒకే ఒక ఆధారం ఈ భూములేనని, ఈ భూమి లేకుంటే తాము రోడ్డున పడి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం ఉండదని రైతులు ఆవేదనతో పేర్కొన్నారు. పట్టా భూములు ఉన్నప్పటికీ తమపై దౌర్జన్యం చేస్తున్న మర్కల్ గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు.

2 hrs ago
user_Routhu srikanth
Routhu srikanth
నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
2 hrs ago
d6012498-d091-475d-925c-2f16d7e7499d

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతులు తీవ్ర ఆరోపణలు చేశారు. మర్కల్ శివారులో ఉన్న తమ వ్యవసాయ భూములను మర్కల్ గ్రామ పెద్దలు అక్రమంగా కబ్జా చేస్తున్నారని, వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తమ భూమిలో మొరం పోస్తూ దౌర్జన్యానికి దిగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై బాధితులు కామారెడ్డి కలెక్టరేట్‌ లో కలెక్టర్ ఆశీస్ సంగ్వన్ కు ఫిర్యాదు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులు చించనోళ్ల లింగంకు చెందిన సర్వే నెంబర్ 260/ఆ/12, పణం సావిత్రికి చెందిన 260/బి, బక్కన గారి నర్సవ్వకు చెందిన 260/1ఏ, ఉండాడి సాయికి చెందిన 260/11, అలాగే భునగారి కాశావ్వకు చెందిన 260/120 సర్వే నెంబర్లలో దాదాపు ఐదు ఎకరాల భూమి ఉందని తెలిపారు. తమకు ఉన్న ఒకే ఒక ఆధారం ఈ భూములేనని, ఈ భూమి లేకుంటే తాము రోడ్డున పడి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం ఉండదని రైతులు ఆవేదనతో పేర్కొన్నారు. పట్టా భూములు ఉన్నప్పటికీ తమపై దౌర్జన్యం చేస్తున్న మర్కల్ గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నిత్యజీవితంలోని ఉరుకుల పురుగుల నుంచి ఒక్కరోజు విరామం తీసుకుని, సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తాండా ప్రజలంతా కలిసి సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, గ్రామంలోని సుమారు 120 కుటుంబాల వారు తమ ఇళ్లకు తాళాలు వేసి, గ్రామ సమీపంలో ఉన్న పంట చేనులో సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ వేడుక సాయంత్రం వరకు కొనసాగింది, వజ్జేపల్లి తాండా ప్రజలందరికీ ఈ సందడి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.
    1
    నిత్యజీవితంలోని ఉరుకుల పురుగుల నుంచి ఒక్కరోజు విరామం తీసుకుని, సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తాండా ప్రజలంతా కలిసి సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, గ్రామంలోని సుమారు 120 కుటుంబాల వారు తమ ఇళ్లకు తాళాలు వేసి, గ్రామ సమీపంలో ఉన్న పంట చేనులో సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ వేడుక సాయంత్రం వరకు కొనసాగింది, వజ్జేపల్లి తాండా ప్రజలందరికీ ఈ సందడి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం ఆదవిపదిర గ్రామస్తులు తమ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. వీర్నపల్లి మండల కేంద్రం నుండి ఆదవిపదిరకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద తాత్కాలికంగా వేసిన డైవర్షన్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. వర్షాలు పడితే ఆ రోడ్డు కొట్టుకుపోయి, మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రానికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన చెందారు. కావున, అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేశారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం ఆదవిపదిర గ్రామస్తులు తమ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. వీర్నపల్లి మండల కేంద్రం నుండి ఆదవిపదిరకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద తాత్కాలికంగా వేసిన డైవర్షన్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. వర్షాలు పడితే ఆ రోడ్డు కొట్టుకుపోయి, మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రానికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన చెందారు. కావున, అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.
    3
    జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
  • నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం, బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విస్తృతంగా చేపట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం రోజున మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ నివాస గృహంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో వారు ఈ సూచనలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, బూత్ కమిటీలు ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల సభ్యత్వ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్, పట్టణ అధ్యక్షులు రవీంద్ర యాదవ్, సంజీవ్, నరసయ్య, కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులైన రవి శంకర్ గౌడ్, మిర్జాపురం హరీశంకర్, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    4
    నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం, బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విస్తృతంగా చేపట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం రోజున మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ నివాస గృహంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో వారు ఈ సూచనలు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, బూత్ కమిటీలు ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల సభ్యత్వ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్, పట్టణ అధ్యక్షులు రవీంద్ర యాదవ్, సంజీవ్, నరసయ్య, కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులైన రవి శంకర్ గౌడ్, మిర్జాపురం హరీశంకర్, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_RAHUL
    RAHUL
    బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    21 min ago
  • రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రత్యేక యాప్ ద్వారా రైతులు తమ ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ యాప్‌లో సమీపంలోని ఎరువుల దుకాణాల్లో ఎంత యూరియా నిల్వ ఉందో తెలుసుకునే సౌకర్యం ఉందని, దీనివల్ల రైతులు తమకు అవసరమైన దుకాణాన్ని ఎంపిక చేసుకుని ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చని దేవ్‌కుమార్ వివరించారు. ఈ కొత్త విధానం వల్ల క్యూలైన్లు, రద్దీ, అనవసర ఇబ్బందులు తగ్గడంతో పాటు ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యూరియా కొరతపై రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని దేవ్‌కుమార్ హామీ ఇచ్చారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకొని రైతులు సులభంగా ఎరువులు పొందాలని ఆయన సూచించారు.
    1
    రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రత్యేక యాప్ ద్వారా రైతులు తమ ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ యాప్‌లో సమీపంలోని ఎరువుల దుకాణాల్లో ఎంత యూరియా నిల్వ ఉందో తెలుసుకునే సౌకర్యం ఉందని, దీనివల్ల రైతులు తమకు అవసరమైన దుకాణాన్ని ఎంపిక చేసుకుని ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చని దేవ్‌కుమార్ వివరించారు.

ఈ కొత్త విధానం వల్ల క్యూలైన్లు, రద్దీ, అనవసర ఇబ్బందులు తగ్గడంతో పాటు ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యూరియా కొరతపై రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని దేవ్‌కుమార్ హామీ ఇచ్చారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకొని రైతులు సులభంగా ఎరువులు పొందాలని ఆయన సూచించారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • రేగోడ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ ప్రవీణ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని ప్రిన్సిపల్ ఈ సందర్భంగా తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ప్రతిరోజూ యోగా చేయాలని ఆమె సూచించారు.
    1
    రేగోడ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ ప్రవీణ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని ప్రిన్సిపల్ ఈ సందర్భంగా తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ప్రతిరోజూ యోగా చేయాలని ఆమె సూచించారు.
    user_ఎనగండ్ల జైపాల్
    ఎనగండ్ల జైపాల్
    Regode, Medak•
    23 hrs ago
  • కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, చీమలకుంటపల్లి గ్రామంలో భూలక్ష్మి, శ్రీ లక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు సోమవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ ఉత్సవాల్లో భాగంగా గోపూజ, కుంకుమ పూజ, చండీ యాగాన్ని అపారమైన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల ప్రారంభంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిడి ప్రకాష్, పాలకవర్గం, గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
    1
    కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, చీమలకుంటపల్లి గ్రామంలో భూలక్ష్మి, శ్రీ లక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు సోమవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ ఉత్సవాల్లో భాగంగా గోపూజ, కుంకుమ పూజ, చండీ యాగాన్ని అపారమైన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ ఉత్సవాల ప్రారంభంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిడి ప్రకాష్, పాలకవర్గం, గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో, మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా వరుణ దేవుడు కరుణించకపోవడంతో, గ్రామ ప్రజలు కప్పతల్లి ఆట ఆడి గ్రామంలోని దేవాలయాల్లోని దేవతామూర్తులకు జలాభిషేకాలు చేశారు. అనంతరం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం కష్టాలు తొలగి, పంటలు బాగా పండాలని, చెరువులు, కుంటలు నిండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని దేవుళ్లను ప్రార్థించినట్లు తెలిపారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో, మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా వరుణ దేవుడు కరుణించకపోవడంతో, గ్రామ ప్రజలు కప్పతల్లి ఆట ఆడి గ్రామంలోని దేవాలయాల్లోని దేవతామూర్తులకు జలాభిషేకాలు చేశారు. అనంతరం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం కష్టాలు తొలగి, పంటలు బాగా పండాలని, చెరువులు, కుంటలు నిండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని దేవుళ్లను ప్రార్థించినట్లు తెలిపారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.